నా ఫోటో చూపిస్తే పోలీసులకే దడ పుడుతుంది.. | Woman Serious Argument With Bus Driver And Conductor In NTR District, More Details Inside | Sakshi
Sakshi News home page

నా ఫోటో చూపిస్తే పోలీసులకే దడ పుడుతుంది..

Oct 17 2025 8:36 AM | Updated on Oct 17 2025 11:18 AM

Women Argue With Rtc Bus Conductor

ఎన్టీఆర్ జిల్లా: ఆర్డీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తమపై దురుసుగా ప్రవర్తించిందని డ్రైవర్, కండక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎనీ్టఆర్‌ జిల్లా కంచికచర్లలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్ల         మండలం పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును విజయవాడలో ఎక్కింది. 

ఆమె పరిటాలలో దిగాల్సి ఉంది. ఆమె బస్సు ఎక్కి ఫుట్‌పాత్‌పై నిల్చుంది. గమనించిన డ్రైవర్‌ ఆమెను లోపలికి వెళ్లమని సూచించాడు. దీనిపై ఆమె డ్రైవర్‌పై గొడవకు దిగింది. ఎందుకమ్మా డ్రైవర్‌పై గొడవ పడతున్నావన్న కండక్టర్‌పైనా ఆమె మండిపడింది. ఇద్దరు కలసి తనను మందలిస్తారా.. ఇది ఫ్రీ బస్సు.. నా ఫొటో తీసుకో.. ఈ ఫొటోను విజయవాడ సిటీలో లేదా చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి చూపించుకో.. నా ఫొటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించింది. 

‘అమ్మా కండక్టర్‌ అయ్యప్ప మాల ధరించాడు అతనిపై దుర్భాషలాడకూడదు’ అని హితవు పలికిన తోటి మహిళలను కూడా దుర్భాషలాడింది. బస్సు డ్రైవర్‌ పరిటాల గ్రామంలో బస్సును ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌ వద్ద బస్సు ఆపి మహిళపై ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ విశ్వనాథ్‌ మహిళను మందలించి కండక్టర్, డ్రైవర్‌లకు సర్ది చెప్పి పంపించి వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement