ఢిల్లీలో యువతిపై వేధింపులు.. యాసిడ్‌ దాడి | woman sustained burn injuries on her hands in an alleged acid attack | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో యువతిపై వేధింపులు.. యాసిడ్‌ దాడి

Oct 27 2025 6:16 AM | Updated on Oct 27 2025 6:16 AM

woman sustained burn injuries on her hands in an alleged acid attack

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళపై యాసిడ్‌ దాడి జరిగింది. ముకుంద్‌పూర్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ సెకండియర్‌ చదువుకుంటోంది. ఆదివారం అదనపు క్లాసులని కాలేజీ వైపు నడిచి వెళ్తున్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన జితేందర్‌ బైక్‌పై ఇషాన్, అర్మాన్‌ అనే మరో ఇద్దరితో కలిసి వచ్చి అడ్డగించాడు. ఇషాన్‌ ఇచ్చిన బాటిల్‌ను ఓపెన్‌ చేసిన అర్మాన్‌ అందులోని యాసిడ్‌ను యువతి ముఖంపై చల్లాడు. 

రక్షణగా అడ్డు పెట్టుకున్న రెండు చేతులపై యాసిడ్‌ పడి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి బైక్‌పై పరార య్యారు. అనంతరం కుటుంబీలకు సాయంతో బాధితురాలు ఆస్పత్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా బాధితురాలిని జితే ందర్‌ వేధింపులకు గురి చేస్తున్నాడు. నెల రోజు ల క్రితం ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. అప్పటి నుంచి వేధింపులు తీవ్రతర మయ్యాయి. ఈ మేరకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యాసిడ్‌ చల్లినందుకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకు నేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement