లాభాల్లోనే లాస్‌  బలంగానే బిజినెస్‌ | TCS net profit fell 14percent to Rs 10657 cr in Q3 | Sakshi
Sakshi News home page

లాభాల్లోనే లాస్‌  బలంగానే బిజినెస్‌

Jan 13 2026 5:00 AM | Updated on Jan 13 2026 5:11 AM

TCS net profit fell 14percent to Rs 10657 cr in Q3

టీసీఎస్‌ రిజల్ట్స్‌

క్యూ3లో రూ. 10,657 కోట్లు 

ఆదాయం రూ. 67,087 కోట్లు 

11,151 మందికి ఉద్వాసన 

రూ. 46 ప్రత్యేక డివిడెండ్‌

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. త్రైమాసికవారీగా అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 10,657 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా కొత్త కారి్మక చట్ట నిబంధనల అమలు ప్రభావం చూపినట్లు టీసీఎస్‌ పేర్కొంది. ఇందుకు రూ. 2,128 కోట్లు(వన్‌టైమ్‌) కేటాయించింది. లేదంటే నికర లాభం 8.5 శాతం ఎగసి రూ. 13,438 కోట్లకు చేరేదని తెలియజేసింది. ఈ ఏడాది క్యూ2లో రూ. 12,075 కోట్లు ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 67,087 కోట్లకు చేరింది. క్యూ2లో రూ. 63,973 కోట్ల టర్నోవర్‌ సాధించింది.  

ఆర్డర్లు గుడ్‌ 
తాజా సమీక్షా కాలంలో టీసీఎస్‌ 9.3 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది. వాటాదారులకు రూ. 11 మధ్యంతర డివిడెండ్‌తోపాటు షేరుకి రూ. 46 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను సైతం బోర్డు సిఫారసు చేసింది. వెరసి ఒక్కో షేరుకీ రూ. 57 చొప్పున చెల్లించనుంది. 

మార్జిన్లు ఓకే 
తాజా త్రైమాసికంలో టీసీఎస్‌ నిర్వహణ మార్జిన్లు క్యూ2తో పోలిస్తే నిలకడగా 25.2 శాతంగా నమోదయ్యాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో 24.5 శాతం మార్జిన్లు సాధించింది. క్యూ2 బాటలో రానున్న త్రైమాసికంలోనూ ఆదాయం వృద్ధి కొనసాగనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్‌ తెలియజేశారు. ఏఐ ఆదాయం 17 శాతం జంప్‌చేసినట్లు వెల్లడించారు. ఆదాయంలో ఉత్తర అమెరికా వాటా 1.3 శాతం పుంజుకోగా.. యూకే 3.2 శాతం నీరసించింది. దేశీ ఆదాయం 34 శాతం క్షీణించింది. క్యూ3లో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 11,151 తగ్గి 2025 డిసెంబర్‌ 31 కల్లా 5,82,163కు పరిమితమైంది. ఇందులో, పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా 1,800 మంది ని్రష్కమించినట్లు సంస్థ తెలిపింది.  

ఫలితాల నేపథ్యంలో టీసీఎస్‌ షేరు బీఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 3,236 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement