breaking news
Wanaparthy District News
-
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
కొత్తకోట రూరల్: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని.. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5 లక్షల సాయం అందించారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని రామనంతాపురం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త బజారు ఆంజనేయులు (30) మృతి చెందడంతో శనివారం గ్రామానికి చేరుకొని ఆంజనేయులు కుమార్తెలు కావ్యశ్రీ, కీర్తన పేరిట వేర్వేరుగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎఫ్డీ బాండ్లు అందజేయడంతో పాటు తల్లికి రూ.50 వేలు, భార్య మనీషాకు రూ.50 వేలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంజనేయులు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సమయంలోనూ ఆర్థిక సాయం అందించామని అయినప్పటికీ కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కుమార్తెల భవిష్యత్ చదువులకు అండగా ఉంటామన్నారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, సీడీసీ మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, బీఆర్ఎస్ దేవరకద్ర మహిళా విభాగం ఇన్చార్జ్ జయంతి, పి.విశ్వేశ్వర్, సాక బాలనారాయణ, కౌన్సిలర్ అయ్యన్న పాల్గొన్నారు. -
చి‘వరి’కి.. దక్కేనా?
గద్వాల: ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాధారిత పంటలు పూర్తిగా దెబ్బతినగా.. జూరాల నీటి ఆధారంగా సాగు చేసిన వరిపంట చివరికి దక్కుతుందా.. లేదా.. అన్న మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. జూరాల జలాశయంలో లైవ్ స్టోరేజీ కింద 4.5 టీఎంసీల నీటి లభ్యతతోపాటు కర్ణాటక వదులుతామన్న 5 టీఎంసీల ఆధారంగా అధికారులు నవంబర్ వరకు వారాబందీ విధానంలో పంటలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా కర్ణాటక కృష్ణాబేసిన్‌లో జూరాలకు నీటి విడుదల నిలిపివేయడంతో జూరాల, నెట్టెంపాడు కింద సాగైన పంటల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దీంతో సరిగ్గా చేతికొచ్చే దశలో సాగునీటి సమస్య ఎదురై పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. శుక్రవారం నుంచి అమలులోకి.. జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వలతోపాటు, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైంది. అయితే జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు పూర్తిగా నిలిచిపోవడంతో జలాశయంలో అందుబాటులో ఉన్న 4.5 టీఎంసీల లైవ్ స్టోరేజీ ఆధారంగా వారాబందీ పద్ధతిలో పంటలకు సాగునీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించి.. శుక్రవారం నుంచి అమలులోకి తీసుకువచ్చారు. వాస్తవానికి సాగైన పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే కనీసం 5– 6 టీఎంసీల నీరు అవసరం కాగా.. అయితే ప్రస్తుతం జూరాలలో 4.5 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. మరి వారాబందీ విధానంతో ఈ పంటలు పూర్తిస్థాయిలో పండుతాయా.. అన్న ప్రశ్న రైతుల్లో తలెత్తుతోంది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు (ఫైల్) జూరాల, నెట్టెంపాడు కింద 2.50 లక్షల ఎకరాల్లో సాగు ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే లైవ్ స్టోరేజీ నవంబర్ వరకు వారాబందీతో సాగునీరు విడుదల అయోమయంలో చివరి ఆయకట్టు రైతులు నా కున్న ఎకరాల్లో వరిపంట సాగుచేశా. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా. పంటపూర్తిగా చేతికి రావాలంటే డిసెంబర్ వరకు నీళ్లు కావాలి. వారాబందీతో నవంబర్ వరకు నీళ్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మరి మేం వేసుకున్న పంటలు పరిస్థితి ఏం కావాలి. ప్రభుత్వం స్పందించి పంటలు కాపాడాలి. – ఆంజేయులు రైతు, కొండేరు, ఎర్రవల్లి మండలం జూరాల ఎడమ కాల్వ కింద 9 ఎకరాల్లో వరిపంట సాగుచేశాను. ప్రస్తుతం వారాబందీ అంటూ మరోమారు కాల్వలకు సాగునీరు నిలిపివేశారు. ఇకపై కాల్వలకు సాగునీరు ఇస్తారో.. లేదోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈసారి పంట మాత్రం చేతికి అందే పరిస్థితి కనిపిస్తలేదు. అలా అయితే నేను రూ.3 లక్షల మేర నష్టపోతాను. – వెంకటేష్, రైతు, గుంటిపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల జలాశయంలో ప్రస్తుతం 8.5 టీఎంసీలు నీరు అందుబాటులో ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజీ 3.7 టీఎంసీలు కాగా.. లైవ్ స్టోరేజీ కింద 4.5 టీంఎసీలు. ఈ క్రమంలో లైవ్స్టోరేజీ కింద ఉన్న 4.5 టీఎంసీల నీటి నుంచి వారాబందీ విధానంతో నవంబర్ వరకు సాగునీరు విడుదల చేస్తాం. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుని పంటలు కాపాడుకోవాలి. – వెంకట్, డీఈ, ఇరిగేషన్‌శాఖ వారాబందీ విధానంతో నవంబర్ వరకు సాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే జూరాల కుడి ప్రధాన కాల్వ పరిధిలో ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాలు, ఎడమ కాల్వ పరిధిలో పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండాలల్లోని చివరి ఆయకట్టు సుమారు 30– 40 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే డిసెంబర్ వరకు సాగునీరు ఇవ్వాలి. మరి వారాబందీ అమలు చేస్తున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. -
రైతుల ధర్నాతో..
జూరాల ప్రాజెక్టు కింద సాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తి పంటలు దెబ్బతినే పరిస్థితి తలెత్తడంతో రైతులు గతనెలలో పలుమార్లు రోడెక్కి ధర్నా చేశారు. చివరికి జూరాల కాల్వ గేట్లు సైతం తెరిచి నీటిని విడుదల చేసుకోవడంతో ప్రభుత్వంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పరిస్థితిని అధిగమించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. జూరాల ఆయకట్టు పంటలను కాపాడేందుకు కర్ణాటక సీఎంతో మాట్లాడి ఒప్పించాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటీ శ్రీహరిలను పురమాయించారు. దీంతో వారు గత నెల 22న ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక వెళ్లారు. 23న సీఎం డీకే శివకుమార్, ఇరిగేషన్ శాఖ మంత్రి షర్వ రాజస్వామి, ప్రిన్సిపల్ సెక్రెటరీ షాల్వాతో మంతనాలు జరిపారు. జూరాల కింద సాగైన పంటల పరిస్థితిని వివరించి మొత్తానికి రోజుకు 5 క్యూసెక్కుల చొప్పున 50 రోజులపాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. అయితే మంత్రులు చేసిన ప్రయత్నం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఎగువ నుంచి వచ్చే నీరు ఈ నెల 2 నాటికే నిలిచిపోయింది. -
కోర్టు కానిస్టేబుళ్లు బాధ్యతగా పనిచేయాలి
కొత్తకోట: నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా కోర్టు కానిస్టేబుళ్లు సమర్థవంతంగా పనిచేయాలని డీఎస్పీ గిరిబాబు అన్నారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయంలో కొత్తకోట సర్కిల్ పరిధిలోని కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించడం, నిందితులకు శిక్షలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేసు నమోదు నుంచి తీర్పు వెలువడే వరకు ప్రతి దశను కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా పర్యవేక్షించాలని సూచించారు. నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన రుజువులు, కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు తదితర ఆధారాలను సకాలంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. సాక్షులు, బాధితులు నిర్ణీత తేదీల్లో తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, కేసుకు సంబంధించి అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. కోర్టు నుంచి అందే సమాచారం, ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్సైలు, దర్యాప్తు అధికారులకు చేరవేయాలని తెలిపారు. దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, ప్రాసిక్యూషన్ మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని కోరారు. అనంతరం పెండింగ్ కేసులు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై సమగ్రంగా సమీక్షించారు. ప్రతి కేసు పురోగతిని సంబంధిత కోర్టు డ్యూటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, సమన్లు, వారెంట్లను సకాలంలో అమలు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. కొత్తకోట సీఐ ఓడీ రమేష్, ఎస్సైలు విక్రమ్, జలంధర్‌రెడ్డి, సర్కిల్ పరిధిలోని పోలీస్స్టేషన్ల కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం వనపర్తి: న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని శనివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గౌరెడ్డి కోటేశ్వర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా సి.తిప్పన్న, గౌరవ అధ్యక్షుడిగా అశ్వక్ అహ్మద్, ఉపాధ్యక్షులుగా అంజద్‌ఖాన్, జెట్టి మోహన్, డి.అరుణ, ప్రధానకార్యదర్శిగా ఎస్.శ్రీనివాసులు, కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.మన్యంకొండ, కోశాధికారిగా ఎండీ జావేద్, పలువురు కార్యవర్గసభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు కోటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. కొనసాగుతున్న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు వనపర్తి: జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్్షిప్–2026 పోటీలు జిల్లాకేంద్రంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తొలిరోజు డబుల్స్ విభాగం మ్యాచ్‌లు నిర్వహించగా.. శనివారం రెండోరోజు సింగిల్స్ విభాగం పోటీలు జరిగాయి. సింగిల్స్ విభాగంలో మొత్తం 40 మంది క్రీడాకారులు పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చారు. పోటీలు క్రీడాభిమానులను ఆకట్టుకున్నాయి. -
ప్రీప్రైమరీ బడుల సిబ్బందికి వేతనాలు
● పాఠశాలల నిర్వహణ, ఇతర ఖర్చుల నిమిత్తం నిధులు ● ఉమ్మడి జిల్లాలో 292 ప్రైమరీ బడులకు రూ.1,69 కోట్లు విడుదల మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం 2024–25 విద్యాసంవత్సరం నుంచి దశల వారీగా ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించింది. ఇందులో ముఖ్యంగా ఎల్కేజీ, యూకేజీ విద్యను అందించి, ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ఈ చర్యలు చేపట్టింది. మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 292 ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రమంలో అందులో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల వేతనాన్ని మంజూరు చేసింది. ఇందులో ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8 వేలు, ఆయాకు రూ.6 వేలను మంజూరు చేసింది. ఈ నిధులు మొదట ఎంఈఓల ఖాతాలో జమ కాగా, అక్కడి నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలు, పాఠశాల హెచ్ఎంల ఖాతాలకు వెళ్లిన అనంతరం ఆధార్‌లింక్ ఉన్న ఇన్స్ట్రక్టర్, ఆయా ఖాతాలో నేరుగా జమచేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. వేతనాల్లో ఆలస్యం లేకుండా నిధులు విడుదల చేయడంపై ఇన్స్ట్రక్టర్, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై డీఈఓ విజయకుమారిని వివరణ కోరగా ఇటీవల ప్రారంభించిన ప్రీ ప్రైమరీ బడుల సిబ్బందికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసిందని, వాటిని నిబంధనల ప్రకారం విడుదల చేయాలని సూచించారు. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
పాన్‌గల్: రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు తెల్లరాళ్లపల్లితండా, తెల్లరాళ్లపల్లి, వెంగళాయిపల్లి, బండపల్లి, అన్నారం, దావాజిపల్లి, శాగాపూర్‌తండా, జమ్మాపూర్, రేమద్దుల, నిజామాబాద్, బండపల్లి, కొత్తపేట, చిక్కేపల్లి, మాధవరావుపల్లి, కిష్టాపూర్‌తండాలో వివిధ అభివృద్ధి పనుల భూమి పూజ, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేసి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నా జనం మాత్రం దుబారా ఖర్చులకు అలవాటు పడి అప్పుల పాలవుతున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని.. మార్పు రావాలని కోరారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. వయోజనులు కూడా చదవడం, రాయడం నేర్చుకోవాలని, చదువుకుంటేనే అభివృద్ధి పనుల గురించి అడగాలన్నారు. తెల్లరాళ్లపల్లిలో గ్రామస్తులకు పలకలు అందించేందుకు తనవంతుగా రూ.10 వేలు అందించారు. దీంతోపాటు గ్రామాల్లో అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మాగాంఽధీ విగ్రహాల ఏర్పాటుకు నాయకులు కృషి చేయాలని, తనవంతు రూ.25 వేలు ప్రకటించారు. గుడిసెల్లో ఉంటున్న వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు అందించాలని, అనర్హులకు కేటాయిస్తే అధికారులు, కమిటీ సభ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ డిమాండ్ పెరిగింది.. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని.. రోజు 19 వేల మెగావాట్ల వినియోగం అవుతుందని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత లేదన్నారు. వినియోగం, ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, పాన్‌గల్ సర్పంచ్ నాగలక్ష్మి, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్‌నాయుడు, రవికుమార్, ఉస్మాన్, రాముయాదవ్, పుల్లారావు, భాస్కర్‌యాదవ్, అరవింద్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించే వరకు పోరాటం
వనపర్తి: సర్ ప్రక్రియతో ఉద్దేశపూర్వకంగా ఓట్లు గల్లంతవుతున్నాయని.. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేపడుతున్నా బీఆర్ఎస్ పార్టీ నేతలు నిమ్మకుండటం బీజేపీతో అనైతిక మైత్రే కారణమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఇండియా కూటమి పార్టీల ప్రతినిధులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం బీజేపీ అధికారం చేపట్టేందుకే విపక్షాల ఓట్లను గల్లంతు చేసేందుకు సర్‌ను వినియోగించుకుంటుందని.. అందుకు సహకరిస్తున్న కేంద్ర ముఖ్య ఎన్నిక అధికారి జ్ఞానేష్‌కుమార్‌పై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సహచర ఎన్నికల అధికారులు సర్ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న లోపాలను సరిచేసుకునేందుకు 14 సార్లు లేఖలు రాసినా.. కేంద్ర ఎన్నికల అధికారిగాని, కేంద్ర ప్రభుత్వంగాని ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నిసార్లు గగ్గోలుపెట్టినా కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. ఇటీవల ఓ ఇంగ్లిష్ దినపత్రికలో ఆధారాలతో వచ్చిన వార్తా కథనానికి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చలనం వచ్చిందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇందుకు ప్రధాన కారణమైన జ్ఞానేష్‌కుమార్‌ను సస్పెండ్ చేసి తగిన విచారణ చేపట్టి చర్యలు తీసుకునే వరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. భారత ఎన్నికల సంఘం కొంతకాలంగా బీజేపీ సంఘంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు, నీట్ నిర్వహణపై దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన నిరసనల మాదిరిగానే సర్ ప్రక్రియపై ఒక్కసారి అన్ని పార్టీలతో కలిసి ఉద్యమించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో పుర చైర్పర్సన్ మాధవి, సీపీఎం నాయకులు ఎండీ జబ్బార్, పుట్టా ఆంజనేయులు, కురుమయ్య, సీపీఐ నాయకులు రమేష్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రహీం, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌బాషా, వివిధ పార్టీల ప్రతినిధులు బాబుగౌడ్, గణేష్, మండ్ల రాజు, పసుపుల తిరుపతయ్య, బ్రహ్మచారి, కోళ్ల వెంకటేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటికి రోడ్డెక్కిన అన్నదాతలు
● కేఎల్ఐ డీ–8 ఎంజే–4 కాల్వకు నీరందక ఇక్కట్లు పాన్‌గల్: మండలంలోని దావాజిపల్లికి చెందిన రైతులు సాగునీటి కోసం శనివారం వనపర్తి–కొల్లాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాగునీటి కోసం అనేక పర్యాయాలు నీటిపారుదల కార్యాలయం, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా సరఫరా చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు కాస్త మెరుగుపడగా ప్రస్తుత ఎండలకు ఎండుముఖం పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేఎల్ఐ డీ–8 ఎంజే–4 కాల్వలకు ఒక్కరోజు రాత్రి నుంచి ఉదయం వరకు నీటిని వదిలి తర్వాత నిలిపివేశారన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న మండలంలోని గోప్లాపూర్, అన్నారం, దావాజిపల్లి, దొండాయిపల్లి రైతులకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని.. పంటలను ఎండనివ్వమని చెప్పిన నాయకులు ఇటువైపు కన్నెతి చూడటం లేదన్నారు. మరోవైపు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా గాకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కాల్వ నీటితో చెరువులను నింపితే తాగునీటి బోర్లలో భూగర్భ జలమట్టం పెరిగి ఇబ్బందులు తొలగుతాయని వివరించారు. రాస్తారోకోతో కొల్లాపూర్, వనపర్తి వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ కుర్మయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని రైతులు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సాగునీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, చిన్నమాసిరెడ్డి, గురవయ్యగౌడ్, వెంకటేష్, కొండారెడ్డి, బాలకృష్ణ, బారిమామ్, చంద్రయ్యయాదవ్, కొందడరాంరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
పీఎం శ్రీ బడుల్లో ప్రత్యేక విద్యా బోధకులు
● ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన, సహాయక సేవలు ● ఐదు నెలల నియామకం.. నెలకు రూ.16,500 వేతనం ● ఉమ్మడి జిల్లాలో 104 మంది గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీఎం శ్రీ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మెరుగైన విద్య, సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్లను నియమించనుంది. ఐదు నెలల కాలానికి చేపట్టనున్న ఈ నియామకాల్లో ఒక్కొక్కరికి నెలకు రూ.16,500 వేతనం చెల్లించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 104 పీఎం శ్రీ పాఠశాలల్లో వీరిని నియమించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కాగా.. పీఎం శ్రీ పాఠశాలలతో పాటు క్లస్టర్, మండల, కాంప్లెక్స్ పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్లు సేవలు అందించాల్సి ఉంటుంది. కంటిచూపు, వినికిడి, శారీరక వైకల్యం, మేధోపరమైన వైకల్యం తదితర సమస్యలు ఉన్న విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మండల కేంద్రాల్లోని భవిత సెంటర్ల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవలు అందుతున్నాయి. పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక విద్యా బోధకుల నియామకంతో వారికి మరిన్ని సేవలు అందనున్నాయి. ఐదు నెలల కాలానికి గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం చేపడుతున్నాం. స్పెషల్ బీఈడీ, బీఈడీ జనరల్, స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత పీఎం శ్రీ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలి. – విజయకుమారి, డీఈఓ -
మరింత చేరువలో న్యాయసేవలు
పాలమూరు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో న్యాయసేవలు మరింత చేరువ కానున్నాయి. కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టులు లేకపోవడంతో పెరుగుతున్న పెండింగ్ కేసులకు కొంతమేర పరిష్కారం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం విధానపరమైన అనుమతులు మంజూరు చేయగా.. ఉమ్మడి పాలమూరు పరిధిలో ఐదు జిల్లాలకు 11 కొత్త కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో న్యాయస్థానాలపై పెరుగుతున్న పనిభారం తగ్గడంతోపాటు కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఏళ్లుగా పేరుకుపోతున్న కేసులు ప్రతి ఏటా లోక్ అదాలత్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమవుతున్నా.. అదే సమయంలో కొత్త కేసులు కూడా కోర్టులకు వస్తున్నాయి. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. కొన్ని కోర్టుల్లో న్యాయమూర్తులు, మౌలిక వసతుల కొరత కూడా విచారణ ప్రక్రియపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోంది. విచారణ వేగవంతం అయ్యే అవకాశం కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టుల సంఖ్య పెంచడం ద్వారా ఒక్కో న్యాయస్థానంపై ఉన్న భారాన్ని తగ్గించవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. కొత్త కోర్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కేసుల విచారణను విభజించడంతో పాటు కొత్తగా దాఖలయ్యే కేసులను కూడా త్వరగా స్వీకరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువ కానున్నాయి. కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టుల ఏర్పాటు, న్యాయమూర్తుల అందుబాటు పెరగడం వల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కూడా దోహదపడే అవకాశం ఉంది. కొత్త కోర్టుల ఏర్పాటుతో న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కొంతమేర తగ్గనుంది. ఉమ్మడి జిల్లాకు 11 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు తగ్గనున్న కోర్టులపై కేసుల భారం వేగంగా పరిష్కారం కానున్న పెండింగ్ కేసులు -
మహాత్ముడి పోరాటం చిరస్మరణీయం
వనపర్తి: దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ చేసిన పోరాటం చిరస్మరణీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ సేవలు, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకున్నారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిచెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన తీరు, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి మరువలేదన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సత్యం, అహింస, సేవ, స్వచ్ఛత వంటి విలువలను ఆచరణలో చూపిన గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమన్నారు. సమాజంలో సమానత్వం, సామరస్యం, సోదరభావం వెల్లివిరియాలన్న ఆయన ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళని చెప్పారు. ● కలెక్టరేట్లో నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల మెరుగు
వనపర్తి: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. యువతలో ఆరోగ్యకర జీవనశైలిని పెంపొందించే లక్ష్యంతో శుక్రవారం గాంధీజయంతి సందర్భంగా పట్టణంలోని అభి ఏరీనా ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్–2026 పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. బ్యాట్ చేతబట్టి కాసేపు ఆడి క్రీడాకారులను ఉత్సాహపర్చారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్రీడల్లో పాల్గొనడంతో ఆరోగ్యకర జీవనశైలి అలవర్చుకోవడంతో పాటు క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తి వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. పోటీల్లో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమని.. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని కోరారు. జిల్లాలో క్రీడల అభివృద్ధి, క్రీడా పోటీల నిర్వహణకు సహకరిస్తున్న అభి స్పోర్ట్స్ అరేనా నిర్వాహకుడు మురళీధర్‌ను కలెక్టర్ అభినందించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డీవైఎస్ఓ సుధీర్‌రెడ్డి, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, క్రీడాకారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వెదురు వస్తువుల తయారీపై శిక్షణ మన్ననూర్: వెదురుతో ఆకర్శనీయమైన పరికరాలు, వస్తువులు తయారు చేయడంలో పరిజ్ఞానం కలిగి ఉన్న ఆదివాసీ చెంచులు, మేదరులను ప్రోత్సహించేందుకు మాతృభూమి సంస్థ ముందుకు వచ్చిందని సంస్థ అధ్యక్షుడు ప్యారసాని రమాకాంత్ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని అప్పాపూర్‌లో గ్రామసభ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ శివమ్మతో కలిసి నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమల్కల, సంఘిడి గుండాలు చెంచు పెంటలలో పర్యటించి చెంచుల జీవన విధానం తదితర అంశాల గురించి చర్చించారు. వెదురుతో వస్తువులు తయారు చేసేందుకు 1,500 మంది మేదరులు, చెంచులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. గతంలో విద్యుత్ సౌకర్యం లేని చెంచు పెంటలు, గూడేలలో సోలార్ లైట్లు అందజేయడం జరిగిందన్నారు. వచ్చే దసరా పండగకు రూ.10 లక్షల వ్యయంతో 100 సోలార్ వీధిలైట్లను ఆయా పెంటలలో అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. -
అధికారులు స్పందించడం లేదు..
ఆలయానికి చెందిన సుమారు 34 ఎకరాల భూమి కౌలు చెల్లించకపోవడం చాలా బాధాకరం. కొందరు రైతులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. అధికారులు స్పందించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సర్వేనంబర్ 410తో పాటు ఇతర నంబర్లలోని భూములకు గతంలో కౌలు చెల్లించిన రైతులే ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో ఆలయ అభివృద్ధి, ధూప దీప నైవేద్యాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అధికారులు స్పందించి సరిహద్దులు గుర్తించి భూములను స్వాధీనం చేసుకోవాలి. రైతుల ద్వారా కౌలు తీసుకోవాలి. – విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ అజ్జకొల్లు శ్రీ శివ రామాంజనేయస్వామి ఆలయ భూముల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. గతంలో కౌలు వసూలు చేసిన మాట వాస్తవమే. ప్రస్తుతం రికార్డులను పరిశీలిస్తున్నాం. త్వరలోనే రెవెన్యూ, దేవాదాయశాఖ సంయుక్తంగా ప్రత్యేక బృందంతో సర్వే నిర్వహిస్తాం. కౌలు బకాయి పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆలయ ఆస్తులను పరిరక్షించడంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. – వాసు, ఎండోమెంట్ సూపర్వైజర్, మహబూబ్‌నగర్ ● -
లింక్ కెనాల్‌తో 40 వేల ఎకరాలకు సాగునీరు
● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల: సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు లింక్ కెనాల్ నిర్మాణ పనులు పూర్తిచేసి 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని వల్లభాపురం సమీపంలో కాల్వ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చిన్నంబావి, వీపనగండ్ల మండలాల రైతులకు సాగు నీరు అందించడమేగాక భీమా కాల్వకు కూడా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. నిరంతరం పనులు కొనసాగుతాయని.. జూన్ నాటికి రైతులకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. 22 కిలోమీటర్ల కాల్వ నిర్మాణానికిగాను నిర్వాసిత రైతులకు భూ సేకరణ డబ్బులు చెల్లించామని, రానివారికి కూడా త్వరలోనే ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, సర్పంచ్‌లు సుదర్శన్‌రెడ్డి, రామన్‌గౌడ్, బండారి రాముడు, పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్, రవీందర్‌రెడ్డి, కావలి మహేష్, గోపి, ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పోలీసు కార్యాలయంలో..
జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం మహాత్మాగాంఽధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, పోలీసు అధికారులు, సిబ్బంది మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో ఆయన నాయకత్వం ఎంతో ముఖ్యమైందని, సత్యం వీడని నాయకుడని కొనియాడారు. అహింసా, శాంతి, స్వాతంత్య్ర ఉద్యమ పోరాటం నేటి సమాజానికి దిక్సూచి లాంటిదన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ సీఐ శ్రీనివాసులు పలువురు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యకు సాంకేతిక చేయూత
● ఏఎక్స్ఎల్ పేరుతో సామర్థ్యాల పెంపునకు శ్రీకారం ● ఉమ్మడి జిల్లాలో 192.. జిల్లాలో 28 పాఠశాలలు ఎంపిక ● ఆయా పాఠశాలలకు కంప్యూటర్లు, సామగ్రి సరఫరా నర్వ: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థుల విద్యా సామర్థ్యాల పెంపునకు మరో ముందడుగు పడింది. ఇప్పటికే ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లేవు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ పేరిట ఏఐ ద్వారా అసిస్టెంట్ సహకారంతో విద్యా సామర్థ్యాలు మెరుగుపర్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలలకు అవసరమైన కంప్యూటర్లు, సామగ్రిని రాష్ట్ర విద్యాశాఖ సరఫరా చేసింది. ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షలు.. ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో విద్యా సామర్థ్యాలు ఉండటం లేదని ఇటీవల కేంద్రం విడుదల చేసిన పీజీఐ సర్వేతో స్పష్టమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 192 ప్రాథమిక పాఠశాలలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు మూడు నుంచి 5 కంప్యూటర్ల చొప్పున మొత్తం 735 కంప్యూటర్లు సరఫరా చేశారు. వీటితో పాటు ఒక్కో కంప్యూటర్‌కు రెండు హెడ్సెట్లు, యూపీఎస్‌లు, టేబుళ్లు, కుర్చీలు, ఇంటర్నెట్ సౌకర్యం, విద్యుత్ సరఫరా పరికరాలు అందజేశారు. నీతి ఆయోగ్ సూచన మేరకు.. జిల్లాలో నీతి ఆయోగ్ సూచన మేరకు ప్రత్యేకంగా స్పార్క్ (స్కూల్ ప్రోగ్రామ్ ఫర్ ఏఐ రెడినెస్ అండ్ నాలెడ్జ్) ద్వారా ప్రాథమిక పాఠశాలలో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం యాస్పిరేషన్ బ్లాక్ నర్వ మండలంలో ప్రతి ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసి ఏఐ కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వీటి పనితీరును పరిశీలించేందుకు కొన్నిరోజుల కిందట నీతి ఆయోగ్ అధికారులు నర్వ మండలాన్ని సందర్శించారు. పాఠశాలల్లో కంప్యూటర్ల ద్వారా ఏఐ అసిస్టెంట్‌తో అందించిన విద్యాబోధన క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇస్తుందని కితాబిచ్చారు. ఏఎక్స్ఎల్ కార్యక్రమానికి ఎంపికై న పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తిస్తారు. వీరికి కంప్యూటర్లో ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసిన ఏఐ అసిస్టెంట్ ద్వారా ఉపాధ్యాయులు బోధన అందిస్తారు. ప్రధానంగా తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్యాంశాలకు సంబంధించి ఏయే అంశాల్లో విద్యార్థులు వెనకబడ్డారో ఏఐ అసిస్టెంట్ గుర్తించి వారికి అక్షరాలు, అంకెలు గుర్తించడం, చదవడం, లెక్కలు చేయడంలో సాయం అందించి విద్యా సామర్థ్యాల మెరుగునకు చర్యలు తీసుకుంటారు. ఏఎక్స్ఎల్ ప్రోగ్రామ్ ద్వారా జిల్లాలో ఎంపికచేసిన 28 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన అందిస్తున్నాం. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు వెనుకబడ్డ పాఠ్యాంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఏఐ ద్వారా ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. ఎంపికై న పాఠశాలల్లో కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట -
ఓటు.. ఒడిసిపట్టు!
గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 2021లో జరిగిన ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 5,17,883 కాగా.. మొత్తం పోలైన ఓట్లు 3,57,354. ఇందులో 3,37,039 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరగనుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగా.. అంతకు ముందుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండడంతో మూడు ప్రధాన పార్టీలు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలు అమలు చేసేలా కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి రాజుకోనున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంపై ప్రధాన రాజకీయ పార్టీలు నజర్ వేశాయి. ఇప్పటికే ఓటరు నమోదుకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పోరు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాగా.. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థిత్వాలను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పాటు ఓటు ఒడిసిపట్టేలా ఓటరు నమోదుపై అన్ని పార్టీల ముఖ్య నేతలు దృష్టి కేంద్రీకరించారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటరు నమోదు కోసం ఆయా పార్టీల ఆధ్వర్యంలో సహాయకేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టభద్ర ఓటర్లను ఆకర్శించే లక్ష్యంతో పావులు కదిపేలా స్థానిక నాయకత్వం, తమ తమ అనుబంధ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ముఖ్యులకు దిశానిర్దేశం చేసే పనిలో నిమగ్నమయ్యారు. తెరపైకి పలువురి పేర్లు.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై అభ్యర్థిపై చర్చించారు. మహబూబ్‌నగర్‌కు చెంది హైదరాబాద్‌లో ఓ ప్రధాన ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్న ప్రముఖ డాక్టర్‌తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరు వినిపిస్తున్నా.. ఆయన సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి ఆయన గెలుపొందగా.. ఆ పార్టీలో దేవరకద్రకు చెందిన డోకూరి పవన్‌కుమార్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రత్యేక ఏర్పాట్లు.. విస్తృత ప్రచారం.. అభ్యర్థుల ఖరారును పక్కనబెడితే ప్రధాన రాజకీయ పక్షాలు ఓటరు నమోదుపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. గత ఎన్నికల్లో పట్టభద్ర ఓటర్లు అవగాహన లేకపోవడంతో ఓటు నమోదుకు దూరం కావడం, ఇతరత్రా లోపాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా తప్పిదాలు జరగకుండా గ్రామ, మండల, పట్టణాల వారీగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి.. ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నాయి. పట్టభద్రులతో దరఖాస్తు చేయించే ప్రక్రియపైనే ప్రధానంగా నజర్ వేశాయి. పార్టీల వారీగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉండగా.. ఇందుకు తగిన విధంగా మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. తగిన ధ్రువపత్రాలతో వచ్చేవారివి కంప్యూటర్లలో అక్కడికక్కడే నమోదు చేస్తున్నారు. అంతేకాదు.. పట్టభద్రులను ఆకర్షించేలా పార్టీల నేతలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటినుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. పట్టభద్రుల ఫోన్ నంబర్లు సేకరించి ఓటు నమోదుకు కావాల్సిన ధ్రువపత్రాలు.. ఫారం–18 నింపే విధానంపై మెసేజ్, వీడియోల రూపంలో పంపుతున్నారు. కాంగ్రెస్ క్లియర్.. బీఆర్ఎస్, బీజేపీ ఆచితూచి.. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 2007 నుంచి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలుగా ఎన్నికలు జరగగా.. ఆ పదవి ఒక్కసారి కూడా కాంగ్రెస్‌ను వరించలేదు. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఆ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ముందస్తుగా పార్టీ అభ్యర్థిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన సామా రామ్మోహన్‌రెడ్డి పేరును ఖరారు చేయడమే కాకుండా.. జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతోంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థిత్వాల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ‘పట్టభద్రుల’ పోరుపై ప్రధాన పార్టీల కీలక కసరత్తు మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానం కై వసమే లక్ష్యంగా వ్యూహాలు.. బీఆర్ఎస్, బీజేపీలో అభ్యర్థిత్వాల జల్లెడ.. కాంగ్రెస్ నుంచి ‘సామా’ ఖరారు ఓటరు నమోదుపైనే నేతల ప్రధాన దృష్టి.. పార్టీల వారీగాసహాయ కేంద్రాలు గత ఎన్నికల్లో నమోదైన గ్రాడ్యుయేట్ ఓటర్లు 5,17,883.. పోలైన ఓట్లు 3,57,354 ఈసారి మరింత పెరిగే అవకాశం.. వాట్సాప్‌ల ద్వారా విస్తృత ప్రచారం -
తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత
వనపర్తి: సృష్టికి మూలం తల్లిదండ్రులేనని.. వృద్ధాప్యంలో వారిని బాధ పెట్టకుండా సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ మధ్య కొందరు వయోవృద్ధులు తమ సంతానానికి తాము సంపాదించిన ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినా.. సంరక్షణ బాధ్యతలు తీసుకోవడం లేదని ఆర్డీఓ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు మొత్తం 169 ఫిర్యాదులు రాగా.. వాటిలో 115 పరిష్కరించినట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా తమ పిల్లలు సంరక్షణ బాధ్యతలు తీసుకోకుంటే తల్లిదండ్రులు ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. మనిషికి కొంత వయస్సు వచ్చాక వృద్ధాప్యం ప్రారంభమై కండరాలు కరిగిపోవడం ప్రారంభమవుతాయని.. కచ్చితంగా వ్యాయామం, యోగా చేస్తూ పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు ప్రభుత్వ ఆస్పత్రిలో స్పెషల్‌సెల్ ఏర్పాటుచేసి ఉచితంగా వైద్యం, మందులు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకేంద్రంలో వయోవృద్ధుల కోసి రీ–క్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని.. అది పట్టణానికి కాస్త బయట ఉన్నందున వయోవృద్ధులు సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదని, త్వరలో పట్టణంలోకి మార్చాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. అనంతరం డీఎస్పీ బాలాజీనాయక్ మాట్లాడుతూ.. వయోవృద్ధులకు తమ పిల్లల నుంచి సమస్యలు వస్తే టోల్ ఫ్రీ నంబర్ 14567 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. పింఛన్ కోసం ఓటీపీలు అడిగి ఖాతాలో ఉన్న నిల్వలను ఖాళీ చేస్తున్నారని, సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకవేళ సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం వయోవృద్ధులను కలెక్టర్ శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, సెర్ఫ్ ప్రోగ్రాం అధికారి లింగయ్యగౌడ్, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బి.ఇందిరా, సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యుడు నాగేంద్రస్వామి, అమ్మ స్వచ్ఛంద సంస్థ నుంచి చిన్నమ్మ థామస్ పాల్గొన్నారు. -
జూరాలకు వారాబందీ
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టుకు గురువారం నుంచి వారాబందీ విధానంలో సాగునీరు సరఫరా చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు అధికారికంగా వెల్లడించారు. కుడి, ఎడమ కాల్వలకు వరుసగా ఐదురోజుల పాటు సాగునీరు సరఫరా చేస్తూ.. మరో 5 రోజుల పాటు నిరంతరాయంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. మొదటిసారిగా వానాకాలంలో వారాబందీ విధానంలో సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో కుడి, ఎడమ కాల్వల కింద 1.15 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవక జలాశయానికి ఆశించిన మేర వరద చేరలేదు. దీంతో ఆయకట్టులో వరి సాగుచేస్తే నీరు ఇవ్వలేమని.. కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని ఇరిగేషన్ అధికారులు ముందునుంచే గ్రామాల్లో టాంటాం వేయించారు. అయినా ఆయకట్టు రైతులు మాత్రం కళ్ల ఎదుట కాల్వల్లో సాగునీరు పారుతుండటంతో వరి సాగు చేశారు. ప్రస్తుతం జలాశయంలో 5.908 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో వచ్చే రెండునెలల పాటు వారాబందీ విధానంలో నీటి సరఫరాకు ముందుకొచ్చారు. వారాబందీ విధానంలో ఎప్పుడెప్పుడు సాగునీరు అందిస్తామనే విషయాలను ఆయకట్టు గ్రామాల్లో రైతులకు వివరించాలని కాల్వవెంట విధులు నిర్వహిస్తున్న లష్కర్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఏఈలు, డీఈలు సైతం వారాబందీపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గురువారం వెలువడిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధాన ఎడమ కాల్వలో పారుతున్న వరద నేటి నుంచి నిలిపివేత.. వారాబందీ విధానం అమలులోకి రావడంతో జూరాల కుడి, ఎడమ కాల్వలకు శుక్రవారం నుంచి సాగునీటి సరఫరాను నిలిపివేయనున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టుపై ఆధారపడిన నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, విద్యుదుత్పత్తి కేంద్రాలకు గురువారం సాయంత్రమే నీటి సరఫరాను నిలిపివేశారు. వీటితోపాటు సమాంతర కాల్వలో సైతం లీకేజీ నీరు పారకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అధికారికంగా ప్రకటించిన అధికారులు గురువారం నుంచే అమలులోకి.. 5 రోజుల పాటు సాగునీటి సరఫరా.. మరో 5 రోజులు నిలిపివేత జలాశయంపై ఆధారపడిన ఎత్తిపోతలకు వర్తింపు రైతు ప్రయోజనాల కోసమే.. జూరాల ఆయకట్టులో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో వారాబందీ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు కాల్వలకు వరుసగా 5 రోజుల పాటు నీటిని వదిలి తర్వాత 5 రోజులు నిలిపివేస్తాం. ఈ విషయాన్ని రైతులు గుర్తించి పొదుపుగా వినియోగించుకోవాలి. – చంద్రశేఖర్, ఈఈ, జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డివిజన్ -
‘మేఘా’ చేయూత
సాయం చేస్తే తృప్తి.. ఆపదలో ఉన్న వారికి సాయం చేయటంలో ఓ తృప్తి ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలవక ముందుకూడా చాలామందికి సాయం చేశా. సాయం చేసి చెప్పుకోవడం నచ్చదు. ఆపద కాలంలో ప్రభుత్వం నుంచి సాయం పొందడానికి సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీలు ఉన్నాయి.. పేద, మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి వనపర్తి: ఆరోగ్య సమస్యలతో సాయం కోసం వచ్చే వారి విషయంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఉదారంగా వ్యవహరిస్తున్నారనేందుకు 34 నెలల్లో పంపిణీ చేసిన సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీలు, వాటి విలువను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. అనారోగ్యం ఓ మనిషి సమస్యకాదు.. ఆ కుటుంబం ఆర్థిక వ్యవస్థను ప్రశ్నార్థకంలో పడేస్తుందని గుర్తెరిగి ప్రభుత్వంతో సాయం అందించడం ఆయన నైజం. నియోజకవర్గంలో గత 34 నెలల్లో 7,872 మందికి రూ.20 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 469 మందికి రూ.19.98, కోట్ల విలువైన ఎల్వోసీలు అందించారు. సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీల మంజూరులో నియోజవర్గం రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలవడం చెప్పుకోదగిన విషయం. ప్రతి దరఖాస్తును ఒక కుటుంబ సమస్యగా భావించి సిఫారస్ చేస్తున్నట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రతిసారి ఎమ్మెల్యే చెప్పడం విధితమే. సాయం కోసం ప్రజలు వనపర్తి నుంచి హైదరాబాద్ వరకు తిరుగుతూ ఇబ్బందులు పడకుండా వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించి ఎల్వోసీలు, సీఎంఆర్‌ఎఫ్‌ల మంజూను పర్యవేక్షించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతినెల సుమారు 1,200 నుంచి 1,500 వరకు దరఖాస్తులు ఆన్లైన్ చేస్తున్నారు. కొన్నినెలల కిందట కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు టూర్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురైతే కేరళ నుంచి విమానంలో హైదరాబాద్‌కు సొంత ఖర్చులతో తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారిని క్రమం తప్పకుండా పరామర్శిస్తూ బాగోగులు తెలుసుకున్నారు. నేడు సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీల పంపిణీ.. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 501 మందికి లబ్ధిదారులకు రూ.1.92 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 290 మందికి రూ.2.90 కోట్ల విలువైన ఎల్వోసీలు పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీల పంపిణీలో రాష్ట్రంలోనే వనపర్తి రెండోస్థానం -
ఆయకట్టు రైతుల ఆందోళనలతో..
తమ పంటలు ఎండుతున్నాయని.. సాగునీరు విడుదల చేయాలంటూ జూరాల ఆయకట్టు రైతులు గత నెల 18వ తేదీ నుంచి ఐదురోజుల పాటు ఆందోళనబాట పట్టగా.. వారికి బీజేపీ, సీపీఎం, బీఆర్ఎస్ పార్టీల నాయకులు మద్దతు పలికారు. ఆయా పార్టీల ప్రధాన నాయకులను అరెస్టు చేయడం వంటి ఘటనతో ఆగ్రహించిన రైతులు ఏకంగా జూరాల ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేలేటరీ షట్టర్లు తెరిచి నీటిని వదులుకున్నారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం పక్క రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి పంటల సమయం వరకు 5 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరగా.. 3 టీఎంసీల నీటిని వదిలింది. -
వయోవృద్ధులను నిర్లక్ష్యం చేయొద్దు
కొత్తకోట రూరల్: తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. వయోవృద్ధులైన వారిని నిర్లక్ష్యం చేయడం చట్టవిరుద్ధమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి దీపా కాసరగడ్డ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం పెద్దమందడి మండలం జగత్పల్లిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వైద్యశాఖ సహకారంతో వయోవృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లల నుంచి వారికి బహుమతుల రూపంలో ఇచ్చిన ఆస్తులను తిరిగి పొందే హక్కు చట్టం కల్పించిందన్నారు. నిరాశ్రయులైన వయోవృద్ధులు ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ ట్రిబ్యునళ్లను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు. అనంతరం డా. శ్రావణి గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సెల్ శ్రీదేవి, ఎస్ఐ జలంధర్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ మారుతీనందన్, ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, మధుసూదన్, సర్పంచ్ పెంటయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి సాయికుమార్, పారా లీగల్ వలంటీర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
వామపక్షాల ఆందోళన
వనపర్తి రూరల్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలంటూ వామపక్షాల ఽఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి రాజీవ్‌చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో కీలుబొమ్మగా మారి దేశంలో ఎన్నికల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న సుమారు 13.5 కోట్ల ఓట్లను ఎన్నికల సంఘం ద్వారా తొలగించారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి చిన్నా, పెద్ద సమస్యలన్నింటిని పక్కనబెట్టి అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, కళాకారులు, మేధావులు పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు. సీఈసీ రాజీనామా చేయకపోతే ఉద్యమం ఇక్కడితో ఆగదని.. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే స్థాయికి చేరుతుందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి హన్మంతు, నాయకులు ఎండీ జబ్బార్, ఎం.రాజు, బాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
వృద్ధుల హక్కులపై అవగాహన అవసరం
వనపర్తి: వృద్ధుల సంరక్షణ, వారి హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు, సమాజం బాధ్యతగా వ్యవహరించాలని, వారికి సరైన గౌరవం, భద్రత, సహకారం అందించాలని సూచించారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా వారి అవసరాలను గుర్తించి, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని తెలిపారు. అవగాహన ర్యాలీలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీవైఎస్ఓ సుధీర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి, వీరయ్య, నర్సింహులుగౌడ్, రఘునాథ్‌రెడ్డి, సంక్షేమ వసతిగృహాల విద్యార్థులు, జిల్లా సంక్షేమశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ధరలు తగ్గించాలి..
కొన్ని రోజుల నుంచి బియ్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. కిలో రూ. 60 నుంచి రూ. 70 వరకు అమ్ముతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలుచేసే పరిస్థితి లేదు. వాటితో పాటు నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలి. – పరమేశ్వర్, నాగర్‌కర్నూల్ 20 ఏళ్లలో ఎప్పుడు చూడలే.. 20ఏళ్ల నుంచి బియ్యం వ్యాపారం చేస్తున్నా. ఈ విధంగా ధరల పెంపు ఎప్పుడు చూడలేదు. గతంలో ప్రతినెలా క్వింటాపై రూ.100 పెరిగేది. ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. బియ్యం కొనుగోలు చేసేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పండే సన్నరకం ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా ఉంటే కొంతమేర రేట్లు తగ్గే అవకాశం ఉంది. – గుబ్బ ఈశ్వర్, బియ్యం వ్యాపారి, కల్వకుర్తి ● -
‘జపామేడ్’ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: నైపుణ్యాలు కలిగిన జపామేడ్ (నవజాత శిశువు, తల్లి సంరక్షకురాలు)లకు నగరాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో జపామేడ్ కోర్స్పై మహిళల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఒక మహిళకి బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 40 రోజుల కాలాన్ని జపా కాలంగా పిలుస్తారన్నారు. ఈ సమయంలో తల్లి, శిశువుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని, వారి సంరక్షణ చూసుకునే కేర్ టేకర్లను జపామేడ్లు అంటారని తెలిపారు. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తల్లి, శిశు సంరక్షణ కోసం అనుభవం కలిగిన కేర్టేకర్ల సేవలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుత కాలంలో అనేక పనులను ఏఐ, రోబోల ద్వారా నిర్వహిస్తున్నప్పటికీ తల్లి, శిశువుల సంరక్షణ వంటి సేవలను ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయడం సాధ్యం కాదని, అందువల్ల ఈ రంగానికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుందని చెప్పారు. జిల్లాకేంద్రంలో ఆర్‌సేటీ ఆధ్వర్యంలో ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. 20 రోజుల పాటు నిర్వహించే శిక్షణలో అభ్యర్థులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. ఈ వృత్తిలో రాణించాలంటే సేవాభావం, ఆసక్తి, ఓర్పుతో పాటు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం నగరాల్లో పలు సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం ద్వారా చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రామమహేశ్వర్‌రెడ్డి, ఎల్డీఎం శివకుమార్, ఆర్‌సేటీ డైరెక్టర్ అనిల్‌కుమార్, ఏపీఎం సరోజ, నర్సింగ్ కళాశాల ఫ్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు. భూ రీ–సర్వేలో భాగస్వాములు కావాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ–సర్వే కార్యక్రమంలో లైసెన్స్డ్ సర్వేయర్లు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో లైసెన్స్డ్ సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని రీ–సర్వే ప్రక్రియ, లైసెన్స్డ్ సర్వేయర్ల భాగస్వామ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లకు వేతనాలు చెల్లిస్తామని చెప్పలేదని, రీ–సర్వే పనులకు ఎకరాకు రూ.60 చొప్పున పారితోషికం చెల్లిస్తుందని తెలిపారు. కష్టపడి నైపుణ్యంతో పనిచేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని.. ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రీసర్వే కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు దోహదపడుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, సర్వేశాఖ ఏడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బియ్యం ధరలకు రెక్కలు
నాగర్‌కర్నూల్: సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పది నెలల్లో క్వింటాకు రూ. 2వేల వరకు అధికం కాగా.. రెండు నెలల్లో మాత్రం రూ.1200 పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు విస్తీర్ణం తక్కువగా ఉందని.. ఆశించినంత దిగుబడి రాకపోవచ్చనని వ్యాపారులు అంచనా వేసి ధరలు పెంచేశారు. ఇటీవల కొన్ని రైస్‌మిల్లులు మూతపడటాన్ని కూడా వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బియ్యం కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలతో సొమ్ము చేసుకుంటున్నారనే మిమర్శలు ఉన్నాయి. బియ్యం ధరల పెరుగుదలతో ఉమ్మడి జిల్లాలోనే రోజు రూ.15 లక్షల వరకు ప్రజలపై అదనపు భారం పడుతోంది. రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుండటం కొంత ఉపశమనం కలిగిస్తుండగా.. ఇతర వర్గాలపై బియ్యం ధరల ప్రభావం బాగానే ఉంది. వానాకాలం వరికోతలు ప్రారంభమైతే కొంత మేర ధరలు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలో పండే సన్నబియ్యం (ఆర్ఎన్ఆర్) రకానికి మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా పాలమూరులో ఆర్ఎన్ఆర్ సాగుకు మంచి పేరుంది. ఇక్కడ పండే పంట ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి ఇక్కడి నుంచి ఎక్కువగా ఈ రకం బియ్యాన్ని వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. దీంతో ఇక్కడ సన్నబియ్యానికి డిమాండ్ ఏర్పడి, రేట్లు పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, మిర్యాలగూడ ప్రాంత వ్యాపారుల ఆజమాయిషీలోనే బియ్యం రేట్ల నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. వానాకాలంలో వరిసాగు చాలా తక్కువగా ఉంది. ఉన్న పంటకు సైతం కరెంటు కోతలు, నీటి సమస్యలతో ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో వరిసాగు కాల్వలకు నీరు రావడంతో 4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అయితే వర్షాభావం, కేఎల్ఐ కాల్వలకు నీటి విడుదలలో అంతరాయం, కరెంటు కోతలతో పంట దిగుబడి తగ్గే పరిస్థితి ఏర్పడింది. దీంతో బియ్యం కొరత ఉంటుందనే అంచనాతో వ్యాపారులు ధరలు పెంచారు. ● ప్రభుత్వం రేషన్ దుకాణాలు, వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలకు సన్నబియ్యం సరఫరా చేస్తోంది. సన్న వడ్లను సీఎంఆర్ కోసం మిల్లర్లు కొనుగోలు చేయడంతో మార్కెట్లో నిల్వలు తగ్గాయి. ఫలితంగా కొరత పెరిగి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పది నెలల్లో పెరుగుదల ఇలా.. పది నెలలుగా సన్నబియ్యం ధరలను పరిశీలిస్తే, ప్రజల గుండె గుభేలుమంటోంది. గతేడాది నవంబర్‌లో కింటా బియ్యం ధర రూ. 4,400 ఉండగా.. ప్రస్తుతం రూ. 6,400 నుంచి రూ. 6,600 వరకు విక్రయిస్తున్నారు. అయితే మార్చి నుంచి ధరల పెరుగుదల ప్రారంభమైంది. ఫిబ్రవరి వరకు రూ. 4,600 ఉండగా.. ఏప్రిల్‌లో ఏకంగా క్వింటాకు రూ. 300 పెరిగి, రూ. 4,900కి విక్రయించారు. మే నుంచి జూలై వరకు రూ.200 పెరుగుకుంటూ వచ్చింది. జూలైలో రూ. 5,500 ఉండగా.. ఆగస్టులో చివరి వారంలో రూ. 6,300కు చేరింది. సెప్టెంబర్‌లో రూ. 6,600 ధర పలుకుతోంది. ఈ రేట్లు కేవలం హోల్‌సెల్ వ్యాపారులకు మాత్రమే. వారికి హమాలీ, రవాణా ఖర్చుతో క్వింటాకు మరో రూ. 200 వరకు పెరుగుతుంది. ఈ లెక్కన ప్రజలకు రూ. 6,800 నుంచి రూ.7వేల వరకు బియ్యం విక్రయిస్తున్నారు. 10 నెలల్లోనే క్వింటాకు రూ.2వేల దాక పెంపు గతేడాది ఇదే నెలలో రూ 4,500 ధర.. ప్రస్తుతం రూ.6,600కు విక్రయం ఉమ్మడి జిల్లా ప్రజలపై రోజు రూ.15లక్షల వరకు భారం ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు విస్తీర్ణం తగ్గడమే కారణం ఉమ్మడి జిల్లాలో రోజుకు 1,400–1,600 క్వింటాళ్ల బియ్యం విక్రయమవుతోంది. క్వింటాకు రూ.1,000 పెరిగితే రోజుకు సుమారు రూ.15 లక్షల అదనపు భారం ప్రజలపై పడుతోంది. బియ్యం ధరల పెరుగుదల ప్రభావంతో హోటళ్లలోనూ ధరలు పెరిగాయి. -
పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి
పాన్‌గల్: తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న గిరిజన రైతులకు భూ హక్కులు కల్పించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించడానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ తెలిపారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో ఆయన పర్యటించి గిరిజనుల సమస్యలపై ఆరా తీశారు. ముందుగా తండాకు వచ్చిన ఆయనకు గిరిజన సంఘం, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం తండావాసులు పోడు భూములు, సాగు, తాగునీరు, వైద్యం తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన రైతుల పోడు భూముల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి భూ హక్కులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. మిగతా స్థానిక సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. ఆయన వెంట కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ ఎల్లేని సుధాకర్‌రావు, మోహన్‌నాయక్, సోమ్‌నాథ్‌నాయక్, గోపాల్‌నాయక్, హరిలాల్‌నాయక్, కృష్ణానాయక్, వేణు నాయక్, అమ్రేష్నాయక్ పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజం వనపర్తి రూరల్: క్రీడల్లో గెలుపోటములు సహజమని.. క్రీడాకారులు రెండింటినీ సమానంగా స్వీకరించాలని, పోటీల్లో పాల్గొనడమే ముఖ్యమని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందిమళ్ల శ్రీధర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడాప్రాంగణంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్టు ఎంపికకు సీఐ రత్నం, డీవైఎస్ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నందిమళ్ల శ్రీధర్, నందిమళ్ల శ్రీకాంత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించి జిల్లా కీర్తిని మరింత పెంచాలని అకాంక్షించారు. అథ్లెటిక్స్ అభివృద్ధికి సహకరిస్తున్న విజ్ఞాన్, వాగ్దేవి కళాశాల, బచ్పన్ పాఠశాలతో పాటు బండారు రఘును ఆయన అభినందించారు. ఎంపికై న జట్టు నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్ సమీపంలోని సదాశివపేట మండలం కంకోల్లో జరగనున్న 20వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్–2026లో పాల్గోంటుందని వివరించారు. కార్యక్రమంలో పీడీలు నందన్, జబ్బార్, మహేష్, ఉమాశంకర్, బసవరాజు, అజయ్, పులేందర్, ప్రవీణ్, శోభా, మాలతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలి గద్వాల న్యూటౌన్: క్రీడల్లో గెలుపోటమలు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని జిల్లా హకీ అసోసియేషన్ అధ్యక్షుడు త్యాగరాజు అన్నారు. స్థానిక నల్ల సోమనాద్రి స్టేడియంలో బుధవారం ఎస్జీఎఫ్ఏ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ –17 హకీ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. టోర్నీలో గద్వాల జిల్లాతో పాటు వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు పాల్లొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయయన మాట్లాడారు. ఓటమిని నిరుత్సాహంగా భావించకుండా, మరింత పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. ప్రతిభ కల్గిన క్రీడాకారులను గుర్తించి, వారి భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా నిష్పక్షపాతంగా ఎంపికలు చేపట్టాలని సెలక్షన్ కమీటీకి సూచించారు. క్రీడాకారులు ఆటపై పూర్తి శ్రద్ధ పెట్టడంతో పాటు క్రమశిక్షణ పాటించాలన్నారు. గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ టోర్నీ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి భవిష్యత్‌లో ఉన్నత స్థాయి పోటీల్లో అవకాశాలు కల్పించేందుకు నిర్వాహకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ ఆనంద్‌కుమార్, పీడీ నాగేష్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
చెరువుల్లోకి చేపపిల్లలు
జిల్లాలో ప్రారంభమైన మత్స్యబీజం పంపిణీ ● మొత్తం 965 చెరువులు.. నీటితో నిండినవి 456 ● 148 మత్స్య పారిశ్రామిక సంఘాలు ● గుర్తించిన చెరువులు, జలాశయాలకు ప్రాధాన్యం ●ప్రభుత్వం జిల్లాలోని పెద్ద చెరువులను గుర్తించి వాటిలో గతం కంటే అధికంగా చేప పిల్లలను వదలాలి. మత్స్యకార్మికుల జనాభాను దృష్టిలో ఉంచుకొని మేలు రకం చేప పిల్లలను అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చేప పిల్లలను వదలడం ఆలస్యమైంది. త్వరగా వదలాలి. – జీఎస్ గోపి, మత్స్యకార్మిక సంఘం నాయకుడు, అమరచింత ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల వారీగా గుర్తించిన చెరువుల్లో చేప పిల్లలను ఉచితంగా అందించేందుకు అన్ని సిద్ధం చేశాం. జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ సహకారంతో 15 మండలాల్లోని ప్రతి చెరువు, కుంటలో వీటిని వదిలేందుకు కార్యాచరణ రూపొందించాం. ఈసారి మేలురకం చేప పిల్లలను అందించాలని సంబంధిత గుత్తేదారులను ఆదేశించాం. – లక్ష్మప్ప, ఏడీ, జిల్లా మత్స్యశాఖ అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అదేరోజు జిల్లాకేంద్రంలోని నల్లచెరువులో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి 1.36 లక్షల చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విడతల వారీగా జిల్లాలో గుర్తించిన జలాశయాలు, చెరువులు, కుంటల్లో 2.36 కోట్ల చేప పిల్లలను ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పంపిణీకి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందిస్తే వాటిని గ్రామాల్లోని చెరువుల్లో వదిలి అవి పెరిగాక విక్రయించి లబ్ధి పొందాలనే ఆలోచనతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. కొన్నేళ్లుగా ముదిరాజ్ కులస్తులకు అందిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకార్మిక కుటుంబాలు రోజువారి జీవనభృతిని సంపాదించుకునేందుకు వీలు కలిగింది. జిల్లాలో ఇలా.. జిల్లాలోని 255 గ్రామాల్లో 965 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటితోపాటు రామన్‌పాడు, జూరాల జలాశయంతో పాటు రంగసముద్రం, శంకర సముద్రం వంటి పెద్ద చెరువుల్లో చేప పిల్లలను వదలుతున్నారు. ఇందుకుగాను ఆయా మండలాల్లో మత్స్యకార్మికులు అధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి మత్స్యశాఖ అధికారులు, మత్స్య సహకార సంఘాలు, సొసైటీలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 148 సంఘాలుండగా.. 13,613 మంది మత్స్యకారులు సభ్యులుగా కొనసాగుతున్నారు. గతేడాది 2.24 కోట్ల చేప పిల్లలను వదిలిన అధికారులు ఈసారి 2.36 కోట్లు వదలనున్నారు. వీటిలో 35 ఎంఎం నుంచి 40 ఎంఎం రకం 122.884 లక్షలు, 80 ఎంఎం నుంచి 100 ఎంఎం 107.5875 లక్షల చేప పిల్లలు కొనుగోలు చేశారు. ఎల్‌నినోతో ఆలస్యం.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం ఆశించిన మేర వర్షాలు కురవక గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 965 చెరువులు, నీటికుంటలు ఉండగా.. చేపలు పెంచడానికి వీలుగా నీటితో నిండిని చెరువులు 456 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈసారి ప్రభుత్వం ఆలస్యంగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడానికి వర్షాలు కురవకపోవడం కూడా ప్రధాన కారణమని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికై నా చెరువులు, కుంటల్లో ఏ మేర చేప పిల్లలు వదులుతున్నారనే విషయాలను సొసైటీలకు అందించాలని కోరుతున్నారు. -
భూ సేకరణకు రైతులు సహకరించాలి
ఖిల్లాఘనపురం: ఖిల్లాఘనపురం బ్రాంచ్ కెనాల్ నుంచి డి–5, డి–8 కాల్వల తవ్వకాల్లో భూములు కోల్పోతున్న రైతులు ముందుకొచ్చి అంగీకార పత్రాలపై సంతకాలు చేస్తే నెలరోజుల్లో పరిహారం చెల్లింపునకు తగిన చర్యలు తీసుకుంటామని భూ సేకరణ అదనపు కలెక్టర్ తిరుపతయ్య తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేధికలో ఖిల్లాఘనపురం, షాపురం, గట్టుకాడిపల్లి, మానాజీపేట గ్రామాల భూ నిర్వాసితులతో ఐబీ డీఈ బాబుచంద్తో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్వతాపురం శివారులో 55 మంది రైతులకు సంబంధించి 20.26 ఎకరాల భూమి కాల్వ కోసం సేకరించినట్లు చెప్పారు. ఈ భూములకు ఎకరాకు రూ.13 లక్షల పరిహారం, డి–8 కాల్వకు భూములిస్తున్న రైతులకు అక్కడి విలువను బట్టి ఎకరాకు రూ.14.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు ఆగారం ప్రకాష్, రాములు, దేవేందర్, ఐబీ ఏఈ లక్ష్మారెడ్డి, డీటీ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. -
వరి పంట ఎండిపోతోంది..
బోరుబావి కింద ఎకరన్నర వరి సాగుచేశా. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావిలో నీటిమట్టం తగ్గిపోవడం, మరోపక్క విద్యుత్ కోతలతో పంటకు సక్రమంగా నీరు అందక ఎకరా పంట పూర్తిగా ఎండిపోయింది. సుమారు రూ.30 వేలకుపైగా నష్టం వాటిల్లింది. – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అన్నారం (పాన్‌గల్) మిర్చి కాపాడుకోలేకపోతున్నాంమూడు ఎకరాలు కౌలుకు తీసుకొని బోరుబావి నీటితో మిర్చి సాగుచేశా. వర్షాలు లేకపోవడం, చెరువులో నీరు అడుగంటి బోరు రీచార్జి కావడం లేదు. పంటను కాపాడేందుకు పక్క పొలం రైతు సాయంతో నీటిని మళ్ళించుకొని అందిస్తున్నా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కరెంట్ కష్టాలు కూడా అధికం కావడంతో ఈసారి రూ.3 లక్షల నష్టం తప్పదనిపిస్తుంది. – లింగానాయక్, తూక్యానాయక్ తండా ● -
ఎమ్మెల్సీ ఓటరు జాబితా నోటిఫికేషన్ విడుదల
వనపర్తి: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటరు జాబి తా నోటిఫికేషన్‌ను మంగళవారం కలెక్టరెట్ కాన్ఫరెన్‌న్స్ హాల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకుగాను కొత్త ఓటరు జాబితా రూపొందిస్తున్నామని.. ఫారం–18 ఆఫ్‌లైన్‌లోగాని, ఆన్‌లైన్‌లోగాని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తునకు నవంబర్ 6 వరకు గడువు ఉందని తెలిపారు. జిల్లాలో అర్హులైన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యాన రాయితీలను వినియోగించుకోవాలి పాన్‌గల్: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం, పండ్ల తోటల పెంపకం, పందిరి సాగు, మల్చింగ్, డ్రిప్, కూరగాయాల నారు తదితర పథకాలకు రాయితీలను అందిస్తోందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, కేవీకే శాస్త్రవేత్త డా. రాజేందర్‌రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రత్తలు, అసమాన వర్షపాతం పరిస్థితుల్లో మామిడి తోటలను కాపాడుకోవడానికి రైతులు ముందస్తు ప్రణాళికతో యాజమాన్య పద్ధతులు పాటించాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అవసరానికి మించి నత్రజని ఎరువులు వినియోగించకుండా సమతుల పోషక యాజమాన్యం పాటించాలన్నారు. పలువురు మామిడి రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకరాగా శాసీ్త్రయ పరిష్కారాలను సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు కృష్ణయ్య, బాలప్రకాశ్, డెవలప్మెంట్ కో–ఆర్డినేటర్ రవికుమార్ పాల్గొన్నారు. అప్రమత్తతతోనే సైబర్ నేరాల నియంత్రణ వనపర్తి: వయోవృద్ధులు డిజిటల్ సేవలను సురక్షితంగా వినియోగించుకోవడంతో పాటు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బాలాజీనాయక్ సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి అధ్యక్షతన సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. వయోవృద్ధులు ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం పిన్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదన్నారు. అనుమానాస్పద లింకులు, ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, ఆన్లైన్ ఆఫర్లు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకు అధికారులు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు అని చెప్పి ఫోన్‌చేసే వ్యక్తులను నమ్మి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని, సైబర్ మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, టీఎస్‌జీఆర్‌ఈ అసోసియేషన్ సభ్యులు నర్సింహ, ఎంఏ సత్తార్, నాగేంద్రస్వామి, కామర్ రహమాన్, వనిత జ్యోతి మహిళా సంఘం, అహ్మద్ అమీర్, సీడీపీఓ అమృతమ్మ, రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది, వృద్ధాశ్రమాల నిర్వాహకులు, సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు. ‘108’ వాహనం తనిఖీ వనపర్తి రూరల్: పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 108 వాహనాన్ని మంగళవారం క్వాలిటీ ఆఫీసర్ వెంకటేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని ఔషదాలు, సామగ్రి, వాహన పరికరాలను పరిశీలించారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని పైలెట్ ఖాజా, ఈఎంటీ మహమూద్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా పోగ్రామ్ మేనేజర్ రవికుమార్, జిల్లా అధికారి దుర్గాప్రసాద్ ఉన్నారు. -
గిరిజనులకు అండగా ఎస్టీ కమిషన్
వనపర్తి: గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం జాతీయ ఎస్టీ కమీషన్‌ను ఏర్పాటు చేసిందని, కమీషన్ పనితీరుపై అవగాహన పెంచుకొని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ సూచించారు. మంగళవారం జిల్లాలోని వివిధ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి అక్కడికి వచ్చిన గిరిజనుల సమస్యలు తెలుసుకొని వారి ఎదుటే అధికారులను అడిగి పరిష్కారానికి గడువు విధిస్తూ అందుకు సంబంధించిన ప్రతిని పంపించాలని ఆదేశించారు. ఎక్కువగా రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలకు సంబంధించిన అంశాలపై సమస్యలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అన్నింటిని పరిష్కరించాలని లేదంటే.. ఎస్టీ కమిషన్ పరిధిలో విచారణ చేసి పరిష్కరించాల్సి ఉంటుందని, అందుకు జాతీయ ఎస్టీ కమిషన్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిర్వహిస్తోందన్నారు. సమస్య ఏదైనా మొదట సంబంధితశాఖ మండల, జిల్లాస్థాయి అధికారులకు విన్నవించి పరిష్కారం కాకుంటే కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజావాణి అర్జీలను పరిష్కరించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వెనుకబడి ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా జిల్లాల్లో నిర్వహించే గ్రీవెన్స్‌లకు వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ వస్తున్నాయని.. ఇందుకు కారణం సమస్యను పరిష్కరించకపోవడమేనని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డికి సూచించారు. ఏ సమస్య ఉన్నా ncstgrams పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు ఎస్టీ కమిషన్ ఉందని ఎస్టీలకు భరోసా కల్పించారు. పాన్‌గల్ మండలంలో వైద్యులు, అదనంగా ఏఎన్ఎం నియమించాలని సూచించారు. పెద్దగూడెంతండాలో ఇంతవరకు ఇంటినంబర్లు ఇవ్వడం లేదని, ఇబ్బందులు పడుతున్నామని తండావాసులు కమిషన్ దృష్టికి తెచ్చారు. స్పందించిన సభ్యులు 15 రోజుల్లో ఇంటినంబర్లు కేటాయించాలని పంచాయతీ అధికారిని ఆదేశించారు. కొన్నితండాలకు రోడ్డు సౌకర్యం లేదని, మరికొన్నింటికి అటవీ భూమి ఉందని రహదారులు వేయడం లేదని కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. ఆయా సమస్యలను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ భూముల్లో ఇప్పటికే కాస్తులో ఉన్న రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో సిగ్నల్ సరిగా లేవని, బీఎస్ఎన్ఎల్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉ న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ సమ స్య ఉందో గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాలని బీఎస్ఎన్ఎల్ అధికారిని ఆదేశించారు. -
స్వరాష్ట్రంలోనూ పాలమూరుకు అన్యాయమేనా?
ఇటీవల జూరాల ఆయకట్టు రైతులు ఎందుకు ఆందోళనలకు దిగాల్సి వచ్చిందో పాలకులు, ప్రతిపక్షాలు గ్రహించాలి. ఎల్ నినో, వర్షాభావం వల్ల అని భావించినా.. నీటి నిర్వహణ, ప్రా జెక్ట్లు, రిజర్వాయర్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణాలు. స్వరాష్ట్రంలో 12 ఏళ్లు గడిచినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తికాకపోవడం విచారకరం. జిల్లా రైతులకు మేలు చేసేలా ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్ల నిర్మాణంలో వేగం పెంచాలి. విమర్శలతోనే సమాధానం చెబుతామనుకుంటే వారికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. – రాజేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ -
కమ్యూనిజం శక్తికి నిదర్శనం : సీపీఎం
మదనాపురం: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కమ్యూనిస్టు భావజాలం విస్తరిస్తోందని.. అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ స్పష్టం చేశారు. మంగళవారం మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డ్ హమాలీ విశ్రాంతి భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మండ్ల రాజు అధ్యక్షతన జరిగిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో అంశాలను సవివరంగా విశ్లేషించారు. ఇటీవల శ్రీలంకలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని, అలాగే అమెరికా సామ్రాజ్యవాద కేంద్రమైన న్యూయార్క్‌లో సైతం విజయం నమోదు చేసిందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు సైతం కమ్యూనిస్టు మేనిఫెస్టోను అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. దేశంలో ఎన్నికల నిర్వహణ విధానంపై పెద్దఎత్తున బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, బాల్‌రెడ్డి, జీఎస్ గోపి, జిల్లా నాయకులు వెంకట్రాములు, మేకల ఆంజనేయులు, ఎస్.రాజు, మహబూబ్‌పాషా, వెంకటయ్య, వెంకటేష్, నిక్సన్, అజయ్ పాల్గొన్నారు. -
వీడని విద్యుత్ కష్టాలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రాములు. అమరచింత స్వగ్రామం. తనకున్న 2 ఎకరాల్లో బోరుబావి కింద వరి సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక గ్రామంలోని పెద్దచెరువు వట్టిపోయి బోరుబావి నుంచి నీరు ఆగి ఆగి వస్తుండటం.. దీనికితోడు రోజుకు కేవలం 6 గంటల విద్యుత్ సరఫరా అవుతుండటంతో నీరందక పంట నెర్రెలు వారిందని చెబుతున్నారు. పంట చేతికందుతుందనే నమ్మకం లేదంటున్నారు. అమరచింత: జిల్లాలోని గ్రామాల్లో బోరుబావుల కింద వానాకాలం వరి సాగు చేసిన రైతులను అప్రకటిత విద్యుత్ కోతలు తీవ్ర నష్టాలను కలిగిస్తున్నాయి. వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు తమ బోరుబావుల కింద వరి సాగుచేశారు. ప్రస్తుతం రోజుకు సుమారు 10 గంటల విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న బోరుబావుల వద్ద వరి, నీటి సౌకర్యం అంతంత మాత్రంగా ఉన్న రైతులు ఆరుతడి పంటలైన పత్తి, కంది సాగుచేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు కూడా ఆశించిన మేర కురవకపోవడంతో భూగర్భ జలమట్టం సైతం పడిపోతుండటంతో సాగు చేసిన ఆరుతడి పంటలను దక్కించుకునేందుకు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. అప్రకటిత కోతలతో అవస్థలు.. వ్యవసాయానికి రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు త్రీ ఫేజ్ విద్యుత్‌ను అందిస్తున్నారు. మధ్యమధ్యన ఎల్సీలు, ఓవర్‌లోడ్, మరమ్మతు పేరిట సరఫరా నిలిపివేస్తుండటంతో కేవలం 6 గంటల సరఫరా కూడా పొందలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. విద్యుదుత్పత్తి ఆశించిన స్థాయి లో జరగకపోవడం, ఉన్న విద్యుత్‌ను సద్వినియోగం చేసుకునే దిశగా వ్యవసాయానికి కోతలు విధించాల్సి వస్తోందని ట్రాన్స్‌కో అధికారులు వెల్లడిస్తున్నారు. ● జూరాలలో నీరు సమృద్ధిగా ఉన్నా.. ఆయకట్టుకు సైతం సాగునీటిని వారాబందీ విధానంలో అందించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామా ల్లోని చెరువు లు, కుంటలు సైతం వట్టిపోవడంతో వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి నీరు ఆగి ఆగి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్నంబావి 4,926 వనపర్తి టౌన్ 4,958 పెద్దమందడి 5,136 గోపాల్పేట 5,638 వీపనగండ్ల 5,781 ఖిల్లాఘనపురం 4,716 శ్రీరంగాపురం 2,353 అమరచింత 3,469 మదనాపురం 3,021 ఆత్మకూర్3,054 రేవల్లి 3,612 కొత్తకోట4,848 మండలాల వారీగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విద్యుదుత్పత్తి లేకపోవడంతో.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం ఆశించిన మేర వర్షాలు లేక ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం తగ్గి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఉన్న విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించుకునేందుకు వ్యవసాయానికి 12 గంటల పాటు అందిస్తున్నాం. రైతులు ఆరుతడి పంటలు వేసుకుంటే ఉన్న విద్యుత్‌తో నీరందుతుంది. – తాతారావు, ఎస్ఈ, ట్రాన్స్‌కో అప్రకటిత కోతలతో ఎండుతున్న పంటలు రోజువారీగా సుమారు 10 గంటలు మాత్రమే సరఫరా జిల్లాలో 64,235 విద్యుత్ కనెక్షన్లు జిల్లాలో బోరుబావుల కింద 1.20 లక్షల ఎకరాలు పాన్‌గల్ 7,775 పెబ్బేరు 4,070 వనపర్తి 878 -
పదోన్నతితో మరింత బాధ్యత : ఎస్పీ
వనపర్తి: పదోన్నతులు మరిన్ని బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. జిల్లాలో ఏఎస్ఐగా పనిచేస్తున్న వెంకటనాగరాజు ఎస్ఐగా, హెడ్ కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజేందర్‌రెడ్డి, బాలీశ్వర్‌రెడ్డి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా పోలీసు సిబ్బంది పదోన్నతులు పొందడం ఆనందదాయకమన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ.. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు తగిన న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. -
పర్యాటక కేంద్రంగా పాన్‌గల్ ఖిల్లా కోట
పాన్‌గల్: మండల కేంద్రమైన పాన్‌గల్ ఖిల్లా కోటతో పాటు మాధరావుపల్లిలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వేదికై న ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పురావస్తుశాఖ అధికారుల బృందం పేర్కొంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో సోమవారం ఆయా ప్రాంతాలను స్థానిక నాయకులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పాన్‌గల్ ఖిల్లా కోటపై ఉన్న చారిత్రాక కట్టడాల వివరాలను సేకరించారు. మాధరావుపల్లిలో వినోబా భావే, నెహ్రూ బసచేసిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రెండు, మూడు రోజుల్లో సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఖిల్లా కోట, మాధరావుపల్లి వేదికల గురించి గైడ్లు వడ్దె పాపయ్య , గడ్డం మహేశ్ అధికారుల బృందానికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ప్రొ.అర్జున్‌రావు కుతాడి, ఇంజినీర్ నర్సింగ్ నాయక్, డైరెక్టర్ ఓఎస్డీ రాజు, టెక్నికల్ అసిస్టెంట్ సాయికిరణ్, కాంగ్రెస్ నాయకులు బ్రహ్మాయ్య, నరేందర్‌గౌడ్, రాంచందర్, మధుసూదన్ ఉన్నారు. సీఈసీ రాజీనామా చేయాలి వనపర్తి రూరల్: ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సర్ ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత, పారదర్శకతపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఎండీ జబ్బార్, చీర్ల సత్యంసాగర్, మెకానిక్ శ్రీనివాసులు, ఖాదర్‌పాషా, రమేశ్, గణేశ్, ఎం.పరమేశ్వరాచారి, బీసన్న, భాస్కర్, ఉమ ఉన్నారు. -
భూముల లెక్క పక్కాగా చేపట్టాలి
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా.. రెండో విడతలో మరో 2వేల ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో చేసిన తప్పులు రెండో దశలో పునరావృతం కానివ్వొద్దని అధికారులకు సూచించారు. మూడు, నాలుగో విడతల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఏ జనావాస ప్రాంతంలో పూరిగుడిసె ఉండనియ్యమన్నారు. అంతకు ముందు జిల్లాలో పలు భవనాల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. శ్రీరంగాపురం, ఆత్మకూర్, వీపనగండ్ల, చిన్నంబావి తహసీల్దార్ కార్యాలయాలకు రూ. 2.25కోట్ల చొప్పున, వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రూ.2.10 కోట్లతో నిర్మించేందుకు కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అదే విధంగా పెద్దమందడి మండలం వెల్టూరు శివారులో రూ. 12.75 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, వనపర్తి మండలం చిట్యాల శివారులో రూ. 10 కోట్లతో బీసీ గురుకులం జూనియర్ కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వనపర్తి నల్ల చెరువులో ఉచిత చేపపిల్లలను వదిలారు. వనపర్తి: గత పాలకులు తీసుకొచ్చిన ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూముల రీ సర్వేకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రీసర్వే ప్రక్రియను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో, పూర్తి బాధ్యతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా గ్రామాల సరిహద్దులను పక్కాగా నిర్ధారించుకుని, ఆ తర్వాత భూముల సర్వేను పక్కాగా చేపట్టాలన్నారు. సోమవారం వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, గృహనిర్మాణం, భూముల రీసర్వే అంశాలపై నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై తహసీల్దార్లు, సర్వేయర్లతో ఆరా తీశారు. అలాగే రైతుల నుంచి వ్యక్తమవుతున్న అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి విలేకర్లతో మాట్లాడారు. సుమారు 120 ఏళ్ల క్రితం భూముల సర్వే నిర్వహించారని.. మళ్లీ ఇప్పుడు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రీసర్వే ప్రక్రియను చేపట్టిందన్నారు. ప్రతి జిల్లాలోని 70 గ్రామాల్లో తొలి దశలో రీ సర్వే చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని 413 నక్షాల్లో లేని గ్రామాలను సైతం సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. తహసీల్దార్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు అధికారులందరూ క్షేత్రస్థాయికి వెళ్లి రీ సర్వే ప్రక్రియను తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. నవంబర్ 15వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వే విషయంలో అటవీ, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రీసర్వే ప్రక్రియకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. 120 ఏళ్ల తర్వాత సమగ్ర సర్వే.. ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే రీ సర్వే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం నవంబర్ 15లోగా రీ సర్వే పూర్తి చేయాలి అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
ఇంటి వద్దే వెరిఫికేషన్
వేగవంతం చేస్తాం.. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నోటీసుల విచారణ వేగవంతం చేస్తాం. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పత్రాలు, వివరాలు సేకరించి ఈసీఐసెట్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే వాటిని ఈఆర్వో పరిశీలించి పరిష్కరిస్తారు. డేటా నమోదులో ఎక్కడ లోపం ఉందో గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. అన్మ్యాప్డ్, తేడాలుండి నోటీసులు అందుకున్న ఓటర్ల పత్రాలు సమర్పించి పరిష్కారం కోసం సహకరించాలి. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్‌కర్నూల్ అచ్చంపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనలను తీర్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నోటీసులు అందుకున్న వారు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సూచించింది. అన్మ్యాప్డ్, వ్యత్యాసాల కారణంగా నోటీసులు అందుకున్న ఓటర్లు.. ఇకపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ) కార్యాలయానికి వెళ్లి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటీసులు అందుకున్న ఓటర్ల ఇంటికే బీఎల్ఓలు వెళ్లి వారి వివరాలు, పత్రాలు సేకరించాలని ఆదేశించారు. సేకరించిన పత్రాలను బీఎల్ఓలు ఈసీఐసెట్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే వాటిని ఈఆర్ఓ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ (హియరింగ్)కు హాజరు కావాల్సి ఉంటుంది. హియరింగ్ కూడా ఆన్లైన్లో నిర్వహించేందుకు అవకాశం ఉండగా.. వ్యక్తి బదులు కుటుంబ సభ్యులు హాజరు కావొచ్చని పేర్కొంది. సాఫ్ట్వేర్ లోపాలు.. సర్ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలు, సాఫ్ట్వేర్ అనువాద పొరపాట్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సష్టిస్తున్నాయి. నోటీసులు రావడానికి గతంలో క్షేత్రస్థాయిలో సాఫ్ట్వేర్ వైఫల్యం వల్లే అనేది బహిరంగ రహస్యం. గ్రామాల్లో ఓటర్లు భౌతిక డిక్లరేషన్ ఫారాలను సరిగ్గా నింపి ఇచ్చినప్పటికీ.. సిస్టంలోని ఆటో– ట్రాన్స్లేషన్ లోపాల కారణంగా వేలాది మందికి నోటీసులు జారీ అవుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సమస్యను పరిష్కరించుకోవడానికి సామాన్యులకు గుర్తింపు కార్డులు చూపడం భారంగా మారింది. గ్రామాల్లో నివసించే చదువుకోని నిరుపేదలు, వృద్ధుల వద్ద ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులు ఉండకపోవచ్చు. దశాబ్దాలుగా అదే ఊరిలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి కూడా అదనంగా గుర్తింపు కార్డులు తీసుకురావాలని నోటీసులు ఇవ్వడం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పేర్ల అనువాదంలో తప్పులు ప్రజలు సర్వే ఫాంలో తమ పేర్లను తెలుగులో స్పష్టంగా రాసిచ్చినప్పటికీ.. పాత రికార్డుల్లోని ఇంగ్లిష్ పేర్లను ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేయడం వల్ల తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయి. ఇంటి పేర్లు మారడం, పేర్లలో ఒత్తులు, దీర్ఘాలు ఎగిరిపోవడం (ఉదా: లక్ష్మయ్య అనే పేరులో క్ష, య వత్తు దూరంగా జరగడం) వంటి చిన్నచిన్న తప్పులను కూడా సాఫ్ట్వేర్ తేడాగా గుర్తించి ఆటోమేటిక్‌గా నోటీసులు జనరేట్ చేసింది. అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించిన కొత్త భౌతిక డిక్లరేషన్ ఫారాల డేటాను పక్కనబెట్టి, పాత ఆటోమేషన్ సిస్టంనే వాడటంతో సమస్య మొదటికి వచ్చింది. సర్టిఫికెట్ల కోసం.. ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు 14 రకాల కార్డుల్లో ఒకటి ఆధారంగా చూపవచ్చని తెలిపింది. అయితే క్షేత్రస్థాయి అధికారులు మాత్రం కులం సర్టిఫికెట్ తీసుకురావాలని ఒత్తిడి చేస్తుండటంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పరిశీలనతో పరిష్కారం.. పాత ఇంగ్లిష్– తెలుగు ఆటో– ట్రాన్స్‌లేషన్‌ను నిలిపివేసి.. ఏఐ ఆధారిత వాయిస్, తెలుగు టైపింగ్ టూల్స్ ద్వారా డేటా సరిచేయాలి. ఓటర్లు బీఎల్ఓలకు అందించిన భౌతిక డిక్లరేషన్ ఫారాల ఆధారంగానే సిస్టంలో మార్పులు చేపట్టాలి. సాఫ్ట్వేర్ పంపే నోటీసులపైనే ఆధారపడకుండా, నిజమైన దొంగ ఓట్లను అరికట్టేందుకు బీఎల్ఓలు, ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయి విచారణ జరిపి సవరణ చేయాలి. ప్రజల్లో నెలకొన్న సందేహాల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం హియరింగ్ కోసం ఓటర్లు ఈఆర్ఓ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు బీఎల్ఓలే ఓటర్ల ఇంటికి వచ్చి పత్రాల పరిశీలన, వివరాల సేకరణ ఆటో– ట్రాన్స్లేషన్ లోపాల వల్లే వేలాది మందికి నోటీసులు సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు -
మంత్రుల దృష్టికి టెనెంట్ సమస్య
కొత్తకోట: మున్సిపాలిటీలోని రాఘవేంద్ర, బీసీ కాలనీల్లో నెలకొన్న టెనెంట్ సమస్యపై ఈ నెల 21న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘టెనెంట్ ఇక్కట్లు’ కథనానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి స్పందించారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో టెనెంట్ సమస్యను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. రాఘవేంద్ర కాలనీ, బీసీ కాలనీ ఏర్పడి సుమారు 50 ఏళ్లు అవుతోందని.. ప్రస్తుతం 400 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని ఎమ్మెల్యే వారికి వివరించారు. అక్కడ సాగుభూమి లేదని.. టెనెంట్ కేసుతో కాలనీవాసులు తమ ఇళ్లు, ప్లాట్లను విక్రయించలేకపోతున్నారని తెలిపారు. అలాగే కొత్తగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రావడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్తులను తాకట్టు పెట్టుకునే అవకాశం కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. టెనెంట్ సమస్యను వెంటనే పరిష్కరించి.. కాలనీలో ఆస్తుల క్రయ, విక్రయాలు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. -
తనిఖీలు నిర్వహిస్తాం..
జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలు, అందుకు సంబంధించి నిర్వహించే వేలం పాటలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా ఉన్న బెల్టు షాపుల నిర్వహణపై తనిఖీలు చేపడతాం. ఎక్కడైనా అనధికారికంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్లు తెలిస్తే అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలి చర్యలు తీసుకుంటాం. ఇటీవల బెక్కెం గ్రామంలో నిర్వహించిన వేలం పాట, బెల్టుషాపు నిర్వహణపై దాడులు నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం. – ఎం.లింగాచారి, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్‌శాఖ అఽధికారి ● -
డిండి ప్రాజెక్టు రద్దుచేసే దాకా పోరాటం
పాలమూరుకు అన్యాయం చేసే డిండి ప్రాజెక్టు ఆపే బాధ్యత ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదే అని ఎంపీ డీకే అరుణ అన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన డిండి ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టడం అంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేయడమే అన్నారు. ఈ జిల్లా నుంచి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఈ ప్రాంత రైతాంగానికి పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వాల్సింది పోయి నల్లగొండకు తరలించాలని చూడటం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పాలమూరుకు నష్టం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని.. ప్రజల తరపున ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు. నాగర్‌కర్నూల్/ కల్వకుర్తి రూరల్: ఉమ్మడి పాలమూరు రైతుల పాలిట శాపంగా మారిన డిండి ప్రాజెక్టును రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నేతలు పునరుద్ఘాటించారు. వంగూరు మండలం ఉల్పర నుంచి ఆదివారం ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ప్రొ.హరగోపాల్ జెండా ఊపి ప్రారంభించారు. రైతులు ప్లకార్డులు చేతబూని పాలమూరు నీరు ఇక్కడి రైతులకే దక్కాలని.. నల్లగొండ జిల్లాకు తరలించొద్దని నినదించారు. అక్కడి నుంచి పాదయాత్ర కోనాపూర్‌కు చేరుకోగా.. ఎమ్మెల్సీ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఈ ప్రాంత రైతాంగం చేస్తున్న సాగునీటి సాధన ఉద్యమానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రకటించారు. కోనాపూర్ నుంచి రంగాపూర్ మీదుగా ఎల్లికల్ వరకు పాదయాత్ర సాగింది. అక్కడ ప్రజలకు పాదయాత్ర ప్రాధాన్యత, డిండి ప్రాజెక్టుతో జరిగే నష్టాన్ని జేఏసీ నాయకులు వివరించారు. ప్రజలు చైతన్యవంతులై ఉద్యమంలో కదం తొక్కాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి కల్వకుర్తి సమీపానికి చేరుకున్న పాదయాత్రలో ఎంపీ డీకే అరుణ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయానికి జేఏసీ నాయకులు చేరుకొని డీఏఓకు వినతిపత్రం అందజేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి స్వంత మండలం నుంచే రైతన్నలు సాగునీటి కోసం పోరుబాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. పాదయాత్రకు వివిధ గ్రామాల నుంచి రైతులు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, జేఏసీ నాయకులు వెంకట్‌గౌడ్, సదానందంగౌడ్, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. సీఎం స్వంత మండలం నుంచే మొదలైన పోరుబాట పాలమూరును ఆగం చేయొద్దని జేఏసీ ఆధ్వర్యంలో కదిలిన రైతాంగం సంఘీభావం తెలిపిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొ.హరగోపాల్ -
‘ఉల్లాస్’తో అక్షరాస్యతకు బాట
వనపర్తిటౌన్: వయోజన నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారడంతో పాటు రోజువారీ జీవితానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉల్లాస్ కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాలోని వనపర్తి, అమరచింత, ఆత్మకూర్, చిన్నంబావి, ఖిల్లాఘనపురం, గోపాల్పేట, కొత్తకోట, మదనాపురం, పాన్‌గల్, పెబ్బేరు, పెద్దమందడి, రేవల్లి, శ్రీరంగాపురం, వీపనగండ్ల, ఏదుల మండలాల్లో నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు మొత్తం 17,506 మంది వయోజన నిరక్షరాస్యులు హాజరయ్యారు. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో నిర్వహించిన పరీక్షను ఆయన పరిశీలించి మాట్లాడారు. పరీక్షల ద్వారా అభ్యసించిన అంశాలను సమీక్షించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీఓఏలు పాల్గొన్నారు. -
సాగునీటి వృథా.. తప్పని వ్యధ
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిగాకపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నిల్వనీరు వృథాగా పారుతోంది. ప్రభుత్వం మూడేళ్ల కిందట షట్టర్ల మరమ్మతుకు రూ.20 లక్షలు మంజూరు చేసింది. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న సమయంలో కాల్వ ప్రధాన హెడ్ రెగ్యులేటరీ వద్ద షట్టర్లకు నీటి సరఫరా నిలిపివేసేందుకు రింగ్‌బండ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతిసారి రింగ్‌బండ్ ఏర్పాటు చేయడం.. వచ్చిన వరద ప్రవాహంతో మొర్రం కొట్టుకుపోవడంతో మరమ్మతు పూర్తి కావడం లేదు. ప్రస్తుత సమయంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయక చేతులెత్తేస్తున్న అధికారులు.. సమాంతర కాల్వ నుంచి రోజు 60 నుంచి 100 క్యూసెక్కుల నీరు లీకేజీ రూపంలో వృథాగా పారుతున్నా అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిచేసి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
నేడు జిల్లాకు మంత్రుల రాక
వనపర్తి: జిల్లాలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఎంపీ మల్లు రవి పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని నల్లచెరువులో చేప పిల్లలను వదిలి కలెక్టరేట్ నుంచే వర్చువల్‌గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, శ్రీరంగాపురం తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్, బీసీ గురుకులం జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, అనంతరం హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని వివరించారు. ప్రజావాణి రద్దు వనపర్తి: ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం ఉన్నందున సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విష యాన్ని గమనించాలని, వచ్చే వారం నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలు విన్నవించు కునేలా ప్రణాళిక చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపిక వనపర్తి రూరల్: పెబ్బేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఽఆధ్వర్యంలో జూనియర్ (బాలికల) జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించినట్లు అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ప్రధానకార్యదర్శి కురుమయ్య తెలిపారు. మొత్తం 65 మంది క్రీడాకారులు పాల్గొనగా 18 మందిని త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 10 నుంచి 12వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం నర్సింహగౌడ్, కమలాకర్, పీడీ, పీఈటీలు సంతోషి, ఝాన్సీ, మాలతి, అశోక్, సీనియర్ క్రీడాకారులు శివ, కిషోర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక ఖిల్లాఘనపురం: మండలంలోని పర్వతాపురం గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఆదివారం హన్మకొండలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పొటీల్లో పాల్గొని 18 ఏళ్ల విభాగం లాంగ్‌జంప్‌లో 6.75 మీటర్లు దూకి బంగారు పతకం సాధించడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు క్రాంతి క్రీడా అసోసియేషన్ అధ్యక్షుడు యాదయ్య వివరించారు. అదేవిధంగా మండలంలోని అప్పారెడ్డిపల్లికి చెందిన జె.సాయి సాత్విక్ ట్రయాథ్లాన్ అండర్ 14 విభాగంలో మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. -
ఇందిరమ్మ చీరలొచ్చాయ్..
● జిల్లాకు తొలివిడతగా 37 వేలు రాక ● జిల్లాకేంద్రంలోని గోదాములో భద్రం ● ప్రభుత్వ ఆదేశాలు రాగానే పంపిణీకి శ్రీకారం ప్రభుత్వం ఏటా మహిళలకు చీరలు పంపిణీ చేయడం గొప్ప విషయం. పండుగల వేళ పేద కుటుంబాలకు ఖర్చు తప్పుతుంది. చీరల రంగులు, నాణ్యత బాగున్నాయని విన్నాం. మంచి చీరలు ఇస్తే సంతోషంగా ఉంటుంది. రానున్న రోజుల్లో మహిళలకు అనేక పథకాలు ఇవ్వాలి. – రాధ, తిరుమలయ్యపల్లి (మదనాపురం) రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కు తొలి విడతగా 37 వేల చీరలు చేరాయి. వీటిని జిల్లాకేంద్రంలోని ప్రధాన గోదాములో భద్రపర్చాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తా ం. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – రామమహేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ●మదనాపురం: పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, పండుగ వేళ వారి ముఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలివిడతగా 37 వేల చీరలు జిల్లాకేంద్రానికి చేరుకున్నాయి. జిల్లాకు చేరిన చీరల బస్తాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి జిల్లాకేంద్రంలోని గోదాముల్లో భద్రపర్చారు. నాణ్యత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, మహిళా లోకానికి ఎంతగానో నచ్చేలా ఆకర్షణీయమైన అంచులు, మన్నికై న వస్త్రంతో చీరలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆసరా పింఛనుదారులు, అర్హులైన పేద మహిళల జాబితాలను ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. తొలి దఫాగా 37 వేల చీరలు రాగా.. మిగిలిన స్టాక్ కూడా త్వరలోనే రానున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాకేంద్రం నుంచి మండల కేంద్రాలకు అక్కడి నుంచి గ్రామపంచాయతీల వారీగా పంపిణీ చేసేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 15 మండలాలు.. 268 గ్రామపంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అందజేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. -
సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్
కందనూలు: రైతులకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి దశదిన కర్మకు హాజరైన ఆయన తిరుగు ప్రయాణంలో మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల వద్ద మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ వద్ద వాపోయారు. వ్యాపారుల వద్ద మిత్తికి అప్పులు తెచ్చి పంటలు సాగు చేశామని, ఆ మిత్తి పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదని తమ గోసను వెలిబుచ్చారు. ఒకపక్క సాగునీరు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క యూరియా దొరకక అవస్థలు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా వారిని పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని సృష్టించిన విపత్తు అని దుయ్యబట్టారు. రైతుల పంటలకు సరిపడా నీరు ఇస్తే పంటలు పండితే ధాన్యాన్ని కొనాల్సి వస్తుందని, అలాగే వారికి డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో 8.30 లక్షల ఎకరాలకు నీరు అందించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూశామని గుర్తుచేశారు. నదులు, ప్రాజెక్టులలో పుష్కలంగా నీరున్నా.. రైతుల పంటలకు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతుంటే అధికార పార్టీకి చెందిన ఏ నాయకుడికి రైతులను పలకరించే తీరిక లేకుండాపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. పాలమూరు జిల్లా రైతులకు ఎండబెట్టి ఆంధ్ర ప్రభుత్వానికి నీటిని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన నిలబడి తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని, రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమే.. అండగా ఉంటామని కేటీఆర్ రైతులకు భరోసానిచ్చారు. కేటీఆర్ వెంట ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే.. రైతులకు అండగా ఉంటాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
‘ఖిల్లా’ కోట అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
ఖిల్లాఘనపురం: కాకతీయుల కాలం నాటి ఖిల్లా కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎఫ్ఆర్ఓ దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రెక్కింగ్‌ను ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి జెండా ఊపి ప్రారంభించి స్థానిక నాయకులు, అధికారులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయులు 14 వేల గొలుసుకట్టు చెరువులు తవ్వారని, 80 ఏళ్ల క్రితమే సరళాసాగర్‌లో సైఫన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నికల్ కళాశాల భవనాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఖిల్లాఘనపురం ప్రాంతంలోనూ కాకతీయుల కాలం నాటి ఎన్నో కట్టడాలు ఉన్నాయన్నారు. గణప సముద్రం, గట్టుకాడిపల్లి మధ్యలో గుట్టపై ఉన్న స్థలంలో రూ.2 కోట్లతో హరిత హోటల్, గదులు, పార్క్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేరేడు చెరువు రిజర్వాయర్‌ను రూ.50 లక్షలతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్టారావుతో మాట్లాడి ఆయా ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.14 కోట్లు మంజూరు చేయించామన్నారు. విద్యార్థులు అవకాశం ఉన్న సమయంలో జిల్లాలోని ప్రాచీన కట్టడాలను పరిశీలించాలని సూచించారు. -
నేటితరానికి ఆదర్శం ఐలమ్మ : ఎమ్మెల్యే
వనపర్తి: చాకలి ఐలమ్మ జీవితం, ఆమె పోరాటాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మకు ప్రత్యేక స్థానం ఉందని, రజాకార్లు, భూస్వాముల ధౌర్జన్యాలకు ఎదురొడ్డి అణగారినవర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా ధైర్యంగా పోరాడిన ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. చాకలి ఐలమ్మ త్యాగాలు, సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. సమాజంలో అన్యాయాలు, అణిచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి అని కొనియాడారు. భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మహిళాశక్తి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, ఏఓ భానుప్రకాశ్, బీసీ సంక్షేమశాఖ అధికారి ప్రమీల, సామాజిక కార్యకర్త గంధం నాగరాజు, పలువురు కౌన్సిలర్లు, ప్రజాసంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం..
రజాకార్లను ఎదురించి తరిమికొట్టిన వీర వనిత, పోరాట యోధురాలు, ధైర్యశాలిగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతాంగ హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, భూమిపై హక్కు సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడిన తొలి మహిళా ఉద్యమ నేతల్లో చాకలి ఐలమ్మ ఒకరన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ వీరారెడ్డి, ఏవో సునంద, ఎస్బీ సీఐ నరేష్, ఆర్ఐ అడ్మిన్ అప్పలనాయుడు, ఆర్ఎస్ఐ వినోద్ మొగ్ధుంబారి, ఆఫీస్ సూపరింటెండెంట్లు ఇంతియాజ్, శంకర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమసమాజ స్థాపనకు పోరాటం : సీపీఎం
వనపర్తి రూరల్: అసమానతలు లేని సమాజం కోసం యువత, ప్రజలు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జన్వెస్లీ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఐద్వా కార్యదర్శి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన పుట్టా వరలక్ష్మి ప్రథమ వర్ధంతి సభకు ఆయన హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజీవ్‌చౌక్ వద్ద నవ తెలంగాణ పుస్తక ప్రదర్శనశాలను ప్రారంభించారు. దేశ సంపద కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో కేంద్రీకృతమవుతోందని, పాలకుల విధానాలతో పేదలు నిరుపేదలుగా, కుబేరులు మరింత ధనవంతులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టా వరలక్ష్మి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీ అభివృద్ధికి, ప్రజా ఉద్యమాలకు ఎంతగానో సహకరించారని కొనియాడారు. మరణానంతరం ఆమె శరీరాన్ని పరిశోధనల నిమిత్తం వైద్య కళాశాలకు అప్పగించి కుటుంబం ఆదర్శంగా నిలిచిందన్నారు. -
డీఎస్పీగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు..
జిల్లాలోని రేవల్లి మండలం శానాయిపల్లికి చెందిన మండ్ల పార్వతమ్మ, నాగయ్యకు మూడు ఎకరాల పొలం ఉంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో పాటు జేసీబీ ఆపరేటర్‌గా, పాలు అమ్మి వచ్చిన డబ్బులతో పిల్లలను కష్టపడి చదివించారు. పెద్ద కుమార్తె బీఈడీ పూర్తి చేయగా.. ఐదేళ్ల కిందట పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. రెండో కుమార్తె కవిత గ్రూప్–1లో 48వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లోని తెలంగాణా పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. వచ్చే నెల 9న పాసింగ్ఔట్ పరేడ్‌తో ట్రైనింగ్ ముగియనుంది. కవిత ఏడోతరగతి వరకు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల, 8 నుంచి పదోతరగతి వరకు నాగర్‌కర్నూల్ జెడ్పీ ఉన్నత పాఠశాల, బాసర ఐఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 2019లో విద్యుత్ ఏఈగా ఎంపికై పెబ్బేరులో పదినెలల పాటు ఉద్యోగం చేసింది. గ్రూప్–1 రాసి 48వ ర్యాంకు సాధించి ప్రస్తు తం ట్రైనింగ్‌లో ఉంది. ఇంత సాధించిన తమ రెండో కూతురును చూ సి తల్లిదండ్రులు గర్విస్తున్నారు. కవిత తల్లితండ్రులు పార్వతమ్మ, నాగయ్య -
ఇక డింఢీ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండికి నీటి తరలింపుపై అగ్గి రాజుకోనుంది. పాలమూరు ప్రజలు, రైతాంగానికి నష్టం వాటిల్లుతుందని.. అడ్డుకోవాలంటూ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలతో యుద్ధం మొదలు పెట్టిన ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటు లీడర్లలో చలనం వచ్చేలా ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిండి ప్రాజెక్ట్ పూర్వపరాలు, ప్రస్తుత పరిస్థితులు, జాయింట్ యాక్షన్ కమిటీ పోరు సన్నాహాలపై ‘సాక్షి’ ఫోకస్.. ఉమ్మడి ఏపీలో ఇలా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా ఎస్ఎల్బీసీ భూగర్భ టన్నెల్ తవ్వకానికి శ్రీకారం చుట్టారు. ఎస్ఎల్బీసీ ప్రధాన కాల్వ ద్వారా వచ్చే నీటిలో కొంత భాగాన్ని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి లింక్ కాల్వల ద్వారా ఎగువన ఉన్న డిండి రిజర్వాయర్‌కు మళ్లించేలా డిజైన్ చేశారు. అయితే టన్నెల్ నిర్మాణంలో అనేక అడ్డంకులు ఎదురుకావడం.. నిధుల విడుదలలో జాప్యంతో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్లో తెరపైకి.. అభ్యంతరాలతో వెనుకడుగు తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా జలాల పునర్విభజన, రీడిజైన్ వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. పాత డిండి లింక్ ప్రతిపాదనను రీడిజైన్ చేసి రూ.6 వేల కోట్లకు పైగా అంచనాతో ప్రత్యేక ఎత్తిపోతల పథకాన్ని రూపొందించింది. ఎస్ఎల్బీసీపైనే ఆధారపడకుండా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల నుంచి డిండికి కృష్ణా జలాలను ఎత్తిపోసేలా మార్పు చేశారు. దీనిపై ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. కాంగ్రెస్.. వచ్చీ రావడంతో.. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పీఆర్ఎల్ఐలో భాగంగా వనపర్తి జిల్లాలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీళు్ల్ తరలించేలా ప్రతిపాదించిన ఏదుల–ఉల్పర లింక్ పనుల కోసం గతేడాది రూ.1,800 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అయితే డిండికి నీటి తరలింపుపై తొలి నుంచీ వ్యతిరేకంగా ఉన్న పాలమూరు రైతులు, ప్రజలు, జల సాధన సమితి, అధ్యయన వేదిక రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు వ్యతిరేకం, ఇప్పుడు మౌనమా? తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదుల నుంచి డిండికి నీటి మళ్లింపు తెరపైకి రాగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని విన్నవించడంతో పాటు హెచ్చరికలు సైతం జారీ చేశారు. అప్పుడు డిండికి పాలమూరు నుంచి నీటిని తరలించొద్దని జూపల్లి కృష్ణారావు లేఖ రాశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండి.. ఏదుల నుంచి డిండికి నీటి తరలింపుపై నోరు మెదకపోవడంపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఉద్యమ తీవ్రత పెంచేలా.. డిండి ప్రాజెక్ట్‌కు వ్యతిరేక ఉద్యమంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ పార్టీల నేతలు కలిసి వచ్చేలా జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ప్రతినిధులు వీరబ్రహ్మచారి, బెక్కెం జనార్దన్, చెన్న కిష్టయ్య, బండెల రాంచంద్రారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి తదితరులు చర్చించుకుని తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేలా ఆదివారం ఉల్పర నుంచి కల్వకుర్తికి పాదయాత్ర చేపట్టనుంది. ఈ యాత్రకు ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర కన్వీనర్, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరుకానున్నారు. యాత్ర వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పేరిట బహిరంగ లేఖలు విడుదల చేయనున్నారు. కల్వకుర్తిలో ఆర్డీఓ తదితర అధికారులకు వినతిపత్రాలు అందించనున్నారు. దశల వారీగా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, వంటావార్పు, నిరసనలు.. ఇలా పోరు కార్యాచరణను వెల్లడించనున్నట్లు సమాచారం. పోరుకు శ్రీకారం చుట్టిన జేఏసీ డిండికి నీటి తరలింపునకు సంబంధించి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలలోని ఏదుల నుంచి 2.52 కిలోమీటర్ల మేర ఓపెన్ కాల్వతో పాటు 16 కి.మీల సొరంగం.. ఆ తర్వాత 3.05 కి.మీల మేర కాల్వను నిర్మించి దుందుభీ నదిలోకి నీళ్లు పోస్తారు. అక్కడ నీటిని మళ్లించేందుకు పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యాం నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఆయా చోట్ల రిజర్వాయర్లు, కాల్వల పనులు మొదలు కాగా.. ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ పోరుకు శ్రీకారం చుట్టింది. పాలమూరు నీళ్లను డిండికి తరలించొద్దని కోరుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలు రాసింది. అంతేకాదు.. పోరు కార్యాచరణను రూపొందించుకుని ముందుకుసాగుతోంది. ఈ మేరకు డిండి పరిధిలో రిజర్వాయర్లు, కాల్వల సందర్శన చేపట్టి.. రైతులు, వివిధ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పోరు సన్నాహాలు ముమ్మరం చేసింది. డిండికి పాలమూరు నీటి తరలింపుపై జేఏసీ పోరు బాట ప్రజల్లో చైతన్యంతోపాటు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఇప్పటికే అడ్డుకోవాలని బహిరంగలేఖలు.. రైతులు, సంఘాల నేతలతో భేటీ నేడు ఉల్పర నుంచి కల్వకుర్తికి పాదయాత్ర... సీఎం పేరిట విజ్ఞాపన పత్రం హాజరుకానున్న ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ -
కంటే.. కూతుర్నే కనాలి
అన్నింటా పురుషులతో సమానంగా రాణింపు ఆడపిల్ల అడుగుపెట్టిన ఇల్లు నందనవనం... ఆమె నవ్వు ప్రతి కష్టాన్ని మరిపించే దివ్య ఔషధం. సమాజంలో ఆడపిల్లల ఉనికి, ప్రాముఖ్యత, వారి నిస్వార్థమైన అనురాగాన్ని గౌరవించి వేడుక చేసుకోవడానికి ఏటా సెప్టెంబర్ నాలుగో ఆదివారాన్ని కూతుళ్ల దినోత్సవంగా జరుపుకొంటాం. చిన్నతనంలో ఇంటి నిండా సందడి చేస్తూ, పెద్దయ్యాక తల్లిదండ్రుల బాగోగులను ఒక తల్లిలా చూసుకునే ఏకై క రూపం కూతురు. కష్టం, సంతోషం ఏదైనా కుటుంబానికి అండగా నిలిచే ధైర్యం ఆమె. నేటి ఆధునిక కాలంలో ఆడపిల్లలు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. విద్య, సైన్స్, క్రీడలు, రాజకీయం, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. కూతుళ్లకు మనం ఇవ్వగలిగే గొప్ప కానుక కేవలం వస్తువులు, నగలు మాత్రమే కాదు.. స్వేచ్ఛ, నాణ్యమైన చదువు, సమానమైన గౌరవం, వారి కలలపై నమ్మకం. తల్లిదండ్రులు వెంటే ఉన్నారనే భరోసా ఆమెకు ప్రపంచాన్నే జయించే శక్తినిస్తుంది. కూతురి ఆశయాలకు రెక్కలు తొడగాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. – గోపాల్పేట/అమరచింత/ఆత్మకూర్/మదనాపురం/పాన్‌గల్ ఆడపిల్లలు పుట్టారని పలువురు అన్నా.. తమకు కలిగిన సంతానం మహాలక్ష్మిలని భావించి వారిని పెంచి పోషించి ఉన్నత చదువులు చదివించారు. వివరాల్లోకి వెళ్తే.. అమరచింతకు చెందిన ఎస్.వెంకటేశ్వర్లు, పద్మావతికి ఇద్దరు కుమార్తెలు. వెంకటేశ్వర్లు సహార ఇండియా ఏజెంట్‌గా, పద్మావతి పైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివించారు. పెద్ద కుమార్తె శరణ్య బీఏఎంఎస్, చిన్న కుమార్తె లావణ్య ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. శరణ్యను డాక్టర్‌కు, లావణ్యను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.తల్లిదండ్రులిద్దరూ అమరచింతలోనే స్థిరపడ్డారు. తల్లిదండ్రుల కష్టసుఖాలను గుర్తించిన కుమార్తెలు ఖర్చుల కోసం ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నారు. తనకు కుమారులు లేరనే బాధ లేదని.. తన కుమార్తెలే కొడుకులని చెప్పుకొంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఆత్మకూర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది చామతోట రామేశ్వర్‌రెడ్డి, అరుణ దంపతులకు 1983, అక్టోబర్ 6న కుమార్తె హారిక జన్మించింది. కుమారుడైనా.. కూతురైనా ఒక్కటేనని బలంగా నిర్ణయించుకొని ఆమెను బీడీఎస్ చదివించారు. అనంతరం 2006, మే 14న ఆత్మకూర్‌కు చెందిన డా. పాషం ప్రణయ్కుమార్రెడ్డికు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి 2008, నవంబర్ 18న కుమార్తె ధాత్రి జన్మించగా.. వీరుకూడా ఒక్క కూతురే చాలనుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాగా చదివించి దేశం గర్వించే స్థాయిలో నిలబెట్టాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు. లింగబేధం, వివక్ష లేకుండా తమ పిల్లలను పెంచామని ఆ దంపతులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా.. కుటుంబానికి కొండంత అండ నేడు కూతుళ్ల దినోత్సవం -
పేదరికం అడ్డుకారాదని..
మదనాపురం మండలం తిరుమలాయపల్లికి చెందిన బోయిని వెంకటన్నది నిరుపేద కుటుంబం. రోజువారీ కూలీ చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. తన పేదరికం కూతురు మమత చదువుకు అడ్డంకి కాకుండా చూసుకున్నారు. చదువే విజయాలకు అసలైన ఆయుధమని నమ్మారు. తండ్రి పడుతున్న శ్రమను కళ్లారా చూసిన కుమార్తె ఆయన ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి ఎల్ఎల్బీ పూర్తి చేసింది. నేడు హైదరాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మా నాన్న కష్టం ముందర ఏదీ ఎక్కువ కాదు. మేము చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులున్నా.. ఏనాడూ మమ్మల్ని నిరాశపర్చలేదు. కూలీ పనికి వెళ్తూనే ఉన్నత చదువులు చదివించారు. ఈ రోజు నేను లాయర్‌గా నిలబడ్డానంటే అది మా నాన్న పడ్డ కష్టం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే. – బోయిని మమత, న్యాయవాది -
అప్రమత్తతతోనే ఎల్‌నినోకు అడ్డుకట్ట
ఆత్మకూర్: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో రానున్న వేసవి మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందని.. అప్రమత్తతతోనే అడ్డుకట్ట వేయవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా–2026 వికసిత్ భారత్ పంచాయతీ ప్రణాళికలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అమరచింత, ఆత్మకూర్ మండలాల సర్పంచ్‌లు, ఈజీఎస్, ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎల్‌నినోతో సాధారణం కంటే అఽధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాలులు వీచే ప్రమాదం ఉందని, దీని ప్రభావం ప్రజారోగ్యంపై పడుతుందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, సాగునీటి ఇబ్బందులు తలెత్తి పంటలు దెబ్బతింటాయని, పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్తుల సమయంలో అధికారులు, సర్పంచ్‌లు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు పక్కా ప్రణాళికతో నివారణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు ఇప్పటి నుంచే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ఉపాధి పథకం ద్వారా నీటిసంరక్షణ పనులు, చెక్‌డ్యాంలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు వేగవంతం చేయాలని, ప్రజలు, పశువులకు ఎలాంటి కష్టాలు రాకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులతో నీటి సంరక్షణ చర్యలు చేపడతామని ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో ఎంపీడీఓలు శ్రీరాంరెడ్డి, శ్రీనివాసులు, ఏపీఓలు రఘుపతిరెడ్డి, అరుణ, ఈసీ రఘు పాల్గొన్నారు. పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం.. అమరచింత: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, పుర చైర్పర్సన్ జింక సువర్ణ రవి,కౌన్సిలర్ రాములు అన్నారు. శుక్రవారం పుర పరిధిలోని 6వ వార్డులో నిర్వహించిన ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి పరిసరాల్లో మురుగు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తడి, పొడి చెత్తను విధిగా వీధిలోకి వచ్చే చెత్త సేకరణ ట్రాక్టర్లలో వేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాలనీలోని మురుగు ప్రదేశాలను గుర్తించి దోమల నివారణ మందు పిచికారీ చేశారు. పుర కమిషనర్ నూరుల్ నదీం, పుర మేనేజర్ యూసూఫ్, మోప్మా. పుర సిబ్బంది పాల్గొన్నారు. -
ఆశలు.. ఆవిరి!
● ఉమ్మడి జిల్లాను వీడని వర్షాభావం ● చెరువులు వెలవెల.. భూగర్భ జలం తగ్గుముఖం ● వాడుముఖం పట్టిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 మండలాల్లో 11 మండలాల్లో లోటు వర్షపాతం, ఒక మండలంలో తీవ్ర లోటు నమోదుకాగా.. ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 487.7 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 345.5 మి.మీ. మాత్రమే నమోదైంది. బుధవారం జిల్లాలో 3.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలంలో అత్యంత దారుణ పరిస్థితి నెలకొంది. సాధారణంగా 433.8 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 171.1 మి.మీ. మాత్రమే కురిసింది. 61 శాతం లోటు నమోదై ‘లార్జ్ డెఫిషియెంట్’గా నమోదైంది. మహబూబ్‌నగర్ రూరల్‌లో 52 శాతం, అడ్డాకులలో 51 శాతం, మహబూబ్‌నగర్ అర్బనన్లో 49 శాతం, కౌకుంట్ల, ముసాపేటలో 43 శాతం, భూత్పూర్లో40 శాతం, కోయిల్‌కొండలో 37 శాతం లోటు నమోదైంది. గండీడ్, నవాబ్‌పేట, బాలానగర్, జడ్చర్ల, మహ్మదాబాద్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గండీడ్, నవాబ్‌పేటలో సాధారణానికి 2 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. నారాయణపేట: వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా ఉమ్మడి పాలమూరు జిల్లాను వర్షాభావ పరిస్థితులు వీడటం లేదు. వానాకాలం ముగియడానికి వారం రోజులే ఉండటంతో.. రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 23 వరకు నమోదైన వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో 35 శాతం, జోగుళాంబ గద్వాలలో 42 శాతం, మహబూబ్‌నగర్‌లో 29 శాతం, నాగర్‌కర్నూల్‌లో 32 శాతం లోటు నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. జిల్లాలోని 11 మండలాల్లో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 23 వరకు జిల్లా సగటు సాధారణ వర్షపాతం 469.5 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 306.6 మి.మీ. మాత్రమే నమోదైంది. మద్దూర్, కోస్గి మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం నమోదైన మండలం ఒక్కటీ లేకపోవడం గమనార్హం. మండలాల వారీగా పరిశీలిస్తే నర్వలో అత్యధికంగా 47 శాతం, ఊట్కూర్, మాగనూర్, మక్తల్‌లో 42 శాతం చొప్పున లోటు ఉంది. మరికల్లో 42, ధన్వాడలో 41, నారాయణపేటలో 38, దామరగిద్దలో 37, కృష్ణాలో 35, గుండుమాల్‌లో 29, కొత్తపల్లిలో 31 శాతం లోటు నమోదైంది. మద్దూర్ మండలంలో సాధారణ వర్షపాతం 421.2 మి.మీ.గాను 377.7 మి.మీ. నమోదై 10 శాతం లోటుతో సాధారణ స్థితిలో ఉంది. కోస్గిలో సాధారణ వర్షపాతం 519.2 మి.మీ.కుగాను 452.7 మి.మీ. నమోదై 13 శాతం లోటుతోనూ సాధారణ వర్షపాతం కేటగిరీలో ఉంది. వర్షాకాలం ముగింపు దశకు చేరుతున్నా జిల్లాలో 35 శాతం వర్షపాతం లోటు కొనసాగుతుండటంతో వర్షాధార పంటలపై ఆందోళన నెలకొంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో సాధారణ వర్షపాతం 444 మి.మీ.కాగా.. ఇప్పటివరకు 301.6 మి.మీ. మాత్రమే నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే పదరలో 60 శాతం, పెంట్లవెల్లిలో 56 శాతం, అమ్రాబాద్‌లో 53 శాతం, లింగాలలో 51 శాతం, పెద్దకొత్తపల్లిలో 51 శాతం లోటు నమోదైంది. మరోవైపు కొల్లాపూర్‌లో 27 శాతం, కల్వకుర్తిలో 36 శాతం, తాడూరులో 37 శాతం లోటు కొనసాగుతోంది. కోడేర్‌లో 14 శాతం, నాగర్‌కర్నూల్‌లో 16 శాతం, చారకొండలో 16 శాతం, వంగూర్‌లో 11 శాతం లోటు ఉండటంతో ఆయా మండలాలు సాధారణ వర్షపాతానికి దగ్గరగా ఉన్నాయి. ఉప్పునుంతలలో కేవలం 5 శాతం లోటు మాత్రమే నమోదైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో సాధారణ వర్షపాతం 421.6 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 244.1 మి.మీ. మాత్రమే నమోదైంది. వడ్డేపల్లిలో అత్యధికంగా 71 శాతం, ఉండవెల్లిలో 56 శాతం, మానవపాడులో 58 శాతం, గద్వాలలో 50 శాతం, మల్దకల్లో 50 శాతం, ఎరవ్రల్లిలో 59 శాతం, రాజోలిలో 46 శాతం, ఇటిక్యాలలో 41 శాతం, ధరూరులో 37 శాతం, అయిజలో 30 శాతం లోటు నమోదైంది. కేటీదొడ్డిలో 3 శాతం, గట్టులో 3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం పరిధిలో ఉన్న ఈ రెండు మండలాలు జిల్లా సగటుతో పోలిస్తే మెరుగైన పరిస్థితిలో ఉన్నాయి. ఈ ఫొటోలోని రైతు పేరు వెంకటేష్. మరికల్ మండలం జిన్నారం గ్రామం. ఈయన 12 ఎకరాల్లో పత్తి, 5 ఎకరాల వరి సాగు చేశారు. ఇప్పటికే రెండు పంటలకుగాను సుమారు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. పంట చేతికందే సమయంలో నీరందక పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. ఆశించిన మేర వర్షాలు కురిసి ఉంటే సుమారు రూ.10 లక్షల వరకు లాభం వచ్చేది. ప్రస్తుతం పెట్టుబడికి చేసిన అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలో సాధారణ వర్షపాతం 474.3 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 306.4 మి.మీ. మాత్రమే నమోదైంది. బుధవారం జిల్లావ్యాప్తంగా సగటున 6.3 మి.మీ. వర్షం కురిసింది. దీంతో ఒక్కరోజు వర్షపాతం సాధారణం కంటే 125 శాతం అధికంగా నమోదైంది. అయినప్పటికీ గతంలో ఉన్న లోటు పూడ్చలేకపోయింది. ఆత్మకూర్‌లో అత్యధికంగా 64 శాతం, అమరచింతలో 53 శాతం, పాన్గల్లో 52 శాతం, చిన్నంబావిలో 46 శాతం, వనపర్తిలో 36 శాతం, ఏదులలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రేవల్లి మండలంలో మాత్రమే ఇప్పటి వరకు 463.4 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణ వర్షపాతం 452.5 మి.మీ.తో పోలిస్తే 2 శాతం అధికంగా ఉంది. -
వరద ఒడిసి పట్టేదెలా..?
అచ్చంపేట: కృష్ణానదికి వచ్చే వరదను ఒడిసి పట్టుకోలేని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంలోనూ ఎగువన కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు 184 టీఎంసీల వరద వచ్చింది. అయితే ఈ జలాశయం ఆధారంగా కృష్ణానదికి వచ్చే వరద నీటిని పూర్తిస్థాయిలో వాడుకోలేని పరిస్థితి దాపురించింది. రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా 2,400 క్యూసెక్కులు మాత్రమే పంపింగ్ చేస్తున్నారు. కేఎల్ఐ ద్వారా 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. ఈ ప్రాజెక్టు కింద ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల సామర్థ్యం 4 టీఎంసీలు మాత్రమే. కాల్వల ద్వారా చెరువులు, కుంటలకు నీరు వదులుతున్నా చివరి ఆయకట్టుకు అందడం లేదు. దీంతో అదనపు రిజర్వాయర్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం హయాంలో పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. అయితే రెండేళ్ల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో కేఎల్ఐ కింద రిజర్వాయర్ల సామర్థ్యం పెపు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినా ఇంత వరకు అడుగు ముందకు పడలేదు. ప్రతిపాదనలు బుట్టదాఖలు.. కేఎల్ఐ కింద 47 అదనపు రిజర్వాయర్లను ప్రతిపాదించగా వీటిలో కేవలం 10 మాత్రమే సాధ్యమని గుర్తించారు. ఇందుకు సంబంధించి సర్వే పూర్తి చేసి గత ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పూర్తి ఆయకట్టకు సాగునీరు అందించాలంటే కనీసం 30 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు అవసరమని సాగునీటిశాఖ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుపై డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులు 2.14 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జొన్నలబొగుడ జలాశయాన్ని 6 టీఎంసీలకు, టీఎంసీ సామర్థ్యం గల గుడిపల్లిగట్టు జలాశయాన్ని 3–4 టీఎంసీలకు పెంచుకోవచ్చని అంచనా వేశారు. ప్రతిపాదించిన ప్రకారం నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి పరిధిలో ఇప్పటి వరకు ఒక్క రిజర్వాయర్ మంజూరు చేయని రాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చి 2న వనపర్తి ప్రాంతంలోని ఘనపూర్ గణప సముద్రం, బుద్దారం చెరువులను రిజర్వాయర్లుగా మార్చేందుకు రూ.97.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో కేఎల్ఐ కింద మొదట ప్రతిపాదించిన ప్రాంతాలకు రిజర్వాయర్లు మంజూరు చేయకుండా పాలకులు చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణానీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు కరువు భారీ జలాశయాలు లేక తప్పని పరిస్థితుల్లో దిగువకు.. ప్రతిపాదనల్లోనే జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు సామర్థ్యం పెంపు చివరి ఆయకట్టుకు తీరని సాగునీటి కష్టాలు చెరువులు, కుంటలు, కాల్వలపై ఆధారపడే పంటల సాగు -
అందరి సహకారంతోనే క్షయ నియంత్రణ
గోపాల్పేట: క్షయ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా. సాయినాథ్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని పొలికెపాడులో సర్పంచ్ బంగారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్షయ నిర్ధారణ పరీక్షల శిబిరానికి ఆయన హాజరై ప్రారంభించి మాట్లాడారు. రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు ఉంటే వెంటనే స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించారు. వ్యాధి సోకిందని భయపడాల్సిన అవసరం లేదని.. వైద్యులు సూచించిన విధంగా మందులు వాడితే తప్పకుండా నయమవుతుందని వివరించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ చాంద్‌పాషా, వైద్య సిబ్బంది, ఉపసర్పంచ్ జంపన్న, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. -
పేదోడికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
వనపర్తి: ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొనే ఆర్థిక స్తోమత లేని వారికి ప్రభుత్వం ఒకేసారి బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఆర్థిక స్తోమత లేక సుమారు 300 మంది లబ్ధిదారులు నిర్మించుకోలేదని.. వారు ఒప్పుకుంటే కాంట్రాక్టర్ ద్వారా నిర్మించి ఇచ్చే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. లబ్ధిదారు, కాంట్రాక్టర్, బ్యాంకర్ ముగ్గురి పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి నిర్మాణ పని జరిగే విధంగా ముందుగా డబ్బులు లబ్ధిదారుని ఖాతాలో జమచేసి అనంతరం కాంట్రాక్టర్‌కు బదిలీ చేస్తారని వివరించారు. 418 చదరపు అడుగుల్లోపు 9 పిల్లర్లు, రెండు అడుగుల బేస్మెంట్ వరకు వేసి సిమెంట్ ఇటుకలతో ఒక హాల్, బెడ్రూమ్, కిచెన్, స్నానపు గది, మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఒప్పుకొని స్వచ్ఛందంగా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే మూడు నెలల్లో ఇల్లు పూర్తిచేసి అప్పగిస్తారన్నారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పురోగతి వివరాలను వెల్లడించారు. కాంట్రాక్టర్ లబ్ధిదారులకు ఇల్లు ఎలా నిర్మించి ఇస్తారు, నాణ్యత ప్రమాణాలను వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించి చూపించారు. సమావేశంలో హౌజింగ్ పీడీ విటోబా, పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, పెబ్బేరు పుర చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సర్పంచులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు దేశం గర్వించేస్థాయికి ఎదగాలి
ఆత్మకూర్: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నామని.. బాగా చదివి దేశం గర్వించేస్థాయికి ఎదగాలని డీఐఈఓ నరేంద్రకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ప్రెషర్స్డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల జీవితంలో కళాశాల పర్యాయం కీలకమైందని.. చదువుపై ప్రత్యేక దృష్టిసారించాలని, క్రమశిక్షణతో మెలగాలని, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలు, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సైదులు, అధ్యాపకులు భాగ్యవర్ధన్‌రెడ్డి, టీజే విశ్వేశ్వర్, రాఘవేందర్రావు, సునీల్‌కుమార్, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ‘బుద్దారం’ నిర్వాసితులకు న్యాయం చేయాలి గోపాల్పేట: బుద్దారం నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయపరమైన పరిహారం ఇచ్చే వరకు అండగా ఉంటామని భారతీయ కిసాన్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం సంఘం నాయకులు రైతులతో కలిసి గోపాల్పేట తహసీల్దార్ కార్యాలయానికి పాదయాత్ర చేయడాన్ని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేడ్కర్, పూలే విగ్రహాలకు పూలమాల వేసి మాట్లాడారు. రైతుల సమస్యలను తెలిపేందుకు శుక్రవారం ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో బాధిత రైతులతో గోపాల్పేట వరకు పాదయాత్ర చేసి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించాలని నిర్ణయించి గురువారం ఎస్సై శశిధర్‌కు సమాచారం ఇచ్చామన్నారు. అయినా కార్యక్రమం ప్రారంభమయ్యే సమయంలో పోలీసులు వచ్చి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.45 లక్షలతో పాటు బావులు, బోర్లు, తోటలు ఇతరత్రా ఉంటే అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం బుద్దారం సర్పంచ్, ఉపసర్పంచ్‌తో కలిసి పెద్దఎత్తున కార్యక్రమం చేపడతామని.. అన్ని సంఘాలు కలిసివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బుద్దారం గ్రామ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వినాయకా.. వీడ్కోలిక
వనపర్తిటౌన్/కొత్తకోట రూరల్: జిల్లాకేంద్రంతో పాటు కొత్తకోటలో గణనాథుల నిమజ్జన వేడుకలు గురువారం రాత్రి కనులపండువగా సాగాయి. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేసిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. జిల్లాకేంద్రంలోని రాజమహల్ మహాగణపతి శోభాయాత్ర ఆధ్యంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చివరి రోజు శాస్త్రోక్తంగా కుంభం పోసి ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి ఇచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా భారీ క్రేనన్ను తెప్పించి విగ్రహాన్ని వాహనంపైకి చేర్చారు. సన్నాయి వాయిద్యాలు, డప్పుల మోత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రూ.5.50 లక్షలు పలికిన లడ్డూ.. రాజమహల్ మహాగణపతి లడ్డూ గతేడాది రూ.8 లక్షలు పలకగా.. ఈసారి రూ.5.50 లక్షలు పలికింది. చీర్ల సంతోష్ పాట పాడి దక్కించుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుదీరిన గణపతి లడ్డూను రాఘవేంద్ర అనే భక్తుడు రూ.2.18 లక్షలకు దక్కించుకున్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి పలు గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి వనపర్తి: గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి హెచ్‌బీ స్థాయి పరీక్షలను తప్పనిసరి నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి గర్భిణుల పరీక్షల విభాగం, ఇతర వార్డులను పరిశీలించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆరోగ్య రికార్డులను పరిశీలించి వైద్యసేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. హెచ్‌బీ స్థాయి ఆధారంగా రక్తహీనతను తగ్గించేలా అవసరమైన చికిత్స, మందులు అందించాలన్నారు. అనంతరం ఆస్పత్రిలోని స్కానింగ్ గదిని తనిఖీ చేసి అందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వివరాలను సక్రమంగా రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. ఆస్పత్రికి జ్వరంతో వచ్చే రోగులను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా చికిత్స అందించాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పరిసరాల్లో నీరు నిల్వకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పుర కమిషనర్‌ను ఆదేశించారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి డ్రైనేజీ, పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు దోమల వృద్ధికి అవకాశం లేకుండా చూడాలన్నారు. వైద్యాధికారులు, జిల్లా సంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో మండలాల వారీగా ఎదుగుదల లోపం ఉన్న చిన్నారులను గుర్తించి ఎన్ఆర్సీకి తరలించి సరైన చికిత్స అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. చంద్రమోహన్, డా. సాయినాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
పాలమూరు ఆగం
బీఆర్ఎస్ పాలనలో ● రైతులను రెచ్చగొట్టేందుకే జూరాలకు.. ● మంత్రులు జాపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి 2015లో కేంద్ర ప్రభుత్వం కృష్ణానది జలాల వాటాపై ఏర్పాటు చేసిన సమావేశంలో 299 టీఎంసీల నీటివాటా చాలని బీఆర్ఎస్ నాయకులు సంతకాలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంఎస్ల వాటాను అప్పగించిన నాడే పాలమూరు రైతులకు అన్యాయం చేశారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పాలమూరు రైతులకు భవిష్యత్‌లో సాగునీటి కష్టాలు రావద్దని 15 టీఎంసీల సామర్థ్యంతో జూరాలకు సమాంతరంగా మరో ప్రాజెక్టు నిర్మాణం చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పాటు రూ.165 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. మరో 20 ఆన్లైన్ రిజర్వాయర్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అనావృష్టి పరిస్థితుల్లో ఎక్కడా సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా నీటి నిల్వకు సీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వనపర్తి: తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు గుర్తుకురావడం హాస్యాస్పదమని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎంపీ మల్లు రవి, వనపర్తి, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డితో కలిసి ఎన్‌నినో ప్రభావం.. సాగు, తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, వరద జలాల అంశంపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు పాలమూరును ఎండబెట్టి ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రాజెక్టు వద్దకు వెళ్లి అమాయకులైన రైతుల ఎదుట వీరంగం చేయడం సరికాదన్నారు. నవంబర్ వరకు సాగునీరు అందించేందుకు ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందని తెలిపారు. ప్రస్తుతం వస్తున్న వరద కొనసాగినంత వరకు రోజు కాల్వలకు నీరందించి.. వరద ఆగిన తర్వాత వారాబందీ లెక్కన అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిల్వ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పదేళ్లు రైతులను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు రాజకీయ స్వార్థంతో కపట ప్రేమ చూపుతున్నారంటూ విమర్శించారు. జూరాలలో నిల్వ ఉన్న కొద్దిపాటి నీటితో పాలమూరు జిల్లాలోని 4.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యం కాదని తెలిసినా.. పదేళ్ల పాలనలో నీటి నిల్వ కోసం ప్రాజెక్టుల రూపకల్పన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు.. ఆ తర్వాత శంకుస్థాపన చేసిన కాళేశ్వరం ఎలా పూర్తి చేశారనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు. వారాబందీ విధానంలో లష్కర్లు, ఇతర సిబ్బందిని వినియోగించి డిస్ట్రిబ్యూటరీ వారీగా ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో సమానంగా నీరు వదలాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు వారాబందీపై రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో జమ్ము, పూడిక తొలగింపు, ఇతర నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలన్నారు. ఆయకట్టు రైతులు సాగుచేసిన వానాకాలం పంటలను కాపాడటానికి ముందుగానే కర్ణాటక ముఖ్యమంత్రికి నీటి విడుదలపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని.. అసెంబ్లీ కారణంగా రెండ్రోజులు ఆలస్యమైందని, అంతలోపే ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయని తెలిపారు. నీటి విడుదలకు సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు జిల్లా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వానకాలం పంటలు కాపాడటానికి నవంబర్ 27 వరకు వా రాబందీ విధానంలో నీటిని విడుదల చేస్తామని.. రైతులు అధైర్యపడొద్దని మంత్రులు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొడుతున్న మాయగాళ్ల మాటలను పాలమూరు రైతాంగం నమ్మవద్దని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. జిల్లా వరప్రదాయిని అంటున్న పాలమూరు ప్రాజెక్టులోని ప్రధాన ఐదు రిజర్వాయర్ల పనులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం, గుత్తేదారులకు బిల్లులు చెల్లించేందుకు కమీషన్ల కోసం ఆసక్తి చూపించిన కారణంగానే ఎక్కడి పనులు అక్కడే పడకేశాయని తెలిపారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని పంటల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాసిన విషయం తెలుసుకొనే బీఆర్ఎస్, బీజేపీ నేతలు జూరాల ప్రాజెక్టుకు వద్దకు వెళ్లి రైతుల ముందు రాజకీయ రాద్దాంతం చేశారని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. వారి అసత్యపు ఆరోపణలు రైతులు నమ్మే పరిస్థితి లేదని.. నాటి నుంచి నేటి వరకు రైతుల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్సేనని తెలిపారు. -
గ్రామాభివృద్ధితోనే దేశ పురోగతి
వనపర్తిటౌన్: యువతలో సేవా దృక్పథాన్ని పెంపొందించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే జాతీయ సేవా పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో–ఎడ్)లో ఎన్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు యువత తమవంతు కృషి చేయాలని కోరారు. ప్రతి విద్యార్థి తన గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలపై అవగాహన పెంచుకొని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలన్నారు. దేశ నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషిస్తుందని, కళాశాలలో స్వచ్ఛత కార్యక్రమాలు, జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యతతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఉమా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధాంసింగ్, డా. రాఘవేంద్ర, డా. యాదగిరిగౌడ్, డా. రామకృష్ణమూర్తి, మల్లయ్య, అధ్యాపకులు మల్లికార్జున్, నాగలక్ష్మి, సునీతబాయి, బీచుపల్లి, స్వప్న, కిరణ్‌సింగ్, మహేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యుత్ కోతలు.. సబ్‌స్టేషన్ ముట్టడి పాన్‌గల్: విద్యుత్ కోతలను నిరసిస్తూ మండలంలోని నిజామాబాద్ (మంగళ్లపల్లి) గ్రామస్తులు, రైతులు గురువారం మండలంలోని కేతేపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఏఈ చందన్‌కుమార్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులు మాట్లాడుతూ.. తరుచూ విద్యుత్ కోతలతో పంటలకు, గృహ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. బుధవారం రాత్రి నుంచి సరఫరా నిలిచిపోవడంతో చీకటిలో ఇబ్బందులు పడ్డామని, తాగునీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. అధిక లోడ్‌తో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం గ్రామానికి ప్రత్యేక బ్రేకర్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రత్యేక స్తంభాలు, లైన్ ఏర్పాటు చివరి దశలో ఉందన్నారు. అక్టోబర్ మొదటి వారం వరకు పూర్తిచేసి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని చెప్పడంతో వారు శాంతించారు. రెడ్‌క్రాస్ కార్యవర్గం ఎన్నిక లాంచనమే వనపర్తి: రెడ్‌క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ ఎన్నికకు గురువారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరించారు. ముందు ఊహించిన విధంగానే కేవలం 15 నామినేషన్లు దాఖలవడంతో ఏకగ్రీవం కానున్నట్లు స్పష్టమైంది. కమిటీలో సభ్యుల సంఖ్య 15కు పరిమితం.. అందుకు తగినట్లుగానే నామినేషన్లు దాఖలు కావడంతో లాంచనప్రాయమేనన్న వాదనలు వినిపించాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై మల్లాగుల్లాలు కొనసాగుతున్నాయి. సేవాభావంతో పని చేసేవారికి చైర్మన్ పదవి దక్కాలనే ఉద్దేశ్యంతో సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ సీట్లు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 9 ఎస్టీ గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 26 లోగా సంబంధిత గురుకులాల్లో దరఖాస్తులు చేసుకోవాలని, కోఆర్డినేటర్ కల్యాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
దసరాకు ‘చేయూత’
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా చేయూత పథకం కింద కొన్ని వర్గాలకు కొత్త పింఛన్లు మంజూరు చేయబోతుంది. ఈ నెల 16 వరకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు మాత్రం ఇవ్వడం లేదు. వారిని నిరాశపర్చచకుండా గ్రామ కార్యదర్శులు కేవలం దరఖాస్తులు మాత్రం తీసుకొన్నారు. కానీ, ఎక్కడా ఆన్లైన్లో నమోదు చేయలేదు. కేవలం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీతా కార్మికులతోపాటు ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు మాత్రమే కొత్త పింఛన్లు ఇవ్వనుంది. వీరి దరఖాస్తులను మాత్రమే ఆన్లైన్ చేయడంతో వాటిని ప్రభుత్వం నిబంధనల ప్రకారం విచారణ చేయడానికి మండల స్థాయి అధికారులకు బాధ్యత అప్పగించారు. వారు శుక్రవారం వరకు విచారణ పూర్తి చేసి సంబంధిత ఎంపీడీఓలకు అప్పగించనున్నారు. వాటిని ఎంపీడీఓ ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత జిల్లా అధికారులు పరిశీలించి ఆమోదించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 65,566 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఫైలేరియా, డయాలసిస్ బాధితులను ఇందులో కలపలేదు. అలాగే వృద్ధుల దరఖాస్తులు స్వీకరించి.. ఆన్లైన్లో నమోదు చేసినా ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. విచారణలో మండల అధికారులు చేయూత లబ్ధిదారుల దరఖాస్తులను విచారణ చేయడానికి మండల స్థాయిలో ఎంఈఓ, పీఆర్ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఎంపీఓలకు బాధ్యత అప్పగించారు. దరఖాస్తులు, గ్రామాల సంఖ్యను పరిగణలోకి తీసుకొని విచారణ అధికారులను ఎంపిక చేశారు. వారికి ముందుగానే పింఛను అర్హతకు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలో వివరించారు. అంతేకాకుండా నింబంధనలకు సంబంధించిన వివరాలు అందజేశారు. ఒక్కో దరఖాస్తును ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమగ్రంగా విచారణ చేసి అర్హులను ఎంపిక చేయాలని సూచించినట్లు నాగర్‌కర్నూల్ డీఆర్డీఓ ఓబులేష్ తెలిపారు. నిబంధనలు కఠినతరం.. చేయూత పథకం కింద పింఛను మంజూరు కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు పెట్టింది. గ్రామీణ ప్రాంత లబ్ధిదారుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, 3 ఎకరాలకు మించకుండా తరి భూమి, 7.5 ఎకరాల వరకు నీటి పారుదల లేని భూమి ఉన్నవారు అర్హులు. ఇక లైట్ లేదా హెవీ మోటారు వాహనాలు కలిగిన వారు సైతం పింఛన్‌కు అనర్హులు. పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్నవారి కుటుంబ సభ్యులు కూడా పింఛన్‌కు అనర్హులుగా నిర్ణయించారు. చేయూత పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను శుక్రవారంలోగా విచారణ పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులకు సూచించాం. వీరంతా ఆయా గ్రామాల్లో పర్యటించి రికార్డులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివరాలు క్రోడీకరించి అర్హులను ఎంపిక చేస్తారు. తర్వాత ఎంపీడీఓ లాగిన్‌లో నమోదు చేయగా జిల్లా స్థాయిలో పరిశీలించి ఆమోదిస్తాం. అయితే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. – ఓబులేష్, డీఆర్డీఓ, నాగర్‌కర్నూల్ జిల్లాలో చాలామంది వృద్ధులు పింఛన్ కోసం ఎదురుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం వారికి మొండిచేయి చూపింది. వీరిలో చాలామంది ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా వారికి రావన్న సంగతి చాలా మందికి తెలియదు. కానీ, తమకు కూడా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుందనే భ్రమలోనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న మండలస్థాయి అధికారులు నేటితో ముగియనున్న విచారణ గడువు ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక పండుగ కానుకగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు కసరత్తు -
అక్టోబర్ 31లోపు బకాయిలు చెల్లించాలి
వనపర్తి: రైస్‌మిల్లర్లు తమకు సంబంధించిన బకాయిలను అక్టోబర్ 31లోగా పూర్తిగా చెల్లించాల్సిందేనని.. విఫలమైతే రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈటీఎఫ్ కె.రాంకుమార్, డీఎస్పీ వెంకటేష్, అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్, పౌరసరఫరాల మేనేజర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో 2022–23 రబీ సీజనన్కు సంబంధించి వేలం ద్వారా కేటాయించిన వరి (అ ఠఛ్టిజీౌ ుఽ్ఛఛీ ్క్చఛీఛీ డ) బకాయిలు, డిఫాల్ట్ పరిమాణాల క్లియరెనన్స్పై సంబంధిత డిఫాల్డ్ రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. 2022–23 రబీ సీజన్‌కు సంబంధించి వేలం ద్వారా కేటాయించబడిన వరి ధాన్యం బకాయిలు రూ.474 కోట్లు ఉండగా.. ఇప్పటి వరకు రూ.62.50 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, రూ.412 కోట్లు బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. వేలం ద్వారా కేటాయించబడిన వరికి సంబంధించిన బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. అదేవిధంగా, డిఫాల్ట్ పరిమాణాలకు సంబంధించిన బకాయిలను కూడా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తప్పనిసరిగా క్లియర్ చేయాలని కోరారు. ప్రభుత్వ బకాయిలు వసూలు చేసే నిమిత్తం అమలులో ఉన్న నిబంధనలు, నిర్దేశిత విధానాల ప్రకారం సంబంధిత డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే ఆస్తులను వేలం వేసి రికవరీ చేస్తామని తెలిపారు. డిఫాల్ట్ రైస్‌మిల్లర్ల నుంచి అందే అభ్యర్థనలు, విన్నపాలను బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే కమిషనర్, సివిల్ సప్లయిస్ పరిశీలిస్తారని వివరించారు. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి ఇచ్చిన గడువులోగా బకాయిలు చెల్లించి రెవెన్యూ రికవరీ చర్యలకు తావులేకుండా చూడాలని అధికారులు సూచించారు. -
వయోవృద్ధుల హక్కులపై విస్తృత అవగాహన
వనపర్తి: వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, చట్టపరమైన రక్షణ తదితర అంశాలపై ప్రజలకు విస్లృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 1న నిర్వహించనున్న వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా వయోవృద్ధుల సమాచార సంచికతో పాటు తల్లిదండ్రులు, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం–2007 ( Maintenance and Welfare of Parents and se nior CitizensAct, 2007)కు సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు. అదేవిధంగా వయోవృద్ధుల హక్కులు, సంక్షేమం, వారికి లభించే ప్రభుత్వ సేవలు, చట్టపరమైన రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా పోలీస్స్టేషన్లలో ఏర్పాటు చేయనున్న డిస్ప్లే బోర్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరియు చట్టపరమైన హక్కులు వినియోగించుకునేలా వయోవృద్ధులకు అవసరమైన సమాచారం అందించాలని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్, డీఆర్డీఓ రామమహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) సుధారాణి, సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు, సీడీపీఓలు, జిల్లా సంక్షేమశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక సాగుతో అధిక దిగుబడులు
వనపర్తి: రోజురోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్తకొత్త ఆలోచనలు, సాంకేతిక మేళవింపుతో రైతులు పంటలు సాగు చేయాలని.. అప్పుడే లాభాలు ఆర్జిస్తారని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రం సమీపంలోని ఓ గార్డెన్స్‌లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్మేళా–2026కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేళాలో వివిధ కంపెనీలు తాము రూపొందించిన మేలురకం విత్తనాలు, సోలార్ ఫెన్సింగ్, రసాయన మందులు, కోళ్లు, పొట్టేళ్లు, గిరిజాతి ఆవులు, సమీకృత ఉద్యాన, పట్టు పరిశ్రమ, ఆయిల్‌పాం, కిసాన్ క్రెడిట్ కార్డు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు ప్రదర్శనకు ఉంచి రైతులకు అవగాహన కల్పించగా కలెక్టర్ సైతం అన్ని స్టాళ్లను సందర్శించారు. అనంతం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం కిసాన్‌మేళాను నిర్వహించి వేల సంఖ్యలో రైతులు సందర్శించేలా చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. కిసాన్మేళా ఓ చక్కని కార్యక్రమం.. దేశంలోని పరిశ్రమలు ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా కనుగొన్న కొత్త వంగడాలు, రసాయన ఎరువులు, యాంత్రిక పరికరాలు ఒకేచోట ఏర్పాటుచేసి రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తారని, వీటి ద్వారా రైతులు కొత్త ఆలోచనలతో లాభసాటి వ్యవసాయం చేసేందుకు దోహదపడతాయన్నారు. ప్రతి మంగళవారం రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలు సాగు విధానం.. చీడపురుగుల నివారణ, లాభసాటి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారని, తప్పనిసరిగా హాజరై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం చాలా తక్కువగా నమోదైందని.. గతేడాది ఈ సమయానికి 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, ఈసారి కేవలం 42 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని వివరించారు. రైతులు వాతావరణానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది జిల్లాలో మినుము సాగు 30 వేల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. వచ్చే ఏడాది జిల్లాలో యూనిక్పామ్ ఆయిల్ కంపెనీ ప్రారంభమవుతుందని.. అప్పుడు జిల్లాలోనే ఆయిల్‌పాం క్రషింగ్ చేసి ఆయిల్ తీయడం జరుగుతుందన్నారు. రాబోయే తరానికి సారవంతమైన భూమి అందించడమే లక్ష్యంగా రైతులు సేంద్రియ సాగును ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, కేవీకే శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి, సాయిచరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు అడ్డుకట్టేది?
వనపర్తిటౌన్: భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వనపర్తి పురపాలికలో అధికార పక్షానికి చెందిన కొందరు కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పాలకవర్గంలో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి సెల్లార్ల నిర్మాణాల అంశం వివిధ సందర్భాల్లో తెరపైకి వస్తూనే ఉంది. సమావేశాల్లో కౌన్సిలర్లు పలుమార్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు, పాలకవర్గం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే హెచ్చరించినా..! సెల్లార్ల నిర్మాణాలపై మే నెల 2న జరిగిన పుర సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. సెల్లార్లకు అనుమతులు లేవనే విషయం తెలిసినా ఎందుకు మౌనం వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించడంతో పాటు పుర అధికారుల పేర్లు చెప్పి రూ.9 లక్షలకుపైగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోందని ప్రస్తావిస్తూ.. ఇలాంటి పరిస్థితులకు తావివ్వకుండా తమ పద్ధతి మార్చుకోవాలని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొత్తకోట రోడ్లోనే ఎక్కువగా..? జిల్లాకేంద్రంలోని కొత్తకోట రోడ్ పరిసరాల్లో ఎక్కువగా అక్రమ సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రాజనగరం, అయ్యప్ప రోడ్, భగీరథనగర్, ఫుడ్ కోర్టు అవతలి ప్రాంతాల్లోనూ ఇలాంటి నిర్మాణాలు ఉన్నట్లు సమాచారం. ఓ వైపు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నా.. మరోవైపు నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత బస్టాండ్ ప్రాంతంలో సెల్లార్ నిర్మాణానికి గుంత తీయడంతో పక్కనే ఉన్న భవన యజమాని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు పుర అధికారులు అక్కడ చర్యలు చేపట్టినట్లు సమాచారం. వనపర్తిలోని బసవన్నగడ్డలో కొనసాగుతున్న సెల్లార్ నిర్మాణం కొత్తకోట రోడ్లోనే అధికం ఎమ్మెల్యే, అధికార పార్టీ కౌన్సిలర్లు హెచ్చరించినా ఆగని వైనం నోటీసులకే పరిమితమైన అధికారులు సెల్లార్ల నిర్మాణానికి ఏ భవన యజమాని అనుమతి తీసుకోలేదు. అక్రమ నిర్మాణాల విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా భవన నిర్మాణ యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదించాం. అనుమతులు లేని సెల్లార్లతో ఉన్న భవనాల క్రయవిక్రయాలు జరగకుండా చూడాలని సబ్‌రిజిస్ట్రార్‌కు సూచించాం. విద్యుత్, కొళాయి కనెక్షన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు విన్నవించాం. నిబంధనల మేరకు మా పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాం. – శివకుమార్, పట్టణ ప్రణాళిక అధికారి, వనపర్తి పుర పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఇప్పటి వరకు అక్రమంగా సెల్లార్ల నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆయా భవన నిర్మాణాలకు అనుమతి ఉన్నప్పటికీ సెల్లార్ల నిర్మాణానికి మాత్రం అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వీరికి షోకాజ్ నోటీసులు, అనంతరం స్పీకింగ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీకి సైతం నివేదించినట్లు అధికారులు చెబుతున్నారు. అక్రమంగా సెల్లార్లు నిర్మించిన భవనాల క్రయవిక్రయాలు జరగకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్యుత్, కొళాయి కనెక్షన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు సూచించినట్లు సమాచారం. -
నేడు రెడ్‌క్రాస్ నామినేషన్ల స్వీకరణ
వనపర్తి: రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గురువారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. ఎన్నికల అధికారిగా డీపీఓ రఘునాథరెడ్డి వ్యవహరిస్తున్నారు. తుది ఓటరు జాబితాలో పేరున్న వారు మాత్రమే సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు పోటీలో ఉండాల్సి ఉంటుంది. లేఫ్ అసోసియేట్ సభ్యులు మినహా.. మిగతా మూడు కేటగిరీల్లోని శాశ్వత సభ్యులు, ప్యాట్రన్ సభ్యులు, వైస్ ప్యాట్రన్ సభ్యులు మాత్రమే పోటీ చేసేందుకు అర్హత ఉంటుంది. రూ.10 వేల నగదు డిపాజిట్‌తో పాటు నామినేషన్ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఇద్దరు మద్దతుదారులు ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అమరచింత: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. ప్రతిపక్షాలు రైతుల పేరిట రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర గీత కార్మిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజ్‌గౌడ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు బుధవారం జూరాల ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల సాగునీటి సమస్యలను మంత్రి వాకిటి శ్రీహరి సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కర్ణాటక సీఎంతో మాట్లాడి ఎగువ నుంచి నీటిని విడుదల చేయించినట్లు చెప్పారు. ఆయకట్టు రైతుల పంటలు కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. బీఆర్ఎస్, బీజేపీల లేనిపోని ఆరోపణలు రైతులు నమ్మొద్దని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జూరాల ఆయకట్టును ఎండనివ్వమని, సాగునీరు అందించి కాపాడుతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రవికాంత్, జింక రవి, చుక్కా ఆశిరెడ్డి, వెంకట్‌రెడ్డి, నందిమళ్ల ఉపసర్పంచ్ శ్రీధర్, గణేష్‌గౌడ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అన్యాయం చేస్తే సహించబోం ఆత్మకూర్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకుందని.. సాగునీరు అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం పట్టణంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్ నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి ప్రాజెక్టులు, నీటి సామర్థ్యాలపై కనీస అవగాహన లేదని.. పండిన పంటలకు ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనని సాగునీరు ఇవ్వకూడదని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరా లేక బోర్లకింద పంటలు ఎండిపోతున్నాయని.. ప్రాజెక్టుల్లో నీరున్నా ఇవ్వకుండా మొండికేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలకు రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల జలాశయంలో సమృద్ధిగా నీరున్నప్పటికీ పంటలకు వదలకుండా కర్ణాటకకు వెళ్లి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రధాన ఎడమకాల్వకు నీటి విడుదల రైతుల విజయమని.. నిరంతరం అండగా ఉంటామని, తేడా వస్తే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో విండో అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు బంగారు శ్రీను, విరేశ లింగం, మాజీ చైర్పర్సన్ గాయత్రి, మాజీ వైస్ ఎంపీపీ కోటేష్, నాయకులు రామకృష్ణ, చెన్నయ్య, మాసన్న, రియాజ్ అలీ, కొత్తబోయ శేఖర్, అనీల్, మాసన్న, పుట్నాల రమేష్, రాజ్‌కిరణ్, జానకిరాం, గోపన్‌పేట అంజి, తోట రవి తదితరులు పాల్గొన్నారు ్డ -
ముగిసిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
● బాలుర విభాగంలో మదనాపురం.. బాలికల విభాగంలో ఖిల్లాఘనపురం జట్లు విజయం కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మంగంపల్లిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లాస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. జిల్లాలోని 15 మండలాలకు చెందిన బాలబాలికలు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. తుది పోరులో బాలుర విభాగంలో మదనాపురం ప్రథమ, కొత్తకోట ద్వితీయ స్థానంలో నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో ఖిల్లాఘనపురం విజేతగా నిలవగా, పెబ్బేరు జట్టు రన్నరప్‌గా నిలిచింది. క్రీడాపోటీల నిర్వహణకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి (డీవైఎస్ఓ) సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో రాణించేలా ప్రోత్సహించడంలో ఎమ్మెల్యే సహకారం ఎంతో ఉపయోగపడిందన్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వ భావన పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ ఇన్చార్జి కుమార్, సర్పంచ్ రమేష్ నాయక్, గ్రామ పెద్ద వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొమ్ము వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్, వనపర్తి మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎంపీడీఓ పరిణత, రాఘవేందర్, పీడీలు, క్రీడా ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
భూ రీ–సర్వే వేగవంతం చేయాలి
వనపర్తి: జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ–సర్వే ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ సర్వేయర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లాలోని సర్వేయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న రీ–సర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ దరఖాస్తులు, భూ సరిహద్దు వివాదాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో సర్వే నిర్వహించాలన్నారు. సర్వే ప్రక్రియలో రైతులు, భూ యజమానుల నుంచి వచ్చే వినతులు, అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సరిహద్దు వివాదాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలను పరిశీలించిన అనంతరం స్పష్టమైన నివేదికలను అందించాలన్నారు. వివిధ సర్వే విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో రీ–సర్వే పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సర్వే ఏడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పక్కాగా పంటల లెక్క
కొత్తకోట రూరల్: జిల్లాలో ఖరీఫ్ సాగు లెక్క తేల్చడానికి వ్యవసాయశాఖ అధికారులు డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేపట్టారు. జిల్లా వ్యవసాయ అధికారితో పాటు ఏడీఏల పర్యవేక్షణలో జిల్లాలోని 265 గ్రామపంచాయతీలు, వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత పురపాలికల్లో 72 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు, 266 మంది వలంటీర్లు నెలాఖరు వరకు సర్వే పూర్తి చేయనున్నారు. వారు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు.. సర్వేనంబర్ వారీగా సాగు చేసిన పంట వివరాలు, ఫొటోలను క్రాప్ బుకింగ్ మొబైల్ యాప్‌లో జియో ట్యాగింగ్ ద్వారా నమోదు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు తలెత్తుతున్నట్లు వలంటీర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతున్నారు. సర్వే ద్వారా జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే కచ్చితమైన వివరాలు రావడంతో పాటు పంటల దిగుబడిని అంచనా వేసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. క్రాప్ బుకింగ్ సర్వే ద్వారా కొన్ని పంటలకు మద్దతు ధర లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. జిల్లాలో కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే పల్లెబాట పట్టిన వ్యవసాయ అధికారులు నెలాఖరు వరకు గడువు ప్రతి రైతు సమాచారం ఆన్లైన్లో నమోదు సర్వేలో 72 మంది వ్యవసాయ అధికారులు.. 266 మంది వలంటీర్లు అధికారులు అవగాహన కల్పించినా.. ఎల్‌నినో ఖరీఫ్ సాగుపై ఎంతమేర ప్రభావం చూపిందనే లెక్క సర్వేతో తేలనుంది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ భారీ వర్షాలు లేక చెరువులు వెలవెలబోతుండగా, భూగర్భ జలాలు అడుగంటాయి. సాగు ప్రారంభంలోనే ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావం ఉంటుందని.. ఆరుతడి పంటల సాగువైపు రైతులను మళ్లించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయి నా రైతులు మాత్రం ఎక్కువ శాతం వరి, తక్కువ భాగంలో పత్తి సాగును వీడలేదు. -
ఉమ్మడి జిల్లాలో ఎస్జీఎఫ్ జోష్
● రాష్ట్రస్థాయి టోర్నీలకు ఐదు జిల్లాలకు కేటాయింపులు ● అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు ● సెలక్షన్స్ అనంతరం టోర్నీల నిర్వహణ మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా సందడి మొదలుకానుంది. ఇప్పటికే మండలస్థాయి పోటీలు ముగింపు దశకు చేరుకోగా.. త్వరలో జిల్లాస్థాయి, ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలకు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు కేటాయించారు. గత నెలలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శులు పంపిన ప్రతిపాదనల ఆధారంగా మంగళవారం టోర్నీలను కేటాయించారు. ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ అనంతరం ఆయా పోటీలు నిర్వహించనున్నారు. ● మహబూబ్‌నగర్ జిల్లాలో అండర్–19 బాల, బాలికల వాలీబాల్, అండర్–17 బాల, బాలికల హ్యాండ్‌బాల్, అండర్–19 బాలుర క్రికెట్, అండర్–19 బాల, బాలికల నెట్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ● వనపర్తి జిల్లాలో అండర్–19 బాలికల హాకీ, అండర్–19 బాల, బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీలు కేటాయించారు. ● నారాయణపేట జిల్లాలో అండర్–14 బాల, బాలికల రెజ్లింగ్ (ఫ్రీస్టైల్), అండర్–14, 17 బాల, బాలికల బీచ్‌వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. ● నాగర్‌కర్నూల్ జిల్లాలో అండర్–17 బాల, బాలికల చెస్, అండర్–17 బాల, బాలికల కబడ్డీతో పాటు అండర్–14, 17, 19 బాల, బాలికల మల్కంబ్ పోటీలు జరగనున్నాయి. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో అండర్–14 బాల, బాలికల చెస్, అండర్–17 బాలుర క్రికెట్, అండర్–17 బాల, బాలికల సెపక్తక్రా, అండర్–17 బాలుర హాకీ, అండర్–14 బాల, బాలికల తైక్వాండో పోటీలు కేటాయించారు. విజయవంతంగా నిర్వహిస్తాం.... జిల్లాకు ఈ ఏడాది నాలుగు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ టోర్నీలు కేటాయించడం సంతోషంగా ఉంది. పీడీలు, పీఈటీలు, క్రీడాసంఘాల సహకారంతో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలను విజయవంతంగా నిర్వహిస్తాం. టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల సౌకర్యాలు సమకూరుస్తాం. – వేణుగోపాల్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, మహబూబ్‌నగర్ -
రైతులకు నీరందించకపోతే పోరాటాలు ఉధృతం
భూత్పూర్: జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా రైతులకు నీరందించకపోతే రైతుల పక్షాన పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జూరాల ప్రాజెక్టు వైపు వెళ్తున్న ఆయనను భూత్పూర్ పోలీసులు అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటలు సాగు చేయరాదని ముందుగానే వ్యవసాయశాఖ గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే రైతులు పంటలు సాగు చేసి ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చు చేసిన తర్వాత ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సాగర్, ఆర్.వెంకట్రాములు, విజయ్‌కుమార్, కిల్లె గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి ఉన్నారు. -
నిల్వనీటిలోనే దోమల వృద్ధి
వనపర్తి రూరల్: నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని.. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్ సూచించారు. పెబ్బేరు మండలం సూగూరులో ఆరు నెలల చిన్నారికి డెంగీ నిర్ధారణ కావడంతో మంగళవారం ఆయన చిన్నారి ఇంటిని సందర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉందని కుటుంబ సభ్యులు ఆయనకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రోజు యాంటి లార్వా సర్వే నిర్వహించి దోమల వృద్ధిని అరికట్టాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. డెంగీ నివారణకు ప్రజలు, వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. వంశీకృష్ణ, ఆరోగ్య విస్తరణ అధికారి దామోదర్, ఆరోగ్య విస్తరణ అధికారి నర్సింహారావు, హెల్త్ అసిటెంట్లు రాజశేఖర్, తిరుపతయ్య, ఏఎన్ఎం అనురాధ, ఆశా కార్యకర్తలు ఉన్నారు. -
గ్రామసభల్లోనే ఉపాధి పనుల గుర్తింపు
పాన్‌గల్: వీబీజీ రాంజీ పథకంలో చేపట్టే పనుల ప్రణాళికలను ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి పద్మజ అన్నారు. మంగళవారం మండలంలోని బుసిరెడ్డిపల్లిలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ (వీజీపీపీ)పై నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ రిసోర్స్ మ్యాప్, గ్రామ వనరుల పటం వేసి గ్రామంలో ఉండే వనరులు, వీబీజీ రాంజీ పథకంలో చేపట్టాల్సిన పనులను గ్రామస్తుల భాగస్వామ్యంతో గుర్తించారు. గ్రామానికి అవసరమైన పనులు, వ్యక్తిగతంగా, కమ్యూనిటీపరంగా అవసరం ఉన్న పనులను గ్రామస్తులకు వివరించారు. ఆయా అంశాలపై పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలకు శిక్షణనిచ్చి అవగాహన కల్పించారు. అక్టోబర్ 2 నుంచి ప్రతి గ్రామపంచాయతీలో గ్రామానికి సంబంధించిన ప్రణాళికలను గ్రామసభలు నిర్వహించి ఆమోదించాలన్నారు. గ్రామంలో ఉండే కూలీల బడ్జెట్‌కు అనుగుణంగా పనులు గుర్తించాలని సూచించారు. సమావేశంలో సునంద, ఎంపీడీఓ గోవిందరావు, ఏపీఓ కుర్మయ్య, సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి , పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్ర గ్రామాభివృద్ధి.. వనపర్తి రూరల్: గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, టీజీఐఆర్డీ జాయింట్ డైరెక్టర్ పద్మజ సూచించారు. మంగళవారం పెబ్బేరు మండలం బునాదిపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వీబీజీ రాంజీ గ్రామపంచాయతీ ప్రణాళిక తయారీపై పీఆర్ఏ విధానంలో నిర్వహించిన శిక్షణలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామ అవసరాలు, సమస్యలు, వనరులు, అభివృద్ధి అవకాశాలను ప్రజలతో కలిసి గుర్తించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఆర్డీఓ రామేశ్వర్‌రెడ్డి, డీపీఓ రఘునాథ్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటేష్, ఎంపీఓ రోజ, సర్పంచ్ విజయ్‌గౌడ్, ఏపీఓ నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల స్వయం ఉపాధికి ఉచిత శిక్షణ
వనపర్తి: మహిళల స్వయం ఉపాధికి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సేటీ) ఆధ్వర్యంలో జపా మైడ్స్ (మదర్ అండ్ బేబీకేర్ టేకర్) కోర్సును ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, నగర ప్రాంతాల్లో ఉపాధి పొందేందుకు ఆసక్తి, సంసిద్ధత కలిగిన మహిళలకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 20 రోజుల పాటు ఉచితంగా తల్లి, నవజాత శిశువు సంరక్షణకు సంబంధించిన అంశాలు, శిశువుల రోజువారీ అవసరాల నిర్వహణ, పరిశుభ్రత, పోషకాహారం, భద్రత, తల్లి సంరక్షణలో పాటించాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. అదనంగా ఆస్పత్రుల్లో ప్రాక్టికల్ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల మహిళలు మర్రికుంటలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు98859 40945, 85220 88978, 79816 84174 సంప్రదించాలన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి వనపర్తిటౌన్: గణేశ్ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ ఎం.మాధవి, వైస్‌చైర్మన్ మధుసూదన్‌గౌడ్ కోరారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. మూడు రోజుల్లో 1,050కు పైగా గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు తెలిపారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో రెండు క్రేన్లు ఏర్పాటు చేశామని, అవసరమైన చోట పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. నల్లచెరువులో మట్టి గణపతుల నిమజ్జనం కోసం కృత్రిమ కొలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా, ఈ నెల 25న మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు చైర్పర్సన్, వైస్‌చైర్మన్ తెలిపారు. సమావేశంలో ఎంఈలు ప్రశాంత్, మేఘనాథ్ ఉన్నారు. -
వరి సాగే అధికం..
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని చెప్పినా జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి సాగుకే రైతులు మొగ్గు చూపారు. ఎల్‌నినో ప్రభావంతో గతేడాది కంటే ఈసారి 61 వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం తగ్గిందని అధికార లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది 1,90,002 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా వేయగా 1,74,691 ఎకరాల్లో సాగైంది. అలాగే పత్తి 17,237 ఎకరాలకుగాను 13,879 ఎకరాలు.. మినుములు 38,970 ఎకరాలకుగాను 11,945 ఎకరాలు, కంది 5,464 ఎకరాలకుగాను 3,962 ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ 30054 ఎకరాలకు అంచనా వేయగా 5333 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 10,923 ఎకరాలకుగాను 6,956 ఎకరాలు.. జొన్న 1,154 ఎకరాలకుగాను 1,149 ఎకరాలు.. ఆముదం 691 ఎకరాలకుగాను 426 ఎకరాలు సాగు చేశారు. ఉద్యాన పంటల విషయానికొస్తే ఆయిల్‌పాం 2,600 ఎకరాలకుగాను 701 ఎకరాలు.. కూరగాయలు 10 వేల ఎకరాలు సాగు అంచనా వేయగా కేవలం 4,182 ఎకరాలు మాత్రమే సాగైంది. -
జూరాల వద్ద ఉద్రిక్తత
ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.. వనపర్తి: జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో పంటలు సాగు చేసిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడించారు. ఈ విషయమై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లేఖరాసి తెలంగాణలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, ఎంజీకేఎల్ఐ పథకాల పరిధిలోని పంటలు కాపాడేందుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై కర్ణాటక సీఎంతో చర్చించేందుకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలు, తాను వెళ్తున్నట్లు ప్రకటించారు. సాగునీటి సమస్య పరిష్కారానికి మరికొన్నిగంటల్లో శుభవార్త వస్తుందన్నారు. అమరచింత: సాగునీటి కోసం రైతులు చేస్తున్న ఆందోళనతో మంగళవారం జూరాల జలాశయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆరు రోజులుగా జూరాల కాల్వలకు సాగునీరు నిలిపివేయడంతో పంటలు కాపాడుకునేందుకు ఆయకట్టు రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలు చేస్తున్న విషయం విధితమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం జూరాల ప్రాజెక్టు సందర్శనతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించడమే కాకుండా జిల్లావ్యాప్తంగా బీజేపీ, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. పోలీసుల కళ్లుగప్పి ప్రాజెక్టుకు చేరుకున్న ఆయా పార్టీల నాయకులను అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లో కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని ఇరుపార్టీల నాయకులు చెప్పగా.. ఇక్కడ ఉండరాదని తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. సమాంతర కాల్వ వద్ద బీజేపీ.. రైతులకు సాగునీరు ఇవ్వాలంటూ బీజేపీ నాయకులు జూరాల సమాంతర కాల్వకు చేరుకున్నారు. నందిమళ్ల క్యాంపు రహదారి నుంచి వస్తారని బారికేడ్లు ఏర్పాటుచేసి పహారా కాస్తున్న పోలీసులకు సమాంతర కాల్వ వద్దకు బీజేపీ నాయకులు చేరుకున్నారనే సమాచారం అందటంతో హూటాహుటిన అక్కడికి చేరుకొని ప్రాజెక్టుపైకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. సాగునీరు వదలాలని కోరుతున్న రైతులపై ప్రభుత్వం పోలీసు బలగాలతో దాడులు చేయించడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు ఆగమయ్యారని, వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు వదిలే వరకు ఇక్కడి నుంచి కదలమని బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర నాయకుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి తలకు గాయమైంది. కార్యక్రమంలో బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, మేర్వ రాజు, మల్లారెడ్డి, లావణ్య, నారాయణ పాల్గొన్నారు. పీజేపీ క్యాంపు వద్ద సీపీఎం.. సాగునీరు వెంటనే వదలాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా మంగళవారం ఆందోళన చేపట్టారు. తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ జూరాలకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడిందని.. భూత్పూర్ వద్ద అరెస్ట్ చేసి ఠాణకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. రైతు, ప్రజా ప్రభుత్వమని పత్రికా ప్రకటనలు ఇస్తున్న కాంగ్రెస్.. సాగునీరు ఇవ్వడంతో విఫలమైందని ఆరోపించారు. ఆయకట్టు రైతులకు కనీసం వారాబందీ విధానంలోనైనా సాగునీరు ఇవ్వాలని.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పడంతో పోలీసులు కలగజేసుకొని బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు బాల్‌రెడ్డి, జీఎస్ గోపి, వెంకటేష్, రమేష్, చిన్నకురుమూర్తి, చంటి తదితరులు పాల్గొన్నారు. మొహరించిన పోలీసు బలగాలు.. జూరాల ప్రాజెక్టుకు మంగళవారం బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు, సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ వస్తున్నారని తెలిసి ప్రాజెక్టు ఎడమ కాల్వ వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కొత్తకోట, వనపర్తి, ఆత్మకూర్ సీఐలు, 10 మంది ఎస్ఐలతో పోలీసు పహారా కొనసాగించారు. కిష్టంపల్లి ఎక్స్రోడ్తో పాటు నందిమళ్ల క్యాంపు, జూరాల ప్రధాన ఎడమ, సమాంతరకాల్వ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు. బీజేపీ, సీపీఎం నాయకుల ఆందోళనలు సాగునీరు వదలాలంటూ తరలొచ్చిన అన్నదాతలు భారీగా మొహరించిన పోలీసులు ప్రాజెక్టు రహదారులన్నీ బారికేడ్లతో మూసివేత నాయకుల అరెస్ట్.. కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలింపు -
రైతులు సహకరించాలి..
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించిన పంట లెక్కల (CsopE num eration) ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. వ్యవసాయ విస్తరణ అధికారులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులు సాగు చేసిన పంట వివరాలు నమోదు చేస్తున్నారు. పంట లెక్కల ఆధారంగా ప్రభుత్వం రైతులకు అందించే వివిధ పథకాల అమలు, పంటల ప్రణాళిక, దిగుబడి అంచనాలు రూపొందించడం సులభమవుతుంది. రైతులు అధికారులకు సహకరించి సరైన వివరాలు అందించాలి. నెలాఖరు నాటికి పంట లెక్కల ప్రక్రియ పూర్తిచేసి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ● -
కృష్ణా.. తోడేస్తుండ్రు
శ్రీశైలానికి వరదలు వచ్చిన సమయంలో ఈ ఏడాది ఇప్పటి వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. మూడు మోటార్ల ద్వారా రోజుకు 800 నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు తరలించాం. రిజర్వాయర్లతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నాం. – అమర్‌సింగ్, ఈఈ, సాగునీటి పారుదలశాఖ శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం ఇలా.. అచ్చంపేట: ఇటు తెలంగాణ, అటు ఏపీ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీటిని అందించడంతో నిరంతర విద్యుత్ సరఫరాకు దోహదపడే శ్రీశైలం జలాశయంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నివో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణం. ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం లేకపోవడంతోపాటు.. వచ్చిన కొద్దిపాటి నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు విచ్చలవిడిగా తోడేస్తుండటంతో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం నిండా నీటితో కళకళలాడిన జలాశయం.. నీటిమట్టం వేగంగా క్షీణించి 861.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలంలో ఎండీడీఎల్ 834 అడుగుల చేరువలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2002– 03 సంవత్సరం నుంచి కృష్ణానదికి అతి తక్కువ నీటి ప్రవాహాలు వచ్చిన నాలుగో సందర్భం ఇప్పుడు మళ్లీ వచ్చింది. తాగు, సాగునీటికి కష్టాలే.. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వానాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఏడాది సాగునీటికి కష్టాలు తప్పేలా లేవు. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ మట్టం 885 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. అయితే గురువారం నాటికి 861.1 అడుగుల వద్ద 109.5400 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో 834 అడుగులు, 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కాగా వినియోగానికి వీలుండేది కేవలం 27.1 అడుగులు, 79.5400 టీఎంసీలు మాత్రమే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది. మనకు తాగునీటికే నెలకు కనీసం ఒక టీఎంసీ అవసరం ఉండగా.. ఇందులో సాగునీటి గురించి ఆలోచించడం సాహసమే. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా జలాలనే కేఎల్ఐ పంపుల ద్వారా ఎత్తిపోసి తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకానికి తరలిస్తారు. ఏడాదికి సుమారు 10– 12 టీఎంసీలు అవసరం అవుతాయి. వరదల సమయంలో ఏటా 35 నుంచి 45 టీఎంసీల నీటిని కేఎల్ఐ పంపుల ద్వారా ఎత్తిపోసేవారు. ఇందులో దాదాపు సాగునీటికి 35 టీఎంసీల వరకు వినియోగించేవారు. ఈసారి కేఎల్ఐ పంపుహౌస్‌ల్లో ఐదు మోటార్లకు గాను మూడింటితోనే ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు తాగు, సాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి కేఎల్ఐ ద్వారా నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలతోపాటు ఇతర ప్రాంతాల్లో 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది వర్షాకాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేశారు. శ్రీశైలంలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో పంటలకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరం వచ్చిన వరద (జూన్ 1 నుంచి (టీఎంసీలు) మే 31 వరకు) 2002– 03 221.781 2003– 04 157.047 2012– 13 243.852 2015– 16 73.600 2023– 24 140.840 2026– 27 215.11 (సెప్టెంబరు 17 వరకు) కృష్ణానది పరివాహకంలో కురిసిన వర్షాలతో మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మటి, నారాయణపూర్ జలాశయాలు నిండిన తర్వాత విడుదల చేసిన నీళ్లు గత జూలై చివరి నాటికి జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకున్నాయి. దీంతో వానాకాలం ప్రారంభానికి ముందు శ్రీశైలంలో 39 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఆగస్టు 12 నాటికి ఎగువ నుంచి 185.5 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో శ్రీశైలంలో 215.11 టీఎంసీల నీరు చేరగా.. తెలంగాణ కేఎల్ఐ, ఏపీ పోతిరెడ్డిపాడు, మల్యాల నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్), వెలుగోడు, ముచ్చుమర్రి పథకాలకు వాడుకుంటోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం నుంచి ఇప్పటి వరకు 145 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు శ్రీశైలం గేజింగ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి ద్వారా పెద్దఎత్తున నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశాయి. తెలంగాణ శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ జెన్కో 446.13 మి.యూ., ఏపీ 72.62 మి.యూ., విద్యుదుత్పత్తి చేసింది. నీటి కేటాయింపులు లేకుండానే రెండు రాష్ట్రాలు నీళ్లు వాడుకుంటున్నాయి. ప్రస్తుతానికి వచ్చిన వరదలతో కాస్త ఉపశమనం పొందినా భవిష్యత్ పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 861.10 అడుగుల 109.5400 టీఎంసీల నీరు డేంజర్ బెల్స్.. ఎండీడీఎల్‌కు కేవలం 79.5400 అడుగులే ఇలాగే కొనసాగితే సాగు, తాగునీటిపై తీవ్ర ప్రభావం వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రాధాన్యం అంటున్న ప్రభుత్వం -
అనుమతి ఇవ్వడం లేదు..
పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కాలనీలో ఉన్న సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలన్నా అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. కేసు కారణంగా పరిస్థితి అనుకూలంగా లేదు. – శ్రీలత, గృహిణి, కొత్తకోట కుటుంబ అవసరాలు, వైద్యం తదితర అత్యవసర ఖర్చుల కోసం ప్లాట్‌ను విక్రయించుకోవాలన్నా క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలి. – నాగమ్మ, కొత్తకోట రాఘవేంద్రకాలనీలో 50 ఏళ్లుగా ప్రజలు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ఇంతకాలం ఎలాంటి సమస్య లేకుండా ఉన్న కాలనీపై ఇప్పుడు కేసు కారణంగా ఇబ్బందులు తలెత్తడం బాధాకరం, అధికారుల తప్పిదాలకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదు. – పి.గాయత్రి సత్యం సాగర్, 7వ వార్డు కౌన్సిలర్ -
జల జగడం..!
● ఆందోళనలు, రాస్తారోకోలతో వేడెక్కిన జల వివాదం ● సోమవారం ప్రాజెక్టుపై ఆందోళనకు పూనుకున్న బీఆర్ఎస్ ● తాగునీటికే ప్రాధాన్యమంటున్న ప్రభుత్వం –8లో uఅమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కాల్వలకు సాగునీటి సరఫరా నిలిపివేయడంతో అటు ఆయకట్టు రైతులు, ఇటు ప్రాజెక్టు అధికారుల మధ్య జల జగడం మొదలైంది. ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటూ ప్రాజెక్టుపై నాలుగు రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా.. సంబంధిత ప్రాజెక్టు అధికారులు మాత్రం సాగునీరు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధంతో పాటు ప్రాజెక్టుపై ఆందోళన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పంటలు ఎండుముఖం పట్టాయని ఆవేదనకు గురైన రైతులు ఏకంగా ఆందోళన సమయంలోనే అధికారుల ఎదుటే ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ షట్టర్ల తాళాలు పగులగొట్టి కాల్వకు సాగునీటిని విడుదల చేయడంతో సమస్య తీవ్రమైంది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభుత్వం ప్రధాన ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద పోలీసు బెటాలియన్‌తో పహార ఏర్పాటు చేసి కాల్వకు సాగునీటి సరఫరాను నిలిపివేసింది. వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తారని ఆశించిన రైతుల ఆశలను ప్రాజెక్టు అధికారులు పూర్తిగా తుడిచేయడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికందదని రైతులు ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయకట్టు పరిధిలో 1.20 లక్షల ఎకరాలు.. వానాకాలం సీజన్లో జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాల్వల పరిధిలో రైతులు 1.20 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. అధికంగా వరి సాగుకాగా.. అక్కడక్కడ ఆరుతడి పంటలు సాగయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం.. ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం జలాశయంలో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో అధికారులు సాగు నీటి సరఫరాను ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే పూర్తిగా నిలిపివేశారు. దీంతో వరి సాగుచేసిన రైతులు తమ పంటలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వంతో పాటు అధికారుల వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టారు. జూరాల ఆయకట్టుకు సాగునీటిని వదలాలంటూ సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రాజెక్టు వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. రైతుల పక్షాల పోరాటం చేసి అండగా నిలిచేందుకు ఆందోళనకు పూనుకున్నాయి. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారని.. ఆయకట్టు పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రైతులను తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముందస్తుగా పోలీసు బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. రైతులు ఆందోళనకు వస్తే వారిని నివారించేందుకు వీలుగా బలగాలను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రైతుల ధర్నాలతో జూరాల ప్రాజెక్టు ధర్నా చౌక్‌గా మారింది. -
బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నాశనం
● ఊకచెట్టు వాగు వంతెన ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి మదనాపురం: తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా సర్వనాశనం అయిందని.. నాటి పాలకుల ద్రోహం, నిర్లక్ష్యానికి ఊకచెట్టు వాగు వంతెనే సజీవ సాక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రూ.15.25 కోట్లతో ఆత్మకూరు–కొత్తకోట మధ్య ఉన్న ఊకచెట్టు వాగుపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ఆదివారం ఆయనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తితోనే అమాయకుల ప్రాణాలు పోయాయని, వంతెన పనులు పిల్లర్లకే పరిమితం చేయడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి నలుగురు పేదలు ప్రాణాలు వదిలినా నాటి కేసీఆర్ ప్రభుత్వానికి కనీసం చలనం రాలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే జీఎంఆర్ అభ్యర్థన మేరకు మదనాపురం, కౌకుంట్ల, మూసాపేట మండలాల్లో రూ.49 కోట్లతో సమీకృత మండల కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని వివరించారు. శ్రీ కురుమూర్తిస్వామి ఆలయానికి రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు, రూ.143 కోట్లతో అనుసంధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నామని.. భూత్పూర్ పురపాలికకు రూ.30 కోట్లు కేటాయించామని, దేవరకద్రలో 100 పడకల ఆస్పత్రి, కోర్టు భవనం, పుర కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, ప్రజా ప్రభుత్వంలో విద్యార్థుల కాస్మోటిక్, డైట్ చార్జీలను 40 శాతం పెంచి పేద పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోందని చెప్పారు. -
‘టెనెంట్’ ఇక్కట్లు..!
● అనుమతి ఇవ్వని అధికారులు ● ప్లాట్లు క్రయవిక్రయాలకు బ్రేక్ ● 50 ఏళ్లుగా నివాసం.. 650కు పైగా ఇళ్లు ●కొత్తకోట: స్థానిక పుర పరిధిలోని రాఘవేంద్రకాలనీ, బీసీకాలనీలో మూడేళ్ల కిందట నమోదైన టెనెంట్ కేసు కారణంగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించకపోవడంతో ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 650కి పైగా కుటుంబాలు ఆయా కాలనీల్లో నివాసం ఉంటున్నాయి. సర్వేనంబర్లు 335, 339, 352, 352/1, 352/2లో సుమారు 20 ఎకరాలకుపైగా ఉన్న కాలనీల్లో టెనెంట్ కేసు కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత స్థలాలు ఉన్పప్పటికీ ఇళ్ల నిర్మాణాలకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు. పాత ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించుకోవాలనుకున్నా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. విద్య, వైద్యం తదితర అత్యవసర ఖర్చుల కోసం ప్లాట్లను విక్రయించుకోవాలనుకున్నా కేసు ప్రభావంతో కొనుగోలుదారులు ముందుకురావడం లేదని చెబుతున్నారు. అధికారుల తప్పిదమేనా..? కొందరు అధికారుల తప్పిదం కారణంగానే తప్పుడు కేసు నమోదైందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అధికారుల స్థాయిలో జరిగిన తప్పిదం ఉంటే దాన్ని సరిదిద్దకుండా ఏళ్ల తరబడి సమస్యను కొనసాగించడంతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారని వారు అంటున్నారు. జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి టెనెంట్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించి వాస్తవ పరిస్థితిపై సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 50 ఏళ్లుగా నివసిస్తున్న 650కు పైగా కుటుంబాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా సమస్య శాశ్వతకు పరిష్కారం చూపాలని ఆయా కాలనీవాసులు కోరుతున్నారు. రాఘవేంద్రకాలనీకి సంబంధించిన టెనెంట్ కేసు న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉంది. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కేసు వివరాలు, రెవెన్యూ రికార్డులు, పుర నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్ట పరిధిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. – సైదయ్య, పుర కమిషనర్ -
‘మధ్యవర్తితం 3.ఓ’ విజయవంతం చేయాలి
వనపర్తి: దేశ అత్యున్నత న్యాయస్థానం కల్పించిన మధ్యవర్తిత్వ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని.. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించనున్న మధ్యవర్తిత్వ 3.ఓ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తిబాకరాజు శ్రీనివాసరావు కోరారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీమార్గం అనేది రామాయణ, మహాభారత కాలం నుంచే ఉన్నాయని, రామాయణ కాలంలో అంగధుడు, మహాభారత కాలంలో శ్రీ కృష్ణుడు మహాయుద్ధాలను ఆపేందుకు రాజీమార్గంలో ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 89 కింద పరిగణించబడిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతుల్లో మధ్యవర్తిత్వం ఒకటని.. వివాదంలో ఉన్న పక్షాలు విచారణకు వెళ్లకుండా సృజనాత్మకంగా పరిష్కరించుకోవడానికి సహాయపడుతుందన్నారు. జిల్లాలో 15 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు ఉన్నారని, వైవాహిక వివాదాలు, వినియోగదారుల వివాదాలు, ఆస్తి భూ వివాదాలు, కుటుంబ, ఆర్థిక వివాదాలు కోర్టులో ఉన్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టుకు వచ్చి మధ్యవర్తిని కల్పించండని కోరితే వెంటనే నియమిస్తామన్నారు. ఆ మధ్యవర్తి ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిపి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించిన అనంతరం కోర్టు పరిష్కారం చేస్తుందని తెలిపారు. రాజీకి ఆస్కారం ఉందని కోర్టుకు అనిపిస్తే న్యాయమూర్తి ఆ కేసును మధ్యవర్తిత్వానికి పంపుతారని చెప్పారు. ఈ సందర్భంగా తను కరీంనగర్లో పనిచేసే సమయంలో భార్యాభర్తలు చిన్న విషయానికి విడాకులు తీసుకునేందుకు వస్తే కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చానని, ఆమె ఒకరోజు అనుకోకుండా కలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ జీవితాన్ని బాగుచేశారని చెప్పిన ఘటన చాలా సంతృప్తినిచ్చిందని గుర్తు చేసుకున్నారు. సమావేశంలో న్యాయమూర్తులు కోట్ల లావణ్య, బాల్‌రెడ్డి, జి.కళార్చన, కవిత, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, కార్యదర్శి వెంకటరమణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప కాసరగడ్డ, శిక్షణ పొందిన మధ్యవర్తులు తదితరులు పాల్గొన్నారు. -
కబడ్డీ.. కబడ్డీ..
ఇండోర్ స్టేడియంలో మ్యాట్‌పై కబడ్డీ శిక్షణ రైడింగ్.. డిఫెండింగ్పై ఫోకస్ కబడ్డీలో కీలకమైన రైడింగ్, డిఫెండింగ్తోపాటు లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మ్యాచ్ పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యర్థి వ్యూహాలను ఎదుర్కోవడం, వేగం–సమన్వయాన్ని పెంచేలా సాధన చేయిస్తున్నారు. శారీరక దారుఢ్యంతోపాటు ఆటలో మెళకువలను మెరుగుపర్చేలా శిక్షణ సాగుతోంది. -
టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తా
ఏడేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. సబ్ జూనియర్ రెండు, జూనియర్ ఒకటి, సీనియర్ అంతర్జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుతం రైడర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. – లోకేష్, ఆదిలాబాద్ ఆల్‌రౌండర్‌గా మెరుగవ్వాలి అకాడమీలో డిఫెండర్, ఆల్‌రౌండర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. గతేడాది హర్యానాలోని సోనిపట్‌లో జరిగిన సబ్ జూనియర్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించా. మూడు సబ్ జూనియర్, ఒక జూనియర్, ఒక సీనియర్ అంతర్జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించా. భవిష్యత్తులో భారత జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం. – గౌతమ్, మహబూబ్‌నగర్ ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్నదే టార్గెట్ మూడేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొన్నా. మా జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి సూచనతో అకాడమీ ఎంపికలకు హాజరయ్యా. ఇక్కడికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. జాతీయస్థాయి పోటీల్లో రాణించడంతోపాటు తెలంగాణ తరఫున ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్నదే నా లక్ష్యం. – ఉమేష్కుమార్రెడ్డి, ఖమ్మం● -
లెఫ్ట్ కార్నర్‌గా రాణించాలి
రెండేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. గతంలో సీఎం కప్ పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుతం లెఫ్ట్ కార్నర్, రైట్ రైడర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. అకాడమీలో శిక్షణ బాగుంది. ఆటలోని మెళకువలు నేర్చుకుంటున్నా. నిరంతరం సాధన చేసి భవిష్యత్తులో భారత జట్టుకు ఆడాలనుకుంటున్నా. – వి.సచిన్, మహబూబ్‌నగర్ పీకేఎల్ స్థాయికి ఎదగాలని ఉంది చిన్నప్పటి నుంచే కబడ్డీ అంటే ఇష్టం. మూడేళ్లుగా ఆడుతున్నా. రెండుసార్లు అంతర్జిల్లా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించా. అకాడమీకి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆడటంతోపాటు భారత జట్టుకు ఎంపిక కావాలన్నదే నా లక్ష్యం. – శివశంకర్, మహబూబ్‌నగర్ -
మా నీళ్లు మాకే..
● పీఆర్ఎల్ఐ నుంచి డిండికి నీరు తరలించొద్దు.. ● ఈ లిఫ్ట్‌ను ఒప్పుకొనేది లేదు.. మలి దశ తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పోరాటం ● ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి ● జేఏసీ ఆధ్వర్యంలో ఉల్పర నుంచి గొట్టిముక్కల వరకు రిజర్వాయర్ల సందర్శన సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తే.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలమూరు రైతుల పట్ల వివక్ష చూపుతోంది. నల్లగొండ లీడర్లు చెప్పిన మాటలు విని ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం.. పాలమూరు నీటిని తరలించే కుట్రను ఇక సహించేది లేదు.. మా నీళ్లు మాకే కావాలి. ఈ మేరకు తెలంగాణ మలిదశ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతాం.’ అని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. యూఎంపీపీఎస్ జేఏసీ ప్రతినిధులు శనివారం మీడియాతో కలిసి డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైన ఉల్పర నుంచి గొట్టిముక్కల రిజర్వాయర్ వరకు జరుగుతున్న పనులను సందర్శించారు. అనంతరం చారకొండ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడారు.జూరాల ప్రాజెక్ట్ నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నీటిని తీసుకొని ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. శ్రీశైలం సోర్స్ ఆధారంగా కేసీఆర్ డిజైన్ మార్పు చేయడంతోనే సమస్య ఉత్పన్నమైందన్నారు. తొమ్మిదన్నరేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అంతేకాదు ఈ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా.. డిండి ప్రాజెక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టడం అన్యాయమని.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి నష్టం వాటిల్లే డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదన్నారు. సొంత జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై స్పందించాలన్నారు. మంత్రి జూపల్లి స్పందించాలి: రాఘవాచారి ఏపీలోని రాయలసీమలో చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణంతో పాలమూరుకు ఎంత అన్యాయం జరిగిందో.. నల్లగొండ జిల్లా కోసం చేపడుతున్న డిండి లిఫ్ట్ వల్ల కూడా జిల్లాకు అంతే అన్యాయం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు నీటి రంగంలో అన్యాయం చేశారని 2023 ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ను ఓడించి.. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. కానీ ఈ ఎమ్మెల్యేలు డిండిపై, పాలమూరు రైతాంగానికి కృష్ణా జలాలను అందించే విషయంలో పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో డిండికి నీటి తరలింపుపై అడ్డుకున్నామని వివరించారు. అప్పటి నాయకుడు, ఇప్పటి మంత్రి జూపల్లి, కాంగ్రెస్ నేతలు డిండిని వ్యతిరేకిస్తూ లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారే నల్లగొండ లీడర్ల చేతిలో దాసోహమయ్యారని.. మీరు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని.. ఈ బలం ఉన్నా ఇక్కడి రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి ఇప్పటికై నా డిండి ప్రాజెక్ట్‌పై ఆయన వైఖరిని తెలియజేయాలన్నారు. -
గంగమ్మ ఒడికి గణనాథులు
క్రేన్ సాయంతో గణనాథుడి నిమజ్జనం వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో ఐదురోజుల పాటు పూజలందుకున్న గణనాథులు శనివారం రాత్రి నిమజ్జనానికి తరలారు. శుక్రవారం నిమజ్జనం చేయకూడదనే సెంటిమెంట్‌తో నిర్వాహకులు శనివారం నిమజ్జనం నిర్వహించారు. భిన్న ఆకృతుల్లో దర్శనమిచ్చిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో డప్పులు, సన్నాయి వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో తీసుకెళ్లారు. శోభాయాత్రలో యువత నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. వివిధ కాలనీలు, ప్రధాన రహదారులపై కొలువుదీరిన సుమారు 40 విగ్రహాలను హైదరాబాద్ రోడ్‌లోని నల్లచెరువుకు తరలించారు. జిల్లాకేంద్రంలోని 22వ వార్డు గణేష్‌నగర్ వినాయకుడిని ఎద్దుల బండిపై నిమజ్జనానికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. నల్లచెరువు వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మట్టి విగ్రహాలు, పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి నల్లచెరువులో వేర్వేరు ప్రాంతాలను ఏర్పాటుచేసి ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. -
గణనాథుడి శోభాయాత్రకు భారీ బందోబస్తు
వనపర్తి: జిల్లావ్యాప్తంగా గణనాథుల నిమజ్జనం సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని, శోభాయాత్రలో డీజేలు వినియోగించడం, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని నల్లచెరువు వద్ద నిమజ్జనం జరిగే ప్రాంతంతో పాటు శోభాయాత్ర మార్గాలను డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిమజ్జన, శోభాయాత్రలు సీసీ కెమెరాల నిఘాలో కొనసాగుతాయని.. అన్ని ప్రధాన ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారుల మరమ్మతు, బారికేడ్లు, విద్యుత్ దీపాలు, క్రేన్లు, తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వాహకులు పూజా కార్యక్రమాలను త్వరగా ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను నిమజ్జన ప్రాంతాలకు తరలించాలన్నారు. శోభాయాత్రల్లో పాల్గొనే చిన్నారులు, మహి ళల భద్రతకు ప్రత్యేక దృష్టి సారిస్తామని, ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాల్లో ప్రయాణించే వారు జా గ్రత్తలు పాటించాలని కోరారు. నిమజ్జన సమయంలో క్రేన్ల సాయంతో విగ్రహాలను నీటిలోకి దించే సమ యంలో యువత, మహిళలు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని.. ఉత్సవ క మిటీలు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇందిరమ్మ పాలన ఇదేనా?
● బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రైతులకు ఆపత్కాలంలో సాయంగా ఉండేలా.. కేసీఆర్ రూపొందించిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఇప్పటికింకా ఇన్స్యూరెన్స్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.1,700 కోట్లు చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో బీమా వర్తించడం లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమవుతారని 2023 జనరల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రతి ప్రచార సభలో చెప్పినా వినకుండా ప్రజలు ఓట్లు వేశారని.. దీంతో మళ్లీ విద్యుత్ కోతలు, యూరియా కష్టాలు, పెట్టుబడి సాయం కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు నిషే ధిత భూముల జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాలను చేర్చి ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఒక్క పెబ్బేరు మండలంలోనే సుమారు వెయ్యి ఎకరాలను ఉద్దేశపూర్వకంగా చేర్చారని ఆరోపించారు. వనపర్తి: రైతులు సాగునీటి కోసం అరిగోసపడేలా.. యూరియా కోసం క్యూలైన్లో నిలబడేలా.. పెట్టుబడి సాయం ఎగొట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మునుపటి కాంగ్రెస్ పాలన తీసుకొచ్చారని.. ఇదేనా ఇందిరమ్మ పాలనా అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి మరణవార్త తెలుసుకొని శనివారం పరామర్శించేందుకు వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో పెబ్బేరు మండలం గుమ్మడం, పెబ్బేరులోని విద్యుత్ సబ్స్టేషన్లను సందర్శించి విద్యుత్ సరఫరా లాగ్‌బుక్‌ను పరిశీలించారు. అనంతరం పెబ్బేరులోని సుభాష్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. వ్యవసాయానికి కేవలం ఐదారు గంటలు మాత్రమే సరఫరా ఇస్తున్నట్లు, రోజుకు పదిసార్ల కంటే ఎక్కువ కోతలు విధిస్తున్నట్లు రైతులు, లాగ్‌బుక్‌లో నమోదు చేసిన వివరాలతో స్పష్టమవుతోందన్నారు. తన రాజకీయ గురువు చంద్రబాబు కోసం వరద జలాలను వదిలేసి.. సకాలంలో మోటార్లు ఆన్ చేయలేదని, దీంతో ఆంధ్రాకు సాగునీరు.. తెలంగాణ ప్రాంత రైతులకు కరువును మిగిల్చారని ఆరోపించారు. ఆంధ్రా పాలకులు ముందుచూపుతో ఇప్పటికే వెలుగొండ, పొతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించుకొని రిజర్వాయర్లు నీటితో నింపుకొంటున్నారన్నారు. మోటార్లు రెండ్రోజులు నడిస్తే వారం పాటు బంద్ చేసే కాంగ్రెస్ పాలకులకు రైతులపై ప్రేమ ఎలా ఉన్నట్లు అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్పన్నమైన కరవు కాంగ్రెస్ పాలకుల పుణ్యమేనని.. ముందస్తు ఆలోచనతో కృష్ణా జలాలను మొదటిరోజు నుంచి ఒడిసిపట్టుకుని నిల్వ చేసుకొని ఉంటే ప్రస్తుతం పంటలకు కావాల్సిన సాగునీరు అందుబాటులో ఉండటంతో పాటు భూగర్భ జలాలు అడుగంటేవి కావన్నారు. -
ప్రత్యేక అవసరాల పిల్లలకు సమగ్ర విద్య
వనపర్తి రూరల్: ప్రత్యేక అవసరాల పిల్లలకు అవసరమైన సహాయ సేవలతో పాటు సమగ్ర విద్య అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన భవిత కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి చిన్నారికి సమాన విద్యా అవకాశాలు కల్పించి.. వారి ప్రతిభను వెలికితీయడమే సమగ్ర విద్య లక్ష్యమన్నారు. భవిత కేంద్రం ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అనంతరం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ. 44లక్షలతో నిర్మించిన అదనపు గదులను మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదినితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు మార్కెట్‌యార్డులో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ విజయవర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కోదండ రామిరెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర పాల్గొన్నారు. -
నేడు పీయూలో లా కళాశాల ఓరియంటేషన్
మమబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ లా కళాశాల విద్యార్థులకు శనివారం అధికారులు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఓరియంటేషన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు క్యాంపస్‌పై పూర్తిస్థాయి అవగాహన కల్పించి, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. ఓరియంటేషన్ కార్యక్రమానికి జిల్లా జడ్జి ప్రేమలత, లా డీన్ వెంకటేశ్వర్లు, బీఓఎస్ చైర్మన్ రాంప్రసాద్ హాజరుకానున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ భూమయ్య, హెచ్ఓడీ సాయి ప్రసాద్, కిరణ్ పాల్గొన్నారు. -
13 ఎకరాల్లో పంటసాగు..
జూరాల కాల్వ నీరు సమృద్ధిగా వస్తుందనే ఆశతో ఈసారి 13 ఎకరాల్లో పంటసాగు చేస్తున్నా. వీటిలో 10 ఎకరాల్లో వరిపంట, 3 ఎకరాల్లో మినుము పంట వేశాను. ఇప్పటికే పంట పెట్టుబడితో పాటు కౌలు కోసం రూ. 3లక్షలు ఖర్చయ్యాయి. కాల్వకు సాగునీటిని నిలిపివేయడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. అధికారులు స్పందించి సాగునీరు విడుదల చేయాలి. – కావలి రాజు, రైతు, మొట్లంపల్లి ప్రస్తుతం జూరాలలో తాగునీటి అవసరాల మేరకు మాత్రమే నీరు అందుబాటులో ఉన్నాయి. ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో కాల్వలకు సాగునీటిని వదలవద్దని పైనుంచి అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. – చంద్రశేఖర్, ఎస్ఈ ● -
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టొద్దు
వనపర్తి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సామాజిక, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శుక్రవారం జిల్లాకు విచ్చేసిన ఆయనకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశమై జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యలు, అట్రాసిటీ కేసుల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించడం అధికారుల బాధ్యత అని అన్నారు. అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించి, నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుశాఖకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తూ.. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు అధికారులు చట్టప్రకారం వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను పెండింగ్‌లో ఉంచొద్దని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన కేసులు పెండింగ్‌లో లేకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. భూ సమస్యలపై అందిన ఫిర్యాదులను సులభతరంగా, నిబంధనల ప్రకారం పరిష్కరించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన బాధితులకు అందాల్సిన పరిహారం తదితర ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా పరిహారాలు పెండింగ్‌లో ఉంటే వాటి వివరాలను తమకు నివేదిక రూపంలో సమర్పించాలని తెలిపారు. ఈ నెల 22న ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో చర్చించి నిధుల విడుదలకు చొరవ తీసుకుంటామన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని.. ఇందులో తహసీల్దార్లతో పాటు ఎస్ఐలు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించడం అధికారుల బాధ్యత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం సాధించాలి
వనపర్తి: జిల్లాలోని బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళిక మేరకు లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్లో లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026–27 మొదటి త్రైమాశిక జిల్లాస్థాయి బ్యాంకర్ల సమన్వయ, సంప్రదింపుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక మేరకు రూ.5990.50 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా.. మొదటి త్రైమాసికం ముగిసే వరకు కేవలం రూ.1366.47 కోట్ల రుణాలు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయన్నారు. అందులోనూ ఎంఎస్ఎంఈ, విద్యా, గృహ రుణాలు చాలా తక్కువ శాతం గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి పథకాలు ప్రతి ఒక్క ఖాతాదారుకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. అదే విధంగా జిల్లాలో గృహ రుణాలు కేవలం 12.47శాతం మాత్రమే లక్ష్యం సాధించడం జరిగిందని.. వందశాతం సాధించేందుకు విరివిగా గృహ రుణాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా పేదలు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక స్థోమత లేక బయట అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారని.. అలాంటి వారికి బ్యాంకులు ఉదారంగా గృహ రుణాలు అందజేయాలని సూచించారు. అలాగే ఎంఎస్ఎంఈ రుణాలు అత్యధిక శాతం ఇచ్చి, జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో దోహదపడాలన్నారు. పీఎం విశ్వకర్మ లాంటి పథకాలను విజయవంతం చేసేవిధంగా బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.ఖీమ్యానాయక్, ఎల్డీఎం శివకుమార్, ఆర్బీఐ ఏజీఎం వి.ప్రదీప్‌చంద్ర యూబీఐ డీజీఎం డి.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
జీఓల్లో నిధులు.. కానరాని పనులు
కౌన్సిలర్ల ఎదురుచూపులు.. ఆయా పుర కౌన్సిల్ సమావేశాల్లో పాలకవర్గం చర్చించి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. అమలు చేయడానికి నిధులు లేకపోవడం పాలకవర్గాలకు ఇబ్బందిగా మారింది. వార్డుల్లో అవసరమైన పనులు చేపట్టేందుకు నిధులు వస్తాయని ఆశించిన కౌన్సిలర్లకు ఎనిమిది నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి. మంత్రి హామీతోనే కదలిక.. ఆత్మకూర్, అమరచింత పురపాలికల్లో మంత్రి వాకిటి శ్రీహరి హామీతో పనుల్లో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. నిధుల విడుదలకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడంతో ఆయా పురపాలికల్లో అభివృద్ధి పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. మిగతా పురపాలికల్లోనూ నిధుల విడుదలకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వనపర్తి టౌన్: జిల్లాలోని ఐదు పురపాలికల అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం రూ.78.07 కోట్లు మంజూరు చేస్తూ జీఓలు జారీచేసి ఏడాది గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వనపర్తి పురపాలికలకు యూఐడీఎఫ్ నిధులు రూ.18.07 కోట్లు, ఆత్మకూర్, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట పురపాలికలకు నగరాభివృద్ధి నిధుల కింద ఒక్కో పురపాలికకు రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.60 కోట్లు కేటాయించారు. వీటితో సీసీ రహదారులు, డ్రైనేజీలు, వరద కాల్వలు, పార్క్‌ల అభివృద్ధి తదితర వాటికి ఈ నిధులను వినియోగించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలోనే పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయినా.. నిధుల లేమితో అడుగులు పడటం లేదు. వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకుగాను నిధుల కోసం కౌన్సిలర్లు ఆశగా ఎదురుచూస్తుండగా.. విడుదలలో జాప్యం నిరాశకు గురిచేస్తోంది. వనపర్తిలో.. వనపర్తి పురపాలికకు యూఐడీఎఫ్ నిధులు రూ. 18.07 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు కొంతమేర ఉపయోగపడతాయని కౌన్సిల్ ఆశించింది. కాని పనుల పురోగతిపై వివరాలు అడిగినప్పుడు నిధులు విడుదల కాలేదనే విషయాన్ని అధికారులు స్పష్టంగా చెప్పకుండా.. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని సమాధానం ఇస్తుండటం గమనార్హం. దీంతో అసలు ప్రక్రియ ఏ దశలో ఉందనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీఓ జారీ అయి నెలలు గడుస్తున్నా.. మంజూరైన నిధులు ఎప్పుడు వస్తాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ● ఆత్మకూర్, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట పురపాలికలు ఒక్కోదానికి నగరాభివృద్ధి నిధులు రూ.15 కోట్లు కేటాయించారు. ఆయా పురాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వరద కాల్వలు, పార్క్‌ల అభివృద్ధి తదితర పనులు చేపట్టేందుకు ఈ నిధులు వినియోగించాల్సి ఉంది. పట్టణాల అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ నిధుల విడుదల ఆలస్యం కావడంతో వాటి అమలు ప్రశ్నార్థకంగా మారింది. పెబ్బేరు, కొత్తకోటలో టెండర్లు పూర్తయినా.. పెబ్బేరు, కొత్తకోట పురపాలికల్లో చేపట్టాల్సిన పలు పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవడం అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. కాగితాలపై పూర్తయిన ప్రక్రియకు క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పురపాలికలకు గతేడాది రూ.78.07 కోట్లు మంజూరు నేటికీ విడుదల కాని వైనం .. కుంటుపడుతున్న అభివృద్ధి వనపర్తి, కొత్తకోట, పెబ్బేరులో ప్రారంభంకాని పనులు మంత్రి చొరవతో అమరచింత, ఆత్మకూర్‌లో కదలిక టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది వనపర్తి, కొత్తకోట పురపాలికల్లో టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. అగ్రిమెంట్ పూర్తికాగానే పనుల ప్రారంభానికి చర్యలు చేపడతాం. సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తాం. – ప్రశాంత్, ఏఈ, వనపర్తి -
గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి రూరల్: గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. పెబ్బేరు మండలం రంగాపూర్ కృష్ణానది తీరంలో బ్రిడ్జి వద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం గుర్తించిన ప్రదేశాన్ని గురువారం వనపర్తి డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సీఐ ఓడీ రమేశ్‌తో కలిసి ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులపై పోలీసు అధికారులతో సమీక్షించారు. కృష్ణానదిలో నీటిమట్టం తక్కువగా ఉన్నందున గణేశ్ విగ్రహాలను తీసుకొచ్చే వాహనాలు నిమజ్జన ప్రదేశం వరకు వెళ్లేందుకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. వాహనాల రాకపోకలు, భక్తులకు రక్షణ, నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, నిర్వాహకులు పోలీసుశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నీటిమట్టం, నదీ తీర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల నిర్వాహకులు కూడా పోలీసుల సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట ఎస్ఐలు వెంకటేశ్‌గౌడ్, హిమబిందు ఉన్నారు. -
పార్టీ ఆదేశాలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు
వనపర్తిటౌన్: పార్టీ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించి.. వాటి నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని సూచించారు. సమావేశాలకు గైర్హాజరయ్యే పదాధికారులకు నోటీసులు జారీ చేయాలని, వరుసగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బీఎల్ఏ–2లకు సర్ ప్రక్రియపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గాంధీ భవన్ నుంచి వచ్చిన శిక్షకుడు మల్లేష్ యాదవ్ బీఎల్ఏలకు శిక్షణ ఇచ్చారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులో విచారణకు హాజరై అవసరమైన పత్రాలు సమర్పించేలా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అదే విధంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
వనపర్తి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.దీప అన్నారు. గురువారం వనపర్తి మండలం పెద్దగూడెంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి పాల్గొని గృహహింస నిరోధక చట్టం, బాల్యవివాహాల నిర్మూలన, తల్లిదండ్రుల సంరక్షణ తదితర చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హక్కులను వినియోగించుకోవడంతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యంగా చట్టాలకు లోబడి నడుచుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, సర్పంచ్ పుష్పలత పాల్గొన్నారు. -
అసత్య ప్రచారం తగదు
కొత్తకోట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా మతోన్మాదులు అసత్య ప్రచారం చేయడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. గురువారం కొత్తకోటలో నిర్వహించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ పోరాటం చరిత్రలో చెరగని అధ్యాయమని అన్నారు. దోపిడీ, అణచివేత, అంటరానితనం, కులవివక్షకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, కమ్యూనిస్టులు సాగించిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, నందిమళ్ల నాగన్న, చీర్ల వెంకటేశ్, గొల్ల వెంకటయ్య, యాదయ్య, కురుమన్న, రఫిక్, రమేశ్, భాస్కర్, రాములు, రాజు, శివన్న, బాబు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక వ్యవసాయపద్ధతులతో లాభాలు వనపర్తి రూరల్: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని డీఏఓ ఆంజనేయులు సూచించారు. జిల్లా కేంద్రం సమీపంలోని నాగవరం రైతువేదికలో గురువారం నిర్వహించిన జిల్లా రైతు సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు సమగ్ర పోషక, ఎరువులు, తెగుళ్ల, నీటి యజమాన్య పద్ధతులు అనుసరించి.. సేంద్రియ వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. పంటల సాగులో శాసీ్త్రయ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం మన గ్రోమోర్ సెంటర్ ఆధ్వర్యంలో నానో డీఏపీ ,నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. నానో ఎరువులతో పంట సమర్థవంతంగా పోషకాలను గ్రహిస్తుందన్నారు. గుళికల రూపంలో ఎరువులను పొలాల్లో చల్లడం ద్వారా కొంతమేర వృథా జరిగే అవకాశం ఉంటుందన్నారు. నానో ఎరువులు వినయోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సలహ కమిటీ వైస్‌చెర్మన్ సూర్య చంద్రారెడ్డి, ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ హైమావతి, వ్యవసాయశాఖ అధికారులు ప్రభాకర్‌రెడ్డి, తిప్పే స్వామి, కుర్మయ్య పాల్గొన్నారు. పల్లీ @ రూ.7,089 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 194 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,089, కనిష్టంగా రూ.5,270, సరాసరిగా రూ.5,719 ధరలు లభించాయి. అలాగే 13 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్ రూ.7,021 ఒకే ధర పలికింది. -
ప్రజాసంక్షేమానికి పెద్దపీట
వనపర్తిటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువగా పాలన సాగిస్తూ.. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలవడంతో పాటు విద్య, వైద్యం, సాగునీరు, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఐడీఓసీ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య జిల్లాలో 3.84 కోట్లకు చేరిందన్నారు. మహిళల ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.161.16 కోట్లు భరించిందని తెలిపారు. 85,383 మంది లబ్ధిదారులకు రూ. 500కే 5,12,439 సిలిండర్లు అందించామని.. సబ్సిడీ రూపంలో ప్రభుత్వం రూ.15.71 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. 2025–26లో 9,023 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.7.72 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మరో 956 సంఘాలకు రూ.3.16 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. రూ.5 కోట్లతో నిర్మించిన జిల్లా మహిళా సమాఖ్య భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. జాతీయ పతాకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతున్న పట్నం మహేందర్‌రెడ్డి జిల్లాలో విద్య, వైద్యరంగాల అభివృద్ధికి ప్రాధాన్యం రూ.కోట్ల నిధులతో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణాలు కర్నెతండా ఎత్తిపోతలతో 4,235 ఎకరాలకు సాగునీరు అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమన్వయంతో ముందుకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీపట్నం మహేందర్‌రెడ్డి అన్నదాతకు అండగా.. రైతు సంక్షేమంలో భాగంగా 2025–26లో రైతుబీమా ద్వారా 702 కుటుంబాలకు రూ.35.10 కోట్లు అందించినట్లు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. 2026 వానాకాలం రైతుభరోసా కింద 1,82,768 మంది రైతులకు ఎకరాకు రూ. 6వేల చొప్పున రూ.212.32 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మినుము, కంది, జొన్న, ఆముదం, కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 1,127 క్వింటాళ్ల మినుము విత్తనాలను రాయితీపై పంపిణీ చేశామని.. 3,750 ఎకరాలకు సరిపడా వేరుశనగ విత్తనాలను పూర్తి సబ్సిడీతో అందించేందుకు సిద్ధం చేసినట్లు వివరించారు. రూ.76.19 కోట్లతో చేపట్టిన కర్నెతండా ఎత్తిపోతల పథకం పూర్తయి వినియోగంలోకి వచ్చిందని.. దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లోని చెరువులను నింపడంతో పాటు 4,235 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పేద కుటుంబాలకు భరోసా.. జిల్లాలోని 1,83,568 రేషన్‌కార్డుల లబ్ధిదారులకు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సన్నబియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. కొత్తగా 26,465 రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో 1,04,000 మంది అదనపు కుటుంబ సభ్యులను చేర్చినట్లు పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద 85,423 కుటుంబాలకు 21.60 లక్షల జీరో విద్యుత్ బిల్లులు జారీ చేసి, రూ.62.60 కోట్ల సబ్సిడీ అందించినట్లు చెప్పారు. చేయూత పథకం ద్వారా జిల్లాలో 70,342 మందికి ప్రతినెలా రూ.16.33 కోట్ల మేర పింఛన్లు అందుతున్నాయన్నారు. -
‘పాలమూరు’ మొదటి పంపు నుంచి నీటి విడుదల
కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరు గ్రామ శివారు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్టు మొదటి పంపు ద్వారా గురువారం అధికారులు నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ లోకిలాల్ మాట్లాడుతూ ప్యారామీటర్ చెక్ చేసుకోవడంలో భాగంగా 2 గంటలపాటు నీటిని విడుదల చేసి.. మరోసారి మోటార్‌ను చెక్ చేసుకున్నామని చెప్పారు. వచ్చే వారం నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని నిరంతరాయంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మా కళ్లముందే మారిన చరిత్ర..
మా చిన్నతనంలో మదనాపురం ఒక పెద్ద వ్యాపారకేంద్రంగా ఉండేది. ముంబై, మద్రాస్, గుజరాత్ వ్యాపారులు ఇక్కడ రైస్‌మిల్లులు ఏర్పాటు చేశారు. అయితే సాయుధ పోరాటం తీవ్రమవడంతో గ్రామస్తుల సహకారం లేక వారు మిల్లులను వదిలి వెళ్లడం నేను ప్రత్యక్షంగా చూశా. కర్నూలు, మద్రాస్ వెళ్లేవాళ్లు మదనాపురం రైలు దిగి ఇక్కడి టంకశాలలో కరెన్సీ మార్చుకునేవారు. నాడు కరెన్సీ మార్పిడి సాగిన ఆ టంకశాల భవనమే నేడు పోలీస్స్టేషనన్గా మారింది. సెప్టెంబర్ 17 అనగానే నాటి సాయుధ పోరాట జ్ఞాపకాలు, ఈ సరిహద్దు టంకశాల కథలే మా కళ్లముందు మెదలుతాయి. – టీకే కురుమన్న, విశ్రాంత ఉపాధ్యాయుడు, మదనాపురం ● -
మారేడుపల్లి..
సాయుధ సమరంలో మదనాపురం: 1947, ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరిగినా.. నైజాం ఉక్కుపాదం కింద నలిగిన తెలంగాణ గడ్డపై విముక్తి భానుడు ఉదయించలేదు. భరతమాత ఒడిలోకి నాటి నైజాం రాజ్యాన్ని విలీనం చేసేందుకు తెలంగాణ పల్లెపల్లెనా సాయుధ పోరాట జ్వాలలు ఎగిసిపడ్డాయి. రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు ఆయుధాలు చేతబట్టి నిజాం సైన్యం, రజాకార్లను ఎదుర్కొన్న సాయుధ సమరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మారేడుపల్లి (నేటి మదనాపురం) ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. ● మదనాపురం అసలు పేరు మారేడుపల్లి. సాయుధ పోరాటానికి ముందు ఈ ప్రాంతం వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా వెలుగొందింది. ముంబై, గుజరాత్, చైన్నె, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం వ్యాపారులు ఇక్కడ నివాసాలు ఏర్పర్చుకొని బియ్యం (రైస్ మిల్లులు), నూనె మిల్లులను నెలకొల్పారు. నాటి వ్యాపార సామ్రాజ్యమంతా వారి గుప్పిట్లోనే ఉండేది. అయితే 1948 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో సాయుధ పోరాటం తీవ్రస్థాయికి చేరింది. భూస్వామ్య విధానం, నిజాం అణచివేతకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించడంతో వ్యాపారులకు స్థానికంగా మద్దతు కరువైంది. రజాకార్ల అరాచకాలు, ప్రజాగ్రహం మధ్య తాము మనుగడ సాగించలేమని గ్రహించి 1948, సెప్టెంబర్ 17 విలీన ప్రక్రియకు ఆరు నెలల ముందే తమ మిల్లులు, ఆస్తులను ఉన్నఫలంగా వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. విలీనం పూర్తయిన అనంతరం వారు తిరిగొచ్చి తమ స్థిరాస్తులను స్థానికులకు విక్రయించి వెళ్లారని చరిత్ర చెబుతోంది. నాడు వ్యాపారానికి ప్రధాన కేంద్రం రైస్, నూనె మిల్లులు ఏర్పాటు.. భిన్న రాజ్యాల కరెన్సీ మార్పిడి కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవ ప్రత్యేక కథనం -
శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి
వనపర్తి: వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సాయుధ దళ పోలీసు కార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథుడి నిమజ్జన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలు కూడా పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునంద, సీఐ సుగంధ రత్నం, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు మంజునాథ్‌రెడ్డి, పర్వతాలు, నరేష్, ఎస్ఐలు హరిప్రసాద్, హృషికేష్, స్వాతి, రజిత, హిమబిందు, రిజర్వ్ ఎస్ఐలు వినోద్, మొగ్దుంబారీ, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు అమరచింత: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్ తెలిపారు. ఆగస్టులో సీపీఎం నాయకులు డీఎంఆర్ఎం ఆస్పత్రిలో వైద్యసేవలు అందడం లేదని ఫిర్యాదు చేయడంతో బుధవారం స్వయంగా పరిశీలించేందుకు వచ్చి ఫిర్యాదుదారులను ఆస్పత్రికి పిలిపించి మాట్లాడారు. అలాగే రోగులతో మాట్లాడి వసతులు, వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎంఆర్ఎం ఆస్పత్రి పీహెచ్సీగా అప్‌గ్రేడ్ అయినందున 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేవిధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రికి కేటాయించిన సిబ్బంది వెంటనే విధుల్లో చేరేలా చూస్తామన్నారు. రాత్రివేళలో వైద్యం అందించేందుకు స్టాఫ్ నర్స్ అందుబాటులో ఉంటుందని.. సమస్య తీవ్రతను డ్యూటీలో ఉన్న వైద్యుడికి వివరించి చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. ఆస్పత్రి వద్దనే 108, 104 వాహనాలు అందుబాటులో ఉంటాయని వినియోగించుకోవాలని సూచించారు. కార్మికులపై పనిభారం తగ్గించాలి వనపర్తిటౌన్: కార్మికులపై పని భారాన్ని తగ్గించి రూట్ సర్వే ఆధారంగా సమయాలను కేటాయించాలని, అలవెన్స్‌లను 80 శాతం పెంచి అమలు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిపో అధ్యక్షుడు ఏజీ కృష్ణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారం, గతంలో అంగీకరించిన అంశాల అమలును కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విన్నర్ పథకం కింద నియమితులైన ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలతో పాటు ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని కోరారు. జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతపై కమిటీ, విలీన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రీజియన్న్ అధ్యక్షుడు కృష్ణయ్య, కార్యదర్శి వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఎండీ ఖయ్యూం, కార్యదర్శి సి.నాగేశ్వర్, ఉపాధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతోనే ‘సర్’ విజయవంతం
వనపర్తి: ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగేందుకు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, పత్రాల సమర్పణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నో మ్యాపింగ్ లేదా అనామలీస్ నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు నోటీసులో పేర్కొన్న తేదీల్లో తప్పనిసరిగా విచారణకు హాజరై సంబంధిత పత్రాలను సమర్పించాలని.. వివరాలు పరిశీలించి తుది ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రజలకు సరైన సమాచారం అందించాలని సూచించారు. ఇటీవల రెండు దఫాలు నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమంలో ఫారం–6, 7, 8కు సంబంధించి 2,177 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఆయా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రంజిత్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
చార్జీల మోత వద్దు..
సామ్యానుడిపై పెనుభారం.. కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించడం శోచనీయం. డిజిటల్ పేమెంట్లు అలవాటు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రూ.రెండు వేల దాటి చెల్లింపులు చేస్తే ఛార్జీలు విధిస్తామని చెప్పడం దారుణం. ప్రస్తుతం సామాన్య ప్రజలు సైతం విద్యుత్ బిల్లులను యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. ఛార్జీల మోత సామాన్యుడి నడ్డి విరిచేలా తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఛార్జీల అమలును ఉపసంహరించుకోవాలి. – విజయరాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి, అమరచింత గద్వాల: డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడిన సామాన్యులపై యూపీఐ చార్జీల భారం పడనుంది. రూ.2 వేల వరకు యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఉండదు. ఆపై జరిగే కొన్ని రకాల చెల్లింపులపై కనిష్టంగా రూ.12 నుంచి గరిష్టంగా రూ.300 వరకు చార్జీలు విధించనున్నారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంపై జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో వివిధ రకాల లావాదేవీలు నెలకు సుమారు రూ.2,500–3,000 కోట్ల మేర జరుగుతున్నట్లు అంచనా. వీటిపై ఎస్ఎస్టీ, సీఎస్టీ తదితర పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే రూ.200–300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. అయితే కొత్త చార్జీలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు సులభతరం కావడంతో నగదు అవసరం తగ్గిందని కొందరు చెబుతుండగా, అదనపు చార్జీల నేపథ్యంలో మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్లే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ‘నగదు వద్దు.. డిజిటల్ ముద్దు’ అంటూ చెప్పి ఇప్పుడు భారం వేయొద్దు యూపీఐ చార్జీల వడ్డనపై వినియోగదారులు, వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా ఆదాయం -
కార్మికులపై నిర్బంధం తగదు
వనపర్తి రూరల్: సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపడుతున్న ఆందోళనలను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. కార్మికులపై నిర్బంధ చర్యలను వ్యతిరేకిస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట కార్మికులతో కలిసి సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. 8, 9 తేదీల్లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, గ్రామపంచాయతీ, మున్సిపల్, ఆర్టీసీ, విద్యుత్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు, భవన నిర్మాణ, హమాలీ కార్మికుల సమస్యలు ఆయన డిమాండ్ చేశారు. హమాలీ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకుడు పుట్టా ఆంజనేయులు, అధ్యక్షుడు ఆర్ఎన్ రమేష్, కార్యదర్శి మండ్ల రాజు, బొబ్బిలి నిక్సన్, సునిత, బాలగౌడ్, రాజు, రాము, బుచ్చమ్మ, కవిత, గిరిజ, తిరుపతమ్మ, సుమతి, ఇందిర, అరుణ, హరికృష్ణ, శ్రీనివాస్, హనీఫ్, జయమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
రైస్‌మిల్లులపై విజిలెన్స్ దాడులు ఆపాలి
వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్‌మిల్లులపై ఉద్దేశపూర్వకంగా నిర్వహిస్తున్న విజిలెన్స్ దాడులను వెంటనే ఆపాలని రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎంబీ ఫంక్షన్హాల్లో జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షురాలు ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా రైస్ మిల్లర్ల సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. 2014 నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాల నాటి నిబంధనలనే నేటికీ అమలు చేయడం సరికాదని, మారిన పరిస్థితులు, పెరిగిన ధరలకు అనుగుణంగా మిల్లింగ్ చార్జీలు, సీఎంఆర్ నిబంధనలను సవరించి మిల్లర్లకు ఏళ్లుగా చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలని, అందుకు మిల్లర్లు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిబంధనల ప్రకారం సీఎంఆర్ వందశాతం చెల్లించిన వారిపై ఫెనాల్టీ, వడ్డీని రద్దు చేయాలన్న మిల్లర్ల డిమాండ్ల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేస్తూ మిల్లులను షట్‌డౌన్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సమయంలోనే మిల్లర్లు ఐక్యంగా పోరాటంలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని కోరారు. వరికోతల సమయంలో అధికార, విపక్షం అనే తేడా లేకుండా ధాన్యం దించుకోవాలని ఒత్తిడి చేసే నాయకులు రోడ్డెక్కిన మిల్లర్ల సమస్య ఏమిటని అడిగిన దాఖలాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రైస్‌మిల్లర్లు అంటే దోపిడీ దొంగలుగా సమాజంలో చిత్రీకరించడం సరికాదని.. సీఎంఆర్ ఒప్పందాన్ని సవరించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాంతంపై అభిమానం చూపుతున్నారని, అదేవిధంగా మిల్లర్లపై జరుగుతున్న దాడులను ఆపి ఆదుకోవాలని కోరారు. మిల్లర్లంతా ఐక్యంగా సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సోళీపురం శేఖర్‌రెడ్డి, కట్ట సుబ్బయ్య, నరేందర్, సంపత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సైనిక చర్యకంటే ముందే విలీనం..
వనపర్తి రాజమహల్వనపర్తి: సెప్టెంబర్ 17 అంటేనే నిజాం పాలనలో ఉన్న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన రోజుగా అందరికీ తెలుసు కానీ.. నిజాం సార్వభౌమాధికార పరిధిలోని సామంతరాజుగా ఉన్న వనపర్తి మూడవ రాజా రామేశ్వర్రావు అంతకంటే ముందే తన సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం లిఖించని చరిత్ర. వందేళ్ల క్రితమే.. వనపర్తి సంస్థానం చివరి రాజు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ప్రముఖుల్లో ఒకరుగా పేరొందారు. స్వాతంత్య్రం అనంతరం సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేస్తున్న విషయం తెలుసుకొని ముందస్తుగానే అప్పటి పాలకులతో విలీన ఒప్పందానికి సిద్ధం కాగా.. నిజాం పాలకులు వనపర్తి సంస్థానాధీశులపై గుర్రుగా ఉంటూ బందీని చేసేందుకు ప్రయత్నించారు. ఆయన అప్పటికే భారత ప్రభుత్వ రక్షణలో ఉండటంతో నిజాం సర్కారు సైన్యం వెనుదిరినట్లుగా ఇక్కడి వారు కథలుగా చెప్పుకొంటారు. ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ రాష్ట్రం సైతం ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత ఆయన భారత ధౌత్యవేత్తగా ప్రభుత్వ ప్రతినిధిగా సేవలందించారు. అనంతరం కేంద్ర మంత్రిగా మహబూబ్‌నగర్ తొలి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై భారత విదేశాంగ మంత్రిగా సేవలందించారు. కానీ ఈ విషయాలు ఎక్కడా చరిత్రలో లిఖించలేదు. ఇప్పటికీ ఇంకా వనపర్తిలో ఆయన నెలకొల్పిన రాజారామేశ్వర్ ట్రస్ట్‌లో కొంత సమాచారం భద్రపర్చడంగమనార్హం. భారత ప్రభుత్వంలో తనకున్న పలుకుబడితో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను వనపర్తికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువత కోసం సాంకేతిక విద్యాలయానికి తన రాజమహల్‌ను దానంగా ఇచ్చి ఆయనతో ప్రారంభోత్సవం చేయించారు. ఇప్పటికీ ఇంకా రాజ భవనంలోనే కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతోంది. -
వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని నల్లచెరువు ట్యాంక్‌బండ్‌ను సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలో ఎన్ని మండపాలకు అనుమతులు ఇచ్చారు.. నల్లచెరువు వద్దకు నిమజ్జనానికి ఎన్ని విగ్రహాలు వచ్చే అవకాశం ఉందనే వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 300 విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని వివరించారు. నిమజ్జనం రోజున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను విధుల్లో ఉంచాలని, వారికి తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు అందించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగకుండా ఆ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్, పోలీస్, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. 25వ తేదీ నాటికి టౌన్‌హాల్ ప్రారంభించాలి.. పాత మార్కెట్‌యార్డులో నిర్మించిన టౌన్‌హాల్‌ను కలెక్టర్ పరిశీలించారు. మిగిలిన పనులు వేగంగా పూర్తిచేసి 25వ తేదీలోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని పుర కమిషనర్‌ను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కలెక్టర్ వెంట పుర కమిషనర్ నిరంజన్, విద్యుత్, పోలీసుశాఖ అధికారులు ఉన్నారు. -
కేఎల్‌ఐకి పాలమూరు నీరు
నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) నీటిని కేఎల్ఐ ఆయకట్టుకు అనుసంధానించే మరో మార్గం అందుబాటులో ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేలా గతంలోనే ఏర్పాటు చేసిన ఇంటర్‌లింక్ స్లూయిస్ ఇందుకు ఉపయోగపడనుంది. నార్లాపూర్–ఎల్లూరు రిజర్వాయర్లను జంట జలాశయాలుగా పరిగణించేలా ఈ అనుసంధానం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని వినియోగంలోకి తీసుకొస్తే పీఆర్ఎల్ఐ ద్వారా నార్లాపూర్లోకి వచ్చే నీటిని ఎల్లూరుకు మళ్లించి.. అక్కడి నుంచి కేఎల్ఐ పరిధిలోని ఇతర రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. పీఆర్ఎల్ఐలో ఒక పంపును రోజంతా నడిపితే సుమారు 0.3 టీఎంసీ నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే అవకాశం ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో సుమారు 4 టీఎంసీల నీరు ఉన్నట్లు అంచనా. రిజర్వాయర్‌లోకి మరింత నీటిని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో.. అవసరమైనప్పుడు ఇంటర్‌లింక్ ద్వారా ఎల్లూరుకు తరలించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు. నార్లాపూర్ నుంచి స్లూయిస్ ద్వారా నీటిని ఎల్లూరులోకి విడుదల చేసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. గుడిపల్లి నుంచి కేఎల్ఐ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చు. నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు మళ్లించే అవకాశం ఇంటర్‌లింక్ స్లూయిస్‌తో రోజూ 800 క్యూసెక్కుల వరకు తరలింపునకు వీలు కేఎల్ఐ పరిధిలో పెరగనున్న నీటి లభ్యత.. ఆయకట్టుకు ప్రయోజనం -
చిన్నన్న రహస్య భేటీ..?
● హైదరాబాద్ శివారులో అసమ్మతి నేతలతో.. ● మీడియాకు దూరంగా ఉంటూనే మాజీలను ఏకం చేసేపనిలో ఉన్నారా..? వనపర్తి: మాజీ మంత్రి, తాజా మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి గోపాల్పేట మండల కాంగ్రెస్‌పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం వేదికగా చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకొని ఆయనపై వేటు వేయడం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం విధితమే. కాగా కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన మరోసారి రాష్ట్రస్థాయి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ అసంతృప్తు నేతలు కొందరితో రహస్య సమావేశం నిర్వహించి వారిని ఏకం చేసి అధిష్టానం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిలో మరొకరిని నియమించడంతో స్వగ్రామంలో ఉంటూ పొలం పనులు చేసుంటూనే.. పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదనే మనోవేదనతో ఉన్న వారిని ఒకేచోట చేర్చే యోచనతో ఈ సమావేశం జరిపినట్లు తెలుస్తోంది. 2004లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వనపర్తి వేదికగా 40 మంది ఎమ్మెల్యేలను ఏకం చేసిన ఘటనను గుర్తు చేసేలా చిన్నన్న పెద్ద ప్లాన్‌లోనే ఉన్నట్టున్నారని పార్టీలో ఆయన సీక్రెట్ మీటింగ్ ఓ చర్చ లేవనెత్తేలా చేసింది. మీడియాకు దూరంగా ఉంటూనే.. మీడియాతో మాట్లాడటానికి విముఖత చూపిస్తూనే వ్యవసాయ క్షేత్రం నుంచే ప్రత్యర్థుల ఊహకందని విధంగా స్కెచ్ వేసి అధిష్టానానికి స్థానిక విషయాలను తెలియజేస్తూ.. తన మునుపటి వైభవాన్ని దక్కించుకొని తన క్యాడర్లో సన్నగిల్లుతున్న నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సన్నిహితులు చర్చించుకుంటున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏమిటని మీడియా వారు ప్రశ్నిస్తే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.. ఏదైనా ఉంటే పిలిచి వెల్లడిస్తానంటూ దూరంగా ఉంటూనే తన ప్లానింగ్‌ను సీక్రేట్‌గా అమలు చేస్తున్నారనే గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. రహస్య సమావేశానికి వనపర్తి నియోజకవర్గం నుంచి కొందరు ముఖ్యులు హాజరైనట్లుగా తెలుస్తోంది. కానీ ఎవరూ సమావేశ విషయాలు బయట పడకుండా జాగ్రత్తలు పాటిస్తుండటం గమనార్హం. తాజాగా పార్టీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పదవికి దూరమైన సంఘటన.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, 2023 ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలతో టికెట్ దూరమైన సందర్భాన్ని పార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డినే చిన్నన్న తొలి ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారం కోసం వాల్‌రైటింగ్ రాసినట్లు పలు వేదికలపై చెప్పినా.. ఆయనకు పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నా స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రెండోసారి ఘాటు వ్యాఖ్యలతో చేటు.. ఢిల్లీకి పయనమవుతున్నారా..? పార్టీ, ప్రభుత్వానికి అంటిముట్టనుట్టుగా ఉంటున్న వారిని ఏకం చేసి అందరితో కలిసి ఢిల్లీకి పయనమై తమ వాదనలను అధిష్టానం వద్ద బలంగా వినిపించేందుకు చిన్నన్న సీక్రెట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందరి మద్దతుతో తమ వాదనలు బలంగా వినిపించేలా తీర్మానం చేసుకున్నట్లు సమాచారం. -
నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్!
పాలన సూపర్ అంటే చాలు.. నజరానాగా కీలక పోస్టుల్లో నియామకం.. మీ వెనుకే ఉంటాం అంటే అందలం.. ప్రశ్నిస్తే మాత్రం పనిష్మెంట్.. పాలమూరు యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల్లో ఇటీవల జరుగుతున్న చర్చ ఇది. విశ్వవిద్యాలయ పరిపాలనలో ముఖ్య భూమిక వహిస్తున్న వారు సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష ప్రదర్శిస్తూ.. అనుభవం లేకున్నా తమ అనుకూల వర్గానికి కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది రెండు (రెగ్యులర్, కాంట్రాక్ట్) గ్రూప్‌లుగా చీలిపోగా.. అంతర్గత వార్ ముదిరినట్లు సమాచారం. పాలకుల ఏకపక్ష వైఖరి, అసమర్థ నిర్ణయాలతో పీయూలో పాలనగాడి తప్పిందనే విమర్శల నేపథ్యంలో ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే.. పాలమూరు యూనివర్సిటీలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆరుగురు ప్రొఫెసర్లు పిండి పవన్‌కుమార్, కిషోర్‌కుమార్, నూర్జహాన్, జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రకిరణ్‌కు అనుభవం ఉంది. వీరిలో ప్రొఫెసర్ చంద్రకిరణ్‌కు తప్ప.. మిగతా ఐదుగురు సీనియర్లకు ఏ రకమైన కీలక బాధ్యతలు ఇవ్వకుండా మొండిచేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రిజిస్ట్రార్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్ మధుసూదన్‌రెడ్డికి పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు వీసీ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కరికి 2, 3 బాధ్యతలు.. యూనివర్సిటీ పరిధిలోని ఎనిమిది ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఏకంగా ఐదింటిని కాంట్రాక్ట్ అధ్యాపకులతో భర్తీ చేయడం.. ఒక్కరికి రెండు, మూడు పోస్టుల చొప్పున ఇవ్వడం.. ప్రొఫెసర్ హోదాలో ఉన్న సీనియర్లను కీలక బాధ్యతల నుంచి తప్పించడం, నామమాత్రపు పోస్టుల్లో నియమించడం విమర్శలకు తావిస్తోంది. రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని కాదని.. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రాధాన్యమివ్వడంపై విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి నుంచే దూరం.. వీసీగా శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రిజిస్ట్రార్‌గా చెన్నప్పను నియమించారు. ఆయన కొన్ని నెలలకే ఆ బాధ్యత నుంచి తప్పుకొన్నారు. ఈ క్రమంలో ఓయూ ప్రొఫెసర్‌గా ఉన్న రమేష్‌బాబును తీసుకొచ్చి రిజిస్ట్రార్‌గా నియమించారు. ఇది యూనివర్సిటీలోని రెగ్యులర్ అధ్యాపకులను మనస్తాపానికి గురిచేసినట్లు సమాచారం. పీయూలో సీనియర్లుగా ఉండి, గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వారిని సైతం పక్కనబెట్టడంతో ఆ రోజు నుంచే పలువురు వీసీతోపాటు రిజిస్ట్రార్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కాగా, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని దగ్గర ఉంచుకుని పీయూ పాలనా యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని నాన్–టీచింగ్, దిగువ స్థాయి ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. వీసీ, రిజిస్ట్రార్ తీరుపై విమర్శలు.. పీయూలో చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకులు వారిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న వారితో ఒకలా, లేని వారితో మరోలా వ్యవహరిస్తున్నారని.. చాలా సమయం వీసీ చాంబర్ ఎదుట నిలబెట్టడం వంటివి చేస్తున్నారని కొందరు రెగ్యులర్ ప్రొఫెసర్లు బాధను వెళ్లగక్కారు. నచ్చకుంటే అన్నింటా తలదూర్చడమే కాకుండా అగౌరవ పరుస్తున్నారని వాపోయారు. గట్టిగా ప్రశ్నిస్తే పీజీ సెంటర్లకు బదిలీ చేస్తామని సైతం బెదిరిస్తున్నట్లు అధ్యాపక వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలమూరు యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా పాలన సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష 8 ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఐదింట కాంట్రాక్ట్ లెక్చరర్లే.. ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే కీలక బాధ్యతలు అనుభవం ఉన్నా.. మిగతా వారికి మొండిచేయి అందరికీ ప్రాధాన్యం ఇస్తాం పోస్టుల కేటాయింపులో రెగ్యులర్ వారితో పాటు అందరికీ ప్రాధాన్యత ఇస్తాం. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. భవిష్య త్లో భర్తీ చేసే పోస్టుల్లో రెగ్యులర్ వారికి మరిన్ని పోస్టులు కల్పిస్తాం. ప్రస్తుతం పోస్టులు కేటాయించిన వారు పూర్తిస్థాయిలో పనిచేస్తే యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందుతుంది. కాంట్రాక్టు సిబ్బందికి అదనంగా ఉన్న బాధ్యతలను తగ్గిస్తాం. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్ అధికారాలు కేంద్రీకృతం కావద్దు పీయూలో వివిధ పోస్టులు ఒకే చోట కేంద్రీకరణ కావద్దు. కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రాధాన్యత ఇస్తూ రెగ్యులర్, సీనియర్లు, అనుభవం ఉన్న వారి సేవలను యూనివర్సిటీలో వినియోగించుకోవాలి. కానీ ఒక్కరికే, రెండు, మూడు పోస్టులు ఇస్తే ఎలా అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుంది. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. – రాము, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు, పీయూ -
ఆందోళనలో రైతులు..
భూత్పురు కాల్వ నీటిని మళ్లించుకునే యత్నంలో భాగంగా నీరు ముందుకు వెళ్లకుండా తూముల షట్టర్లను పగులగొట్టి మూసి ఉంచుతుండటంతో చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరచింత మండలంలోని ధర్మపురం గ్రామానికి సాగునీటిని మళ్లించే తూముతో పాటు మస్తీపురం గ్రామానికి సాగునీటిని మళ్లించే తూమును గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టడంతో సమస్య జటిలంగా మారింది. మూడు నెలలుగా కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నా సమీప చెరువులకు సైతం నీరు చేరకపోవడం ఏమిటని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. 32.5 కి.మీ. పొడవునా ఉన్న కాల్వ వెంట అడుగుకో పంపుసెట్ ఏర్పాటు చేసుకుని పొలాలకు సాగునీటిని మళ్లించుకుని వెళ్తున్నా అరికట్టే వారే కరువయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
డిండి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలి
కందనూలు: డిండి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం జిల్లాకేంద్రంలోని గాంధీ పార్కులో జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జల సాధన సత్యాగ్రహ దీక్షకు రైతులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి, రాఘవాచారి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు పాలమూరు ప్రాజెక్టులు, రైతుల సమస్యలు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. నల్లగొండకు నీటి తరలింపు పేరుతో పాలమూరు రైతులకు అన్యాయం జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. డిండి ప్రాజెక్టుతో పాలమూరు రైతులు, గ్రామాలు నష్టపోయే పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎర్రవల్లి, గోకారం, ఉల్పర, అజిలాపూర్ గ్రామాలను ముంపునకు గురిచేసే చర్యలను నిలిపివేయాలని కోరారు. జల సాధన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ కోదండరాం ఫోన్లో సంఘీభావం తెలిపారు. పాలమూరు జిల్లా రైతాంగం నీటి హక్కుల కోసం పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటం న్యాయమైనదని ఆయన పేర్కొన్నారు. రైతుల హక్కులు, పాలమూరు ప్రాంతానికి న్యాయం జరిగేలా విధాన మండలిలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు శశిధర్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, సదానందం, జంగయ్య, చెన్నకిష్టయ్య, బెక్కెం జనార్దన్, తిమ్మప్ప, శ్రీనివాస్‌నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మచ్చలే మకుటంగా.. నల్లమల రాజసం
అచ్చంపేట: నల్లమల గిత్తగా పేరొందిన తూర్పు పొడ జాతి పశువులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. తెలంగాణలో నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదాకు నోచుకోలేకపోతోంది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాంత పశువుకు గౌరవం కల్పించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 2025 మే నెలలో అమ్రాబాద్ మండలం మాచారం వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. తెలంగాణ బ్రాండ్‌గా తూర్పు పొడ జాతి పశువులు లోతట్టు ప్రాంతంలో మేలురకం పశు సంపద అమ్రాబాద్ గిత్తకు వందేళ్లకుపైగా చరిత్ర 500 మంది రైతులు.. 20 వేల పశువుల పెంపకం 2020లో ప్రత్యేక పశువుగా గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం కోసం ఎదురుచూపు -
ప్రత్యేక హోదా కల్పిస్తాం..
కోడె దూడలకు డిమాండ్ వ్యవసాయ అనుబంధమైన పశు పోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశు సంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్‌తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి నచ్చిన వాటిని కొనుగోలు చేసేవారు. ప్రతిఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతారు. అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ఎత్తైన గుట్టలు, లోయ ప్రాంతంలోనూ నడిచే శక్తి ఉంటుంది. కాళ్ల గిట్టలు గుర్రం గిట్టలను పోలి బలంగా ఉండటంతో బాగా నడుస్తాయి. అటవీ మేతతో దృఢంగా ఉండడం, 20– 25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీటిపై ఆసక్తి చూపుతారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉండి పాలు సైతం బాగా ఇస్తాయి.నైపుణ్యం కలిగిన పశువులు.. మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది. – హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు నల్లమల పొడజాతి మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ప్రత్యేకమైన మచ్చలపై పరిశోధన చేయిస్తాం. ఇక్కడ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. ఈ జాతి పశువులను సంరక్షించేందుకు ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని నల్లమలకు గుర్తింపు తెస్తాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన
విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి.. గోపాల్పేట: కరెంటు కోతలతో పంట పొలాలకు నీరు పారడంలేదని పలు గ్రామాల రైతులు గోపాల్పేట విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో 18 గంటల కరెంటు వచ్చేదని.. ఇప్పుడు 12 గంటలు కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కాగా, విద్యుత్ ఏఈ సుధాకర్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. ఏడీఈకి ఫోన్ చేయగా.. సానుకూలంగా స్పందించి కరెంటు సరఫరా చేయడంతో రైతులు శాంతించారు. వనపర్తి రూరల్: వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ కూడా సరఫరా కావడం లేదంటూ శనివారం రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి మండలం నాచహళ్లి, కిష్టగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాల రైతులు నాచహళ్లి గ్రామ శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట పెబ్బేరు – వనపర్తి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో పంటలకు సరిపడా నీరందక ఎండిపోతుండటంతో పాటు బోరుమోటార్లు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఇబ్బందులను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న విద్యుత్ ఏఈ చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, మాధవరెడ్డి, డేగా మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, రవిప్రకాశ్‌రెడ్డి, టీకే నాయక్, కిష్టగిరి సర్పంచ్ పద్మ వెంకటేశ్, నారాయణ, శంకర్‌నాయక్, బాలకృష్ణ, మహేశ్, అంజి, రూప్లానాయక్, గోవిందు నాయక్, తులసి, రామకృష్ణ, శ్రీను, ఆనంద్ పాల్గొన్నారు. నాచహళ్లిలో ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు -
లోతట్టు అభయారణ్యంలో..
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఈ గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకుని పనిచేస్తున్నారు. నల్లమల ప్రాంతంలో మేలుజాతి పొడ పశువులు మన్ననూర్ గిత్తగా నామకరణం.. 2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్(బికె)లో ఈ ప్రాంత రైతులు, తెలంగాణ జీవవైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేసింది. అదేవిధంగా పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 20 వేలకు తగ్గిపోయింది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనే వారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతాల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడింది. పశు పోషణ భారంగా మారి చాలామంది ఆ వృత్తిని వదులుకుంటున్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్
కొత్తకోట: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి.. రైతులు, ప్రజలను మోసం చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. శనివారం కొత్తకోట చౌరస్తాలో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిందని సంబురాలు చేసుకుంటుందని.. ఈ వెయ్యి రోజుల్లో రైతులకు, సామాన్య ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలు వర్షంలా కురిపించిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రూ. 2లక్షల రుణమాఫీని అర్హులైన ప్రతి రైతుకు అమలు చేయకుండా, కొందరికే పరిమితం చేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. రైతుభరోసా సకాలంలో అందక, పంటలకు అవసరమైన విద్యుత్ సరఫరా లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొడంగల్‌కు విద్యుత్ సరఫరా చేస్తూ.. ఇతర ప్రాంతాల రైతులకు ఎందుకు కోతలు విధిస్తున్నారని నిలదీశారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. రాజకీయ ప్రచారాలు, సంబురాలకే పరిమితమైందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ మాటలు ఎక్కువగా చెప్పారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకుమించి మాటలకే పరిమితమవుతున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, గిట్టుబాటు ధరల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం మున్సిపాలిటీలోని 7వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నంది నర్సయ్య, జాతీయ కోఆప్షన్ సభ్యుడు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, డోకూర్ పవన్‌కుమార్ రెడ్డి, అయ్యవారి ప్రభాకర్‌రెడ్డి, కొండ ప్రశాంత్‌రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్, రాజవర్దన్‌రెడ్డి, కౌన్సిలర్ గాయత్రి సత్యంసాగర్, దాబా శ్రీను, నరేంద్రగౌడ్ పాల్గొన్నారు. -
పకడ్బందీగా సర్ ప్రక్రియ
గోపాల్పేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపుక లెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శనివారం గోపాల్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో చేపట్టిన సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ప్రచార దినోత్సవం సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే పౌరులకు అవసరమైన సమాచారం అందించాలని బీఎల్ఓలకు సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియలను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు కావాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం వనపర్తి రూరల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన విప్లవ నాయకుడు సీతారాం ఏచూరి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.బాల్‌రెడ్డి అధ్యక్షతన సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ.. సామాజిక అసమానతలు లేని సమాజం కోసం ఏచూరి చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. విద్యార్థి దశలోనే ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని.. దేశంలో మతోన్మాద శక్తులు పెరుగుతున్న సమయంలో లౌకిక శక్తుల ఐక్యత కోసం ఏచూరి నిరంతరం కృషి చేశారన్నారు. ప్రతిపక్షాల ఐక్యత, ఇండియా కూటమి ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించే విధానాల కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, రాజు, లక్ష్మి, గోపి, ఉమా పాల్గొన్నారు. ప్రసాదాల విక్రయ వేలం రూ.61 లక్షలు చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు రూ.61.01 లక్షలకు వేలం పలికింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల విక్రయానికి బహిరంగ, సీల్డ్ కవర్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో హన్వాడ మండలం కాకర్లపాడుకు చెందిన వెంకటయ్య రూ.61,00,111కు లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దక్కించుకున్నారు. అదేవిధంగా విద్యుత్ అలంకరణ పనులను అమరచింతకు చెందిన ప్రవీణ్ రూ.3,49,999కు, రంగులు వేసే పనులను తిర్మలాపురానికి చెందిన ప్రవీణ్ రూ.3.65 లక్షలకు దక్కించుకున్నారు. -
ఎగువ జలకళ.. దిగువ వెలవెల!
పెద్ద చెరువు బోసిపోతుంది.. భూత్పురు కాల్వ ద్వారా వచ్చే సాగునీటితో అమరచింత పెద్ద చెరువు నిండి అలుగు పారేది. ఈసారి కాల్వకు సాగునీరు విడుదల చేస్తున్నా ఎగువలో ఉన్న రైతులు దిగువకు నీరు వెళ్లకుండా తూములను మూసివేసి, నీటిని తమ తమ గ్రామాలకు మళ్లించుకుంటున్నారు. దీంతో అమరచింత పెద్ద చెరువు నీరులేక బోసిపోయింది. బోరుబావులు కూడా రీచార్జి కావడం లేదు. పంటలు ఎండుముఖం పడుతున్నాయి. – లక్ష్మీనారాయణ, రైతు, అమరచింత లష్కర్‌తో పర్యవేక్షణ.. మక్తల్ మండలం నుంచి నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల వరకు విస్తరించి ఉన్న భూత్పురు కాల్వ వెంట లష్కర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. 32 కి.మీ. పొడవునా ఉన్న కాల్వ వెంట ముగ్గురు లష్కర్లు మాత్రమే ఉన్నారు. తూముల షట్టర్లు ధ్వంసం చేశారని తెలుసుకున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిత్యం కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. – బాలకృష్ణ, ఏఈ, ఇరిగేషన్‌శాఖ అమరచింత: భూత్పురు రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎగువన ఉన్న రైతులు కాల్వ తూముల షట్టర్లను పగులగొట్టి సాగునీటిని తమ తమ గ్రామాలకు తీసుకెళ్తుండటంతో దిగువన ఉన్న పంట పొలాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. భూత్పురు రిజర్వాయర్ నుంచి అమరచింత, ఆత్మకూర్ మండలాలకు సాగునీరు అందించే భూత్పురు కాల్వ వెంట ఆయకట్టు రైతులు నిత్యం తిరగాల్సిన దుస్థితి నెలకొంది. 32వేల ఎకరాల ఆయకట్టు.. భూత్పురు రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో మక్తల్, నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాలు ఉండగా.. మొత్తం 35 గ్రామాల్లోని 32వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రతి వర్షాకాలంలో జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని భూత్పుర్ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నారు. ఈసారి గత జూలైలో ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. అయితే చివరన ఉన్న అమరచింత పెద్ద చెరువు, పిన్నంచర్ల గ్రామ చెరువుల్లోకి సాగునీరు చేరుకోలేకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఏడాది పొడవునా కేవలం ఒకే ఒక పంటను పండించుకునే రైతులకు ఈసారి సాగునీరు వస్తుందని ఆరుతడి పంటలను సాగుచేసుకున్నారు. తీరా కాల్వ ద్వారా సాగునీరు రాకపోవడం.. నీటిని ఎగుమ గ్రామాల రైతులు మళ్లించుకుని వెళ్తున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అమరచింత, పిన్నంచర్ల గ్రామాల రైతులు నిత్యం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, యాంకి గ్రామాల వరకు కాల్వ వెంట వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భూత్పురు రిజర్వాయర్ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు ఎగువన ఎడమ కాల్వ తూముల షట్టర్ల ధ్వంసం మూడు నెలలుగా నీరు పారుతున్నా నిండని చెరువులు అమరచింత, పిన్నంచర్ల రైతులకు తప్పని సాగునీటి కష్టాలు -
ప్రాచీన చేతిరాతల డిజిటలైజేషన్
వనపర్తి: ఆధ్యాత్మిక, ఆయుర్వేద, ప్రాచీన చరిత్రకు సంబంధించిన చేతిరాతలు సేకరించి వాటిని డిజిటలైజేషన్ చేసేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధ్యక్షతన జిల్లా కమిటీ ఏర్పాటైంది. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలు తమ ఇళ్లలో భద్రపర్చుకున్న ప్రాచీన చేతిరాతలు, ఆలయాలు, మఠాలు, దర్గాల్లోని వారసత్వ గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు తదితర చేతిరాతలను గుర్తించి వాటిని డిజిటలైజేషన్ చేసి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సభ్యులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థుల ద్వారా చేతిరాతల వివరాలు సేకరించి నిర్ణీత ప్రొఫార్మాలో వివరాలను ముందుగా సేకరించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నరేందర్‌కుమార్, ఎఫ్–సెక్షన్ సూపరింటెండెంట్ సునీత, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం
● 88,727 మంది ఓటర్లకు ‘సర్’ నోటీసులు ● సరైన ఆధారాలు చూపిస్తే ఓటుహక్కు కల్పిస్తాం ● జిల్లాలో 2.35 లక్షల ఓటర్లు ● గ్రామాలకు వెళ్లి విచారణ.. ఆధారాల సేకరణలో సిబ్బంది ● ‘సాక్షి’ ఫోన్–ఇన్‌లో అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ ప్రశ్న : కొత్త ఓటరు నమోదుకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి? – నవీన్, గోపాల్పేట అదనపు కలెక్టర్ : ఏడాదికి రెండు అంతకంటే ఎక్కువ సార్లు అర్హులకు ఓటు హక్కు కల్పించేందుకు సీఈఓ ఫారం–6 స్వీకరిస్తుంది. ఆ సమయంలో దరఖాస్తును తహసీల్దార్ కార్యాలయం ఎన్నికల విభాగంలోగాని, ఆన్‌లైన్‌లోగాని దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 12, 13 తేదీల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన వారు ఉపయోగించుకోవాలి. ప్రశ్న : వయసు 45 ఏళ్లు పైబడి ఉంటుంది. ఎక్కడా ఓటుహక్కు లేదు. ఓటరు నమోదుకు కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? – రాములు, పాన్‌గల్ అదనపు కలెక్టర్ : వయస్సు ఎక్కువగా ఉండి ఓటరు నమోదుకు దరఖాస్తు చేసినట్లయితే.. సంబంధిత డాక్యుమెంట్లతో పాటు దేశంలో మరెక్కడా ఓటుహక్కు లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో సదరు వ్యక్తికి ఇతర ప్రాంతంలో ఓటుహక్కు ఉన్నట్లు నిర్థారణ అయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం శిక్షార్హులవుతారు. పేర్లు, వయసు, ఇంటిపేరులో వ్యత్యాలుంటే.. మునుపటి ఓటరు జాబితాలో ఒకలా.. ప్రస్తుత ఓటరు జాబితాలో మరోలా పేరు ఇద్దరూ ఒక్కరే అని ధ్రువీకరించేందుకు సీఈఓ జారీ చేసిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి బీఎల్వోలకు సమర్పిస్తే అప్పటికప్పుడే ఆన్లైన్లో నమోదు చేస్తారు. 2026, నవంబర్ 9న చేసే తుది ఓటరు జాబితాలో వారికి ఓటుహక్కు కల్పించబడుతుంది. ప్రశ్న : సర్ నోటీసులు జారీ చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామసభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదా..? – అంజద్ అలీ, రామన్‌పాడ్, మదనాపురం అదనపు కలెక్టర్ : పాత, ప్రస్తుత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు, ఇంటిపేరు, వయస్సులో వ్యత్యాసాలుంటే నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు జాబితాల్లో పేర్కొన్న వ్యక్తి ఒక్కరేనని నిర్ధారించేందుకు సీఈఓ నిర్దేశించిన ధ్రువపత్రాల్లో ఏదైన ఒకటి బీఎల్వోకు అందజేస్తే సమస్య వెంటనే పరిష్కారమవుతుంది. విచారణ అధికారులు గ్రామాలకు వచ్చి గ్రామసభలు నిర్వహిస్తూ అక్కడే సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని పది మండలాల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఆవాస ప్రాంతాలకు 20 బృందాలను ఏర్పాటు చేశాం. వనపర్తి: నోటీసులు వచ్చాయని ఓటర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు.. కేవలం వివరాలను సరిచేసేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు సమర్పించాలనే నోటీసులు జారీ చేశాం.. ఓట్లు గల్లంతవుతాయనే అపోహలు వదిలేయండి.. సరైన ధ్రువపత్రాలు బీఎల్వోలకు సమర్పించి ఓటుహక్కు పొందాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ సూచించారు. ‘సర్’ ప్రక్రియపై ఓటర్లకు ఉన్న అపోహలు తొలగించి సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్–ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వివరాలు వెల్లడించటంతో పాటు పలువురు ఓటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జిల్లాలో ఎస్ఐఆర్కు ముందు 2.75 లక్షల ఓట్లు ఉండేవని.. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన లెక్కల ప్రకారం పబ్లిష్ చేసిన ఓటరు జాబితాల్లో 2.35 లక్షలు ఉండగా, వారిలో 88,727 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇందులో నో మ్యాపింగ్ ఓటర్లు 12,087 మంది.. పేర్లు, ఇంటిపేర్లు, వయసు వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు 76,640 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. నో మ్యాపింగ్ జాబితాలో ఉన్న వారు 1987కు ముందు జన్మించిన వారైతే స్థానికులనే ధ్రువపత్రం ఏదైనా ఒక్కటి సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. 1987–2004 మధ్య కాలంలో జన్మించిన వారైతే తన ధ్రువపత్రంతో పాటు ఈ ప్రాంతంలో తన తండ్రి ఓటు వేసినట్లుగా ఓటరు జాబితాలో ఉన్న ఎపిక్ నంబర్, ఓటరు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ 2004 –2025 మధ్య కాలంలో జన్మించిన వారైతే వారి స్థానిక ధ్రువపత్రంతో పాటు కుటుంబ సభ్యుల్లో కనీసం ఇద్దరి ఓటర్లు జాబితాలోని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు వ్యక్తి ఓటుహక్కును బీఎల్వోలు జాబితాలో చేర్చేందుకు సిఫారస్ చేస్తూ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రశ్న : కొన్ని ఇంటినంబర్లపై 20కి పైబడి ఓట్లు ఉండటం ఎలా సాధ్యం? – శ్రీనివాసులు, మదనాపురం అదనపు కలెక్టర్ : అద్దెకు ఉన్న ఇళ్లలో ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు గుర్తించాం. ఇందులో చాలావరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినప్పుడే తగ్గిపోయాయి. స్థానికంగా ఉంటున్నారు.. ఇదివరకు ఇక్కడి ఓటరు జాబితా ప్రకారం వారి కుటుంబ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నట్లుగా ఆధారాలు సమర్పించిన వారికే జాబితాలో పేర్లు నమోదవుతాయి. ప్రశ్న : పెళ్లి చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చిన వారు ఏ ధ్రువపత్రాలు సమర్పించాలి. – విజయ్‌కుమార్, పెబ్బేరు అదనపు కలెక్టర్ : దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం నుంచి అయినా ఇక్కడికి పెళ్లి చేసుకుని వచ్చిన మహిళలైనా వారి తల్లిదండ్రుల ఓటుహక్కు ఎక్కడ ఉంటే అక్కడి వివరాలను ఓటరు జాబితా ఆధారంగా సేక రించి సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సిందే. భర్త వివరాలను పేర్కొనాలనుకోవడం సరికాదు. ప్రశ్న : మా అమ్మ ఇంటిపేరు లేకుండా ఓటరుగా నమోదు చేశారు. ఆమె చదువుకోలేదు. ఏ ధ్రువపత్రాలు సమర్పించాలి. – నర్సింహ, గోపల్‌దిన్నె, వీపనగండ్ల అదనపు కలెక్టర్ : పట్టాదారు పాసు పుస్తకం, ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణపత్రం, పింఛన్‌కార్డు, ఆధార్‌కార్డు సమర్పిస్తే సరిపోతుంది. వారికి ఓటుహక్కు కల్పిస్తాం. -
నేడు లోక్ అదాలత్
వనపర్తిటౌన్: జిల్లాలోని కోర్టుల్లో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. సివిల్, వివాహ సంబంధిత కేసులు, మోటారు ప్రమాద క్లెయిమ్స్, చెక్‌బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని.. ఏళ్లుగా పరిష్కారం కాని కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. సమర్థవంతంగా ప్రజాపాలన దినోత్సవం వనపర్తి: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టరేట్ ఆవరణలో వేడుకల నిర్వహణకు అవసరమైన వేదిక, కుర్చీలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, ఆహ్వానితులు హాజరయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, అందరికీ ఆహ్వానాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం జరిగే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, సీపీఓ హరికృష్ణ, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. కేంద్ర బృందం తనిఖీ మదనాపురం: మండలంలో జల్ సంచయ్.. జల్ భాగీదారి పథకంలో భాగంగా చేపట్టిన నీటి నిల్వ పనులను శుక్రవారం కేంద్ర బృందం ప్రతినిధి అమన్సోన్ పరిశీలించారు. గతేడాది వివిధ గ్రామాల్లో నిర్మించిన ఫాంపాండ్స్, ఇంకుడుగుంతలు, గట్లపై తవ్విన ట్రెంచెస్ తదితర నీటి సంరక్షణ నిర్మాణాల వివరాలను అధికారులు ఆనన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన వర్క్ఐడీల ఆధారంగా మండలంలోని అజ్జకొల్లు, తిరుమలాయపల్లి, రామన్న్పాడు, మదనాపురం, నెల్విడి, నర్సింగాపురం, కొన్నూరు, దుప్పల్లి, ద్వారకానగర్, గోపన్పేట్ గ్రామాల్లో పర్యటించిన బృందం 22 ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీచేసి నిర్మాణాల నాణ్యతను, వినియోగాన్ని సమగ్రంగా పరిశీలించింది. వారి వెంట ఏపీఓలు వీబీ జయరామ్, బాలయ్య, ఈసీ ముఖీద్, సాంకేతిక సహాయకులు (టీఏలు) సౌమ్య, జ్యోతి, భరత్, రాఘవేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాల నిర్వహణ
వనపర్తి: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై శాంతికమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాహకులు మండపాల ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాకు నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన తీగలను మాత్రమే వినియోగించాలని.. సంబంధిత శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కూడా ముందుగానే విద్యుత్ సరఫరా, ఇతర అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో డీజేలు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వినియోగించాలని.. అధిక శబ్ధంతో వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, ఆస్పత్రుల్లోని రోగులకు ఇబ్బందులు కలగకుండా శబ్ధ పరిమితులు తప్పనిసరిగా పాటించాలన్నారు. అవసరమైన చోట తాగునీరు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నిమజ్జనం రోజున మద్యం దుకాణాలు మూసి వేయించనున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. నిర్వాహకులు, ప్రజలు అధికారులకు సహకరిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ, పారిశు ద్ధ్య తదితర శాఖల అధికారులు, మసీద్ కమిటీ సభ్యులు, శాంతికమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా భూ రీ–సర్వే
ఖిల్లాఘనపుర: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పకడ్బందీగా భూ రీసర్వే చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం మండలంలోని మల్కాపురం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ–సర్వేను రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. రోవర్ల వినియోగం, ఆధునిక సాంకేతికతో సర్వేయర్లు భూములు కొలుస్తున్న విధానాన్ని క్షేత్రస్థాయిలో చూశారు. భూములు కొలిచే సమయంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న భూ రీ సర్వేకు మల్కాపురం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై ందన్నారు. గ్రామ శివారులోని భూములకు సంబంధించి రికార్డులు సమగ్రంగా, పారదర్శకంగా నవీకరించడంతో పాటు సర్వేనంబర్ల వారీగా హద్దులు గుర్తించి వివాదాలను పరిష్కరిస్తారని తెలిపారు. డిజిటల్ భూ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం ప్రాజెక్టు ఉద్దేశమని.. రైతులు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు సర్వే అఽధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. రైతుల సందేహాలు, అభ్యంతరాలను నివృత్తి చేసి నిబందనల ప్రకారం సర్వే చేపట్టాలని సూచించారు. అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో సర్వే ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ సుగుణ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, సర్పంచ్ రవీందర్, రెవెన్యూ అఽధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. జ్వరంతో వచ్చే రోగికి డెంగీ పరీక్షలు.. జ్వరంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి కచ్చితంగా డెంగీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం మండలకేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. డెంగీ పరీక్షలు చేయడంతో సకాలంలో గుర్తించి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. క్షయ అనుమానితులను గుర్తించి అవసరమైన వారికి ఎక్స్‌రే తీసేందుకు ప్రభుత్వం ఇచ్చిన యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ఆస్పత్రి ఆవరణలో శుభ్రత పాటించాలని సూచించారు. ● మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ శిథిలావస్థకు చేరిందని.. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శుక్రవారం ఆయన హాస్టల్ గదులను పరిశీలించగా.. పైకప్పు పెచ్చులూడి కనిపించడంతో స్పందించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్, ఎస్సీ సంక్షేమశాఖ అఽధికారి రాంజీరావు, వైద్యులు, సిబ్బంది, వివిధ శాఖల అఽధికారులు ఉన్నారు. -
పటిష్ట నిఘాకే సీసీ కెమెరాలు : ఎస్పీ
వనపర్తి: ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై పటిష్ట నిఘా, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ సంస్థలు, దాతల సహకారంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 412 సీసీ కెమెరాలు, మరమ్మతు చేయించిన పాత కెమెరాలను కలుపుకొని మొత్తం 2,221 సీసీ కెమెరాల యూనిట్‌ను శుక్రవారం సాయంత్రం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన ప్రదేశాల్లో నిత్యం నిఘా కొనసాగనుందని, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడంతో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలు, నేరాలకు సంబంధించిన ఘటనలను గుర్తించడం నిరంతర ప్రక్రియలో భాగమవుతుందన్నారు. స్మార్ట్ పోలీసింగ్.. సేఫ్ వనపర్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దాతలను ఎస్పీ శాలువాలతో సత్కరించారు. సమాజ హితం కోసం భవిష్యత్‌లోనూ ఇలాంటి సామాజిక భాగస్వామ్యం కొనసాగాలని పిలుపునిచ్చారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి.. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణలో జరుపుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి సూచించారు. శుక్రవారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని, ప్రతి ఒక్క గణపతి మండపం జ్ట్టి ఞట://ఞౌ జీఛ్ఛిఞౌట్ట్చ .్టటఞౌ జీఛ్ఛి.జౌఠి.జీ ుఽ లింకుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మండపాల్లో ఎట్టి పరిస్థితుల్లో డీజేలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, వనపర్తి, కొత్తకోట సీఐలు సుగంధ రత్నం, ఓడీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, జిల్లాలోని ఎస్సైలు, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ మతాల పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మరో ఏడాది ఆగాల్సిందే!
