‘బాక్సింగ్ గ్రేట్’ మహ్మద్ అలీ పరిస్థితి విషమం! | 'Boxing Great Muhammad Ali in a serious condition! | Sakshi
Sakshi News home page

‘బాక్సింగ్ గ్రేట్’ మహ్మద్ అలీ పరిస్థితి విషమం!

Oct 25 2014 1:34 AM | Updated on Sep 2 2017 3:19 PM

చాలా కాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ ‘బాక్సింగ్ దిగ్గజం’ మహ్మద్ అలీ పరిస్థితి విషమంగా

న్యూఢిల్లీ: చాలా కాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ ‘బాక్సింగ్ దిగ్గజం’ మహ్మద్ అలీ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రమైన అనారోగ్యంతో రోజులు లెక్కబెడుతున్నాడని బాక్సర్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత వారం తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఐయామ్ అలీ’ అనే హాలీవుడ్ కొత్త చిత్రం ప్రీమియర్‌కు 72 ఏళ్ల అలీ హాజరు కాకపోవడంతో బాక్సర్ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తన తండ్రి కచ్చితంగా కోలుకుని సంపూర్ణంగా జీవిస్తాడని కూతురు హన్నా ఆశాభావం వ్యక్తం చేసింది.   అలీకి పార్కిన్సన్ వ్యాధి సోకినట్లు 42 ఏళ్ల వయసులో (1984) గుర్తించారు. బౌట్‌లలో తల మీద బలమైన పంచ్‌లు తగలడం ఈ వ్యాధికి కారణం కావొచ్చని తేల్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement