1981లో బీజం.. మార్పులతో ఆమోదం | - | Sakshi
Sakshi News home page

1981లో బీజం.. మార్పులతో ఆమోదం

Apr 2 2026 7:17 AM | Updated on Apr 2 2026 7:17 AM

నాగర్‌కర్నూల్‌

వనపర్తి

గద్వాల

తంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్‌ రూట్‌ మ్యాప్‌ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్‌ రైల్‌ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్‌లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్‌, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్‌ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్‌ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్‌– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి డీపీఆర్‌ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్‌లో (పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌) కొత్త లైన్‌ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్‌కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్‌మెంట్‌ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్‌ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement