వైభవంగా ఈదమ్మ షిడె ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఈదమ్మ షిడె ఉత్సవం

Feb 4 2026 6:56 AM | Updated on Feb 4 2026 6:56 AM

వైభవం

వైభవంగా ఈదమ్మ షిడె ఉత్సవం

పాన్‌గల్‌: మండల కేంద్రంలోని ఈదమ్మ జాతరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల భక్తులు మంగళవారం వేలాదిగా తరలిరావడంతో ఆలయం ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. మహిళలు అందంగా అలంకరించిన బోనపు కుండలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా షిడె కార్యకమ్రం నిర్వహించారు. ఆలయ ఆవరణలో పొడగాటి కర్రకు గొర్రె పిల్లను కట్టి చుట్టూ తిప్పారు. సర్పంచ్‌ నాగలక్ష్మి, నరేందర్‌గౌడ్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్తాలు, వడిబియ్యం సమర్పించారు. అర్చకుడు నాగన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కేఎస్‌ రత్నం, ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది ఎస్‌ఐలు, 75 మంది పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మిఠాయి, గాజుల దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారిని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు జూపల్లి అరుణ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌, టీపీసీసీ ఓబీసీ కన్వీనర్‌ డా. కేతూరి వెంకటేష్‌, తహసీల్దార్‌ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు వెంకటేష్‌నాయుడు, రవికుమార్‌, రాముయాదవ్‌, మధుసూధన్‌రెడ్డి, బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రశేఖర్‌నాయక్‌, వీరసాగర్‌, బీజేపీ నాయకులు అన్వేష్‌, శివరాంయాదవ్‌ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

షిడెకు హాజరైన భక్తులు

జాతరకు పోటెత్తిన భక్తులు

వైభవంగా ఈదమ్మ షిడె ఉత్సవం 1
1/1

వైభవంగా ఈదమ్మ షిడె ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement