కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్‌ కష్టాలకు చెక్‌!

Government Asking Firms To Offer Gig Workers Some Social Security Benefits - Sakshi

గిగ్‌ ఉద్యోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సోషల్‌ సెక్యూరిటీ అంటే లైఫ్‌ ఇన్సూరెన్స్‌, పర్సనల్‌ యాక్సిడెంట్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటి సౌకర్యాలు కల్పించాలని ఓలా, ఉబర్‌, స్విగ్గీ, జొమాటో, అర్బన్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదే అంశంపై కేంద్ర కార్మిక శాఖ ఆయా సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం కేంద్రం - సంస్థల మధ్య కొనసాగుతున్న చర్చలు సఫలమైతే డెలివరీ బాయ్స్‌తో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న గిగ్‌ ఉద్యోగుల కష్టాలు గట్టెక్కనున్నాయి.

దేశంలోని అనధికారిక కార్మికులందరికీ సామాజిక భద్రతను అందించేలా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్‌ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించిన ఈ నాలుగు లేబర్‌ చట్టాలపై ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. 2022 జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కార్మిక చట్టాలు ఉమ్మడి అంశం కాబట్టి కేంద్ర, రాష్ట్రాలు సంబంధిత నిబంధనల ఆధారంగా వాటిని అమలు కావాల్సి ఉంది. కానీ అవి ఇప్పటికీ  కార్యరూపం దాల్చలేదు.  

ఇటీవల కాలంలో గిగ్‌ ఉద్యోగుల భవితవ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో కేంద్రం..గిగ్‌ ఉద్యోగులకు సోషల్‌ సెక్యూరిటీ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ వారికి బెన్ఫిట్స్‌ అందించే విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 

40శాతం మంది కార్మికులు
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ - 2021 నివేదిక ప్రకారం, వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం 40శాతం మంది కార్మికులు ఆరోగ్య బీమాను కలిగి ఉన్నారు. అయితే 20% కంటే తక్కువ మందికి యాక్సిడెంటల్‌ పాలసీ, నిరుద్యోగం, డిజేబిలిటీ ఇన్సూరెన్స్‌ (disability insurance), వృద్ధాప్య పెన్షన్‌లు లేదా పదవీ విరమణ ప్రయోజనాలు పొందుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.

గిగ్‌ వర్కర్లు అంటే ఎవరు?
ఫలానా సమయానికి/ ఫలానా పని కోసం నియమితులయ్యే కార్మికులే గిగ్‌ వర్కర్లు. తమ పనిగంటలను ఎంపిక చేసుకునే సౌలభ్యం వీళ్లకు ఉంటుంది.నీతి ఆయోగ్‌ గణాంకాల ప్రకారం.. గిగ్ ఎకానమీ వర్కర్ల వాటా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపింది. వర్క్‌ ఫోర్స్‌లో 1. 3 శాతం కంటే ఎక్కువగా ఉంది.

చదవండి👉 జొమాటోకు షాకిచ్చిన ఉద్యోగులు.. భారీ ఎత్తున నిలిచిపోయిన సేవలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top