వేసవిలో ఉ–కకు పొంచిన విద్యుత్‌ క్షామం | - | Sakshi
Sakshi News home page

వేసవిలో ఉ–కకు పొంచిన విద్యుత్‌ క్షామం

Mar 3 2026 8:22 AM | Updated on Mar 3 2026 8:22 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో వర్షాలు కురిసినా వేసవిలో ఉత్తర కర్ణాటకకు జల క్షామంతో పాటు విద్యుత్‌ క్షామం ఏర్పడనుంది. బాగలకోటె జిల్లా ఆల్మట్టి డ్యాంలో ఆశించినంత మేర నీరు అందుబాటులో లేనందున ఈ ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉంది. డ్యాం గరిష్ట నీటిమట్టం 519.60 మీటర్లు, 123.081 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 510.70 మీటర్లు, 52.400 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డెడ్‌ స్టోరేజీ 17.60 టీఎంసీలు కాగా మిగిలిన 34.800 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది డ్యాంలో 21.414 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. దీంతో విద్యుత్‌ క్షామానికి కారణమవుతోంది. రాయచూరు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి(ఆర్టీపీఎస్‌), యరమరస్‌థ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి(వైటీపీఎస్‌) కేంద్రాల నుంచి రాష్ట్రానికి 45 శాతం విద్యుత్‌ను సరఫరా చేసే యూనిట్లలో ఉత్పత్తి సామర్ద్యం సన్నగిల్లింది. ఆర్టీపీఎస్‌లో 8 యూనిట్లు, వైటీపీఎస్‌లో 2 యూనిట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి మొత్తం 3,320 మె.వా. ఉంది. ఆర్టీపీఎస్‌లో 8 యూనిట్లలో 7 యూనిట్లు పని చేస్తున్నాయి. 210 మె.వా, వైటీపీఎస్‌లో 2 యూనిట్లలో ఒక్క యూనిట్‌ నుంచి కేవలం 800 మె.వా.విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. నీటి ప్రమాణం తగ్గుతున్న కొద్ది మొత్తం 823 మె.వా. విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది. వైటీపీఎస్‌లో 2 యూనిట్ల నుంచి 1600 మె.వా. విద్యుత్‌ ఉత్పత్తి కావాల్సి ఉండగా కేవలం 489 మె.వా. విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement