రిజర్వాయర్ పనులు చేపట్టొద్దని పాదయాత్ర
గోపాల్‌పేట: ఏదుల మండలంలోని గొల్లపల్లి, చీర్కపలి సమీపంలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ పనులు చేపట్ట వద్దని మంగళవారం అఖిలపక్ష నాయకులు పాదయాత్ర చేపట్టారు. గొల్లపల్లి గేట్ నుంచి ఏదులలోని తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి తహసీల్దార్ మల్లికార్జున్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మించడంతో 1,350 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తోందని.. వెంటనే పనులు ప్రారంభించకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తలారి కుర్మయ్య, అబ్దుల్ మహమూద్, రాజురెడ్డి, దొడ్ల ఇందిర, రేణుక, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
వేసవి ప్రణాళిక
పనులు చేపట్టాలి
వనపర్తిటౌన్: విద్యుత్ వినియోగదారులకు వేసవిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూపొందించిన ప్రణాళిక పనులను త్వరగా పూర్తి చేయాలని టీజీఎస్‌పీడీసీఎల్ హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ చీఫ్ ఇంజినీర్ పీవీ రమేష్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలో విద్యుత్ సర్కిల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, గృహ, వాణిజ్య తదితర కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాబాటలో గుర్తించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. అంతకుముందు జిల్లా స్టోర్స్‌ను సందర్శించి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కావాల్సిన సామగ్రి, ఇతర అత్యవసర సమయాల్లో కావాల్సిన పరికరాలు ఉన్నాయా లేవా అని పరిశీలించి అందుబాటులో ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎస్‌ఈ తిరుపతిరావు, డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్, డివిజనల్ టెక్నికల్ ఇంజినీర్ సి.వెంకట శివరాం, సీనియర్ అకౌంట్స్ అధికారి వెంకటరమణ, స్టోర్స్ ఏడీఈ లక్ష్మణరావు, కొత్తకోట ఏడీఈ శివశంకర్‌రెడ్డి, ఏఈలు, అకౌంట్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వాయర్ పనులు చేపట్టొద్దని పాదయాత్ర


