చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Feb 4 2026 6:56 AM | Updated on Feb 4 2026 6:56 AM

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

గోపాల్‌పేట: మిహిళలు వారి చట్టాలు, భద్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి రజని అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఐఎఫ్‌హెచ్‌ఈ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వరకట్న, లైంగిక వేధింపులు, వరకట్న మరణాలపై పలు సూచనలు చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టం 112, మహిళా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 181 నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గృహహింస రక్షణ చట్టం గురించి లీగల్‌ ఎయిడ్‌ సభ్యులు ఫిర్యాదులు చేయడం, న్యాయ సాయం పొందే విషయాలను నాటిక ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అయేషా అంజుం, ఎంపీఓ భవాని, రవి, కన్నన్‌, దిలీప్‌శర్మ, గీత, ప్రియదర్శిని, రాకేష్‌, సూర్యదేవర, లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement