ఐటీ ఉద్యోగుల జీతాలు.. కొత్త లేబర్‌ కోడ్‌ | IT Employees To Get Salaries By 7th Of Every Month New Labour Code | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగుల జీతాలు.. కొత్త లేబర్‌ కోడ్‌

Nov 22 2025 8:36 AM | Updated on Nov 22 2025 9:09 AM

IT Employees To Get Salaries By 7th Of Every Month New Labour Code

ఐటీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి.. ఇవి కాక అనేక ఇతర ప్రయోజనాలు.. ఆహా జాబ్‌ అంటే ఐటీ వాళ్లదే అనుకుంటాం. కానీ వాస్తవంలోకి వెళ్తే ఉద్యోగులకు అరకొర జీతాలు.. అదీ నెలనెలా సక్రమంగా ఇవ్వని ఐటీ కంపెనీలు అనేకం ఉన్నాయి. అలాంటి బాధితులకు ఉపశమనం కలగనుంది.

దేశంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొత్త లేబర్‌ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లేబర్‌ కోడ్‌లను తక్షణం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులకు ప్రతి నెలా 7వ తేదీలోగా జీతం పంపిణీ చేయడం తప్పనిసరి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇకపై జీతాల్లో జాప్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇక మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కూడా కొత్త లేబర్‌కోడ్‌ పలు అంశాలను నిర్దేశించింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, వేతనంలో లింగ ఆధారిత అసమానత ఉండదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

అంతేకాకుండా నైట్‌ షిఫ్టులలో పని చేయడం ద్వారా అందే అధిక వేతనాలు, ఇతర ప్రయోజాలను మహిళలు కూడా పొందవచ్చు. ఇందుకు అనుగుణంగా మహిళా ఉద్యోగులు రాత్రి షిఫ్టులలో పని చేసుకునేలా అన్ని సంస్థలలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.

వీటన్నింటితో పాటు పరిశ్రమ-నిర్దిష్ట కోడ్ ప్రకారం.. వేధింపులు, వివక్ష, వేతన సంబంధిత వివాదాలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుంది. ఉద్యోగులందరికీ నిర్ణీత కాల ఉపాధి, నియామక పత్రాలు అందించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సరళీకృతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఈ లేబర్‌ కోడ్‌లను ప్రకటించింది.

ఇది చదివారా?: కొత్త జాబ్‌ ట్రెండ్స్‌.. ప్రయోగాత్మక పని విధానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement