స్వర్ణం గెలిచిన నిఖత్‌ జరీన్‌ | Nikhat Zareen wins gold medal at World Boxing Cup | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌లో స్వర్ణం గెలిచిన నిఖత్‌ జరీన్‌

Nov 20 2025 8:09 PM | Updated on Nov 20 2025 8:37 PM

Nikhat Zareen wins gold medal at World Boxing Cup

భారత బాక్సింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Zareen) వరల్డ్ బాక్సింగ్ కప్‌లో (World Boxing Cup 2025) స్వర్ణ పతకం (51 కిలోల విభాగంలో) కైవసం చేసుకుంది. ఇవాళ (నవంబర్‌ 20) జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై 5–0తో గెలుపొందింది. 

నిఖత్‌ సాధించిన ఈ పతకంతో ప్రస్తుత బాక్సింగ్‌ కప్‌లో భారత మహిళలు సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది. నిఖత్‌కు ముందు 48 కిలోల విభాగంలో మినాక్షి హూడా, 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్, 70 కిలోల విభాగంలో అరుంధతి, 80+ కిలోల విభాగంలో నూపుర్ శెఓరన్ స్వర్ణాలు సాధించారు.

మాజీ ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్..‌ దాదాపు రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ పతకాన్ని సాధించింది. ఈ టోర్నీలో నిఖత్‌ వెయిట్‌ కేటగిరీలో ఐదుగురు బాక్సర్లు మాత్రమే బరిలోకి దిగారు. దీంతో నేరుగా సెమీఫైనల్‌ ఆడిన నిఖత్‌ 5–0తో జెనీవా గుల్‌సెవర్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను చిత్తు చేసింది. 

భుజం గాయంతో దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన నిఖత్‌ ఈ టోర్నీతోనే బరిలోకి దిగింది. 2024 ఫిబ్రవరిలో స్ట్రాంజా మెమోరియల్‌ టోర్నీలో సాధించిన విజయం తర్వాత నిఖత్‌ గెలిచిన తొలి పతకం ఇదే.

చదవండి: ముచ్చల్‌తో నిశ్చితార్థాన్ని ధృవీకరించిన మంధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement