పగిలిన చంద్రగఢ్‌ పైప్‌లైన్‌ | - | Sakshi
Sakshi News home page

పగిలిన చంద్రగఢ్‌ పైప్‌లైన్‌

Feb 21 2026 8:11 AM | Updated on Feb 21 2026 8:11 AM

పగిలి

పగిలిన చంద్రగఢ్‌ పైప్‌లైన్‌

అమరచింత: మండలంలోని చంద్రగఢ్‌ ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పగిలి పంప్‌హౌజ్‌ నుంచి ముందుకు పారాల్సిన సాగునీరు తిరిగి వెనక్కి వస్తున్న పరిస్థితి నెలకొంది. నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి, చంద్రగఢ్‌ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటార్లు చంద్రగఢ్‌ ప్రధాన పంప్‌హౌజ్‌లో ఏర్పాటు చేశారు. 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 20 ఏళ్ల కిందట రూ.52 కోట్లతో రూపొందించారు. ఆయకట్టుకు పీవీసీ పైప్‌ల ద్వారా సాగునీరు అందిస్తుండగా.. నాసిరకం పైపులు వేయడం, 10 ఏళ్లుగా తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పైప్‌లైన్‌ పగిలి నీరు ముందుకు పారక సాగునీరు తిరిగి వెనక్కి వచ్చి పంప్‌హౌజ్‌లోకి చేరుతోంది. ఇలానే కొనసాగితే చంద్రగఢ్‌ ఎత్తిపోతలకు ముప్పు తప్పదని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్‌ ఏఈ ఆంజనేయులు వద్ద ప్రస్తావించగా.. ఉన్నతాధికారులకు విన్నవించామని, లిఫ్ట్‌ పరిధిలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు సరఫరా నిలిపి వేయాలని ట్రాన్స్‌కో డీఈకి విన్నవించినట్లు చెప్పారు. విద్యుత్‌ సరఫరా నిలిచిన వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

పగిలిన చంద్రగఢ్‌ పైప్‌లైన్‌ 1
1/1

పగిలిన చంద్రగఢ్‌ పైప్‌లైన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement