breaking news
Labour Codes
-
నల్ల చట్టాలను విరమించుకోవాలి!
139 సంవత్సరాల క్రితం కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగా ఎనిమిది గంటల పని దినాలు సాకారం అయ్యాయి. ఆ పని గంటలతో పాటు అనేక ఇతర కార్మిక ప్రయోజనాలూ నేటి పాలకుల నల్ల చట్టాల కారణంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర పాలకులు తీసుకువచ్చారు. ఈ నాలుగు లేబర్ కోడ్ల అమలు ఆ యా రాష్ట్రాల ఇష్టానికి వదిలి గెజిట్ విడుదల చేశారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి ప్రభుత్వాలు కొత్తగా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమలు జరుపుతున్నాయి. దీనిలో భాగంగా 10 నుంచి 12 గంటల పని దినాలు అమలు జరిపేందుకు ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. ఫలితంగా ఏపీలో పనిదినాన్ని 9–10 గంటలుగా నిర్ణయించారు. మహిళలు రాత్రిపూట పనిచేయడానికి కూడా ఈ సవ రణ అనుమతిస్తున్నది. చట్ట రూపంలో అమలు అయితే ఓవర్ టైమ్ కూడా 75 గంటల నుండి 144 గంటల వరకు ఇవ్వొచ్చు. ప్రభుత్వం మహిళలకు సమాన అవకాశాల పేరిట రాత్రిపూట పని చేయడా నికి చేసే సవరణ వల్ల, అందుకు అంగీకరించని మహిళల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుంది. ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అధిక పని గంటలు అమలు జరిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వాణిజ్య సంస్థల కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పనిచేయాలి. అయితే వారా నికి 48 గంటల కన్నా ఎక్కువ పని చేయడానికి వీలు లేదనీ, అంతకుమించి పనిచేస్తే ఓవర్ టైం వేతనాలు చెల్లించాలనీ... కార్మిక శాఖ ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ ఓవర్ టైం పనిచేయడానికి పరిస్థితులు సహకరించని వాళ్ళను పని నుంచి తొలగించే అవకాశాలు ఏర్పడతాయి. యాజమాన్యాలు తమ అధిక లాభాల కోసం ఓవర్ టైం చేయాలని కార్మికులు, ఉద్యోగుల మీద ఒత్తిడి చేసే అధికారం నూతన లేబర్ కోడ్లు ఇస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2020 పారిశ్రామిక సంబంధ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. 100 మంది కంటే తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నసంస్థల నుండి వారిని తొలగించడం యాజమాన్యాలకు సులభం అవుతుంది. కార్మిక సంఘాల ఏర్పాటు చేసుకోవడం క్లిష్టంగా తయారవుతుంది. 10 మంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య సంక్షేమం వంటి హక్కులు కోల్పోతారు. నాలుగో లేబర్ కోడ్ అమలు ద్వారా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కోటి మందికి పైగా కార్మికులకు ఈ కోడ్ వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం వంటి రకరకాల పేర్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూనివర్సిటీలు కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఈ విధానం కొనసాగుతున్నది. ఏళ్ల తరబడి శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి కాంట్రాక్ట్ ప్రాతి పదికన తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. నాలుగు లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు జరిగితే వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగుల జీవి తాలు దుర్భరంగా దిగజారిపోతాయి. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పాతర వేసేందుకు బీజేపీ తహతలాడుతున్నది. ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలి గిస్తూ ఆ యా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రాలు స్వయం నిర్ణయాధికారం కలిగిన అంశాల్లో కూడా గవర్నర్ ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు సముచితంగా అందాల్సిన వాటాను ఇవ్వకుండా నిరంకుశ పోకడలు అనుసరిస్తున్నారు. రాష్ట్రాల అధికారాల్లో వేలు పెడుతూ ఆ యా రాష్ట్రాలను స్థానిక సంస్థల స్థాయికి కుదించే విధంగా కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ దేశ ప్రజల భవిష్యత్తుని కార్పొరేట్లకు తాకట్టు పెట్టే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి. ఈ నేపథ్యంలో వామ పక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ పార్టీలూ, ప్రజాసంఘాలూ, కార్మిక ఉద్యోగ సంఘాలూ జూలై 9న (నేడు) దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలి!కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి.-జూలకంటి రంగారెడ్డిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కమిటీ -
కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్!
గిగ్ ఉద్యోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో, అర్బన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై కేంద్ర కార్మిక శాఖ ఆయా సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం కేంద్రం - సంస్థల మధ్య కొనసాగుతున్న చర్చలు సఫలమైతే డెలివరీ బాయ్స్‌తో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న గిగ్ ఉద్యోగుల కష్టాలు గట్టెక్కనున్నాయి. దేశంలోని అనధికారిక కార్మికులందరికీ సామాజిక భద్రతను అందించేలా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించిన ఈ నాలుగు లేబర్ చట్టాలపై ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. 2022 జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కార్మిక చట్టాలు ఉమ్మడి అంశం కాబట్టి కేంద్ర, రాష్ట్రాలు సంబంధిత నిబంధనల ఆధారంగా వాటిని అమలు కావాల్సి ఉంది. కానీ అవి ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల కాలంలో గిగ్ ఉద్యోగుల భవితవ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో కేంద్రం..గిగ్ ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ వారికి బెన్ఫిట్స్ అందించే విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 40శాతం మంది కార్మికులు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ - 2021 నివేదిక ప్రకారం, వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం 40శాతం మంది కార్మికులు ఆరోగ్య బీమాను కలిగి ఉన్నారు. అయితే 20% కంటే తక్కువ మందికి యాక్సిడెంటల్ పాలసీ, నిరుద్యోగం, డిజేబిలిటీ ఇన్సూరెన్స్ (disability insurance), వృద్ధాప్య పెన్షన్లు లేదా పదవీ విరమణ ప్రయోజనాలు పొందుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. గిగ్ వర్కర్లు అంటే ఎవరు? ఫలానా సమయానికి/ ఫలానా పని కోసం నియమితులయ్యే కార్మికులే గిగ్ వర్కర్లు. తమ పనిగంటలను ఎంపిక చేసుకునే సౌలభ్యం వీళ్లకు ఉంటుంది.నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం.. గిగ్ ఎకానమీ వర్కర్ల వాటా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపింది. వర్క్ ఫోర్స్‌లో 1. 3 శాతం కంటే ఎక్కువగా ఉంది. చదవండి👉 జొమాటోకు షాకిచ్చిన ఉద్యోగులు.. భారీ ఎత్తున నిలిచిపోయిన సేవలు! -
‘లేబర్ కోడ్’లు రద్దు చేసేవరకు పోరాడుతాం
సిద్దిపేటఅర్బన్: కార్మికుల హక్కులను హరిస్తూ...వారికి ఉరితాళ్లుగా మారిన లేబర్ కోడ్లను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసేంతవరకు పోరాడుతూనే ఉంటామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపస్‌సేన్ స్పష్టం చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభల ముగింపు సమావేశం శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేరళ కార్మిక మంత్రి శివన్ కుట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా తపస్‌సేన్ మాట్లాడుతూ..కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ సామాన్యులను, కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని పెట్టుబడిదారులకు దోచిపెడు తూ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు (సీఆర్) మాట్లాడుతూ...29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా వర్గీకరించి కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చిందన్నారు. మళ్లీ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడుగా సీఆర్ సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.వీరయ్య, భూపాల్, ఎస్.రమ, పి.జయలక్ష్మి, కె, వెంకటేశ్వర రావు, జె.మల్లికార్జున్, వీఎస్.రావు, వీరారెడ్డి, ఈశ్వర్ రావు, రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కార్యదర్శులుగా వెంకటేశ్, పద్మశ్రీ, ముత్యంరావు, చంద్రశేఖర్, మధు, మల్లేశ్, రమేశ్, శ్రీకాంత్, రమేశ్, కూరపాటి రమేశ్, గోపాల స్వామి, కోశాధికారిగా రాములు ఎన్నికయ్యారు. -
వారానికి 4 రోజులే పని, కొత్త లేబర్ చట్టం అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాలు జులై1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంత వరకు అమలు జరగలేదు. ఒక వేళ అమలైతే ఉద్యోగుల వేతనం, పీఎఫ్ వాటా, పని సమయం, వీక్లీ ఆఫ్‌లు వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, అనేక రాష్ట్రాలు ఇంకా కొత్త కోడ్లను ఆమోదించలేదు. రాజ్యాంగం పరిధిలో కార్మిక అంశం ఉన్నందున అమలులో జాప్యం జరిగింది. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. కేంద్ర కార్మిక శాఖ సమాచారం ప్రకారం..ఇప్పటి వరకు 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల కోడ్- 2019 కింద ముసాయిదా నిబంధనల్ని ప్రచురించాయి. త్వరలో అమలులోకి రానున్న కొత్త లేబర్ కోడ్ ఉద్యోగుల పని గంటలు, టేక్ హోం శాలరీ, సెలవులపై ప్రభావం చూపనుంది. ఉద్యోగి చివరి వర్కింగ్ డేస్ వరకు చెల్లించాల్సిన వేతనాలు రెండు రోజుల లోపే పూర్తి చేయాలని వేతన కోడ్ నిర్దేశిస్తుంది. అదే విధంగా సంస్థలు ఉద్యోగుల పని గంటల్ని పెంచుకోవచ్చు. అలాంటి సందర్భాలలో ఉద్యోగులకు అదనపు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. ♦ కొత్త వేతన నియమావళి ప్రకారం బేసిక్ శాలరీ కనీసం 50 శాతం ఉండాలని నిర్దేశించడంతో ఉద్యోగులు తీసుకునే టేక్ హోం శాలరీపై ప్రభావం పడనుంది. ♦ ఉద్యోగి, సంస్థల సహకారంతో ఎక్కువ మొత్తం పీఎఫ్‌లో జత కానుంది. ♦ 2019లో పార్లమెంట్ ఆమోదించిన ఈ లేబర్ కోడ్ 29 కేంద్ర కార్మిక చట్టాలను భర్తీ చేస్తుంది. ♦ వేతనం, సామాజిక భద్రత, కార్మిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై నాలుగు కొత్త కోడ్లు జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. జాప్యం జరగడంతో త్వరలోనే అమలు జరగనున్నాయి. ఉద్యోగులపై ప్రభావం రాజీనామా, ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత ఉద్యోగి చివరి పనిదినం వరకు చెల్లించిన బకాయిల్ని రెండు రోజులలోపు పూర్తి చేయాలని కొత్త చట్టం ఆదేశిస్తుంది. ప్రస్తుతం, కంపెనీలు సెటిల్మెంట్కు 45 రోజుల నుండి 60 రోజుల గడువు విధిస్తున్న విషయం తెలిసిందే. పెరగనున్న పని గంటలు కొత్త కార్మిక చట్టంలో సంస్థలు ఉద్యోగుల పని గంటల్ని 9 గంటల నుండి 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తుంది. పనిగంటలు పెరిగితే కొత్త లేబర్ చట్టాల ప్రకారం.. ఉద్యోగులు ప్రస్తుతం వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తుండగా..కొత్త పనివేళలతో వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులకు వారానికి 3 రోజుల హాలిడేస్ కావాలి అనుకుంటే ప్రతి వారం 48 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. వారంలో 48 పని గంటలు దాటితే సదురు ఉద్యోగికి..సంస్థలు అదనంగా ఓవర్ టైం చెల్లించాల్సి ఉంటుంది. -
టేక్ హోం సాలరీ, పనిగంటలు: జూలై 1 నుంచి మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం జూలై 1నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలుతో కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి, వేతనాలలో గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. అలాగే ఆఫీసు వేళలు, పీఎఫ్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ టేక్-హోమ్ జీతం తగ్గే అవకాశం ఉంది. జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఇంకా నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను రూపొందించలేదు. 23 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) మాత్రమే వేతనాలపై కోడ్ ముసాయిదా నిబంధనలను ప్రచురించాయని కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ లోక్‌సభ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కొత్త లేబర్ కోడ్స్, మార్పులు జూలై 1వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలు అమలైతే, ఆఫీసు పని గంటలను 8-9 గంటల నుండి 12 గంటల వరకు పెంచవచ్చు. అయితే పనిగంటలు పెరిగితే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ఆఫీస్ పనివేళలను మార్చుకోవడానికి కంపెనీలకు వీలుంటుంది. కాబట్టి, వారంలో పనిదినాలు నాలుగు రోజులకు తగ్గించబడతాయి, కానీ వారంలో మొత్తం పని గంటలు ప్రభావితం కావు. కొత్త వేతన కోడ్ ప్రకారం వారానికి మొత్తం 48 పని గంటలు తప్పనిసరి. కొత్త వేతన కోడ్ ప్రకారం టేక్-హోమ్ జీతం కాంపోనెంట్, ప్రావిడెంట్ ఫండ్‌కు యజమానుల సహకారంలో మార్పు ఉంటుంది. స్థూల నెలవారీ జీతంలో కనీసం 50 శాతం బేసిక్ జీతం ఉంటుంది కాబట్టి ఉద్యోగుల టేక్-హోమ్ జీతం కూడా గణనీయంగా మారుతుంది. ఇది ఉద్యోగి, యజమాని పీఎఫ్ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. కొంత మంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు టేక్ హోం జీతం తగ్గుతుంది. అయితే ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వ నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమలుకు కేంద్రం యోచిస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం- పని పరిస్థితులు లాంటి అంశాల ఆధారంగా 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ కొత్త కోడ్స్‌ను రూపొందించింది. -
ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ విషయంలో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే లేబర్ కోడ్స్ అమల్లోకి రావాల్సి ఉండగా.. కొత్త విధివిధానాలను రూపొందించడంలో జాప్యం జరగడంతో లేబర్ కోడ్స్ అమలు నిలిచిపోయింది. వివిధ కార్మిక చట్టాలను సవరించిన వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత; ఆరోగ్యం, పని పరిస్థితులు పేరిట నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేబర్ కోడ్స్‌కు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం రూపొందించింది. ఉమ్మడి జాబితాలో... కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కూడా విధివిధానాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే 18 రాష్ట్రాలు లేబర్ కోడ్స్ డ్రాఫ్ట్‌ను ప్రచురించాయి. ఈ 18 రాష్ట్రాలు నియమ నిబంధనలను ఖరారు చేసినట్లు ఇటీవల కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాజ్యసభలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాలూ నిబంధనలను ఖరారు చేశాక వచ్చే ఏడాది నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి రానున్నాయని కార్మిక శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే..! ఈ కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే ఉద్యోగుల ప్రాథమిక వేతనం, ప్రావిడెంట్ ఫండ్ లెక్కించే విధానంలో గణనీయమైన మార్పులు రానున్నాయి. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చేవి. కొత్త వేతనాల కోడ్ ప్రకారం.. ఉద్యోగి స్థూల వేతనం 50 శాతం, అలవెన్సులు 50 శాతం చొప్పున ఉండాలి. అంటే ఉద్యోగులు టెక్ హోమ్ శాలరీ తగ్గి, ఆయా కంపెనీలు పీఎఫ్ వాటాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉద్యోగుల పనిదినాలు కూడా మారనున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న వారానికి ఐదు రోజుల పాలసీకు బదులుగా, వచ్చే ఏడాది నుంచి నాలుగు రోజుల పాటు పనిచేసే అవకాశం ఉద్యోగులకు రానుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన వస్తే..ఆ నాలుగు రోజుల్లో ఉద్యోగులు 12 గంటలపాటు పని చేయాల్సి ఉంటుందని కార్మిక శాఖ వెల్లడించింది. చదవండి: క్రిప్టోకరెన్సీ చట్టం: ముగియనున్న సమావేశాలు! క్రిప్టో బిల్లుపై జాప్యానికి కారణాలు ఏంటంటే..