స్విగ్గీ, జొమాటో వెల్లడి
న్యూఢిల్లీ: కొత్తగా నోటిఫై చేసిన నాలుగు లేబర్ కోడ్స్‌ను స్విగ్గీ, జొమాటో మొదలైన అగ్రిగేటర్లు స్వాగతించాయి. ఈ సంస్కరణలతో లక్షల కొద్దీ వర్కర్లకు మేలు జరుగుతుందని స్విగ్గీ పేర్కొంది. తమ వ్యాపార వ్యయాలపై, దీర్ఘకాలికంగా ఆర్థిక పనితీరుపై ఇందుకు సంబంధించిన భారమేమీ ఉండదని వివరించింది. కంపెనీలపై నిబంధనల భారం తగ్గిస్తూ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో పనిచేసే వర్కర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవి ఉన్నాయని స్విగ్గీ తెలిపింది.
మరోవైపు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత మరింత అందుబాటులోకి వస్తుందని జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ పేర్కొంది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేస్తూ, గిగ్ వర్కర్ల నిబంధనల్లో ఏకరూపత తెచ్చే దిశగా ఇది సరైన అడుగని తెలిపింది. దీనివల్ల తమ జొమాటో, బ్లింకిట్ వ్యాపార విభాగాలపై ఆర్థిక భారమేమీ ఉండదని వివరించింది. గిగ్ వర్కర్లకు ఇప్పటికే తాము సమగ్ర బీమాతో పాటు ఇతరత్రా ప్రయోజనాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఎటర్నల్ వివరించింది.


