ఉద్యోగాల తొలగింపు సరికాదు.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల తొలగింపు సరికాదు..

Feb 20 2026 7:01 AM | Updated on Feb 20 2026 7:01 AM

ఉద్యో

ఉద్యోగాల తొలగింపు సరికాదు..

ఉద్యోగాల తొలగింపు సరికాదు.. ఉద్యోగ భద్రత, పే స్కేల్‌ ఇవ్వాలి.. ఉన్నతాధికారులకు విన్నవించాం..

తహసీల్దార్‌ కార్యాలయంలో 2008 నుంచి కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చాలీచాలని వేతనంతో జీవనం గడుపుతున్నాం. మూడు, నాలుగు నెలలకు ఓసారి వేతనం చెల్లిస్తుండగా.. ఎప్పటికై నా కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందని భావించాం. కానీ ఏకంగా ఉన్న ఉద్యోగాన్ని తొలగించి బయటకు పంపే ప్రయత్నం చేస్తారని ఊహించలేదు.

– రమేష్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, వనపర్తి

తహసీల్దార్‌ కార్యాలయాల్లో కీలకంగా పని చేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పే స్కేల్‌ అమలు చేసి ప్రతినెలా వేతనం ఇవ్వాలి. ఏళ్లుగా పనిచేస్తున్న మేము ఇప్పుడు బయటకు వచ్చి కొత్తగా ఉద్యోగం వెదుక్కొనే పరిస్థితి కల్పించొద్దు. వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్నపిల్లలు, కుటుంబం మాపై ఆధారపడి జీవిస్తున్న విషయం ప్రభుత్వ పెద్దలు గుర్తించి న్యాయం చేయాలి.

– రఘు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఆత్మకూరు

ధ్రువపత్రాలు, ప్రొసీడింగ్‌లు, ఇతర కార్యాలయ పనులు చాలావరకు టీసీసీఓలతోనే చేయిస్తాం. ఏళ్లుగా వారి సేవలు వినియోగిస్తున్నాం. కార్యాలయంలో వారి అవసరం చాలానే ఉంది. తొలగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సైతం నివేదించాం. మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. జిల్లాకేంద్ర కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్లు లేకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలకు సరైన సేవలు అందించలేం.

– రమేష్‌రెడ్డి, తహసీల్దార్‌, వనపర్తి

ఉద్యోగాల తొలగింపు  సరికాదు.. 
1
1/2

ఉద్యోగాల తొలగింపు సరికాదు..

ఉద్యోగాల తొలగింపు  సరికాదు.. 
2
2/2

ఉద్యోగాల తొలగింపు సరికాదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement