కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాకారం
వనపర్తి రూరల్: కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని.. ఎలాంటి ఆటంకాలు లేకుండా బిల్లులు నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మండలంలోని చందాపురం గ్రామంలో పుల్లరి నీలమ్మ నాగరాజు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని శుక్రవారం గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఇంటి యజమానులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. లబ్ధిదారు బేస్‌మెంట్ లెవల్ ఖర్చు నిర్మాణం మినహా ఆపై నిర్మాణాలకు సంబంధించి బిల్లులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని తెలిపారు. దీంతో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు డబ్బులు మంజూరవుతాయని.. పనులు ఆపిన లబ్ధిదారులు తిరిగి ప్రారంభించాలని సూచించారు. అనంతరం లబ్ధిదారు పుల్లరి నీలమ్మ నాగరాజు మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో తమలాంటి వారు ఇల్లు నిర్మించుకోవడం అదృష్టంగా భావిస్తునట్లు తెలిపారు. సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


