breaking news
loses life
-
కూకట్‌పల్లిలో దారుణం.. అపార్ట్మెంట్లో మహిళ హత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. రేణు అగర్వాల్(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు.. ఆ మహిళను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.ఇంట్లో పనిచేసే వ్యక్తులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థి మృతి
బస్సులోంచి జారిపడి ఓ ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోట బస్‌స్టాండ్‌లో శుక్రవారం జరిగింది. నాయుడుపేట మండలానికి చెందిన ప్రభాకర్ (16) కోట విద్యానగర్ లోని ఎన్బీకేఆర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఊరు నుంచి కాలేజికి రోజూ ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తుంటాడు. రోజులాగే శుక్రవారం కాలేజి నుంచి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో జారిపడ్డాడు. దీంతో బస్సు వెనక చక్రాలు అతని పై నుంచి పోవడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు.


