
లక్నోలో ఓ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ.. పిజ్జా డెలివరీ బాయ్‌పై రెచ్చిపోయింది. లక్నోలోని రద్దీగా ఉండే రోడ్డులో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్ బైక్.. ఓ మహిళ నడుపుతున్న కారును స్వల్పంగా తాకింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ పిజ్జా డెలివరీ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టింది.
దీంతో ఆగకుండా తన కారుకి జరిగిన డ్యామేజ్ కోసం రూ.30 వేలు ఇవ్వలంటూ డిమాండ్ చేసింది. అతని ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ బిగ్గరగా అరుస్తూ హల్‌చల్ చేసింది. నగదు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన డెలివరీ బాయ్ తన వైపు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ.. తోటి రైడర్‌లకు ఫోన్ చేశాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు.
ఎవరిపైనా చేయి చేసుకోవడానికి హక్కు లేదంటూ మహిళను వారించారు. దీంతో ఆ మహిళ.. సలహాలు ఇవ్వకండి. నష్టం కలిగించింది ఇతనే కనుక డబ్బులు కూడా ఇతనే చెల్లించాలి. మీరు కావాలంటే పోలీసులకు ఫోన్ చేయండి” అంటూ మరింత చెలరేగిపోయింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ చర్యను దాడిగా పేర్కొంటూ.. ఆమెను అరెస్టు చేయాలని కొందరు డిమాండ్ చేశారు.
Lucknow 📍
Woman Slaps Pizza Delivery Guy Over Minor Accident, Demands ₹30,000 As Damage Control pic.twitter.com/mmS3bCHay5— Mayank Burmee (@BurmeeM) September 13, 2025