సత్తాచాటిన ‘ఖిల్లా’ విద్యార్థులు
ఖిల్లాఘనపురం: సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో మండలానికి చెందిన యువకులు బంగారు పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన పోటీల్లో పర్వతాపురం గ్రామానికి చెందిన కె.ఉదయ్‌కిరణ్ లాంగ్‌జంప్‌లో, అప్పారెడ్డిపల్లికి చెందిన సాయి సాత్విక్ 600 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించినట్లు డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించడంతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పాక్షిక శనిత్రయోదశి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి శనివారం పాక్షిక శనిత్రయోదశిని పురస్కరించుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనిగ్రహ దోష నివారణకు భక్తుల చేత భక్తిశ్రద్ధలతో పూజలు చేయించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, సర్పంచు సుగుణమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
18న పీయూలో
క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: అమ్నీల్ ఫార్మా జడ్చర్ల, ఆర్–టెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 18న క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్లు పీయూ ప్లేస్‌మెంట్ అధికారి ఎస్‌ఎన్ అర్జు న్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 ఫార్మ సీ, ఎంకామ్, ఎంబీఏ విద్యార్థుల కోసం ఫా ర్మసీ కళాశాల ఆడియోరియంలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్మాలో క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ విభాగాల్లో, ఆర్–టెక్ సొల్యూషన్స్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తగ్గిన వేరుశనగ ధరలు
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగ ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే క్వింటాకు గరిష్ట ధర వద్ద రూ.167, కనిష్ట ధర వద్ద రూ.1,186 తగ్గింది. శనివారం వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.9,399, కనిష్టంగా రూ.3,029 ధరలు లభిచాయి. కందులకు గరిష్టంగా రూ.7,812, కనిష్టంగా రూ. 5,555, మినుములు గరిష్టంగా రూ.8,349, కనిష్టంగా రూ.8,339, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,693, కనిష్టంగా రూ.6,689, మొక్కజొ న్న గరిష్టంగా రూ.1,876, కనిష్టంగా రూ. 1,848, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రూ.2,409, పత్తి గరిష్టంగా రూ.6,869, కనిష్టంగా రూ.3,050 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు క్వింటా గరిష్టంగా రూ.7,579, కనిష్టంగా రూ.7,219గా ధరలు పలికాయి.
సత్తాచాటిన ‘ఖిల్లా’ విద్యార్థులు


