
హైదరాబాద్: యువతిని మాట్లాడుదాం అని పిలిచి ఆమెను బ్లేడుతో కోసి ఓ యువకుడు పరారరయ్యాడు.ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... మూసాపేటకు చెందిన మోషిన్ (20) అఫ్రిన్ (20) ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అనంతరం ఇద్దరూ ప్రేమించుకున్నారు. అతను ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుండటంతో అతని ప్రవర్తనతో తట్టుకోలేకపోయిన ఆమె చాలా నెలలు నుండి అతనిని దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంది.
ఆదివారం రాత్రి 8 గంటలకు ఆమె ఇంటికి వెళుతుండగా ఫోన్ చేసి మాట్లాడటానికి మూసాపేట మెట్రో స్టేషన్‌కు రమ్మని కోరారు. ఆమె రాత్రి 11 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ గొడవ పడటం ప్రారంభించారు. ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా నిందితుడు వెంట తెచ్చుకున బ్లేడ్ తీసుకుని ఆమె కడుపులో పొడిచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న యువతిని స్థానికులు కూకట్‌పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.