పెద్దతరం చిన్నపోవద్దు! | 70 percent senior citizens live alone in India | Sakshi
Sakshi News home page

పెద్దతరం చిన్నపోవద్దు!

Jan 30 2026 3:24 AM | Updated on Jan 30 2026 3:24 AM

 70 percent senior citizens live alone in India

70% భారతదేశంలో కుటుంబ సభ్యులు లేకుండా ఒంటరిగా ఉంటున్న వృద్ధుల సంఖ్య 80 నుండి 90 లక్షల వరకు వుంటుందని గణాంకాల అంచనా. వీరిలో 70 శాతం ఒంటరి వృద్ధులు మహిళలే. 

2040 
2040 నాటికి ఒంటరిగా నివసించే వృద్ధ దంపతులు, ఒంటరి వృద్ధుల సంఖ్య బాగా  పెరగనుందని గణంకాలు చెబుతున్నాయి. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం  వేగంగా వృద్ధాప్యంలోకి అడుగుపెడుతోంది.

2050 నాటికి ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు వృద్ధులుగా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ గణాంకాల కంటే భయంకరమైనది వారు ఎదుర్కొంటున్న భావోద్వేగ నిర్లక్ష్యం. పిల్లలే సర్వస్వమనుకొని,వారికోసమే తమ జీవితాన్ని గడిపిన వారికి నేడు ఒంటరితనం శాపంలా మారుతోంది. ఎంతలా అంటే జీవితంపై ఆసక్తి పోయేంతలా.మానసిక కేంద్రాలకు వెళ్లేంతలా, తమకు గౌరవం, విలాసాలు కాదు కావల్సింది... ఒక ప్రేమపూర్వకమైన చిన్న పలకరింపు మాత్రమే అని వేడుకునేంతలా...

2046
2046 నాటికి వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు తప్పనిసరి అవసరంగా మారబోతున్నాయి.

20%
ప్రస్తుతం భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు దాదాపు 10 శాతం ఉండగా, 2040–46 నాటికి ఇది 20 శాతానికి చేరుకుంటుందని అంచనా. అంటే ప్రతి ఐదుగురిలో ఇద్దరు వృద్ధులు వుంటారు.

70%
సుమారుగా 75 శాతం మంది వృద్ధులు రోజూవారీ అవసరాల కోసం ఇతరులపై లేదా పిల్లలపై ఆధారపడుతున్నారు. 25 నుండి 50 శాతం వృద్ధ జంటలు పిల్లలు లేకుండా కేవలం ఇద్దరు మాత్రమే నివసిస్తున్నారు. 70శాతం మందికి ఎటువంటి పెన్షనూ లేదు.  

10
ఢిల్లీ ఎయిమ్స్‌లోని మానసిక వైద్య నిపుణుల ప్రకారం వృద్ధులలో 70 శాతం మంది నిద్రలేమి, ఒత్తిడి, మానసిక అనారోగ్యం, ఆందోళనతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో చాలామంది తమ మనసులోని బాధను, ఒంటరి తనాన్ని మాటల్లో చెప్పలేరు. అందుకే అది ఇతర శారీరక సమస్యల రూపంలో బయటపడుతుంది. ఒంటరిగా ఉండే వృద్ధులలో డిప్రెషన్‌ వచ్చే అవకాశం కుటుంబంతో ఉండే వారికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 70 శాతం అనే ఈ గణాంక సంఖ్య కేవలం ఒక అంకె కాదు, అది భారతదేశం ఎదుర్కోబోయే ఒక భారీ నిశ్శబ్ద మహమ్మారికి సంకేతం.

1.4 
భారత్‌లో డిమెన్షియా (మతి మరుపు) బాధితుల సంఖ్య ప్రతి 20 ఏండ్లకు రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం 2023–24 అంచనాల ప్రకారం సుమారు 88 లక్షల మంది 60 ఏళ్ల పైబడినవారు డిమెన్షియాతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 1.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

40%
ఐఎల్‌ఎస్‌ సెంటర్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌  లా అండ్‌ పాలసీ డైరెక్టర్, డాక్టర్‌ సౌమిత్ర పాఠరే ప్రకారం భారతదేశంలో వృద్ధుల ఆత్మహత్యలు 2019 లో 11,013 ఉండగా 2022 నాటికి ఆ సంఖ్య 15,339 కి పెరిగింది. అంటే ఆత్మహత్యల రేటు దాదాపుగా 40 శాతం పెరిగింది. భారతదేశంలో సగటున 42 మంది వృద్ధులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

14%
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 60ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది ఏదో ఒక మానసిక రుగ్మతతో సతమతమవుతున్నారు.

1,37,653 
ది జర్నల్స్‌ ఆఫ్‌ జెరంటాలజీ సిరీస్‌ బి అనే పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం సామాజిక ఒంటరితనం వృద్ధులలో మానసిక సామర్థ్యం తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం 14 ఏళ్ల కాలంలో 1,37,653 మానసిక పరీక్షలను విశ్లేషించింది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement