ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థి మృతి | student slips off from rtc bus, loses life | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థి మృతి

Sep 11 2015 8:22 PM | Updated on Sep 3 2017 9:12 AM

బస్సులోంచి జారిపడి ఓ ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోట బస్‌స్టాండ్‌లో శుక్రవారం జరిగింది.

బస్సులోంచి జారిపడి ఓ ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోట బస్‌స్టాండ్‌లో శుక్రవారం జరిగింది. నాయుడుపేట మండలానికి చెందిన ప్రభాకర్ (16) కోట విద్యానగర్ లోని ఎన్‌బీకేఆర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు.

ఊరు నుంచి కాలేజికి రోజూ ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తుంటాడు. రోజులాగే శుక్రవారం కాలేజి నుంచి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో జారిపడ్డాడు. దీంతో బస్సు వెనక చక్రాలు అతని పై నుంచి పోవడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement