మామిడి తోటలను పరిశీలించిన శాస్త్రవేతలు
వీపనగండ్ల: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో చీడపీడలతో దెబ్బతిన్న మామిడి తోటలను బుధవారం కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత డా. వీణా జోషి పరిశీలించి పలు సూచనలు చేశారు. పూత దశలో నల్ల తామర ఉధృతి అధికంగా ఉండటం, పగటి సమయంలో పొగమంచుతో వాతావరణం చల్లబడి తేమమంచు కూడా అధికంగా ఉండటాన్ని గమనించి నివారణకు పిప్రోనిల్, డినోటోఫరన్ లాంటి పలురకాల మందులను పిచికారీ చేయాలని సూచించారు. పిందె బఠాని గింజ సైజులో ఉన్నప్పుడు నత్రజని, బాస్వరం, పొటాష్ లాంటి ఎరువులను క్రమం తప్పకుండా అందించాలన్నారు. ఆమె వెంట మోజర్ల ఉద్యాన కళాశాల అసోసిమేట్ డీన్ డా. మాధవి, షహనాజ్, భాగ్యశాలి, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, ఉద్యాన అధికారి కృష్ణయ్య ఉన్నారు.
నాణ్యమైన విద్య
అందించాలి
గోపాల్‌పేట: విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని అన్నారు. బుధవారం మండలంలోని పొలికెపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయసేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె బాల్య వివాహాల నియంత్రణ, బాల కార్మిక వ్యవస్థ, ఉచిత నిర్బంధ విద్య, మత్తు పదార్థాలు, సైబర్‌క్రైం, పోక్సో చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఉచిత న్యాయసాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100 నంబరును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యురాలు శ్రీదేవి, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
నైపుణ్యాలు
పెంపొందించుకోవాలి
వనపర్తిటౌన్: యువత ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ప్రియాంక కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డిగ్రీ మెన్స్ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగమేళాకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ విధానం, ఉద్యోగ నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. జాబ్‌మేళాలో 4 కంపెనీలు, 62 మంది విద్యార్థులు పాల్గొనగా.. ఇంటరూ్‌వ్య్ నిర్వహించి 21 మంది జాబితా రూపొందించి చివరకు ఆరుగురిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్, వైస్ ప్రిన్సిపాల్ కె.ఉమా, అకాడమిక్ కో–ఆర్డినేటర్ డా. వి.యాదగిరిగౌడ్, టీఎస్‌కేసీ విభాగం ద్వారా ఎఫ్‌టీఎం నాగేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి క్రీడలకు
విద్యార్థులు ఎంపిక
ఖిల్లాఘనపురం: మండలంలోని దొంతికుంటతండా స్టేజీ దగ్గర ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై నట్లు ప్రత్యేక అధికారి ఉమాదేవి, పీఈటీ చందర్ బుధవారం తెలిపారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ కిక్‌బాక్సింగ్ 32 కిలోల బరువు జూనియర్ కేటగిరిలో అనూష పాల్గొని ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. అదేవిధంగా మరో నలుగురు విద్యార్థులు వెండి పతకాలు సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను ప్రిన్సిపాల్, పీఈటీతో పాటు కోచ్ శివకృష్ణ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.
మామిడి తోటలను పరిశీలించిన శాస్త్రవేతలు
మామిడి తోటలను పరిశీలించిన శాస్త్రవేతలు


