ఎత్తుకు.. పైఎత్తులు! | - | Sakshi
Sakshi News home page

ఎత్తుకు.. పైఎత్తులు!

Feb 6 2026 8:42 AM | Updated on Feb 6 2026 8:42 AM

ఎత్తుకు.. పైఎత్తులు!

ఎత్తుకు.. పైఎత్తులు!

పెబ్బేరు పుర పీఠం కై వసానికి ప్రధాన పార్టీల వ్యూహాలు

ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యే చాన్స్‌?

మూడు పార్టీలు

ఒక్కటవుతాయా?

పెబ్బేరు పుర పీఠం హస్తగతం కానివ్వకూడదని బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలు ఒక్కటవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు నామినేషన్ల దాఖలు సమయంలో బీఆర్‌ఎస్‌ నేతల వాహనాలు గౌని బుచ్చారెడ్డి ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టడంలాంటి ఘటనలు స్థానికులు ఉదహరిస్తున్నారు. పుర పీఠం దక్కించుకునేందుకు ఏకమయ్యే అవకాశాలు ఎక్కువ గా ఉన్నట్లు చర్చ వినిపిస్తోంది. ఈ నెల 11న పె బ్బేరు పుర ప్రజలు ఎవరిని ఆశీర్వదించి గెలుపు శిఖరాలను ఎక్కిస్తారో వేచి చూడాలి మరి.

వనపర్తి: సమీప భవిష్యత్‌లో నియోజకవర్గ కేంద్రంగా మారనున్న పెబ్బేరు పుర పీఠం దక్కించుకునేందుకు అధికార, విపక్షాలు తమదైన శైలిలో ఎత్తుగడలు వేస్తూ ఎన్నికల బరిలోకి దిగాయి. మొన్నటి వరకు అధికార కాంగ్రెస్‌పార్టీలో ఉన్న గౌని బుచ్చారెడ్డి సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆలిండియా ఫార్వర్డ్స్‌ బ్లాక్‌ పార్టీ గుర్తుపై తన మద్దతుదారులను ఐదు వార్డుల్లో పోటీలో నిలిపి జనరల్‌కు కేటాయించిన పుర పీఠాన్ని కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. పెబ్బేరులో అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌కు ఎమ్మెల్యే మద్దతు పుష్కలంగా ఉన్నా.. తన బలమైన సమీప బంధువు మద్దతు లభించకపోవడంతో ఒంటరి పోరు చేస్తున్నారు. ఎంత వరకు విజయం సాధిస్తారనే అంశాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు బీజేపీ గత ఎన్నికల్లో రెండుస్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి ఐదు స్థానాల్లో గెలుపొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ జిల్లా నాయకుడు, మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెంటపల్లి పురుషోత్తంరెడ్డి తన మఖాం పెబ్బేరుకు మార్చి ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తూ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ విషయానికొస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో సంత విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పుర పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి సైతం పెబ్బేరుపై ప్రత్యేక దృష్టి సారించి పాత స్నేహితులను స్వతంత్రులుగా పోటీలో నిలిపి ఓట్లు చీల్చి గులాబీ జెండా ఎగురవేసేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement