అభివృద్ధి పనులకు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు భూమిపూజ

Mar 3 2026 8:22 AM | Updated on Mar 3 2026 8:22 AM

రాయచూరు రూరల్‌: నగర పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్‌ సూచించారు. సోమవారం యక్లాస్‌పూర్‌ వద్ద వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. యక్లాస్‌పూర్‌లో విద్యుత్‌ దీపాలంకరణకు రూ.1.30 కోట్లతో అభివృద్ధి, సముదాయ భవనాల నిర్మాణాలకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

టెన్త్‌లో మంచి ఫలితాల

సాధనకు సూచన

రాయచూరు రూరల్‌ : మార్చి నెలలో జరగబోయే పదో తరగతి పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ సూచించారు. ఆయన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో బాగా చదివించాలని తమకు రాసిన లేఖలను సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రదర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళలో విద్యార్థులకు విద్యాభ్యాసానికి అవకాశం కల్పించాలని ఆ లేఖల్లో కోరారు.

సీహెచ్‌ పౌడర్‌ విక్రేత అరెస్ట్‌

రాయచూరు రూరల్‌ : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సీహెచ్‌ పౌడర్‌ విక్రయం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని జిల్లా ఎస్పీ అరుణాంగ్శుగిరి వెల్లడించారు. ఆయన ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలోని గద్వాల రహదారి వీరాంజనేయ ఆలయం వద్ద ఉరుకుందమ్మను అరెస్ట్‌ చేశారు. ఆమె వద్ద నుంచి 153 లీటర్ల కల్తీ కల్లు, 203 లీటర్ల సీహెచ్‌ పౌడర్‌ను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సమర యోధుల సేవలు స్మరణీయం

రాయచూరు రూరల్‌ : నేటి విద్యార్థులు స్వాతంత్య్ర సమర యోధుల సేవలను స్మరించుకోవాలని కవి శివరంజన్‌ సత్యంపేటె పేర్కొన్నారు. సోమవారం వీరమ్మ గంగమ్మ సిరి కళాశాలలో స్వాతంత్య్ర సమర యోధుడు చెన్నబసప్పపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పాఠాలకు తోడు పాఠ్యేతర అంశాల్లో కూడా శ్రద్ధ కనబరచాలన్నారు. 1947లో దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ెపోరాటాలు చేసిన వారిని గుర్తుంచుకోవాలన్నారు. హెచ్‌కేఈ సంస్థ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేంద్ర కొండా, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ మహేష్‌, మహదేవప్ప, అనిల్‌ కుమార్‌, నాగణ్ణ, అమరనాథ్‌, పాటిల్‌, వీణా, మోహన్‌ రాజ్‌, శివరాజ్‌, అనురాధలున్నారు.

కవితాళ తాలూకా కోసం ధర్నా

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా మాన్వి తాలూకా నుంచి వేరు చేసి కవితాళను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. సోమవారం కవితాళ త్రయంబకేశ్వర ఆలయం వద్ద చేపట్టిన ధర్నాలో ప్రజలు మాట్లాడారు. 20 కి.మీ.దూరమున్న సిరవారను తాలూకా కేంద్రంగా ప్రకటించి మూడేళ్లు కావస్తోందన్నారు. కవితాళ పరిధిలో 45కు పైగా గ్రామాలు వస్తాయని తెలిపారు. కవితాళను కూడా తాలూకా కేంద్రంగా ప్రకటించేందుకు 2026–27వ సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదనకు శాసన సభ్యులు హంపయ్య నాయక్‌, బసనగౌడ ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.

నేడు స్థానిక సెలవు

హోసూరు: హోసూరులో చంద్రచూడేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు తాలూకాలకు స్థానిక సెలవు ప్రకటించారు. రథోత్సవం సందర్భంగా ఏటా హోసూరు, డెంకణీకోట, సూళగిరి తాలూకాలకు స్థానిక సెలవు ప్రకటించడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం నాలుగు తాలూకాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు స్థానిక సెలవుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement