హోసూరు: హోసూరు కార్పొరేషన్ పరిధిలోని బాగలూరు రోడ్డులో నిర్వహిస్తున్న పాత వస్తువుల గిడ్డంగిలో మహిళను పోలీసు పేరుతో పరిచయం చేసుకుని తుపాకీతో బెదిరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన పెరియణ్ణ భార్య ముత్తా. బాగలూరు రోడ్డులో పాత వస్తువుల గిడ్డంగి నిర్వహిస్తోంది. గత 25వ తేదీన ద్విచక్ర వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి తను పోలీసు అని చెప్పి తుపాకీతో బెదిరించాడు. ముత్తా ధైర్యంగా సెల్‌ఫోన్‌లో వీడియో తీయగా పరారయ్యాడు. ఈ ఘటనపై నల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. హోసూరు అలసనత్తం తోటగిరి ప్రాంతానికి చెందిన మనోజ్‌ను అరెస్ట్ చేసి, అతడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.


