
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇందులో నేతలకు ఓ పద్ధతి అంటూ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నేతల బూతు పురాణాలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. స్వయంగా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవువుతున్నాయి. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఓ మహిళా ఆటోడ్రైవర్ పక్కనే కూర్చున్న లోకేష్.. ఆమె కంగుతినే రేంజ్‌లో మాట అన్నారు.
విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఇతర నేతలంతా ఆటోలో ప్రయాణించారు. ఆ సమయంలో.. ఆటో వెనుక రాసిన కొటేషన్లు చదువుతూ, లోకేష్ హాస్యం చేయబోయారు. ‘‘కంగారు పెట్టకండి..గుద్దితే నాకే బొ*’’ అంటూ లోకేష్ నోట మాట వచ్చింది.
దీంతో ఆ మహిళా డ్రైవర్ ఒక్కసారిగా కంగుతింది. అయితే మంత్రిగారూ ఫీలవుతారనుకుందో ఏమో.. ఆమె కూడా ఇబ్బందిగానే నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు చేరింది. కనీస గౌరవం లేకుండా ఓ మహిళ ముందు ఇలాగేనా మాట్లాడేంది అంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు.