జస్ట్‌ నాలుగు నెలల్లో..24 కిలోల బరువు..! ఈ సింపుల్‌ డైట్‌ ప్లాన్‌తో.. | How This Woman Lost 24 Kg Weight In 4 Months Goes Viral | Sakshi
Sakshi News home page

జస్ట్‌ నాలుగు నెలల్లో..24 కిలోల బరువు..! ఈ సింపుల్‌ డైట్‌ ప్లాన్‌తో..

Nov 18 2025 5:32 PM | Updated on Nov 18 2025 6:47 PM

How This Woman Lost 24 Kg Weight In 4 Months Goes Viral

ఇన్‌స్టాగ్రామ్‌ సోర్స్‌

వెయిట్‌లాస్‌ జర్నీలో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఎంతలా అంటే.. ఎలాంటి క్రాష్‌ డైట్‌లు పాటించకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఏదో మాయ చేసినట్లుగా అమాంతం స్లిమ్‌గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇక్కడ అలానే జాహ్నవి అనే మహిళ ఎంత అద్భుతంగా బరువు తగ్గిందంటే..చాలా తక్కువ సమయంలోనే అధిక బరువుని కోల్పోయింది. అదికూడా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే తగ్గడం విశేషం. అదెలాగో ఆమె మాటల్లోనూ సవివరంగా తెలుసుకుందామా..!.

జాహ్నవి అనే మహిళ వెయిట్‌ లాస్‌ జర్నీలో అందరికీ స్ఫూర్తి అంటూ ఫిట్‌నెస్‌ నిపుణుడు మాక్‌ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేశారు. అంతేగాదు త్వరిగతిన ఫలితాలు పొందాలనుకునేవారికి ఆమె ప్రేరణ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. బరువు తగ్గడం అనేది కాస్త కఠినమైన టాస్క్‌ అయినా..క్రమశిక్షణ, డెడికేషన్‌ ఉంటే..ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. 

ముందుగా ఈ వెయిట్‌లాస్‌ జర్నీలో ప్రతిఒక్కరికి స్థిరత్వంతో కూడిన అంకితభావం ప్రధానమని..నొక్కి చెబుతోంది జాహ్నవి. తాను 94 కిలోల మేర అధిక బరువు ఉండేదాన్ని..జస్ట్‌ నాలుగు నెలల్లోనే 24 కిలోలు వరకు తగ్గిపోయానని పేర్కొంది. పైగా తన డైట్‌ ఎలా ప్లాన్‌ ఎలా ఉండేదో కూడా వివరించింది. 

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉసిరి కాయ రసం, ఐదు బాదం పప్పులు, అజ్వైన్(క్యారమ్‌ గింజలు), దాల్చిన చెక్క నీరు, నానబెట్టిన వాల్‌నెట్స్‌, మెంతినీరు తప్పనిసరిగా తీసుకుంటానని అంటోంది. 
బ్రేక్‌ఫాస్ట్ రొటీన్ (ఉదయం 8)

అల్పాహారం కోసం, జాహ్నవి మిల్లెట్ దోస, చియా సీడ్ స్మూతీ, పెసరపప్పుతో చేసే  ఇడ్లీ తింటానంటోంది.

మిడ్-మార్నింగ్ రొటీన్ (ఉదయం 11)
ఈ సమయంలో, ఫిట్‌నెస్ ప్రియురాలు సీజనల్ పండ్లు, ఫ్రూట్ స్మూతీ, రాగి (ఫింగర్ మిల్లెట్) మాల్ట్‌ను ఆశ్రయించింది.

లంచ్ రొటీన్ (మధ్యాహ్నం 2)
ఆమె లంచ్ మెనూలో బియ్యం, కూరగాయల కూర, పెరుగు, లేదా మిల్లెట్ పులావ్, మిశ్రమ కూరగాయలు, రైతా వంటి సరళమైన వంటకాలు ఉన్నాయి.

స్నాక్ రొటీన్ (సాయంత్రం 4)
స్నాక్స్ కోసం, జాహ్నవి తనకు తానుగా ఉడికించిన గుడ్డు, భెల్(మరమరాలు),  నల్ల చన్నా (సెనగలు) చాట్‌ తీసుకున్నట్లు తెలిపింది.

డిన్నర్ రొటీన్ (రాత్రి 7)
ఆమె తన విందును ముందుగానే ముగించేదాన్ని అంటోంది. ఆమె ఆహారంలో కూరగాయలతో ఉడికించిన చికెన్, గుడ్డు ఆమ్లెట్, కూరగాయల కూరతో మిల్లెట్ రోటీ ఉన్నాయి.

పడుకునే ముందు (రాత్రి 9)
పడుకునే ముందు, జాహ్నవి హెర్బల్ టీ లేదా పుదీనా, కొత్తిమీర నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకున్నట్లు తెలిపింది. 

ఇలా కేర్‌ఫుల్‌గా తీసుకునే డైట్‌పై ఫోకస్‌ పెడితే.. హెల్దీగా బరువు తగ్గడం ఏమంత కష్టం కాదని అంటోంది జాహ్నవి. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం

(చదవండి: అత్యుత్తమ చికెన్‌ రెసిపీ జాబితాలో బటర్‌ చికెన్‌కి చోటు..! ఎన్నో స్థానంలో ఉందంటే..)
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fitelo | Customised Diet Plans (@fitelo_tamil)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement