
రాత్రివేళ దసరా ఏనుగులతో చిందులు
మైసూరు: వీడియోల పిచ్చితో యువతీ యువకులు పడరాని పాట్లు పడుతుంటారు. ఎక్కడ మంచి రీల్స్‌కు చాన్సుందా అని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం దుస్సాహసాలు కూడా చేస్తుంటారు. అదే మాదిరిగా మైసూరులోని దసరా ఏనుగులతో ఓ యువతి రీల్స్ చేసింది. వాటిని సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయ్యాయి. మావటీలు, కాపలాదారులు తప్ప ఇతరులు దసరా ఏనుగుల వద్దకు వెళ్లే అవకాశం లేదు.
కానీ ఓ యువతి రాత్రి సమయంలో వచ్చి ఏనుగుల వద్ద డ్యాన్సులు చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంది. ఆ సమయంలో అక్కడి సిబ్బంది ఎందుకు ఆమెను అడ్డుకోలేదో తెలియడం లేదు. వీడియోలు వ్యాప్తి చెందగా, ఆమె చర్యపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. గలాటా జరుగుతోందని తెలిసి ఆ యువతి వీడియోలను తొలగించింది. అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ యువతి కోసం గాలిస్తున్నారు.