అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఆత్మకూర్: స్థానిక పురపాలికలో మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చైర్‌పర్సన్ నాగమణి, వైస్‌చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం వారు మాట్లాడారు. రూ.15 కోట్లతో సీసీ రహదారులు, డ్రైనేజీలు, రూ.3.14 కోట్లతో పరమేశ్వరస్వామి చెరువుకట్ట సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అభివృద్ధిలో పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, ఎన్‌ఆర్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి చెన్నయ్యసాగర్, పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్, తులసీరాజ్, కౌన్సిలర్లు జుబేదాబేగం, దండు శ్రీను, తిరుపతయ్య, సద్దల తులసి, పాల్గొన్నారు.


