క్షణం.. క్షణం.. ఉత్కంఠ రేపే జానపద నృత్యం..! | Woman Wins Hearts With Stunning Dance Goes Viral | Sakshi
Sakshi News home page

భారతీయ సంస్కృతికి అద్దం పట్టే అద్భుతమైన నృత్యరూపకం..!

Sep 22 2025 11:26 AM | Updated on Sep 22 2025 11:44 AM

Woman Wins Hearts With Stunning Dance Goes Viral

ఎన్నో రకాల నృత్యాలు చూశాం. కానీ ఈ నృత్యం చూస్తుంటే ఎలా చేయగలదా అన్న అనుమానం..ఏం జరుగుతోందో అన్న టెన్షన్‌తో అలర్ట్‌గా ఉండేలా చేసే అద్భుతమైన నృత్యం. సాహసోపేతమైన డ్యాన్స్‌కి మరో రూపం ఇదేనేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియొలో ఒక మహిళ సంప్రదాయ లెహెంగా చోలి, చక్కటి ఆభరణాలు ధరించి అద్భుతమైన జానపద నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఉత్కంఠభరితమైన ఆ నృత్యం భారతీయ సంస్కృతికి అసలైన అందంగా అలరారింది. చూస్తున్నంతసేపు చేయగలదా అన్న టెన్షన్‌, నిజమైన ప్రతిభకు అర్థం పట్టే డ్యాన్స్‌ ఇది. ఆ వీడియోలో ఒక మహిళ తన తలపై మూడు మట్టికుండలను బ్యాలెన్స్‌ చేస్తూ..కింద ఒక ప్లేట్‌పై డ్యాన్స్‌ చేస్తున్నట్లు చూడొచ్చు. 

ఆ నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాలంటే, ప్రతిభ, దృష్టి, ఏకాగ్రత, బ్యాలెన్స్‌పై మంచి పట్టు ఉండాలి. అప్పుడే ఆ నృత్యంలో దాగున్న అద్భతమైన అందం ప్రేక్షకుల్ని అటెన్షన్‌తో తిలకించేలా చేస్తుంది. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మీరు చేసిన విధానం అత్యంత అద్భుతంగా ఉంది, నిజమైన ప్రతిభ భారతదేశ సంస్కృతికి అసలైన అందం అని కీర్తిస్తూ పోస్టలు పెట్టారు.

 

(చదవండి: మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement