పుర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

పుర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

Feb 6 2026 7:17 AM | Updated on Feb 6 2026 7:17 AM

పుర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

పుర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

వనపర్తి: జిల్లాను రద్దు చేస్తానంటున్న అధికార కాంగ్రెస్‌పార్టీకి ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని 3, 4, 15, 16, 17 వార్డుల్లో ఎన్నికల ఇన్‌చార్జ్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, పార్టీ అభ్యర్థులను వెంటబెట్టుకొని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో చేసి చూపించామన్నారు. జిల్లాకేంద్రంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పాతకోట కాలనీలోని కందకం ప్రాంతంలో మార్కెట్‌ నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. పాత పట్టణం అభివృద్ధి చెందాలని మాతా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రం, క్రిటికల్‌ కేర్‌, డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం ఎన్నికల ఇన్‌చార్జ్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో వనపర్తికి పలుమార్లు వచ్చానని, నాటికి నేటికీ చా లా మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. విశాలమైన రహదారులు, ఉన్నత విద్యాలయాలు, చెరువు ల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులను గుర్తించానని వివరించారు. నిరంజన్‌రెడ్డి కుమార్తె డా. ప్రత్యూషా జిల్లాకేంద్రంలోని వివిధ వార్డుల్లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు, ఆ యా వార్డుల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement