
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. రేణు అగర్వాల్(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు.. ఆ మహిళను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఇంట్లో పనిచేసే వ్యక్తులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.