పనిని ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్‌ కిచెన్‌ గ్యాడ్జెట్స్‌ | Smart Kitchen Gadgets That Make Cooking And Serving Easier At Home, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

పనిని ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్‌ కిచెన్‌ గ్యాడ్జెట్స్‌

Jul 5 2026 11:45 AM | Updated on Jul 5 2026 1:36 PM

Interesting Kitchen Gadgets That Make Tasks Easier

కిచెన్‌ గ్యాడ్జెట్స్‌

రోజూవారీ వంటలు వండటం ఒక ఎత్తయితే, వాటిని వేడి వేడిగా వడ్డించడం, పిల్లలు అడిగిన స్నాక్స్‌ అప్పటికప్పుడు చేయడం గృహిణులకు పెద్ద టాస్క్‌. ఇలా కాకండా, వంట పనిని స్మార్ట్‌గా, ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్‌ కిచెన్‌ గ్యాడ్జెట్స్‌ ఇవే...

ఇంట్లోనే ఐస్‌క్రీమ్‌ రోల్స్‌!
‘ఐస్‌క్రీమ్‌ కావాలి!’ అని పిల్లలు అడిగిన వెంటనే.. హెల్దీ హోమ్‌ మేడ్‌ ఐస్‌క్రీమ్‌ కోసం షాప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌ రోల్స్‌ చేసి ఇచ్చేయడానికి వచ్చేసింది ఈ ఇన్‌ స్టంట్‌ ఐస్‌క్రీమ్‌ మేకర్‌. ఇది మీ కిచెన్‌ ను చిన్న ఐస్‌క్రీమ్‌ పార్లర్‌గా మార్చేస్తుంది. ఈ కోల్డ్‌ ప్లేట్‌ను కొన్ని గంటల ముందు ఫ్రీజర్‌లో ఉంచి. బయటకు తీసిన తర్వాత దానిపై ఐస్‌క్రీమ్‌ మిశ్రమాన్ని పోయాలి. ఇక  క్షణాల్లో గడ్డకట్టిన మిశ్రమాన్ని స్క్రాపర్లతో రోల్స్‌గా మార్చేస్తే చాలు! చల్లచల్లని ఐస్‌క్రీమ్‌ రోల్స్‌ రెడీ! ఇలా రోల్స్‌తో పాటు గెలాటో, సార్బెట్‌ వంటి ఫ్రోజెన్‌ డెజర్ట్స్‌ కూడా తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని వాడటానికి కరెంట్‌ అవసరం లేదు. ఎలాంటి క్లిష్టమైన యంత్ర భాగాలు లేవు. ఫుడ్‌ గ్రేడ్‌ మెటీరియల్‌తో తయారైన ఈ ట్రేను శుభ్రం చేయడం కూడా చాలా సులభం. ధర రూ.3,000 మాత్రమే!

దోసెల ప్రేమికులకు గుడ్‌ న్యూస్‌!
గ్యాస్‌ స్టవ్‌ ముందు గంటల తరబడి నిలబడి దోసెలు వేయడం మరచిపోండి! ఇప్పుడు ప్లగ్‌ పెడితే చాలు, నిమిషాల్లో వేడి వేడి దోసెలు మీ ప్లేట్‌లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే, ఈ ఎలక్ట్రిక్‌ గ్రిడిల్‌ క్రేప్‌ మేకర్‌తో దోసెలు, పాన్‌ కేక్‌లు, ఆమ్లెట్‌లు, క్రేప్‌లను ఎలాంటి గ్యాస్‌ అవసరం లేకుండా ఎక్కడైనా సులభంగా తయారుచేసుకోవచ్చు. నాన్‌–స్టిక్‌ కోటింగ్‌ ఉండటంతో తక్కువ నూనెతోనే వంట పూర్తవుతుంది. ఆటోమేటిక్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌ వల్ల ప్రతి దోసె సమంగా కాలి, రుచిగా ఉంటుంది. తేలికైన బరువుతో ఉండటంతో  హాస్టల్‌ గదుల్లో, చిన్న ఇళ్లలో, ఆఫీసుల్లో ఎక్కడైనా ఈజీగా ఉపయోగించు కోవచ్చు. ధర కేవలం రూ.1,400 మాత్రమే!

టేబుల్‌పైనే వేడి వేడి విందు!
అతిథులు ఒక్కోసారి వచ్చి కూర్చుంటే, కిచెన్‌ కి వెళ్లి మళ్లీ మళ్లీ వేడి చేయడం కాని పని. అలాగని, వారు వచ్చే ముందు వేడివేడిగా వండటమూ కష్టమే. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు వచ్చేసింది ఎలక్ట్రిక్‌ ఫుడ్‌ వార్మింగ్‌ ట్రే మ్యాట్‌. దీనిపై ఒకేసారి 3 నుంచి 4 పెద్ద గిన్నెలను సులభంగా ఉంచుకోవచ్చు. అలా ఒకేసారి అన్నం, కూరలు, సూప్‌లు, స్నాక్స్‌... ఏవైనా సరే గంటల తరబడి సరైన ఉష్ణోగ్రతలో వేడిగా ఉంచుతుంది. పైగా ఇందులో ఉన్న స్మార్ట్‌ టచ్‌ కంట్రోల్‌ ప్యానెల్‌ ద్వారా వేడిని అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. అప్పుడు ఆహారం ఓవర్‌–కుక్‌ అవ్వకుండా, ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. దీని సర్ఫేస్‌ నాన్‌–స్టిక్‌ మెటీరియల్‌తో రావడం వల్ల ఏదైనా ఒలికినా, ఒక చిన్న గుడ్డతో ఈజీగా క్లీన్‌ చేసుకోవచ్చు. కిచెన్‌ చుట్టూ తిరిగే పని లేకుండా చేసే ఈ సూపర్‌ గాడ్జెట్‌ అసలు ధర రూ. 5,000.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement