breaking news
Parkinsons disease
-
గంటల్లోనే వణుకుడు వ్యాధి మాయం..!
చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ.. మనమీద మనకే నియంత్రణ లేకుండా చేసే దారుణమైన సమస్య ..పార్కిన్సన్స్ డిసీజ్. దాదాపు ఏడాది క్రితం వరకు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. కానీ వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఓ సరికొత్త చికిత్స వచ్చింది. అదే.. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్జీఎఫ్యూఎస్). దీని సాయంతో.. కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్య ప్రముఖులు చెబుతున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబసభ్యులకు ఈ సమస్య, దాని లక్షణాలు, ఉన్న చికిత్స అవకాశాల గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్‌లోని మూవ్మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యంలో గురువారం నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై.. తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగాధిపతి, చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు.. “పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనిషిని పూర్తిగా కుంగదీసే సమస్య. దీనివల్ల వచ్చే శారీరక సమస్యలతో పాటు.. అవి ఉన్నాయన్న బాధ వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా ఎక్కువే. ఇంతకాలం మందులు, డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు మాత్రమే దీనికి పరిష్కారంగా ఉండేవి. ఇప్పుడు చిన్న కోత కూడా అవసరం లేకుండా కేవలం ఎంఆర్ఐ యంత్రానికి మరో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చి మూడు నాలుగు గంటల పాటు చికిత్స చేస్తాం. ఇది పూర్తయ్యి రోగి బయటకు రాగానే ఒకవైపు ఉన్న సమస్య పూర్తిగా నయం అయిపోతుంది. అప్పటివరకు ఉన్న వణుకు మటుమాయం అవుతుంది. పైగా ఈ ప్రక్రియ చేసేటప్పుడే వణుకు తగ్గిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కాబట్టి... పూర్తిగా తగ్గిన తర్వాతే చికిత్స పూర్తవుతుంది. అంతేకాదు గతంలో డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలకు ఎంత వ్యయం అయ్యేదో.. దాదాపుగా దీనికి కూడా అంతే అవుతుంది. వణుకు ప్రాథమిక దశలో ఉన్నవారి నుంచి బాగా తీవ్రంగా ఉన్నవారి వరకు ఎవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. వారికి ఒక చిన్న పరీక్ష చేసి, ఈ చికిత్స వారికి సరిపోతుందో లేదో నిర్ణయిస్తాం. ఆ తర్వాత చికిత్స చేయించుకుని.. హాయిగా ఎవరి సాయం లేకుండా ఒక్కరే నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించిన కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం జయశ్రీ మాట్లాడుతూ, “ఎంఆర్జీ ఎఫ్యూఎస్ అనేది చాలా అత్యాధునికమైన చికిత్స. ఇప్పటికే కిమ్స్ ఆస్పత్రిలో ఎనిమిది మంది రోగులకు దీని సాయంతో చికిత్స చేసి సత్పఫలితాలు సాధించాం. ఇందులో ఎలాంటి కోత అవసరం లేకుండా ఎంఆర్ఐతోనే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపుతారు. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులో ప్రభావితమైన ప్రాంతాలను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, వెంటనే చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్‌తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్న్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తాం. తర్వాత ఎక్కువ హీట్ తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుంది. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుంది. సాధారణంగా పార్కిన్సన్స్ రోగులకు ఒకవైపే (కుడి లేదా ఎడమ) సమస్య తీవ్రంగా ఉంటుంది. వ్యాధి త్రీవత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్సకు సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. ఫలితాలు మాత్రం వెంటనే కనిపిస్తాయి."ఓ కేసులో 28 ఏళ్ల యువకుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచర్ అవుదామనుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన తర్వాత ఇప్పుడు హాయిగా టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలామందికి సాయపడుతున్నాడు. అలాంటి నాణ్యమైన జీవితాన్ని అందరికీ ఇవ్వాలని కిమ్స్ తహతహలాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాలజీ బృందం అత్యుత్తమ సేవలు అందిస్తోంది. అందుకు వారికి అభినందనలు” అని కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు.చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్. మోహన్ దాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్టర్ ఈఏ వరలక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాడా, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు. “సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. అవి మోటార్, నాన్ మోటార్. మోటార్ సమస్యలు అంటే కదలికలకు సంబంధించినవి. వణుకు, గట్టిగా అయిపోవడం, నెమ్మదించడం లాంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. చేతులు, కాళ్లు విపరీతంగా వణుకుతుంటాయి. ఏవీ పట్టుకోలేరు, సరిగా నడవలేరు. నడకమీద నియంత్రణ ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోయే పనికి 20 నిమిషాలు పడుతుంది. ముఖంలో కదలికలు తగ్గిపోతాయి. ఇక నాన్ మోటార్ సమస్యల్లో నిద్ర లేకపోవడం, మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం, మలబద్ధకం, మానసిక సమస్యలు, వాసన లేకపోవడం లాంటి వాటితో పాటు.. శరీరం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తరచు పడిపోయి గాయపడతారు. ఈ సమస్యల వల్ల వాళ్లు నలుగురితో కలవలేక ఒంటరిగా మిగిలిపోతారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లలేరు. విపరీతమైన కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ పార్కిన్సన్స్ వల్ల అదనంగా వస్తాయి.(చదవండి: శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు.. ) -
జో బైడెన్‌కు పార్కిన్సన్స్.? క్లారిటీ ఇచ్చిన డాక్టర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పార్కిన్సన్స్(వణుకు) వ్యాధి ఉందా.. వైట్‌హౌజ్‌కు న్యూరాలజీ డాక్టర్ పదే పదే ఎందుకు వస్తున్నాడు.. బైడెన్ పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స చేయడం కోసమేనా.. ఇలాంటి ప్రశ్నలు ఇటీవల అమెరికాలో చర్చనీయంశమయ్యాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. వైట్‌హౌజ్‌కు తరచుగా న్యూరాలజిస్ట్ రావడంపై సోమవారం(జులై 8) ఒక అధికారిక లేఖ విడుదల చేశారు. ‘అధ్యకక్షుడు బైడెన్‌కు పార్కిన్సన్స్ వ్యాధి లేదు. ఆయన ఈ వ్యాధి కోసం ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు. వైట్‌హౌజ్‌లో ఉండే వందలాది మంది సిబ్బంది ఎదుర్కొనే న్యూరలాజికల్ సమస్యలకు చికిత్స చేయడానికి న్యూరాలజిస్ట్ ఇటీవల వైట్‌హౌజ్‌కు ఎక్కువగా వస్తున్నారు. కరోనా తర్వాత వైట్‌హౌజ్ సిబ్బందిలో న్యూరాలజీ సమస్యలు పెరిగాయి’అని లేఖలో తెలిపారు. కాగా, వృద్ధాప్యం రీత్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్ ఇటీవల ఎక్కువయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బైడెన్‌కు పార్కిన్సన్ లేదని ఆయన ఫిజీషియన్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. డెమొక్రాట్ల తరపున బైడెన్, రిపబ్లికన్ల నుంచి ట్రంప్ ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. -
పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాణాంతక వ్యాధా? ఎలా నివారించాలి?
పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ)ని ఆయుర్వేద వైద్యంలో "కంపా వట" అని పిలుస్తారు, ఇది శరీరం యొక్క అవయవాలు అతిశయోక్తి కదలికలను ప్రదర్శిస్తాయని అర్థం. పీడీ అనేది కేంద్ర నాడీ వ్యవస్థ క్షీణించిన వ్యాధి, ఇది మోటారు నైపుణ్యాలు, ప్రసంగం మరియు అనేక ఇతర విధులను ప్రభావితం చేస్తుంది, ఇది ప్రధానంగా డోపమైన్-ఉత్పత్తి చేసే కణాల నష్టం కారణంగా సంభవిస్తుంది. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం.! పార్కిన్సన్స్ వ్యాధి అనేది కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక క్షీణత అనే రుగ్మత. ఇది ప్రధానంగా మోటారు వ్యవస్థను, అనగా శరీర అవయవ చలనమును ప్రభావితం చేస్తుంది. వ్యాధి తీవ్ర పడే కొద్ది, నాన్ మోటార్ లక్షణాలు సర్వసాధారణం అవుతాయి. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా నెమ్మదిగా బయటపడతాయి..వ్యాధి ప్రారంభంలో, చాలా స్పష్టమైన లక్షణాలు అంటే వణుకు, బిగుసుకు పోవడం , కదలిక మందగించడం, నడకలో ఇబ్బంది వంటివి ఉంటాయి. ఆలోచించడం, ప్రవర్తనా సమస్యలు కూడా సంభవించవచ్చు. వ్యాధి ప్రారంభదశల్లో చిత్తవైకల్యం, జ్ఞాపక శక్తి తగ్గటం సాధారణం అవుతుంది. లక్షణాలు: కండరాల దృఢత్వం వణుకు నెమ్మదిగా శారీరక కదలిక (బ్రాడికినిసియా) మరింత తీవ్రమైన సందర్భాల్లో భౌతిక కదలిక (అకినేసియా) తోపాటు సంతులనం పూర్తిగా కోల్పోవడం. సాధారణ నిర్వహణ: విటమిన్ ఇ, బి12, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి ఎందుకంటే ఈ పోషకాలు మొత్తం మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఉదా. అవకాడో, సాల్మన్, సార్డిన్, అవిసె గింజలు, నానబెట్టిన గింజలు మొదలైనవి. బెర్రీలు, తాజా సాల్మన్ మొదలైన యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ తీసుకోండి. అశ్వగంధ, కర్కుమిన్ కూడా ఈ పరిస్థితికి చాలా సహాయకారిగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి దూలగొండి (ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens(కపికచ్చు)), దాని సహజ L-డోపా కంటెంట్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి ప్రామాణిక ఔషధ చికిత్సలో ఎల్-డోపా కీలకమైన భాగం. --ఆయర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ దాడి! వీడియో వైరల్) -
అరుదైన వ్యాధికి గురైన దిగ్గజ క్రికెటర్..సెంచరీ కొట్టలేనని భావోద్వేగ ప్రకటన
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ తాను ‘పార్కిన్సన్స్’ వ్యాధితో బాధపడుతున్నట్లు మొదటిసారి ప్రకటించాడు. తాను ఏడేళ్ల క్రితం దీనికి గురయ్యానని, అయితే ఎవరూ తనపై జాలి చూపించరాదని ఇప్పటి వరకు చెప్పలేదన్నాడు. నాడీ వ్యవస్థపై ప్రభావం పడే కారణంగా శారీరక కదలికలు సాధారణంగా లేకపోవడం ఈ వ్యాధి లక్షణం. ‘ఇది తెలిస్తే జనం ఎలా స్పందిస్తారో తెలీదు. బాధపడతారా లేదా ఓదారుస్తారా చెప్పలేం. అయితే ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నా’ అని బోర్డర్ వెల్లడించాడు. 68 ఏళ్ల బోర్డర్ తాను 80 ఏళ్లు జీవించగలిగితే అదే చాలా గొప్పగా భావిస్తానని, మరో ‘సెంచరీ’ సాధించలేనని మాత్రం కచ్చితంగా చెప్పగలనని భావోద్వేగంతో అన్నాడు. 156 టెస్టుల్లో 11,174 పరుగులు... 273 వన్డేల్లో 6524 పరుగులు చేసిన అలెన్ బోర్డర్ రెండు ఫార్మాట్లలో కలిపి 30 సెంచరీలు, 99 అర్ధసెంచరీలు సాధించాడు. అతని నాయకత్వంలోనే ఆ్రస్టేలియా 1987లో తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. -
‘బాక్సింగ్ గ్రేట్’ మహ్మద్ అలీ పరిస్థితి విషమం!
న్యూఢిల్లీ: చాలా కాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ ‘బాక్సింగ్ దిగ్గజం’ మహ్మద్ అలీ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రమైన అనారోగ్యంతో రోజులు లెక్కబెడుతున్నాడని బాక్సర్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత వారం తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఐయామ్ అలీ’ అనే హాలీవుడ్ కొత్త చిత్రం ప్రీమియర్‌కు 72 ఏళ్ల అలీ హాజరు కాకపోవడంతో బాక్సర్ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తన తండ్రి కచ్చితంగా కోలుకుని సంపూర్ణంగా జీవిస్తాడని కూతురు హన్నా ఆశాభావం వ్యక్తం చేసింది. అలీకి పార్కిన్సన్ వ్యాధి సోకినట్లు 42 ఏళ్ల వయసులో (1984) గుర్తించారు. బౌట్లలో తల మీద బలమైన పంచ్‌లు తగలడం ఈ వ్యాధికి కారణం కావొచ్చని తేల్చారు.