
భారత్‌లో బాక్సింగ్‌కు ఆదరణ పెంచే దిశగా నటుడు, వ్యాపారవేత్త రానా దగ్గుబాటి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా 'ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్' వ్యవస్థాపకుడు ఆంథోనీ పెట్టిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రానా ‘బాక్సింగ్‌బే’ కో- ప్రమోటర్‌గా ఉన్నాడు.
తాజాగా ఆంథోని పెట్టిస్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ (APFC) ఇండియా అరుదైన ఘనత సాధించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌నకు చెందిన అధికారిక UFC యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న భారత తొలి కంబాట్ స్పోర్ట్‌గా నిలిచింది. ఈ యాప్ 200పైగా దేశాల్లో అభిమానులను అలరిస్తోంది.
APFC ఇండియా 1 డిసెంబరు 5 నుంచి.. అదే విధంగా బాక్సింగ్‌బే 4 డిసెంబరు 21 నుంచి ఈ యాప్‌లో ప్రసారం కానున్నాయి. కాగా ఈ ఈవెంట్స్‌కు హైదరాబాద్, బెంగళూరుతో పాటు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రానా దగ్గుబాటి ప్రమోట్ చేస్తున్న బాక్సింగ్‌బే.. భారత బాక్సింగ్ మండలి, ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్ ఎకోసిస్టమ్‌లో భాగం.