వేగవంతం చేస్తున్నాం.. నార్లాపూర్– ఏదుల రిజర్వాయర్ మధ్య ఓపెన్ కాల్వలో కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద ఉన్న రాయిని తొలిగింపు పనులు వేగవంతం చేశాం. డిసెంబర్ చివరిలోగా తొలిగింపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. రాయి బ్లాస్టింగ్ చేసి లోతు నుంచి బయటకు రాళ్లు తీసుకెళ్లడం కొంత ఇబ్బందిగా ఉంది. కాల్వలో హార్డ్ రాక్ తొలిగిస్తే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లు తరలించవచ్చు. ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి కర్వెనకు ఎత్తిపోయడానికి పంపుసెట్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. అన్ని పనులు పూర్తయ్యి.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీళ్లు ఉంటే రిజర్వాయర్‌లోకి తరలించవచ్చు. – పార్థసారధి, ఇరిగేషన్ ఎస్ఈ నాగర్‌కర్నూల్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. గతేడాది మే నెలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. ఇంకా చాలా వరకు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రెండు పంపుసెట్లు ప్రారంభించినా.. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసి నిలిపివేశారు. ఏదుల రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేయడానికి ఓపెన్ కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటమే ఇందుకు కారణం. కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గట్టి రాయి ఉండటంతో నీరు వదలడానికి వీలు కాలేదని, ప్రస్తుతం రాయి తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అసంపూర్తిగా ప్రధాన కాల్వ.. నార్లాపూర్ నుంచి ఏదుల మధ్యలో 6.4 కి.మీ., ప్రధాన కాల్వ ఉంది. దాదాపు 40– 25 మీటర్ల వెడల్పు, లోతు ఉంటుంది. కాల్వ తవ్వకాలు జరిగినా కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద హార్డ్ రాక్ ఉండటంతో పనుల్లో వేగం తగ్గింది. దాదాపు ఆ రెండు చోట్ల 8 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి, మట్టి ఉందని అధికారుల అంచనా. గతేడాది మే నెలలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి కాల్వ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గతేడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేస్తే ఈ ఏడాది వానాకాలం సీజన్లో నీళ్లు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. పనులు కాలేదు. ఇంకా ఓపెన్ కాల్వలో కుడికిళ్ల వద్ద హార్డ్ రాక్తో కాల్వ తవ్వకాలు నెమ్మదించాయి. ఇందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని విమర్శలున్నాయి. తాజాగా పనులు డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించినా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్ట్‌ల సమీక్షకు వచ్చిన తర్వాత పనుల్లో కొంత వేగిరం పెరిగిందనే చెప్పవచ్చు. ఏదేమైనా రిజర్వాయర్లలోకి నీళ్లు వచ్చేది 2027 వానాకాలం సీజన్లోనే. అప్పటి వరకు పాలమూరు– రంగారెడ్డి వినియోగంలోకి రాదు. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ కోసం ఉపయోగించుకునే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇక నార్లాపూర్– ఏదుల మధ్య ఓపెన్ కాల్వతోపాటు 16 కి.మీ., పొడవు సొరంగం ఉంది. సొరంగం పని దా దాపుగా పూర్తి కాగా.. ముందు భాగంలో 50 మీటర్ల పొడవు పని చేయాల్సి ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఉన్న వడ్డెర గుడిసెలు, సున్నపుతండా వాసులను ఇటీవల ఖాళీ చేయించారు. వచ్చే ఏడాది నాలుగు రిజర్వాయర్లకు నీళ్లు తరలనున్నాయి. నార్లాపూర్– ఏదుల రిజర్వాయర్ల మధ్యలో ఓపెన్ కాల్వలో కొనసాగుతున్న రాయి తొలగింపు పనులు ‘పాలమూరు–రంగారెడ్డి’ నీటికోసం తప్పని నిరీక్షణ నార్లాపూర్– ఏదుల మధ్య పూర్తి కాని కాల్వ పనులు దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు చర్యలు డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశం.. మార్చి వరకు కొనసాగే అవకాశం ఆ మట్టి తొలిగిస్తేనే ఏదుల రిజర్వాయర్‌కు సాఫీగా నీరు 2015లో శంకుస్థాపన.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 2015లో రూ.35,200 కోట్ల అంచనాలతో అప్పటి సీఎం కేసీఆర్ పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కింద నార్లాపూర్ నుంచి ఏదుల, ఏదుల నుంచి వట్టెం, మరోవైపు ఏదుల నుంచి కర్వెన, అక్కడి నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్లకు నీళ్లు తరలిస్తారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం రిజర్వాయర్లు దాదాపుగా పూర్తవగా.. ఉదండాపూర్ పనులు కొనసాగుతున్నాయి. పంపుహౌస్‌ల్లో మోటార్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. నీళ్లు వస్తే చాలు ఉదండాపూర్ రిజర్వాయర్ మినహాయిస్తే మిగతా రిజర్వాయర్లు ఏదుల, వట్టెం, కర్వెన నీటితో కళకళలాడుతూ.. భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయి. -
గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి
వనపర్తి రూరల్: గర్భిణుల్లో రక్తహీనతను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మండలంలోని కడుకుంట్ల పీహెచ్‌సీని ఆయన సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి పాముకాటు బాధితులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, యాంటీ స్నేక్ వీనం (ఏఎస్వీ) నిల్వలు, వాటి వినియోగం, పాము కాటు కేసులు వచ్చినప్పుడు చేపడుతున్న వైద్య ప్రక్రియ తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాముకాటు బాధితులకు పీహెచ్సీ స్థాయిలోనే తక్షణ వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు అవసరమైన మందులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పీహెచ్సీ పరిధిలో గర్భిణుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలపై చర్చించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, భౌతికశాస్త్రం, గణితం, ఆంగ్లం సబ్జెక్టులో ప్రత్యేకంగా రూపొందించిన సామగ్రి ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి క్రీడా మైదానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్, వైద్యాధికారి రాకేష్‌రెడ్డి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం
వనపర్తిటౌన్: కనుమరుగవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు భక్తిభావాన్ని పెంపొందించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో 15 రోజుల పాటు నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగంలో గురువారం నిరంజన్‌రెడ్డి, వాసంతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వశాంతి కోసం ఇంతటి మహాయాగాన్ని నిర్వహించడం వనపర్తికి ప్రత్యేకతను తీసుకొస్తుందని పేర్కొన్నారు. ప్రజలు సుభిక్షంగా, సౌభాగ్యంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పూర్ణాహుతి అనంతరం వేదపండితులు నిరంజన్‌రెడ్డి దంపతులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలుస రమేష్‌గౌడ్, వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్, వనం రాములు, దిలీప్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శం
వనపర్తి: ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు చాకలి ఐలమ్మ చూపిన తెగువను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని.. ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్‌తో ముఖ్యఅతిథులుగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికసంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యంగా నిలిచి భూస్వామ్య దోపిడీ, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత అని కొనియాడారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి, ఆత్మవిశ్వాసంతో అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు ఐలమ్మ జీవితం స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు ఆమె చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట పటిమ సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఈ సందర్భంగా సామాజికవేత్తలు రాజారాం ప్రకాష్, గంధం నాగరాజు చాకలి ఐలమ్మ జీవితంపై పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి ప్రమీల, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’పై ‘సాక్షి’ ఫోన్–ఇన్
వనపర్తి: జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్ల సందేహాల నివృత్తికి శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌తో ‘ఫోన్–ఇన్’ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ఓటర్లు తమ సందేహాలు, సమస్యలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు తెలియజేయాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిష్కారం పొందాలి. సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు సెల్‌నంబర్లు : 91009 04724, 95539 55698 -
సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి
పాన్‌గల్: రైతులు సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే కృషి విజ్ఞాన శాస్త్రవేత్త డా. భవాని సూచించారు. గురువారం మండలంలోని దావాజిపల్లిలో యూత్ ఫర్ యాక్షన్ ఆధ్వర్యంలో యాజమాన్య పద్ధతులు, వరి సాగు, ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, నానో ఎరువుల వినియోగం, పప్పుధాన్యాలు, ఆయిల్‌పాం, కూరగాయల సాగు గురించి వివరించారు. చీడపీడల నివారణకు అధికారుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తిప్పేస్వామి, సర్పంచ్ సూగురమ్మ, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. 13న జిల్లా కబడ్డీ జట్టు ఎంపికలు వనపర్తి రూరల్: పెబ్బేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 13న ఉదయం 8 గంటలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఽఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్ జూనియర్స్ బాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి కురుమయ్య గురవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురు 05.11.2006 తర్వాత జన్మించి 75 కిలోల బరువు.. బాలికలు 10.12.2010 తర్వాత జన్మించి 55 కిలోల బరువున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు పదోతరగతి ఒరిజినల్ మార్కుల ధ్రువపత్రం, జనన ధ్రువపత్రం, బోనాఫైడ్ తీసుకురావాలని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 26 నుంచి 29 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 70130 50502, 85001 65900 సంప్రదించాలని సూచించారు. ఆయిల్‌పాం తోటలపరిశీలన కొత్తకోట రూరల్: మండల కేంద్రానికి చెందిన రైతు వేముల హరీశ్‌రెడ్డి ఆయిల్‌పాం తోటలను గురువారం మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. వీణాజ్యోషి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. శంకరస్వామి పరిశీలించారు. ఎల్‌నినో నేపథ్యంలో తోటల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీరు, పోషకాహార నిర్వహణ, మొక్కల సంరక్షణకు పలు సూచనలు చేశారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాసీ్త్రయ పద్ధతులు పాటించాలని, పంటను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని తెలిపారు. అధిక దిగుబడులు సాధించేందుకు ఉద్యాన అధికారుల సలహాలు పాటించాలన్నారు. -
ఊరి పేరు.. తకరారు!
●ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మల్రెడ్డి నర్సింహారెడ్డి. ఈయన తన సొంత పొలం 5 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో తమ గ్రామం పేరు అమరచింత మండలంలో చూపిస్తుండడంతో ఎరువులు అక్కడ బుకింగ్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బస్తా రూ.300 ఉంటే అక్కడి నుంచి తమ గ్రామానికి రవాణాకు రూ.200 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లక్ష్మణ్‌గౌడ్. 4 ఎకరాల్లోవరి సాగు చేశాడు. గతంలో ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా ఒక్కటే బుకింగ్ చేసుకునే వారమని, ఇప్పుడు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. రెండు, మూడు బస్తాల ఎరువులు అవసరమైనా 45 కిలోమీటర్ల దూరంలోని అమరచింత మండలంలోనే చూపిస్తున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు, మూడు బస్తాల కోసమైనా ఆటో తీసుకొని వెళ్తే కిరాయి రూ.1,500 నుంచి 2 వేలు చెల్లించాల్సి వస్తోందంటున్నారు. సమస్య పరిష్కారంపై దృష్టి పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి రైతులు ఇబ్బందులు పడుతున్న వాస్తవం. సమస్య మా దృష్టిలో ఉంది. ప్రస్తుతం ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో వారికి అమరచింత మండలంలోని పామిరెడ్డిపల్లిలో ఫర్టిలైజర్స్ వివరాలు చూపెడుతుంది. సమస్యను కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. వారం రోజుల వ్యవధిలో పూర్తిగా పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంతలోపు కొత్తకోట నుంచి రెండు లారీల యూరియా తీసుకెళ్లా స్థానిక రైతువేదిక వద్ద అందుబాటులో ఉంచుతాం. – సైదులు యాదవ్, ఏఓ, పెద్దమందడి అమరచింత: వనపర్తి జిల్లాలోని అమరచింత మండలంలో ఒక పాంరెడ్డిపల్లి, పెద్దమందడి మండలంలో మరో పామిరెడ్డిపల్లి ఉండడంతో ఫార్మర్ రిజిస్ట్రీలో ఇ బ్బందులు తలెత్తున్నాయి. పెద్దమందడి మండలంలో ని పామిరెడ్డిపల్లికి చెందిన రెవెన్యూ భూములను అమరచింత పాంరెడ్డిపల్లిలో రెవెన్యూ రికార్డులో చూపుతుండడంతో ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో ఎరువుల బుకింగ్‌కు అవస్థలు తప్పడం లేదు. కానీ సమస్యను పరిష్కరించాల్సిన జిల్లా వ్యవసాయ అధికారులు నెలల తరబడి చోద్యం చూస్తున్నారు. రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. కాలం వెళ్లదీస్తున్నారే తప్పా శాశ్వత పరిష్కారం చూపడం లేదు. 45 కి.మీ. వెళ్లాల్సిందే.. పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి రెవెన్యూలో ముందరితండా, చీకరుచెట్టుతండా, దొడగుంటపల్లి, అంకూరు, బలిజపల్లికి చెందిన కొంత పొలాలు కలిపి సుమారు 1600 మంది రైతులు 2,800 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో 1,850 ఎకరాల్లో వరి, వేరుశనగ 400 నుంచి 500 ఎకరాల్లో, 250 ఎకరాల్లో ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఫార్మర్ రిజిస్ట్రీలో అధికారులు చేసిన తప్పుకు రైతులు ఎరువులు తెచ్చుకోవాలంటే సుమారు 45 కి.మీ దూరంలో ఉన్న అమరచింత మండలానికి వెళ్లాల్సిన దుస్థితి వస్తోంది. దీంతో రైతులకు రవాణా భారం తడిసి మోపెడవుతోంది. పెద్ద రైతులు ట్రాక్టర్లు, ఆటోలు కిరాయికి తీసుకొని వెళ్తున్నా.. రెండు, మూడు బస్తాల ఎరువులు కావాల్సిన సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనపర్తి రూరల్: విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. కనీసం ఆరు గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదంటూ గురువారం మండలంలోని కడుకుంట్ల శివారు సబ్‌స్టేషన్ ఎదుట కడుకుంట్ల సర్పంచ్ తిరుపతయ్య ఆధ్వర్యంలో కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. విద్యుత్ కోతలతో బోర్లుమోటార్లు తరచూ కాలిపోతున్నాయని, పంటలకు సాగునీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. రైతుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, విద్యుత్‌శాఖ డీఈ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీఈ రైతులకు వివరించారు. వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, మాధవరెడ్డి, డేగా మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, లక్ష్మీకాంత్, బాలకృష్ణ, కొండయ్య, కృష్ణానాయక్, మనీష్, గ్రామ అధ్యక్షుడు వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ఆందోళన పామిరెడ్డిపల్లి రైతులు గురువారం ప్రధాన రాహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలుగడంతో పెద్దమందడి ఎస్ఐ జలంధర్‌రెడ్డి రైతుల సమస్య గురించి ఫోన్లో తహసీల్దార్, ఏఓ చర్చించారు. సమస్యను పరిష్కరిస్తామని సర్ధిచెప్పడంతో ఆందోళన విరమించారు. దీనిపై వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీ చేసేటప్పుడు పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా అమరచింత మండలంలోని పాంరెడ్డిపల్లి క్లస్టర్ చూపుతుందన్నారు. ఢిల్లీలోని వ్యవసాయ ప్రధాన కార్యాలయం నుంచే సమస్యను పరిష్కరించే వీలుంటుందని, సమయం పడుతుందని తెలిపారు. జిల్లాలో రెండు పామిరెడ్డిపల్లి గ్రామాలు ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో బుకింగ్‌కు ఇబ్బందులు రైతులకు తప్పని అవస్థలు -
సమన్వయంతోనే ’ఉల్లాస్’ విజయవంతం
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: సమన్వయంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలో కార్యక్రమం అమలు, శిక్షణ, రాత పరీక్ష నిర్వహణ, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ప్రతి ఒక్కరికీ అక్షరాస్యత, విద్యా అవకాశాలు అందించడమే ఉల్లాస్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. తమ రోజువారీ జీవితంలో చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ సేవలు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై అవగాహన పెంచుకోవడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. అక్షరాస్యత వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని.. ముఖ్యంగా మహిళల అక్షరాస్యత పెంపొందించడంతో ఆర్థిక, సామాజికంగా మరింత సాధికారత సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉల్లాస్ కార్యక్రమం కింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 20,992 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ ప్రాంతాలకు చెందిన 1,200 మంది సభ్యులు శిక్షణ పొందుతున్నారని.. వీరంతా 20వ తేదీన నిర్వహించే రాత పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలో కార్యక్రమం సజావుగా, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అమలయ్యేలా జిల్లా పంచాయతీ అధికారి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ రాత పరీక్షకు తప్పనిసరిగా హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంగనన్‌వాడీ కేంద్రాల ద్వారా కార్యక్రమానికి అవసరమైన సహకారం, సమన్వయం అందించేందుకు జిల్లా సంక్షేమ అధికారి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ శిక్షణ నుంచి పరీక్షల వరకు ప్రతి దశను సమర్థవంతంగా పర్యవేక్షించి జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ రామమహేశ్వర్, డీపీఓ రఘునాథ్, డీడబ్ల్యూఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ఓటరు శిభిరాలు వినియోగించుకోవాలి
వనపర్తి: ప్రత్యేక ఓటరు నమోదు శిభిరాలను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నామని.. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, ప్రత్యేక ఓటరు నమోదు శిభిరాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆయా తేదీల్లో బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. 2026, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఫారం–6, ఓటరు వివరాల్లో సవరణల కోసం ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక శిభిరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. కొత్త ఓటరు నమోదుకు వయస్సు, చిరునామా ధ్రువీకరణ పత్రం, డిక్లరేషన్‌తో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు సమర్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వ్యక్తిగతంగా రావడం సాధ్యం కానివారు ఆనన్లైనన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్ల నోటీసుల పరిష్కారంపై బీఎల్వోలు, ఏఈఆర్వోలు చురుగ్గా పనిచేస్తున్నారని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్ డబుల్.. స్పీడ్ డబుల్..
● చురుగ్గా సాగుతున్న రెండోట్రాక్ పనులు ● మహబూబ్‌నగర్–మన్యంకొండ మధ్య పనులు పూర్తి.. ● 90 కి.మీ. వేగానికి అనుమతి స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైల్వే రంగానికి మహర్దశ రానుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్–సికింద్రాబాద్ మధ్య డబ్లింగ్ లైన్ అందుబాటులోకి రాగా.. తాజాగా మహబూబ్‌నగర్–డోన్ (ద్రోణాచలం) మధ్య రెండో రైల్వే లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 185 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పనులు పూర్తయితే హైదరాబాద్–డోన్ మార్గంలో రైళ్ల రాకపోకలకు మరింత వెసులుబాటు కలగనుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రైళ్ల సంఖ్య పెంచేందుకు అవకాశం ఏర్పడనుంది. మన్యంకొండ వరకు పూర్తి మహబూబ్‌నగర్–మన్యంకొండ స్టేషన్ల మధ్య రెండో ట్రాక్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 18న రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి ఈ మార్గాన్ని సమగ్రంగా తనిఖీ చేసి స్పీడ్ ట్రయల్ నిర్వహించారు. ప్రత్యేక మోటార్ ట్రాలీపై అధికారులతో కలిసి ప్రయాణిస్తూ ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ, వంతెనలు తదితరాలను పరిశీలించారు. కొత్త లైన్‌పై రైళ్ల స్థిరత్వం, భద్రత, సాఫీ ప్రయాణాన్ని పరీక్షించారు. అనంతరం ఈ సెక్షన్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. దేవరకద్ర వైపు పనులు మన్యంకొండ–దేవరకద్ర మధ్య రెండో ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. దశల వారీగా డబ్లింగ్ పనులను పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపడుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు మొత్తం మార్గం పూర్తయితే ఈ ప్రాంత రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. మహబూబ్‌నగర్–డోన్ డబ్లింగ్ లైన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్–డోన్ మార్గంలో రైళ్ల రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్ల రాకపోకల కారణంగా ఎదురయ్యే ఆలస్యాలు తగ్గడంతో పాటు అదనపు రైళ్లను నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గే వీలుండటంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. సరుకు రవాణా వేగవంతమై.. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వాణిజ్య రవాణా కూడా మెరుగుపడే అవకాశం ఉంది. మేడ్చల్–ముద్ఖేడ్, మహబూబ్‌నగర్–డోన్ సెక్షన్లలో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ముద్ఖేడ్ నుంచి డోన్ వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న 12.5 వాట్ల సామర్థ్యాన్ని 25 వాట్లకు పెంచేందుకు ఆమోదం లభించింది. దీంతో విద్యుత్ వ్యవస్థలో లోపాలను అధిగమించి నిరంతర విద్యుత్ సరఫరాతో రైళ్లను మరింత సమర్థవంతంగా నడిపేందుకు వీలవుతుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి. -
మరక పడితే వేటే..!
వనపర్తి: అవినీతి, అక్రమాలు, విధుల్లో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం, శాఖాపరమైన అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు, ఉద్యోగులు వరుసగా చర్యలకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం మరో ఇద్దరి ఉద్యోగుల సస్పెన్షన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రెండేళ్ల కాలంలో సస్పెండ్ అయిన వారి లెక్క తీస్తే.. సుమారు 17 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో నలుగురు జిల్లాస్థాయి అధికారులు, ఎనిమిది మంది పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు వార్డెన్లు, ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, జిల్లా పౌరసరఫరాలశాఖలో పనిచేసే ఉద్యోగి ఒకరు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఇటు కలెక్టర్, అటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సైతం తప్పు చేసినట్లు విచారణలో వెల్లడైతే చర్యలకు వెనకాడటం లేదనేందుకు మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఇద్దరిపై వేటు వేయడంతో స్పష్టమవుతోంది. వసతి గృహానికి చేరాల్సిన 15 క్వింటాళ్ల బియ్యం లెక్క విషయంలో జిల్లాకేంద్రంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్ నరేందర్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖలో పనిచేసే ఉద్యోగి మహేష్‌పై వేటు పడింది. ఈ ఘటన జిల్లాలో ఉద్యోగ లోకానికి షాక్ తగిలినట్లయింది. దీంతో రెండేళ్ల కాలంలో చర్యలకు గురైన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంపై చర్చ వినిపిస్తోంది. రెండేళ్లలో 17 మందికిపైగా.. ఇందులో నలుగురు జిల్లాస్థాయి అధికారులు ఇద్దరు వార్డెన్లు, ఎనిమిది మంది కార్యదర్శులు, ఎస్ఐ, ఏఎస్ఐ... అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినా.. అక్రమార్జనకు పాల్పడినట్లు ఆధారాలతో వెల్లడైనా.. ప్రతి ఘటనలో చర్యలకు వెనకాడకపోవటం జిల్లా అధికార యంత్రాంగంలో భయాందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. హాస్టల్లో ఉంటూ.. చదువుకునే పేదవారి కడుపుకొట్టి బియ్యాన్ని విక్రయించుకునే వారిపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించినట్లు తాజా చర్యలతో వెల్లడవుతోంది. -
వదంతులు సృష్టిస్తే కటకటాలకే.. : ఎస్పీ
మదనాపురం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాజిక మాధ్యమాలు వేధికగా వదంతులు, అసత్య ప్రచారాలు వ్యాప్తిచేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని.. సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీతారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించి బాధితులతో సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై ఆరా తీశారు. రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు వచ్చే వారికి పోలీస్ వ్యవస్థపై విశ్వాసం పెరిగేలా పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి పాత నేరస్తులు, సమస్యాత్మక వ్యక్తుల వివరాలు సేకరించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచి ఈవ్‌టీజింగ్, చోరీలు, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అనంతరం వినాయక నిమజ్జన ప్రధాన ప్రదేశాలైన సరళాసాగర్, రామన్‌పాడ్, కొత్తపల్లి వంతెన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిశాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మండపాల నుంచి నిమజ్జన ప్రదేశాల వరకు నిరంతర నిఘా కొనసాగాలని.. మద్యం తాగి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ఆకతాయి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఆమె వెంట డీఎస్పీ గిరిబాబు, ఆత్మకూరు, కొత్తకోట, వనపర్తి సీఐలు శివకుమార్, ఓడీ రమేష్, సుగంధ రత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఎస్ఐ జగదీశ్వర్ పాల్గొన్నారు. -
శ్రీరంగాపురంలో దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్
పెబ్బేరు రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయాన్ని బుధవారం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ హన్మంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. అలాగే ఆలయ ఆవరణలోని తంజాపూర్ చిత్రపటాలు, స్వామివారి వెండి వాహనాలను తిలకించారు. రంగసముద్రం జలాశయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఈఓ శేఖర్‌గౌడ్, అర్చకులు, సిబ్బంది ఉన్నారు. సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడులు ఖిల్లాఘనపురం: రైతులు వరి సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, టీకేవీకే శాస్త్రవేత్త నవత, డీపీడీ హైమావతి అన్నారు. బుధవారం మండలంలోని అంతాయపల్లిలో వ్యవసాయశాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సంయుక్తంగా పొలంబడి, వరి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు సమగ్ర నేల సంరక్షణ కచ్చితంగా పాటించాలన్నారు. నెలలో పంటకు కావాల్సిన ఎరువులు, పోషకాలు, పచ్చి రొట్ట ఎరువులు మాత్రమే వినియోగించాలని సూచించారు. భాస్వరం ఎరువులు అధికంగా వినియోగిస్తే భూమిలో చౌడు తేలి పోషకాల లభ్యత తగ్గుతుందన్నారు. నానో యూరియా ఉపయోగించాలని, చీడపీడల నివారణకు వ్యవసాయ అధికారులు సూచించిన పురుగు మందులు వాడాలని కోరారు. పలువురు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సర్పంచ్ తోక నర్సింహగౌడ్, ఏఓ మల్లయ్య, ఏఈఓ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటరమణ రైస్‌మిల్ సీజ్ పాన్‌గల్: సీఎంఆర్ బకాయిలున్న మండల కేంద్రంలోని శ్రీ వెంకటరమణ రైస్‌మిల్లును అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఆర్ఐ మహేష్ కథనం మేరకు.. రైస్‌మిల్లుకు 2023–24 సంవత్సరంలో వరి ధాన్యం కేటాయించగా ఇందుకు సంబంధించిన సీఎంఆర్ ప్రభుత్వానికి అందించకుండా బకాయి పడ్డారు. బకాయిపడ్డ ధాన్యం విలువ రూ.6.93 కోట్లని.. చెల్లించకపోవడంతో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం మిల్లును తహసీల్దార్ కార్తీక్‌రావు, ఎస్ఐ కుర్మయ్య పర్యవేక్షణలో సీజ్ చేసినట్లు ఆర్ఐ వివరించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్‌గౌడ్, జీపీఓ రాధ, మల్లేష్ పాల్గొన్నారు. ఎన్ఎస్యూఐకు కొత్త సారథులు స్టేషన్ మహబూబ్‌నగర్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఽఅధ్యక్షుడిగా ఎ.శేఖర్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి యశ్వంత్, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీకాంత్, గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అవినాష్ యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్‌ను నియమించారు. ఎన్ఎస్యూఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడుసూచించారు. -
తప్పిదాలతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
వనపర్తి టౌన్: విద్యార్థులు చదువుతో పాటు భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని చాణక్య పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు హాజరై పాఠశాల రేడియో స్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, తెలియక చేసే తప్పిదాలు భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వేధికలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. పోక్సో చట్టంపై అవగాహన లేకుండా చేసే తప్పులు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాలు
వనపర్తి: ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని 30వ వార్డులో ఉన్న షెడ్యూల్డ్ కులాల బాలుర వసతిగృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలో కొత్తగా నిర్మించిన వంటగది (కిచెన్), స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. పనుల నాణ్యత, వినియోగంలో ఉన్న సామగ్రి తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణాలు నిర్దేశించిన అంచనాల ప్రకారమే చేపట్టాలని, అదనపు పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మరో నెలలో భవనాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం వసతిగృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. వసతిగృహాల్లో శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు తదితర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యాభ్యాసానికి అనుకూలమైన వాతావరణం కల్పించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రాంజీరావు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. -
7.78 లక్షల మంది నిరక్షరాస్యులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 7,78,142 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఇందులో 2,99,907 మంది పురుషులు, 4,78,235 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా నిరక్షరాస్యుల సంఖ్య 1,78,328 అధికం. జిల్లా వారీగా చూస్తే గద్వాల జిల్లాలో అత్యధికంగా 70,619 మంది పురుషులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. నారాయణపేటలో అత్యల్పంగా 37,461 మంది ఉన్నారు. అయితే ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం మహిళా సంఘాల సభ్యులకే పరిమితం కావడంతో.. నిరక్షరాస్యులుగా ఉన్న పురుషులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం గమనార్హం. సమాజంలో నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలించాలంటే మహిళలతో పాటు పురుషులపైనా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.


