స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
ఈవీఎం గోదాం తనిఖీ..
● పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లను
నియమించుకోవాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, పోలింగ్, కౌంటింగ్‌కు ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ సునీతరెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకురాలు లక్ష్మీబాయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ 11వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతుందని, ఓట్ల లెక్కింపు 13వ తేదీన చేపట్టనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్‌ను నియమించుకోవాలని, కౌంటింగ్ ప్రక్రియకు వార్డుకు ఒక ఏజెంట్‌ను నియమించుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను 11వ తేదీలోపు ఎన్నికల అధికారులకు సమర్పించాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియ వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, పెబ్బేరు లెక్కింపు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో, కొత్తకోట లెక్కింపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఆత్మకూర్ లెక్కింపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, అమరచింతకు సంబంధించి ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతుందని వివరించారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను 8వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు వినియోగించుకోవచ్చన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అన్ని పుర కార్యాలయాల్లో కొనసాగనుందని.. కొత్తకోటలో మాత్రమే ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందని చెప్పారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ బుధవారం నుంచి అధికారికంగా కొనసాగుతుందని వివరించారు.
ముందస్తు అనుమతి తప్పనిసరి..
ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలకు ముంద స్తు అనుమతులు తీసుకోవాలని ఎస్పీ సునీతరెడ్డి సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కా గా అమలు చేస్తున్నామని.. ఉల్లంఘిస్తే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయని, చెక్‌పోస్టులు కూడా కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీబాయి మా ట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛా యుత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాల ని సూచించారు. కావాల్సిన అనుమతులు సకాలంలో తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ సు బ్ర మణ్యం,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వాతావరణం
మధ్యాహ్నం ఎండ వేడిమి పెరుగుతోంది. రాత్రిళ్లు చలి తీవ్రత కాస్త ఉంటుంది. అప్పుడప్పుడు చల్లటి గాలులు వీస్తాయి.
జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను బుధవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశామని కలెక్టర్ చెప్పారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.


