breaking news
Ashok Vihar
-
ఢిల్లీలో యువతిపై వేధింపులు.. యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ముకుంద్‌పూర్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుకుంటోంది. ఆదివారం అదనపు క్లాసులని కాలేజీ వైపు నడిచి వెళ్తున్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన జితేందర్ బైక్‌పై ఇషాన్, అర్మాన్ అనే మరో ఇద్దరితో కలిసి వచ్చి అడ్డగించాడు. ఇషాన్ ఇచ్చిన బాటిల్‌ను ఓపెన్ చేసిన అర్మాన్ అందులోని యాసిడ్‌ను యువతి ముఖంపై చల్లాడు. రక్షణగా అడ్డు పెట్టుకున్న రెండు చేతులపై యాసిడ్ పడి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి బైక్‌పై పరార య్యారు. అనంతరం కుటుంబీలకు సాయంతో బాధితురాలు ఆస్పత్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా బాధితురాలిని జితే ందర్ వేధింపులకు గురి చేస్తున్నాడు. నెల రోజు ల క్రితం ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. అప్పటి నుంచి వేధింపులు తీవ్రతర మయ్యాయి. ఈ మేరకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యాసిడ్ చల్లినందుకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకు నేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
రాజ్యాధికారాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
సంస్కృతి రక్షణ పేరుతో దాడులకు పాల్పడొద్దు: ఢిల్లీ కోర్టు న్యూఢిల్లీ: నైతిక విలువల రక్షణ పేరిట రాజ్యాధికారాన్ని చేతుల్లో తీసుకునే అధికారం ఎవరికీ లేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. తన కార్లో కూర్చొని ఓ స్నేహితురాలితో కలసి మద్యం సేవిస్తున్న వ్యక్తిని కాల్చేసిన గన్‌మన్‌కు యావ జ్జీవ కఠిన జైలు శిక్ష విధిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 2011 లో అశోక్ విహార్‌లో హరియాణాకు చెందిన సందీప్‌కుమార్ అనే 32 ఏళ్ల గన్‌మన్.. వీరేందర్ అనే వ్యక్తిని లెసైన్స్డ్ రైఫిల్‌తో కాల్చడంతో అతను మరణించాడు. కోర్టు కుమార్‌కు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. రూ. లక్ష వీరేందర్ కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి కామిని మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు సున్నితమైన సామాజికాంశాల్ని దెబ్బతీస్తాయన్నారు. దేశ సంస్కృతి పరిరక్షణ పేరుతో పలువురు వ్యక్తులు, సంఘాలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, అధిక సందర్భాల్లో యువతులే లక్ష్యంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరి ప్రవర్తన సవ్యంగా ఉండాలని.. అదే సందర్భంలో అలా లేనివారిని శిక్షించే అధికారం ఏ ఒక్కరికీ లేదని అన్నారు.


