
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.