చెట్టు.. తీసింది కీర్తన ఊపిరి | Bengaluru Tragedy: Woman Dies After Tree Falls in Soladevanahalli, Two Injured | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ చూసి వస్తుండగా..బెంగళూరులో విషాద ఘటన

Oct 7 2025 8:58 AM | Updated on Oct 7 2025 11:24 AM

Young woman dies after falling tree

మృతురాలు కీర్తన

కూలిపడి యువతి మృతి..ఇద్దరికి తీవ్రగాయాలు 

బెంగళూరులో విషాద ఘటన

దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరానికి చెట్లు ఎంత అందాన్ని ఇస్తాయో అంతే ముప్పుగా కూడా మారాయి. ఎప్పుడు ఏది విరిగిపడి ప్రాణం తీస్తుందో తెలియడం లేదు. చెట్టు పడి యువతి దుర్మరణం చెందగా, మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సిటీలో సోలదేనహళ్లిలో జరిగింది. హెబ్బాళకు చెందిన కీర్తన (24) మృతురాలు కాగా, మరో బైకిస్టు భాస్కర్, రాధ క్షతగాత్రులు.  

గతంలో ఫిర్యాదు  
ఈ ఘటనతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను కొట్టివేయాలని ఎన్నిసార్లు పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పడిపోయిన చెట్టు ఏడాది నుంచి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. 

మ్యాచ్‌ చూసి వస్తుండగా.. 
ఎలా జరిగిందంటే.. ఆదివారం కీర్తన, ఆమె స్నేహితురాలు రాధతో ఆచార్య మైదానంలో జరిగే శాండల్‌వుడ్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను చూడడానికి స్కూటర్‌లో వెళ్లారు.  

మ్యాచ్‌ ముగిశాక సాయంత్రం 7 గంటల సమయంలో తమ స్కూటర్‌లో ఇళ్లకు బయల్దేరింది. కీర్తన స్కూటర్‌ వెనుక కూర్చుంది.  

సోలదేనహళ్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పెద్ద చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో ఎలాంటి గాలి వాన లేవు.

చెట్టు కింద నలిగిన కీర్తన క్షణాల్లోనే చనిపోయింది. రాధ, మరో బైక్‌పై వస్తున్న భాస్కర్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.  

అందరినీ స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కీర్తన చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement