కార్మికుల పర్మినెంట్‌కు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

కార్మికుల పర్మినెంట్‌కు డిమాండ్‌

Mar 3 2026 8:22 AM | Updated on Mar 3 2026 8:22 AM

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్‌వర్క్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించకుండా విధుల నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పడాన్ని తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్‌వర్క్‌ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగలింగ స్వామి ఖండించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిది నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో పాటు రబీ సీజన్‌లో తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల చేయడం లేదన్నారు. పనులు లేని కారణంగా విధులకు రావడం తగదని ఇంజనీర్‌ విజయలక్ష్మి పేర్కొనడాన్ని తప్పుబట్టారు. టాస్క్‌వర్క్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, వారికి చెల్లించాల్సిన రూ.10 కోట్ల దుర్వినియోగంపై విచారణ జరపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement