‘పుర ఎన్నికలతో కాంగ్రెస్ కనుమరుగు’
వనపర్తి టౌన్: పుర ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఇచ్చే దెబ్బకు కాంగ్రెస్ కనుమరుగవుతుందని.. అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జిల్లాకేంద్రంలోని 5, 18, 19, 20, 21 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గొర్ల ప్రేమ్‌కుమార్, గంధం మదన్, మురళీసాగర్, సునీల్ వాల్మీకి, ఆంజనేయులుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణ, నల్ల చెరువు సుందరీకరణ, మాత, శిశు సంక్షేమ కేంద్రం, క్రిటికల్ కేర్ సెంటర్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. సౌకర్యాలు పెరగడంతో భూముల విలువలు పెరిగి ప్రజలు ఆర్థికంగా ఎదిగారని, ఇవన్నీ ముందుచూపుతో చేపట్టామని వివరించారు. చేసిన అభివృద్ధిని కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


