పుర ఎన్నికల్లో ఆర్వోలే కీలకం
మూడు వార్డులకు ఒకరి నియామకం
వనపర్తిటౌన్: పుర ఎన్నికల నిర్వహణలో కీలకమైన నామినేషన్ల పత్రాల పరిశీలన విధానాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసింది. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా నామినేషన్ల స్వీకరణ నుంచి విజేతలకు ధ్రువపత్రాల ఽజారీ వరకు అన్నింటిని చూసుకునే పుర కమిషనర్లకు ఎన్నికల నిర్వహణ భారాన్ని తప్పిస్తూ రిటర్నింగ్ అధికారులకు బాధ్యతలు కట్టబెట్టింది. ఈసారి పుర ఎన్నికలకు గెజిటెడ్ హోదా ఉన్న అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. మున్సిపాల్టీకి రిటర్నింగ్ అధికారి ఒక్కరుంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు వార్డులకు ఒకరు బాధ్యతలు నిర్వర్తించేలా నియమించింది. దీంతో ఎన్నికల ప్రక్రియలో వేగం పెరగడంతో పాటు ఆయా వార్డులకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. దీనికితోడు ప్రతి రిటర్నింగ్ అధికారికి మరో సహాయ రిటర్నింగ్ అధికారిని సైతం నియమించారు. ఎన్నికల ఫలితాలు సైతం ఆయా వార్డుల ఆర్వోలే ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. ఏదేని పురపాలికలో ఒక్క వార్డు ఎక్కువైతే ఒక అధికారికి అదనంగా కేటాయించారు. తక్కువైతే రెండింటికే పరిమితం చేస్తారు. అంతేగాకుండా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో రిజర్వ్ అధికారులను సైతం నియమించారు.
పెరగనున్న పరిశీలన..
పుర ఎన్నికల్లో నామినేషన్ పత్రాల పరిశీలన సుశితంగా ఉండనుంది. ఏ చిన్న పొరపాటు గుర్తించినా తిరస్కరిస్తారు. నామినేషన్ పత్రాల ఆమోదానికి అభ్యర్థులు పొందుపర్చిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఏ చిన్న తప్పు జరిగినా అధికారిదే బాధ్యత.
పురపాలికల వారీగా సిబ్బంది కేటాయింపు ఇలా..
మున్సిపాలిటీ ఆర్వోలు ఏఆర్వోలు రిజర్వ్ రిజర్వ్
ఆర్వోలు ఏఆర్వోలు వనపర్తి 11 11 2 2
కొత్తకోట 5 5 2 2
పెబ్బేరు 4 4 2 2
ఆత్మకూర్ 4 4 1 1
అమరచింత 4 4 1 1
నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ధ్రువీకరణ పత్రాల జారీ వరకు వారిదే బాధ్యత
నామినేషన్ల పరిశీలన సరళీకృతం
అభ్యర్థులకు తప్పనున్న అనుమానాలు


