సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా | - | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా

Feb 4 2026 6:56 AM | Updated on Feb 4 2026 6:56 AM

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా

వనపర్తి: మున్సిపల్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ డి.సునీతరెడ్డి తెలిపారు. మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి ఎస్పీ, జిల్లాలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో చేపడుతున్న భద్రత చర్యలు, బందోబస్తు ప్రణాళికలు, సున్నిత ప్రాంతాల గుర్తింపు, పోలీసు బలగాల వినియోగం తదితర అంశాలను డీజీపీకి వివరించారు. వీసీలో ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, వనపర్తి, కొత్తకోత, ఆత్మకూర్‌ సీఐలు కేఎస్‌ రత్నం, రాంబాబు, శివకుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేష్‌, సీసీఎస్‌ సీఐ అశోక్‌కుమార్‌, రిజర్వ్‌ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్‌, జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement