కాంగ్రెస్‌తోనే అభివృద్ధికి బాటలు
వనపర్తి: పుర ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌పార్టీకి ఓటేసి అభివృద్ధికి బాటలు వేద్దామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి కోరారు. శనివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని 28వ వార్డులో అభ్యర్థి కోట్ల శిరీష రవితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి పుర పీఠం హస్తగతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం, పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. పదేళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాజేంద్రప్రసాద్ యాదవ్, నాగార్జున, బాబా, పెంటన్న యాదవ్, సహదేవ్ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, జిల్లెల్ల ప్రదీప్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి దూరమవుతున్న పట్టణాలు
వనపర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని 14, 15, 16, 33 వార్డుల్లో పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం భగీరథ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హడావుడి తప్పా అభివృద్ధి జాడ కనిపించడం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జిల్లాకేంద్రంలోని నలుమూలల ఉన్న చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి భూగర్భ జలాలను వృద్ధి చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బి.లక్ష్మయ్య, రమేష్‌గౌడ్, గంధం బాలపీరు, వేణుగోపాల్, చిట్యాల రాము, జోహెబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ అర్హత పరీక్ష
కందనూలు/ బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశాల కోసం 1,520 విద్యార్థులకు గాను 1,067 విద్యార్థులు హాజరు కాగా.. 11వ తరగతి కోసం 3,072 మంది విద్యార్థులకు గాను 2,353 మంది పరీక్షకు హాజరయ్యారని నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధికి బాటలు


