జలాశయాలకు రొయ్య పిల్లలు | - | Sakshi
Sakshi News home page

జలాశయాలకు రొయ్య పిల్లలు

Feb 21 2026 8:11 AM | Updated on Feb 21 2026 8:11 AM

జలాశయ

జలాశయాలకు రొయ్య పిల్లలు

జీవనోపాధి కలుగుతుంది.. మత్స్యకారుల ఉపాధికే..

‘జూరాల’లో 8 లక్షలు వదిలిన అధికారులు

జిల్లావ్యాప్తంగా 1.60 కోట్లు..

ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది. శుక్రవారం 8 లక్షల రొయ్య పిల్లలను జూరాల వెనుక జలాల్లో వదలడం సంతోషంగా ఉంది. ప్రాజెక్టు సమీపంలోని నందిమళ్లలో మత్స్యసంపదపై ఆధారపడి 300 కుటుంబాలు జీవిస్తున్నాయి. చేపలతో పాటు రొయ్యల అమ్మకంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

– రాములు, మత్స్యకారుడు, నందిమళ్ల

ప్రస్తుతం జిల్లాలో ఉచితంగా రొయ్య పిల్లలను మత్స్యకారులకు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. జిల్లాలోని జూరాల, రామన్‌పాడు, సరళాసాగర్‌లో మొదటిసారి ప్రయోగాత్మకంగా 12.50 లక్షల పిల్లలను వదులుతున్నాం. ఇవి పెరిగి మత్స్యకారులకు ఉపాధినిస్తే వచ్చే ఏడాది జిల్లావ్యాప్తంగా రొయ్య పిల్లల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేస్తాం.

– డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ

అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందిస్తూ వారి కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది. మార్కెట్‌లో రొయ్యలకు మంచి డిమాండ్‌ ఉండటంతో ఈ ఏడాద వందశాతం రాయితీపై రొయ్య పిల్లలను సైతం మత్స్యకారులకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే జిల్లాలోని జూరాల, రామన్‌పాడు, సరళసాగర్‌ జలాశయాల్లో మొత్తం 12.50 లక్షల రొయ్య పిల్లలను అధికారులు వదులుతున్నారు. శుక్రవారం జూరాల వెనుక జలాల్లో ఈర్లదిన్నె పంప్‌హౌజ్‌ సమీపంలో మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్ప, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్‌తో కలిసి రాయితీపై అందజేసిన 8 లక్షల రొయ్య పిల్లలను వదిలారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్‌ జింక సువర్ణ, వైస్‌ చైర్‌పర్సన్‌ రాధ, కౌన్సిలర్లు, నందిమళ్ల సర్పంచ్‌ రాజేందర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులులు పాల్గొన్నారు.

జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఇప్పటి వరకు 1.60 కోట్ల చేప పిల్లలను వదిలారు. ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి టెండర్లు ఆహ్వానించినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మరోమారు రీ–టెండర్‌ నిర్వహించడంతో చేప పిల్లల పంపిణీ కాస్త ఆలస్యమైంది.

అధిక లాభాలు..

రొయ్యలకు బయటి మార్కెట్‌లో మంచి ధర ఉంది. ప్రస్తుతం కిలో రూ.450 పలుకుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇక్కడ పెంచిన రొయ్యలను హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలకు ఎగుమతి చేసి విక్రయించే వీలుంది. రోజువారిగా 5 కిలోల రొయ్యలు పట్టినా కుటుంబ పోషణకు సరిపోతుందని పలువురు మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.

రామన్‌పాడు, సరళసాగర్‌తో కలిపి 12.50 లక్షలు పంపిణీ

మత్స్యకారులకు అదనపు ఆదాయం

జలాశయాలకు రొయ్య పిల్లలు 1
1/3

జలాశయాలకు రొయ్య పిల్లలు

జలాశయాలకు రొయ్య పిల్లలు 2
2/3

జలాశయాలకు రొయ్య పిల్లలు

జలాశయాలకు రొయ్య పిల్లలు 3
3/3

జలాశయాలకు రొయ్య పిల్లలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement