
పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన ఓ మహిళకు పెద్దపల్లి మండలం అప్పన్న పేటలో నివసించే అరవింద్‌తో స్నాప్ చాట్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే అతడికి 22, ఆమెకు 35 సంవత్సరాలు. అంతే కాదు ఆమె ఓ వివాహిత. తనకు 12 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు.
వీరి ప్రేమ వ్యవహారం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలియడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశాడు ఆ మహిళ భర్త. ఏం చేయాలో పాలుపోక ప్రియుడు అరవింద్ ఇంటి ముందు బైఠాయించి పెళ్లి చేసుకోవాలని వేడుకున్న ప్రియురాలు.
12 సంవత్సరాల వయసు గల పిల్లలున్న మహిళతో పెండ్లి ఎలాగని తలలు పట్టుకుంటున్న అరవింద్ కుటుంబ సభ్యులు. ఇరు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన స్నాప్ చాట్ వ్యవహారం.
పోలీస్ స్టేషన్‌కు చేరిన స్నాప్ చాట్ ప్రేమ పంచాయతీ. ఇరు కుటుంబాలను కౌన్సిలింగ్ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు