రాష్ట్ర హౌసింగ్ విజిలెన్స్ అధికారి తనిఖీ
ఖిల్లాఘనపురం: మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో బిల్లులు అందని ఇందిరమ్మ ఇళ్లను గురువారం రాష్ట్ర హౌసింగ్ విజిలెన్స్ అధికారి బలరాం, డీఈ విఠోభా పరిశీలించారు. మండలంలోని మానాజీపేటలో 2, మల్కాపూర్‌లో 3, దొంతికుంటతండాలో 1, ఖిల్లాఘనపురం గ్రామంలో 4 ఇళ్లు మొత్తం 10 ఇందిరమ్మ ఇళ్లకు వివిధ కారణాలతో ఇప్పటి వరకు బిల్లులు అందలేదన్నారు. ఆయా ఇళ్లన్నింటిని పరిశీలించడంతో పాటు లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ప్రొసీడింగ్‌లు ఇచ్చినప్పటికీ అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తప్పనిసరిగా బిల్లులు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ సందీప్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు ఉన్నారు.


